భాగవతము చదవటం ఒక అద్భుతమైన, అనిర్వచనీయమైన అనుభవం. అత్యంత సమగ్రమైన ఆధ్యాత్మిక జ్ఞానం. భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సంపద ప్రపంచంలోనే అత్యంత విశేషమైనది. అందులోనూ భాగవతము అత్యంత సంపూర్ణమైన జ్ఞానము. భాగవతము పేరులోనే ఉన్నట్టు భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వము, ముక్తి వీటన్నింటి గురించి సమగ్రంగా సృజించట మేకాకుండా వీటి మధ్య అద్భుతమైన సమన్వయం సాధించిన గొప్పగ్రంథము.
సృష్టి యొక్క నిర్మాణము, అవిర్భావము, యుగములు, కల్పాలు, ప్రకృతి నియమాలు, కాల స్వభావము, పరిణామము వీ టన్నిటి గురించి సమగ్రంగా చర్చించినది. ఆత్మ, అనాత్మ జ్ఞానము, పరమాత్మ యొక్క స్వరూపము. ఆయన అవతారాలు, వాటి వెనుక పరమార్థాలు, లోకంలో ప్రచారములో ఉన్న వ్యావహారిక సత్యాలు, పారమార్ధిక సత్యాలు వీటి గురించి వివరించింది.
చారిత్రిక, ఆధునిక విజ్ఞాన దృష్టికోణంలో భాగవతంలోని సంఘటనలు, సన్నివేశాలను ఎలా అర్ధం చేసుకోవాలి? ఆయా విషయాలలోని శబ్దార్ధాలను గాక, భావార్థాలను ఎలా గ్రహించాలి? అనే విషయాలను కూడా స్పష్టంగా వివరించింది. ఏఏ యుగాలలో ప్రజలు ఎవరికి వారు ఆచరించవలసిన ధర్మాలు, ఎవరికి వారికి విధించిన నైమిత్తిక కార్యాలు వాటి విధి విధానాలను వివరించింది.
ఏఏ కార్యాలు ఆచరించటం వలన ఆయా కర్మఫలాలు ఎలా ఉంటాయి, ఆయా కర్మఫలబోగాలు ప్రారబ్ధాలుగా మారి ఎవరెవరికి ఎలా జన్మలోను, జన్మాంతరంలోను అనుసరిస్తాయి అని స్పష్టంగా వివరించంది. సాధకులు తమ తమ సాధనా మార్గాలలో ఎలా పురోగ మించాలి? ఎలాంటి జాగ్రత్తలు వహించాలనే హెచ్చరికలు కూడా చేసింది. మార్గ దర్శకాలను సూచించింది.
భగవంతుని యొక్క వివిధ విభూతులు, శక్తులు, అవతారాలు వాటి ఉద్దేûశాలు వివరించింది. మానుష రూపంలో ఆయన అవతరించినప్పుడు ఆయన ఎలా తన అవతార కర్తవ్యాలను నిర్వర్తించి అవి పూర్తవగానే ఆయా అవతారాలను ఎలా చాలించాడు అని స్పష్టంగా వివరించింది. ఆయా అవతారాలలో ఆయన చేసిన కార్యాలను అద్భుతంగా వివరిస్తూనే వాటన్నిటిని మనం లౌకిక వ్యవహారిక దృష్టితో కాకుండా అలౌకిక, పారమార్థిక దృష్టితో ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని స్పష్టంగా వివరించింది.
సగుణ, నిర్గుణ భక్తులను నిర్వచించి వాటి యొక్క స్వభావాలు, వాటి పరిణామాలను వివరించింది. ఆయా మార్గాలలో సాధన చేసి అత్యున్నత స్థాయికి చేరుకొన్న మహానుభావుల జీవిత విశేషాల ద్వారా మార్గదర్శనం చేయించింది. హిరణ్యకశిపుడు, రావణుడు, కంసుడు, శిశుపాలుడు లాంటి వారు వైరి భావంతో కూడా భగవానుడిని ఎదుర్కుని ఎలా ముక్తిని పొందారనేది కూడా వివరించింది.
ఎంత జ్ఞానము, స్థితప్రజ్ఞత సంపాదించినా నిష్కామభక్తి లేకపోవటం వలన అవి ఎలా రాణించవో వివరించింది. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము ఇలా అన్ని ఆశ్రమా వారు తమ తమ ఆశ్రమాలలో పాటించవలసిన విధివిదానాలను స్పష్టంగా వివరించింది. ఇందులోని అత్యంత మనోహరమైన ఘట్టం ఏమిటంటే శ్రీ కృష్ణుడి యొక్క సంపూర్ణ అవతారము, ఆ అవతారములో ఆయనయొక్క అతి మానుష తత్వం యొక్క వివరణ సాధకులు ముందుగా అంత:కరణ శుద్ధి ఎలా చేసుకుని ఆశుద్ధ అంత:కరణములో భగవానుడిని ఎలా ప్రతిష్టించుకోవాలి, ఎలా సదాకాలం కోసం నిలబెట్టుకోవాలి అని స్పష్టంగా వివరించింది. సాధికులు ఇంద్రియ భోగాలను ఎంత కనిష్ట సాయిలో వినియోగించాలి, మిత, హిత ఆహారవ్యవహారాలు ఎలా ఉండాలి అని స్పష్టంగా వివరించింది.
పుస్తకాలు చదివి సంపాదించిన పుస్తకజ్ఞానము, శ్రవణం వలన సంపాదించిన శృతజ్ఞానము ఈ రెండూ అనుభవ జ్ఞానము లేకుండా ఎలా రాణించాలో వివరించింది. అనుభవజ్ఞానము ఎలా సంపాదించుకోవాలి? దానిని ఎలా ఆచరణలోకి తెచ్చుకోవాలి అని కూడా స్పష్టంగా వివరించింది. భక్తిహీనుడయిన విప్రుని కంటే భక్తి కలిగిన ఛండాలుడే మేలన ఒకింత కఠినంగా సత్యాన్ని వివరించింది. ఆధ్యాత్మిక పురోగతి లేకుండా ప్రాపంచిక పురోగతి ఏమాత్రం ఉపయోగకరం కాదని స్పష్టం చేసింది.
ఇన్నాళ్లు మనకొక అవగాహన ఉండేది. భాగవతం అంటీ భ గ వ త ము భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం, ముక్తి. అందులో భక్తి మొదటి దశ. దాని కంటే ఉన్నతం జ్ఞానం. దానికంటే ఉన్నతం వైరాగ్యం. దానికంటె ఉన్నతం తత్వం. దాని కంటె ఉన్నతం ముక్తి. కాని ఇది పూర్తి సత్యం కాదు. ఇందులో ఏదీ ఎక్కువ కాదు. ఏది తక్కువ కాదు. అది ఒక్కో దశ. వాస్తవానికి ఇది ఇలా ఉండాలి. ఇది వరుస క్రమము కాదు. వలయము.
నీ టెండెన్సీని బట్టి నీ పాత్ర, నీ సంస్కారాన్నిబట్టి నీ మార్గం నిర్ణయించబడుతుంది. నీ టెండెన్సీని బట్టి నీ రోల్‌ని ఎంచుకోవాలి. ఈ ఎంపికకి నీకు సావకాశం ఉంది. నీ క్షమత, సామర్థ్యము, నీ సంస్కారాలు, వీటిని బట్టి నీ మార్గం సాధŠన ఉంటుందనేది భాగవతము చాలా స్పష్టంగా విశదీకరించింది. భాగవతం చదవటం ఒక యోగం. ప్రతివాడు చెయ్యాల్సిన యాగం. దాని ఫలితం అతేంద్రియ సుఖనుభవ భోగం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి