మొత్తం పేజీ వీక్షణలు

18, జులై 2021, ఆదివారం

చరిత్రలో నేడు : జులై 18 : ఎస్. వి. రంగారావు వర్ధంతి

సామర్ల వెంకట రంగారావు (జులై 3, 1918 - జులై 18, 1974) ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత.

కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు మద్రాసులో, ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు.

చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా ఉద్యోగం చేశారు.

జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. 

నటన కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు.

1946లో వచ్చిన వరూధిని అతనుకు నటుడిగా తొలి చిత్రం. 

దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించారు.

రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలలో రాణించారు 

పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన సినిమాలు. 

నటుడిగా ఆయన చివరి చిత్రం యశోదకృష్ణ (1975)

నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. 

ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు అందుకున్నాయి. 

విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ మొదలైనవి ఆయన బిరుదులు. 

1974 లో యాభై ఆరేళ్ళ వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించారు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి