మొత్తం పేజీ వీక్షణలు

26, జూన్ 2026, శుక్రవారం

దేవదాసు.....నిందాస్తుతి

వినోదా వారి ‘దేవదాసు’ విడుదలైన 58 సంవత్సరాలకు sTÖ కైవారగీతం పాడటానికి రెండు కారణాలు. షష్టిపూర్తి చేసుకొనే సమయంలో కూడా సర్వాంగసుందరంగా, సొగసుజూడతరమా అన్నట్లిది శోభిల్లడం. ఇప్పటికి అయిదు భాషల్లో తయారైన పదకొండు (G ఒక మÖకీ) చిత్రాలలో దీనికి వచ్చిన పేరూ ప్రతిష్ఠా మరే చిత్రానికీ రాకపోవడం.

నేనీ ‘దేవదాసు’ల్లో ఎనిమిదింటిని చూశాను. ప్రతిదానిలో ఏదో ఒక ప్రత్యేకాకర్షణ యిప్పటికీ సూదంటురాయిలా వుంది. ఒకదానిలో సంగీత సాహిత్యాలు (ఆరుద్ర - రమేశ్ నాయుడు / విజయనిర్మల-1974), యింకోదానిలో స్క్రీన్-ప్లే (పి.సి.బరువా/ పి.సి.బరువా-1935, హిందీ), ఛాయాగ్రహణం (కమల్ బోస్ / బిమల్ రాయ్-1955, హిందీ), మొట్టమొదటి టైటిల్ కార్డు నుంచి చిట్టచివరి సమాప్తం కార్డు వరకూ ప్రౌఢ స్ధాయిలో పటాటోపం (సంజయ్ లీలా భన్సాలి, 2002, హిందీ), భగవాన్-చునీలాల్‌గా అమోఘ నటన (ఉత్తమ్ కుమార్/దిలీప్ రాయ్-1979, బెంగాలీ)  యిలా అన్నిటిగురించీ ఒక ప్రత్యేక దీప్తిని ఎంచి చూపవచ్చు.

కాని sTÖ అన్ని పరిధులను దాటి, ప్రేక్షకుల మనసుపై చెరగని ముద్ర వేసింది వినోదా వారి ‘దేవదాసే’,  నిస్సంశయంగా. నేనీమాట ఒక ఆంధ్రుడిగా మాతృభాషాభిమానంతో చెప్పడంలేదు. అరవై అయిదు సంవత్సరాలుగా పలు భాషల్లో వేల సినిమాలు చూసి సినిమా కళ అంటే ఒక స్పష్టమైన దృష్టినేర్పరుచుకొని అంటున్నమాట.

స్వర్ణయోగం సిద్ధించటానికి కారణాలు సవాలక్ష. అలాగే sTÖ చిత్రమిలా బంగారమయిదంటే దాని వెనుకనున్న తారాబలం, సాంకేతిక బృందమే కాక మరొక అంశం అదృష్టం, అన్నీ అలా అందంగా కలిసిరావడం. ఆ యోగానికి ఒక్కరినే వేలెత్తి చూపమంటే, కాదు బలాత్కరిస్తే దర్శకుడు (వీరికి సంగీత, నృత్య, సాహిత్యాభినయాలు వంశపారంపర్యంగా వచ్చి, కృషితో చేతికందిన కల్యాణసౌగంధికాలు) వేదాంతం రాఘవయ్యనే పేర్కొనాలి. ఆ మరుసటి సంవత్సరమే వీరి దర్శకత్వంలోనే వచ్చి, అందరినీ నిరుత్సాహపరచిన ‘అన్నదాత’  మాటేమిటి అని అడిగితే నేనొక ఋషివాక్యాన్నే ఉదాహరించగలను: ‘చినికిన చినుకెల్ల మంచి ముత్యము కాదు’ (మల్లాది రామకృష్ణశాస్తి - చివరకు మిగిలింది/రామినీడు, 1960).

సాంకేతిక వర్గంలో ప్రతి ఒక్కరూ తాము చేయవలసింది నిష్కళంకంగా చేశారు. తేటతెల్లంగా కనబడే ఛాయ, కళ, మేకప్, వస్తాలంకరణలే కాక గాలి తెచ్చే గంధంలా తెలిసీ తెలియక అలముకొనే నృత్యరచన, నేపథ్య సంగీతము, కూర్పు కూడా ఒకదానికొకటి తోడైనాయి.

నేను మొట్టమొదట ‘దేవదాసు’ చూసింది మొదటి విడుదలకే, 1953లో  స్కూలు క్రికెట్టు జట్టు అఫీషియల్ ఫోటోగ్రాఫర్‌గా బెంగుళూరు వెళ్లినప్ప్పుడు. చివరనే కాదు ఎన్నో సన్నివేశాలలో కన్నీళ్లు కాలువలై ప్రవహించాయి. ఆ వయసు—నిండా నిండని పధ్నాలుగు—అటువంటిది. ముఖ్యంగా చంద్రముఖి-దేవదాసు వీడ్కోలు సన్నివేశం గుండెను పిండివేసింది. ఎన్నో సంవత్సరాల తరువాత విజయవాడ మాడర్న్ కఫేలో వుంటూ దగ్గరున్న ఎ.సి. హాలులో చూడని ‘సీతారామయ్యగారి మనవరాలి’ని వదులుకొని దూరంగా బెంజ్ సర్కిల్ అవతల వున్న పాత హాలులో, ఆ హోటలు మేనేజరు సైకిలు తీసుకొని వెళ్లి, రాత్రి ఆటను చూసినప్ప్పుడు - అదే ఉత్పాతం. అదే sTÖ ‘దేవదాసు’ గొప్పతనం.

ఒకటి రెండు ముచ్చట్లు అందరికీ తెలియనివి చెప్పి, sTÖ వందిమాగధీయాన్ని ముగిస్తాను.

‘దేవదాసు’ పాటల్లో మల్లాది వారి హస్తం ఉందనే మాట పాతదే. దీనికి ఉదాహరణగా ‘అందాల ఆనందం’, ‘కుడి యెడమైతే’ పాటలను పేర్కొంటారు. ‘తాగినోడి మాటకర్థం వెతకాలా’ అని ఒక రిక్షావాడడగడం కట్టుకథని ప్రతిభాశాస్తి నాతో స్వయంగా చెప్పారు. అవటుపెడితే, మÖడుచోట్ల సంభాషణల్లో నాకు ఆ రామకృష్ణుడే ప్రత్యక్షమౌతాడు.

“నువ్వెందుకే sTÖ గీత గోవిందం?” (నాయనమ్మ, పుట 25).

“నమస్కారం మహాప్రభో! నాకు సెలవిప్పించండి. ఇహ నేనీ ‘ప్రహ్లాద’ నాటకం ఆడలేను!” (బడిపంతులు, పుట 31).

“అయ్యయ్యో! అదేం పరధ్యానమే తల్లీ? నాకు తలంబ్రాలు పోస్తావేమే!” (నాయనమ్మ, పుట 38).

సినిమా రచయితగా సముద్రాల రాఘవాచార్యులు మల్లాది రామకృష్ణశాస్తి ప్రక్కన ఆచంట మల్లన్నే, సందేహం లేదు. కాని పై మÖడూ సముద్రాల కాదు గదా తన మగని నాలిక దిగివచ్చిన చదువులతల్లీ వ్రాయలేదు. కస్తూరి, పునుగు, జవ్వాదుల ఘాటు లేకపోవచ్చు. కాని వట్టి వేరు మట్టి వాసన, చల్లని పరిమళం, దానిదే. మల్లాది వారి సంభాషణలు పాత్రలకు సహజాతాలు.

‘దేవదాసు’ కోసం రికార్డు చేసి అందులో ఉపయోగించని పాట£కటున్నది. అది ‘వినవేడుక” (ఆర్కే బుక్స్, 2005, వెల రూ. 100/-) పుస్తకంలో 26వ పుటలో ఉంది.

ఏరు నవ్విందోయ్ ఊరు నవ్విందోయ్

ఏటిలోన చిట్టి చేప యిట్టే నవ్విందోయ్

గట్టున చిట్టి పాప అట్టే నవ్విందోయ్ ॥ఏరు॥

ఏరు మీద ఊరు, ఊరు మీద ఏరు

ఏరు మయాన పాలేరు

గరప చేనుమీద మిరపపండు చూసి

దొరబిడ్డ ఉలుకెత్తి దొండపండనుకుంటే ॥ఏరు॥

నిమ్మకు నీరెట్టి చేనుకు నారెట్టి

సమ్మతైనావోడు నిదరోతే

కంటినిద్దుర రాక ఒంటిపొద్దూ పోక

ఏమి తోచని పిల్ల ఏతామెక్కిందని ॥ఏరు॥

ఈ పాట వినోదావారి ‘దేవదాసు’ కోసం సి.ఆర్. సుబ్బురామన్‌కి పాడినట్లుగా మాధవపెద్ది సత్యం నోటు బుక్కులో వుంది. ఆ పాట బోళ్ల సుబ్బారావు ప్రథమ చిత్రం ‘పల్లెపడుచు’లో ఉపయోగించుకొన్నారు. ఈ సినిమా పాటలతోనే విడుదలలైన రికార్డు పైనా వినోదా వారి సౌజన్యంతో అనీ, రచన మల్లాది రామకృష్ణశాస్తి అనీ వుంది.

ఇదంతా నాకు తెలిసేటప్పటికి డి.ఎల్.నారాయణ, వేదాంతం రాఘవయ్య లేరు. ఉన్న ప్రతిభాశాస్తి, పేకేటి శివరాం, అక్కినేని నాగేశ్వరరావు sTÖ పాట సంగతే తెలియదన్నారు.

పాట రచన బట్టి ఏ సన్నివేశం కోసం చేశారా అని ఆలోచిస్తే, ఏదీ తేలడం లేదు. వరసా, వాద్యగోష్ఠి గమనిస్తే, ఒక పడవవాని పాటై వుండవచ్చు అనిపిస్తున్నది. ఒకవేళ బెంగాలులో చిన్న చిన్న నదులు చిలవలు పలవలుగా వుండటం దృష్టిలో పెట్టుకొని, తండ్రి చనిపోయిన తరువాత దేవదాసు సొంత వూరు వచ్చే తరుణంలో, పార్వతీ ప్రయాణం కట్టిన సన్నివేశానికా? ఇవన్నీ తలపోతలే.

చివరి మాట. విజయనిర్మల ‘దేవదాసు’తో బాటు వినోదా వారిది కూడా విడుదల చేయబడి బాగా ఆడటంతో అన్ని పాటలతో ఒక ఎల్.పి. కొలంబియా లేబిల్‌పైన సరస్వతీ స్టోర్స్ వారు విడుదల చేశారు. వివరాలన్నీ తప్ప్పుల తడకలు. ఆ పాటలు మొదట విడుదల చేసింది హెచ్.ఎం.వి. ఈ తప్ప్పులు దిద్దమని సరస్వతీ స్టోర్స్ కణ్ణన్‌ని అడిగితే, అవి మాకు హెచ్.ఎం.వి వాళ్లిచ్చారు, అవే కరెక్టు, మార్చడం కుదరదన్నారు. గ్రామకో మంగాపతినడిగితే అది కొలంబియా విడుదల, నేను చేయగలిగిందేమీ లేదు అని చేతులెత్తేశారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడని బద్దెన యేనాడో అన్నాడు కదా తన సుమతీ శతకంలో! వసుదేవుణ్ణయినా ఫలితం లేకపోయింది.

అప్ప్పుడు మద్రాసు విజయ-వాహిని స్టూడియోలో షూటింగ్‌కని అక్కినేని వున్నారు. ఆయన చేతులు పట్టుకొన్నాను, మధ్యాహ్నం విశ్రాంతి వేళ భంగం కలిగించి. ‘మీరు రెండు మాటలు చెప్పిన దేవదాసు ఎల్.పి. యిన్ని తప్ప్పుడు వివరాలతో విడుదల చేశారు. నేను మర్యాదగా అడిగితే మాట వినడం లేదు ఆ గ్రామ, యింటి సింహాల వాళ్లు. ఏయే దిద్దుబాట్లు చేయాలో మీరు వ్రాసినట్లు ఆ కంపెనీల వారికి ఒక ఉత్తరం టైపు చేసి తీసుకువచ్చాను. మీరు సంతకం పెట్టండి’ అంటూ అభ్యర్థించాను.

ఒకసారి చదివి సంతోషంగా సంతకం పెట్టారు. ఆ ఉత్తరం చివరి పేరాలో ‘ఈ సరియైన వివరాలు వి.ఎ.కె. రంగారావు యిచ్చినవని కొత్త విడుదలపై వుండాలి’ అని వుంది. అలాగే ఆ ఈస్టిండియా కుంఫిణీ వారు బ్రతికినట్టు విడుదలైన కేసెట్టులో వేశారు. ఇప్ప్పుడా కౌటిల్యులా విషయం తొలగించే వుంటారు.

ఆ విజయం నాకు జరిగిన కనకాభిషేకంలో ఒక నాణెం. ఇప్ప్పుడీ లోకంలో లేనివారికి జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించడం కన్నా ఆనంద్‌కి ఆనందమేమున్నది! నాకీనాడు పేరుప్రతిష్ఠలున్నవంటే దీనికి కారణం వారు కట్టిన సరాగమాలలే కదా! 

ఇలాంటి పాత చిత్రాల సంభాషణలు నవలా రూపంలో రావడం ఆ కర్తలకు నివాళి. ఆ కార్యానికి దాఖలా. నేటి ప్రేక్షక పఠితలకు పచ్చకర్పూరం వేసిన కొఱ్ఱబియ్యపు పాయసం. ఎత్తండి. గుర్తించండి. ఆస్వాదించండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి