మొత్తం పేజీ వీక్షణలు

22, జూన్ 2026, సోమవారం

దుఃఖం ` సంతోషం

రెండు

హృదయాలు 

ఏకాంతంగా

మాట్లాడుకుంటున్నవి

ఒక హృదయం 

దుఃఖాన్ని 

ఆరబోస్తుంది

మరో హృదయం 

సంతోషాన్ని 

ఆవిష్కరిస్తుంది


ఈ రెండు

హృదయాల్లో

ఏ హృదయం

దుఃఖంతో ఉందో

తెలియదు 

సంతోషంమాత్రం

సగంలోనే 

మాయమయింది

దుఃఖం మాత్రం

అలాగే ఉండిపోయింది 

బహుశా దుఃఖం

బంధించినట్టుగా

హృదయాన్ని 

సంతోషం

బంధించదేమో? 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి