కపిలవాయి లింగమూర్తి సాహిత్యంలో విశ్వబ్రాహ్మణుల ప్రస్తావన
కపిలవాయిగారు శతాధిక గ్రంథకర్త. సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలో, వివిధ విషయాలపై సమగ్రమైన రచనలు చేశారు. వారి రచనలన్నీ పరిశోధానాత్మకంగా వివరాణాత్మకంగా ఉంటాయి. వారు విశ్వకర్మలు. విశ్వకర్మ సాహిత్యంపై, విశ్వకర్మ ప్రముఖులపై ఎన్నో గ్రంథాలు రాశారు. విశ్వకర్మ ప్రముఖుల ప్రత్యేక సంచికలకు కూడా సంపాదకత్వం వహించారు. వారి విశ్వకర్మ సాహిత్య రచనలు మాతృశ్రీ కడియంపాటి గురుగోవిందమాంబచరిత్ర, ఆంధ్రపూర్ణాచార్యుడు, శివరామబ్రహ్మేంద్రయోగి చరిత్ర, నాగశేషమాంబ చరిత్ర, నమఃకవి పంచననాయ, విశ్వకర్మపురాణము, విశ్వబ్రాహ్మణులు - సంస్కృతీ అనుకరణం, స్వర్ణశకలాలు, మాంగళ్యశాస్త్రం, వివాహస్వర్ణోత్సవ సద్దలి, నిదర్శనాలు, విశ్వకర్మ విలాసము, మా భగోట మొదల్కెనవి. వారు రాసిన వందలాది వ్యాసాలలో పీఠికలలో చాలా చోట్ల విశ్వకర్మల ప్రముఖులను, ప్రతిభావంతులను, వృత్తులను గురించి ప్రస్తావించారు. వారు స్వయంగా కొంతకాలం వృత్తిపని చేసినందున ఆ మెళకువలన్నీ వ్యాసాలలో ప్రస్తావించారు.
విశ్వకర్మ అంటే పరాత్పరుడ్కెన విశ్వకర్మ అనీ విశ్వకర్మలు అన్నపుడు ఆయన వంశంలో జనించిన వారనే అర్థం రూఢమైంది. వారు మనుమయాది దేవగణంలోని వారైనా, నేటికాలంలోని పంచదాయిలన్కెనా అట్లాగే చూడాల్సి
ఉంది. విశ్వబ్రాహ్మణ శబ్దమొకటుంది. విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మబ్రాహ్మణ శబ్దాలమీద చర్చ చాలాకాలంగా ఉంది. చర్చచేసే వారిలో వారివారి జిహ్వబలం వారిని నిలబెడుతూ వస్తుంది. ఎంతగా ఎన్నివిధాలుగా చర్చించినా ఈ చర్చంతా ఒక్క పంచదాsTÖ (పంచానన) వర్గంమీదే. బ్రహ్మయై సృష్టించటంతో విశ్వకర్మ విశ్వబ్రహ్మ అయినాడు. దాంతో అతని సంతతి విశ్వబ్రాహ్మణశబ్దంతో గుర్తింపబడిరది. విశ్వకర్మ - విశ్వబ్రాహ్మణ శబ్దాలు ఒకరకంగా పర్యాయాలే.
కపిలవాయివారి రచనల్లోకి తొంగిచూసి విశ్వకర్మలను గూర్చి, వారి కర్మను గూర్చి వారేం చెప్పారో తెలుసుకోబోతే మున్ముందుగా చెప్పుకోవలసిన గ్రంథం ‘స్వర్ణశకలాలు’. కావ్యాలలో ముఖ్యంగా ప్రాచీన కావ్యాలలో తాము చూసిన విశ్వకర్మల ప్రసక్తులను ఈ గ్రంథంలో ఎత్తిచూపి వానికి తమద్కెన వ్యాఖ్యానంచేశారు. గ్రంథంపేరే స్వర్ణశకలాలు. ఆ మేరకు స్వర్ణకారులయిన విశ్వజ్ఞవిశ్వకర్మవంశీయుల కర్మ, కర్మఫలాలు వర్ణించబడటం చూస్తామీ గ్రంథంలో.
ఉదాహరణ
“గరళపుముద్ద లోహమవగాఢ మహాశనికోట్లు సమ్మెటల్
హరు నయనాగ్ని కొల్మి, యురగాధిపు కోరలు పట్టుకార్లు ది
క్కరటి శిరంబు దాయ లయకారుడు కమ్మరి వైరివీరసం
హరణ గుణాభిరాముడగు మైలమభీమన ఖడ్గసృష్టికిన్.”
‘ఏఱువభీముని ఖడ్గం’ అనే శీర్షికతో ఉదాహరించిన ఈ పద్యం వేములవాడ భీమకవి చాటువట. ఈ పద్యంలో పేర్కొనబడిన వస్తువులన్నీ శివునిపరంగా ఉండేట్లు చెప్పబడ్డాయి. లోహం శివుని కంఠంలోని గరళం, అశని అంటే పిడుగు. పిడుగుకు హీరమనీ, శివునికి హీరుడనే పేర్లూ ఉన్నాయి. ప్రళయకాలంలో కురిసే పిడుగులు సమ్మెటపోటులు, శివుని నయనాగ్ని కొలిమి, ఆయన నలంకరించిన ఉరగాల (పాముల) కోరలు పట్టుకారులు, దిక్కరటిశిరం అంటే దిగ్గజశిరం డాకలి. ఈ రహస్యాలన్నీ విప్పిచూస్తే లయకారుడు. అంటే శివుడు. ఆ శివుని కమ్మరిగా ఉపమించి వర్ణించిన ఈ పద్యంలో విశ్వకర్మ ఛాయామాత్రంగా కనిపించటాన్ని విప్పిచెప్పారు కపిలవాయిగారు. శివుణ్ణి భీముడనీ అంటారు. ఓజులు అని విశ్వకర్మీయుల్నంటాం. ఇక్కడ భీమకవి ఈ భీముణ్ణి (శివుణ్ణి) భీమోజును చేశాడంటారు కపిలవాయిగారు. మొత్తంపై శివుణ్ణి మనుబ్రహ్మగా, విశ్వకర్మగా రూపుకట్టించిన ఈ పద్యానికి వారు చేసినవ్యాఖ్యానంలో తామున్నూ విశ్వకర్మను తలచుకున్నట్లే అయింది.
ఈ వరుసలోనే చిమ్మపూడి అమరేశ్వరుని ‘విక్రమసేనం’ లోని అశోకవృక్షవర్ణన. ‘గణపవరంవారి కమ్మరి’ అనే శీర్షికలో గణపవరపు వెంకటకవి ‘ప్రబంధరాజవేంకటేశ్వర విలాసం’ లో వసంతుణ్ణి కమ్మరిని చేసిన ఘట్టం ఉందని పేర్కొని వివరించారు. ఇట్లే మట్ల అనంతరాజు ‘కకుత్సవిజయంలో’ వర్ణించిన వడ్రంగిని పట్టి చూపించారు. ‘సింహాసనద్వాత్రింశిక’లోని మÖడవకథలో గౌళికుడనే మయకుమారుడు కఱ్ఱతో గరుత్మంతునిచేసి ఏకంగా తాను శ్రీమహావిష్ణురూపాన్ని ధరించి రాకుమారిని వరించిన సందర్భాన్ని ముచ్చటించారు. ‘గణపవరంవారి కొలిమిలో కాలినగుండు’, ‘కొరివిగోపరాజుగారి పడెచ్చు’, ‘అయ్యలరాజుగారి అగసాల’, ‘ఆంధ్రభోజుని అతుకు’ ‘పినవీరన పూతకడియం’, ‘భట్టుమÖర్తిచేసిన బంగారుబొమ్మ’, ‘వడ్డాదివారి వెండికంచం’, ‘నరహరిపండితుని పసిడిపూదె’ ఇట్లాంటి శీర్షికలలో ప్రాచీనకావ్యాల్లోని పద్యాల అచ్చట్లు ముచ్చట్లలో చోటుచేసికొన్న విశ్వకర్మీయులను తమ వ్యాఖ్యానాలతో దర్శింపజేశారు.
గతశతాబ్దంలో గోపాలపేట ప్రభువు తమ కేశంపేట, గోపాలపేటలలో ఆలయాలకు ద్వారాలు, మకరతోరణాలు, దేవతామÖర్తులకు కిరీటకవచాలు చేయటానికి పెదమర్రూరులోని తల్లోజు హనుమంతాచారిని పిలిపించుకున్నాడట. రేమద్దులలో పని సాగుతుండగా ఆ ప్రభువొకసారి పరిశీలనకన్నట్లుగా వచ్చి, హనుమంతుగారూ ! మీరు మంచి పనివారని విన్నాం. మీ పనితనం ఎలాంటిదో మాకెన్నడూ చూపకపోతిరి? అన్నాడట. ఆ తర్వాత ఒకనాడు ఆ ప్రభువు కొలువులో ఉండగా హనుమంతాచారి వెళ్ళాడట. తన దగ్గరున్న రెండు బంగారు తుమ్మెదలను రెక్కలునొక్కి ప్రభువుదిశకు విసిరాడట. అవి ఎగురుతూపోయి ప్రభువుమీద వాలాయట. తనమీద ఏదో పురుగు వాలిందనుకొని ప్రభువు విదలించబోతే హనుమంతాచారి వారించి వెళ్ళి తుమ్మెదలనుతీసి తనజేబులో వేసుకున్నాడట. ఆశ్చర్యమÖ ఆనందము కలుగగా ఆ ప్రభువు ఆ ఆచారికి ఒక యిల్లు బహుమానంగా యిచ్చాడట. ఆ హనుమంతాచారి వంశంవారు ఇప్పటికి గోపాలపేటలో ఉన్నారట. అట్లే మొలుగర అనే ఊళ్ళోని ఒక విశ్వకర్మ వెండితీగతో చిన్న చేపనుచేసి పళ్ళెంలో నీళ్ళుపోసి ఆ నీళ్ళలో ఆ చేపను వదిలితే పళ్ళెంచుట్టూ తిరిగిందట. ఇట్లాంటి సందర్భాలనూ ప్రోవుచేశారీ గ్రంథంలో. సూటిగా పరాత్పరుడ్కెన విశ్వకర్మను తీసుకోకపోయినా ఆయన ప్రభావాన్ని, ఆయన వంశీయులను ఈ వ్యాసాల్లో పాఠకులముందుకు తీసుకువచ్చారు కపిలవాయివారు.
కపిలవాయివారి సాహిత్యంలో విశ్వకర్మ అనే విషయం చెప్పుకోవలసివస్తే వారు వచనంగా కూర్చిన ‘విశ్వకర్మపురాణం’ చెప్పుకోక తప్పదు. దీనికి మÖలం వేంకటాచార్య కృతమైన పది ఆశ్వాసాల పద్యగ్రంథం. వ్యాసభగవానుని రచనల్లో ఉన్న అనేక కథలలో ఇరుక్కుపోయి ఉన్న విశ్వకర్మసంబంధి విషయాలను చిక్కుల్ని విడదీస్తూ సృష్టించబడిరది ‘విశ్వకర్మపురాణం’. వీపూరి వెంకటాచార్యులు తాను ఒకనాటి ముమ్మనాచార్యుని వంశంవాడనని చెప్పుకున్నాడు. ఈయన కాలక్రమంలో నల్లగొండజిల్లాకు తరలివచ్చి నివాసం చేసుకొని, పెందోటరాజ్యంలో ఉంటూ శ్రీనాథుడు కూడా రాసిన విశ్వకర్మపురాణం ఒకటుండేదని ఆ నాటికి వినికిడే కాని గ్రంథం లభ్యంకాలేదనీ, అందుకే తాను విశ్వకర్మపురాణం వ్రాస్తున్నానని చెప్పుకున్నాడట. ఈ పెందోటరాజ్యం నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో మునిగిపోయి కథల్లోమాత్రమే మిగిలిపోయింది.
ఇక్కడ నాగరఖండం అనే గ్రంథంగురించి కొంత చెప్పుకోవలసి ఉంది. పెందోట సామ్రాజ్యాన్ని ధవళేశ్వరపు మార్కండేయుడు పాలించిన రోజుల్లో ఆయన కోర్కెపై వ్యాసకృతమైనదీ సంస్కృతంలో ఉన్నదీ అయిన స్కాంద పురాణంలోని నాగరఖండం ఆంధ్రీకరించబడి తాళపత్రాల్లో పద్యగ్రంథంగా కూర్చబడిరదట. పెద్దకాలం పిదప ఆ పద్యగ్రంథానికి కడపజిల్లా కానిస్టేబుల్ రాయవరపు పూర్ణయాచారి ప్రతి రాయించి, మతుకుమిల్లి రామకృష్ణకవి అనే పండితునిచే తాత్పర్యాలు రాయించి నూటామÖడు సంవత్సరాల క్రిందట అచ్చువేయించాడు. ఇటీవల ఆ గ్రంథానికి సనాతనసాహితీసమితి వారు పునర్ముద్రణ తీసుకువచ్చి దానికి మళ్ళీ వందసంవత్సరాల ఆయువుపోసి పుణ్యంకట్టుకున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఆ నాగరఖండంలో ఉన్నదంతా విశ్వకర్మ చరిత్రమే. దీని భూమికమీదే వెంకటాచార్య విశ్వకర్మపురాణం రాశారని ఊహించవచ్చు. అయితే అదీ పద్యగ్రంథమే. కపిలవాయిగారు ఆ గ్రంథాన్ని వచనంగా చేయటానికి ముందే అదేపని కురిచేటి చెంచయ్యగారు చేయగా వారి గ్రంథానికి పీఠిక రాయవలసి వచ్చిందట కపిలవాయిగారికి. ఏమయితేనేం తరువాతికాలంలో తమ చిరకాలసంకల్పం నెరవేరుస్తూ తామును ఈ వచనరూప విశ్వకర్మపురాణం రూపొందించారు. ఇక వారి వచనరచన ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కొత్తగా చెప్పేపనిలేదు.
విశ్వకర్మ (వంశీయు) లకు తాము రూపొందించే మాంగల్యంతో విడదీయరాని బంధముంది. మాంగల్యానికితోడు ముత్తైదువలు ధరించే పవిత్రమైన ఆభరణాలు, తదితర ఆభరణాల విశేషాలతో కూర్చిన గ్రంథం ‘మాంగళ్యశాస్త్రం’. ఆభరణాల తయారీ, వానికి సంప్రదాయాలతో ఉన్న ముడి, ఏయే కాలాలలో ఏయే ఆభరణాలు వాడుకలో ఉండేవి, ఎవరు ఏయే సమయాలలో ఏ ఆభరణాలు ధరించటం శ్రేయం, ఆయా ఆభరణాలకున్న ప్రత్యేకతలు మొదల్కెన విషయాలెన్నో ఏకరువు పెట్టారు కపిలవాయిగారీ గ్రంథంలో. దీనికి మÖలం వారికి తమ యింటిలోనే శిథిలావస్థలో దొరికిన ఒక ప్రాచీనగ్రంథమట. ఆ గ్రంథప్రతిని తీసికొని చూచి డా.జ్ఞానానందగారు కన్నడంలోకి అనువదించారు, ప్రచురించారు. ఆపైన తెలుగులో కపిలవాయిగారి వ్రాతతో ప్రచురణం జరిగింది. దొరికిన మాంగళ్యశాస్త్రరంలోని అంశాలేకాక తమ పరిశోధనలో తేలిన ఎన్నెన్నో విశేషాలను ఈ గ్రంథంలో జతకూర్చి విస్తరింపజేశారు. ఈ గ్రంథంలో ఆభరణాల విశేషాల్తోపాటు అక్కడక్కడ విశ్వకర్మ(వంశీయు)ల ముచ్చట్లును సాగాయి. తమ ‘మాంగళ్యశాస్త్రం’ జ్ఞానానందగారు కన్నడంలోకి అనువదిస్తే, ఆ జ్ఞానానందగారి కన్నడగ్రంథం ‘విశ్వబ్రాహ్మణులు - సంస్కృతీ అనుకరణలు’ ను కపిలవాయిగారు తెలుగులోనికి అనువాదం చేశారు. ఇదో చిత్రమైన సన్నివేశం. ఈ గ్రంథనామంతోనే ఇదంతా విశ్వకర్మ, విశ్వకర్మీయుల విశేషాలు, విషయాలతో నిండి ఉంటుందని తెలిసిపోతుంది. విశ్వకర్మసాహిత్యంలో ఇదొక అమÖల్య గ్రంథంగా చెప్పుకుంటారు.
కపిలవాయి రాసిన ప్రతి గ్రంథంలో అవకాశమున్నచోట విశ్వకర్మీయులను గురించి, విశ్వకర్మను గురించి ప్రస్తావించారు. ఎందరో మరుగునపడిన విశ్వకర్మీయుల చరిత్రలను వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి పరిచయం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి