మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

20, జూన్ 2026, శనివారం

భాగవతంలోని సందేశాలు ఏవి?

 భాగవతంలోని సందేశాలు

1. పరమాత్మయే ఈ సృష్టి నియామకుడు, పాలకుడు

2. బ్రహ్మం సర్వవ్యాపకం, సృష్టికి ఆధారం. 

3. స్వధర్మాచరణయే మనిషి యొక్క అసలైన ధర్మం. 

4. కార్యాల ఫలాభిలాషను విడిచిపెట్టాలి. భగవదర్పితం చేయాలి

5. నిషద్ధ వ్యాపారాలను విడిచిపెట్టాలి. 

6. మనప్రయత్నానికి దైవం ఎంతిస్తే అంతలో తృప్తిపడాలి.

7. మంచి ఆధ్యాత్మిక సాహిత్యం చదవాలి. 

8. ఆత్మవేత్తలను సదా సేవించాలి. 

9. మోక్ష ధర్మాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి.

10. ఎక్కడŠ పుణ్యముంటుందో అక్కడ ఆకలి ఉండదు.

11. జీవిత కాలం ఎంతుందో అంతకాలం జీవించటం ఒక్కటే జీవిత ఫలం కాదు.

12. ఏ శ్రమ భగవత్ప్రీతికరంగా పరిణమిస్తుందో అది సార్థకం. తక్కినవి నిరర్థకం.

13. జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి ఇవి ఆత్మ మÖడు శక్తులు.

14. భక్తి పంచమ పురుషార్ధం. మిగతా నాలుగింటికి ఆధారం.

15. పూజ కేవలం దైనందిన విధినిర్వహణ కాదు. అది భక్తి సాధనం.

16. భక్తి లేని సాధన వలన మిగిలేగి శ్రమ మాత్రమే.

17. దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము ఇవి భక్తి అంగాలు.

18. కోరినది ఇవ్వటం వరం. ఏది మేలో అది ఇవ్వటం అనుగ్రహం.

19. భక్తి ఒక్కటే దుఃఖనివృత్తికి ఆలంబనం.

20. వైరభక్తి, జ్ఞానభక్తి, మÖఢ భక్తి అని మÖడు విధాలు.

21. నవ భక్తిమార్నాలు : శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, దాస్య, సఖ్యం, అర్చనం, వందనం, ఆత్మనివేదనం.

22. అద్వైతము భేదభావాన్ని నిషేధిస్తుంది. కాని లోకవ్యవహారాన్ని కాదు.

23. ఆత్మ - రాజు, అహంకారం-మంత్రి, మనస్సు - సేవకుడు.

24. భగవంతుడు భక్తికి వశమైనట్లు మరొకదానికి వశుడు కాడు.

25. భక్తితో ఉండటమే పూజ గాని పుష్పాది సమర్పణ పూజ కాదు.

26. పరమాత్మను ఆశ్రయించినవారికే ముక్తి సాధ్యపడుతుంది.

27. కలియుగంలో దైవనామస్మరణ అన్నిటి కంటే శక్తి వంతమైనది.

28. భక్తి యోగానికి వైరాగ్యము అవసరం. 

29. ఏ కార్యము భగవత్పరమో అదే ఉత్తమ ధర్మం. 

30. ఏ కాలం భగవత్కీర్తన స్మరణాదులతో గడుస్తుందో అదే పుణ్యకాలం

31. భగవన్నామ సంకీర్తిశ సర్వజనులకు నియత ధర్మము.

32, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వము, ముక్తి ఇదే భాగవతము. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి