నిను ఆర్తిగా ఆశగా వెతికే ఎదురు చూపులకి
నా కంటి పాప నువ్వే నని ఎలా చెప్పను!
నాయెద లోని నీ ప్రతి జ్ఞాపకానికి
గుండె చప్పుడు నువ్వు కాదని ఎలా చెప్పను!
నా ప్రేమ మీద ఏ కవిత రాయను ?
చెలి నా చెంత లేదని దిగులు చెందనా?
ఇక మరలిరాని గతంలో ...
ఎప్పటికీ మరువలేని జ్ఞాపకం ...నీ ప్రేమ!
నీతో గడిపిన ఆనంద క్షణాలను తలచుకొంటూ...
నీవు లేని క్షణాలను ఆలా గడుపుతున్నా...
కలత చెందిన మదిలో కదిలెను
నీ రూపు మరి మరి
చెంత చేరవని ఎంత చెప్పినా,
మది నమ్మనంటోంది ఎం చేయను?
ఎవరివి నీవు...? నాకే మౌతావు...?
ఎందుకు నన్ను కలవర పెడతావు...
ఏమీ కాని నన్ను కవిని చేశావు...
నా ప్రేమ నిజ మైనది ఐతే
నీవెందుకు నాకిక
నీ జ్ఞాపకం చాలదా నాకు...
ప్రేమంటే పదవులపై కదిలే పదాలు కాదు...
పెదాలు సైతం పలకలేని భావాలు...
నీకు ఎంతో దూర దూరంగా...
ఒంటరి తనానికి మరింత దగ్గరగా...
నీ కోసం ఎదురు చుస్తూ...
నీ జ్ఞాపకాల్లో మత్తుగా ఒదిగిపోతూ ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి