మొత్తం పేజీ వీక్షణలు

18, జులై 2021, ఆదివారం

కృష్ణానది పరీవాహకతీరం

కృష్ణానది సహ్యాద్రి పర్వతాగ్రమునుండి ప్రవహించుచూ మహాబలేశ్వర క్షేత్రమున భూమియందు ప్రవేశించింది. 

వేదగిరి  పర్వత శిఖరాగ్రమున ఆమక వృక్షము నుంచి వేణి నది జనించెను. 

పర్వతాల  మీద కొంత దూరం ప్రవహించి సతారా అను ప్రాంతమున కృష్ణను కలిసెను. 

ఈ ప్రాంతము కృష్ణ వేణి సంగమం అని ప్రశస్తి పొందియున్నది. 

బ్రహ్మశిఖరమునకు దక్షిణమునుండి కకుద్మతీ నది బయుదేరి కృష్ణవేణిలో కలిసినది. 

కృష్ణవేణి సహ్యాద్రి పర్వతము నుంచి ప్రవహిస్తూ 60 నదీ, నదమును అనేక వాగును వంకను కుపుకొనుచూ అనేక ప్రాంతములో పంటకు, త్రాగునీటికి ఉపయోగపడుతూ అనేక పుణ్యక్షేత్రము యందు ప్రవహించుచూ కృష్ణాజిల్లా హంసదీవి వద్ద సాగరమునందు కలియుచున్నది. 

కృష్ణవేణినది పశ్చిమకనుమల్లో మహాబలేశ్వరాన గోముఖం నుండి ఒక ఊట కొనులో జన్మించినది. 

కృష్ణమ్మ మహారాష్ట్ర, కర్ణాటకల్లో 560 కి.మీ. ప్రవహించి మహబూబ్‌ నగర్‌  జిల్లా అంపురం దగ్గర తెంగాణలో ప్రవేశిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో 720 కి.మీ. దూరం ప్రవహించి కృష్ణాజిల్లా పులిగడ్డ వద్ద రెండు పాయలు చీలి ఏటిమొగ, ఎదురుమొండి దగ్గర సముద్రంలో కలు స్తోంది. 

కృష్ణానదికి దిండి, మూసి, పాలేరు, మున్నేరు, తంగభద్ర వంటి ఉపనదున్నాయి

కృష్ణానది ఆలం పురం వద్ద తెలం గాణలో ప్రవేశించినపుడు ఉత్తరదిశగా ప్రవహిస్తుంది. 

కృష్ణానది శ్రీశైలం వద్ద న్లమ కొండ మధ్యగా ఒక సన్నని కనుమ గుండా ప్రవహిస్తుంది. 

శ్రీశైలం నుంచి కృష్ణానది తూర్పుగా ప్రవహించి నాగార్జునాసాగర్‌ చేరుకుంటుంది. 

నాగార్జునకొండ దాటి కృష్ణానది అమరావతి క్షేత్రం చేరుకుంటుంది. 

బౌద్ధమతం క్షీణించి వైదిక మత ప్రాబల్యం పెరగడంతో తూర్పుచాణక్యరాజు భీమదేవుడు ఇక్కడ అమరేశ్వరాయాన్ని నిర్మించినట్టు శాసనాలు తెలుపు తున్నాయి. 

అమరావతి దాటాక కృష్ణానది పులిచింత దగ్గర మైదానాల్లో ప్రవేశిస్తుంది. 

విజయవాడ మీదుగా సముద్రం వైపు పయనిస్తూ పులిగడ్డ దగ్గర రెండు పాయల వుతుంది. 

ఈ రెండు పాయల  మధ్య ప్రాంతమే దివిసీమ. 

మరి కొంతదూరం ప్రవహించి మూడు పాయలు చీలి కృష్ణవేణి సముద్రంలో కుస్తుంది.

కృష్ణానది విశ్వరూపిణిగా లోక ప్రసిద్ధి. 

లోకాను తరింపజేయటానికి కృష్ణ పరమాత్మ సహ్యాద్రిపైన అశ్వత్థ వృక్షరూపంలో నిలిచాడని, ఆ చెట్టు వ్రేళ్ళ నుండి కృష్ణానది అవతరించిందని ఐతిహ్యం. 

మహారాష్ట్ర, కర్ణాటక, తెలం గాణ, ఆంధ్రరాష్ట్రా చారిత్రక సాంస్కృతిక జీవనంలో ఈ నది ప్రముఖస్థానం పొందింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి