మొత్తం పేజీ వీక్షణలు

22, జూన్ 2026, సోమవారం

నేను మీలా....

నేను మీలా

నటించలేను

ముఖస్తుతి

చేయలేను

వేదికల మీద 

మంత్రాలు

చదవలేను


మేకపోతు

గాంభీర్యం

ప్రదర్శించవలెను

అవును

మీలా

నటించడం రాదు 

శరీరమంతా

ద్వేషం

మనసునిండా

కుతంత్రం

ఓర్వలేనికళ్లు 

ఓర్మిలేనిరూపం

నాలో 

నింపుకోలేను

రంగుల స్టిక్కర్‌తో

విషం నింపుకుని 

మెరిసిపోయే 

టానిక్ సీసాను కాను

నా మనస్సులో 

సునామిని

దాచుకున్న 

ఎన్నో ఏళ్ల 

సంఘర్షణ నేను

అదిమిపట్టుకున్న 

అయినా సాధువుగా

సర్దుకుపోతున్న

సజ్జనుడిగా 

నడుచుకుంటున్న

నటించడం రాదు

ఆడించడం రాదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి