మొత్తం పేజీ వీక్షణలు

22, జూన్ 2026, సోమవారం

నీ వెవరు?

ఒక నిముషం

అద్దం ముందు

నిలబడు


నువ్వు తొడుకున్న

ముసుగు కనిపిస్తుంది

నువ్వు పూసుకున్న రంగు

అగుపిస్తుంది

నీ మేకపోతు గాంభీర్యం

నీ మేకవన్నెపులి నటన

దృశ్యమానమవుతుంది


గతం కళ్ళముందు

కనిపిస్తుంది 

అప్పుడు చెప్పు 

నీవెవరు?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి