బ్రహ్మశ్రీ డా. బొడ్డుపల్లి కాళిదాసు (ఆధ్యాత్మిక కుసుమాలు)
బ్రహ్మశ్రీ డా. బొడ్డుపల్లి కాళిదాసు గారు ఆధ్యాత్మికా జగత్తులో వికసించిన ధృవతార. మాతా పిత సేవలో తరించిన ఒక ముద్దుబిడ్డ. ధార్మిక, సమాజసేవానిరతిలో నిరంతర కృషీవలుడు. దైవ చింతనలో తపస్వీ, వృత్తిపరంగా వైద్యుడైన ప్రవృత్తి పరంగా ఆధ్యాత్మికా ప్రపంచములో ప్రవచనా చక్రవర్తి. మానవ సేవయే మాధవ సేవగా ఎంచిన నిస్వార్థ సేవా దురంధరుడు, పేదలపాటి పెన్నిది.
మహాకవి కాళిదాసు నామదేయమును సార్ధకము చేసుకున్న మీVAన్నతుడు. వీరి కర కమలముల నుండి వెలువడిన ఈ పుస్తకంలో వారి మనోగతాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రీయ విజ్ఞానాన్ని మన కందరికి మకరందంలా పంచారు. ఈ విశాల విశ్వరూప తత్వాన్ని, హిందూమత వైశిష్ట్యాన్ని, ద్విజుడైన విశ్వబ్రాహ్మణుని ఉన్నత విశిష్ట ఔన్నత్య వ్యక్తిత్వాన్ని ప్రాపంచిక విశ్వమానవాళికి ఆవిష్కృతం చేసారు.
హిందుమత విశ్వాసాలు, దైవారాధనల నియమావళి, ప్రదోష కాల శివాభిషేక ప్రాశస్త్యం, మంత్రశక్తి మహాత్యం, భగవంతుని ప్రసన్నము చేసుకొనే విలక్షణ సూత్రాల నియమావళితో, జీవితాన్ని చైతన్య వంతంగా, ఈ స్వాపి¾్నక జగత్తులో ఎలా సాధించగలమోనని నిరూపించారు.
దేహమే దేహలయం: ‘అహం బ్రహ్మాన్ని’ అనే ఆది శంకరుని విశ్వవ్యాప్త అద్వైత సిద్ధాంతాన్ని వివరంగా వక్కాణించారు. ‘ఏకం సతివిప్రా బహుదా వదంతి” అను తత్వాన్ని జ్ఞానులు, దైవాన్ని అనేక ఆకారాలుగా ఆవిష్కరించారు.
ఏ రూపంలో, ఏ విధంగా, ఏ ఏ సమయాలలో, నలు దిక్కుల, ఎక్కడ వ్రతాలు, జపాలు, తపాలు, ఆరాధనలు జరిగినా అవి అన్ని బ్రహ్మలో తరించేవే అనునానుడిని బహు చక్కగా వివరించారు.
వివిధ స్వరూపాలలో నున్న దేవి, దేవతా మÖర్తుల ఆభరణాలు, ఆయుధాలు మరియు మానవ ఆంగాలలో నున్న దైవ స్థానాల నిక్షిప్తత, వాటి విశిష్టత, ప్రత్యేకత, ప్రయోజనాలు ప్రయోగాత్మకంగా, విశ్లేషించి, అనుమానాలకు, ఆలోచనలకు తావు లేకుండ వివరణ ఇచ్చారు.
సామాజిక స్పృహ కలిగే విధంగా మననిత్య జీవితంలో ఉపయోగించే పసుపు, కుంకుమ మరెన్నో ఉపకరణాల ప్రయోజనం, కట్టు బొట్టు అలంకరణ ఆచరణ విధానాలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలు ఉన్నాయని అభి వర్ణించారు.
నిత్య జీవితంలో సమాజ సగౌరవాన్ని పొందాలంటే కావలసిన విలక్షణమైన ‘వకార పంచకం’ లోనున్న అంశాలను సభ్య సమాజానికి విశదీక రించారు. వీటికి తోడుగా సమాజలో మంచి పేరు, పలుకుబడికి స్థానం కావాలంటే, “ప్రియ వాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతన తస్మాత్ తదేక వ్యక్తవ్యం వచనే కాదరిద్రతో’ అంటే అనుకూలతను అభివ్యక్త పరిచే అలవాటు అన్ని విధాల శ్రేయష్కరం అన్నది ఆర్యోక్తి.
శ్రాద్ధకర్మలలో మాంసాహారాన్ని నిషేధించి, ఆహింసా పద్దతిలో నివేదనలు, తర్పణాలు, దానాలు, అర్పిసే పితృ దేవతలు వాటిని, దివంగ తులకు ఏ రూపంలో నున్న వారికి అందించి తృప్తి పరుస్తారు అనే విషయాన్ని తేట తెÉల్లం చేసారు.
తేనెలొలికె తెలుగు భాషలోని ఔన్నత్యాన్ని వినసొంపుగా, మనస్సునకు హాయిని, అహ్లాదాన్ని ఎంతో వినోదాన్నిస్తుందని ఉదాహరణాలిచ్చారు. ‘వసుదైక కుటుంబము’ లో నున్న విశాల హృదయ తత్వాన్ని, అనందాన్ని ఇంద్ర ధనుస్సు రూపంలో విరజిమ్మారు.
అమ్మకు ఆప్యాయతతో, మధురమైన అనుభూతుల తో, అనురాగ అనుబందాలతో అక్షరాంజలి ఘటించారు. మాతృ మÖర్తియందున్న భక్తి, ప్రేమానురాగాలు పాట రూపంలో, ‘మనస్సుకు హత్తుకునే విధంగ ఉంది.
గృహస్తు ధర్మంలోనున్న భాధ్యత, తోబుట్టువులతో నున్న ఆప్యాయత, ఆడపడుచులలోని అనురాగం, కుటుంబంలో జరిగే సీమంతం సంబరాలను అందంగా ఆవిష్కరించారు. సమాజానికి జాగరూకతగా, జీవిత సత్యాన్ని, అత్త ఉన్నకోడులుత్తమురాలుగా స్వీయానుభవముతో కొనియాడారు.
సాంఘిక సేవా ధర్మంగా నిరుపేదలకు నిర్మించిన ఉచిత విద్యా ఆశ్రమ పాఠశాల ‘కారుణ్వ సింధు” కు అక్షరాభినందనలు కురిపించారు. మన సమాజంలో, ప్రాచీనులలో ఉద్దండులైన ప్రాజ్ఞులు, ఋషి పుంగవులు ఎందరో జన్మత: బ్రాహ్మణేñతరులై, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణులుగా నీరాజనాలందుకున్న వారి నామాలను స్మరించి వారికి వినయాంజలులు ఘటించారు.
చివరిగా, సమాజానికి కనువిప్పు సందేశంగా ఆచరణీయ అంశాలను కొన్ని ఉద్ఘాటించారు. అందులోని సత్యం, ధర్మం, నీతి, నిజాయతి, నిస్కామక్రియలను ఆసక్తిగా ఆచరిస్తూ, భక్తి శ్రద్దలతో తల్లి, తండ్రులను సేవిస్తూ, కటుంబము, సంఘం పట్ల ఆదరణ కల్గి, ధార్మిక సేవా కార్యక్రమాలలో నిరంతరం పాల్గొంటూ ఆ భగవంతుని ఆశీస్సులతో తరించాలని ఆశించిన ప్రాజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు, శ్లాఘనీయుడు డా. బొడ్డుపల్లి కాళిదాసు గారు.
వీరి రచన నేటి యువతరానికి సంస్కృతీ సాంప్రదాయాలను తెలిపే కరదీపిక. ఇంత చక్కని రచన అందించిన మా బావగారైన కాళిదాసు గారు ఆయురారోగ్యాలతో కలకాలం వర్థిల్లాలని మనసారా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాము. వీరి లేఖిని నుండి మరెన్నో ఇలాంటి రచనలు వెలువడాలని మా ఆకాంక్ష.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి