భాగవత ప్రసాదము
ఇటీవలి కాలములో ఎక్కడ చూసినా సమాజంలో మనుషుల మద్య సామరస్యము లేకపోవటం, షర్షణలు, అల్లర్లు, దోపిడీలు, అణచివేతలు, ఇతరమతాలను దూషించటం, అవహేళన చేయటం, ఆ మతాలలోని విధివిధానాలను ఎగతాళి చేయటం, అవి తర్కవిరుద్దంగా ఉన్నాయని విమర్శించటం, వాటికి అనుసరిస్తున్న వారందరూ అజ్ఞానులు, మÖర్కులు అన్న విధంగా మాట్లాడడం పరిపాటి అయిపోయింది.
టీవీలలో మరియు ఇతర ప్రసారమాధ్యములలో జరుగుతున్న చర్చలలో కూడా ఇదే దోరణి కనిపిస్తుంది. వీటివలన సమాజానికి ఏవిధమైన ప్రయోజనం లేకపోగా ఇప్పటికీ అంతంత మాత్రముగా ఉన్న మతసామరస్యము, పరమత సహనము మరియు లౌకిక తత్వాలకు ఇంకా విఘాతము కలిగి ఒక రకమైన ఘర్షణాపూరితమైన వాతావారణం నెలకొంటున్నది.
సహజంగానే కొందరు కుటిల రాజకీయ నాయకులు పరిస్థితులను తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి తమ రాజకీయ అవసరాలు తీర్చుకొంటున్నారు. బాగా చదువుకొన్నవారు, మేధావులు కూడా తమకు తెలిసో, తెలియ కుండానో ఈ ట్రాప్‌లో పడిపోతున్నారు. వెరసి సామాన్య ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. మనకు రాజ్యాంగం ఉన్నది. అందులో పౌరహక్కులు, పౌరభాద్యతలు, ప్రవర్తనానియమావళి, శిక్షాస్మృతి ఇలా అన్నీ ఉన్నాయి. నిభందనలున్నాయి. అలాగే ఇటు ఆధ్యాత్మికంగా చూసుకొన్నా మానవులకి నైతిక విలువలు, మార్గదర్శకాలు భోధించే అనేక గ్రంథాలున్నాయి. అలాగే ఎంతోమంది మహానుభావులు, సత్పురుషులు ప్రవచనాలు, సందేశాలు, జీవిత చరిత్రలద్వారా మనకు ఎన్నో మంచి విషయాలు భోధిస్తూనే ఉన్నారు. మతగ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు, ప్రభందాలు కోకొల్లలుగా ఉన్నాయి. స్వచ్చంద సేవాసంస్థలు అనేకం ఎన్నో రకాల సేవాకార్యక్రమాలు చేస్తూ వాళ్ళు చేసే సేవ ద్వారా మనకు సందేశాలు ఇస్తున్నారు. అనేకమంది మహానుభావులు తమ రచనల ద్వారా, జీవిత చరిత్రల ద్వారా అనేక మంచి సందేశాలు ఇస్తూనే ఉన్నారు. అందరూ తమ శక్తి అనుసారముగా వీటిని పాటిస్తున్నారు. ఇంత అవిరళకిృషి జరుగుతున్నా కూడా ఈ రోజున సమాజంలో ఇంత అనిశ్చిత పరిస్థితులు, ఘర్షణ వాతావరణాలు, అలజడి, అశాంతి, విద్వేషాలు, వినాశనాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ఆలోచించాలి. మనకున్న అపారమైన మానవ వనరులు ఆధ్యాత్మిక సంపదలు సక్రమంగా ఉపయోగించుకొని ఒక ఆదర్యప్రాయమైన, ఆనందమయమైన సమాజాన్ని నిధించుకోవాలి.
అన్నిమతాలలోకి, అన్నిమార్గాలలోని మంచిని మనం గ్రహించాలి. మనం నిజాయితీగా పరికించి, పరిశీలించి చూస్తే ఏమతము యెక్క లేదా ఏ సిద్ధాంతము యొక్క మÖల గ్రంథాలలో ఏ విధమైన లోపాలు, తప్పులు లేవు. ఉండవు. అవన్నీ మానవుల కళ్యాణము కోసమే ఏర్పాటు చేయబడ్డాయి. అయితే కాలాంతరములో వాటిని వక్రీìకరించి, కల్తీచేసి తప్పుగా ప్రచార ప్రసారాలు చేయటం వలననే అవి ఈ రోజున కొంత గందరగోళము, అయోమయాన్ని కలిగిస్తున్నాయి. అంతేతప్ప ఏమÖల సిద్ధాంతము చెడును ప్రభోదించదు. అసతాన్ని, అణచివేతను ప్రోత్సహించదు. ఏమతం తన అనుయాయులు అసత్యవాదులు, పరమత ద్వేషులు, భోగలాలసులు, తీవ్రవాదులు కావాలని కోరుకోదు. తద్వారా సమాజంలో అశాంతి ప్రబలి ఈ సమాజం ఒక భూతల నరకం కావాలని కోరుకోదు. అలాగే ఏ సిద్ధాంతం లేదా ఇజం యొక్క ప్రతిపాదకులు కూడా అలాంటివి కోరుకోరు. సమాజంలో మనుషులందరూ సమాన అవకాశాలను అందిపుచ్చుకొని, స్వేచ్చగా, ఆనందంగా అందరూ కలిసి మెలసి జీవించాలనీ కోరుకుంటారు. దానికోసమే అందరూ ప్రయత్నించారు. ప్రభోదించారు. ఆయా కాలమాన పరిస్థితులను బట్టి, అప్పటి సాంఘిక, సామాజిక, ఆధ్యాతిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ రకమైన సిద్ధాంతాలను, మతవిశ్వాసాలను, ఆచారవ్యవహారాలను ప్రతిపాదించారు. హిందూ మతంలోని ఆధ్యాత్మిక సిద్ధాంతాలను పరికించి చూసినా ఈ సకల చరాచర సృష్టిలో సర్వవ్యాపకుడు, సర్వమంగళకారి అయిన పరమేశ్వరుడు అందరినీ సమదృష్టితోనే చూస్తాడు. సర్వులకూ సమానమైన జ్ఞాన ప్రకాశాన్నే ఇస్తున్నాడు. సూర్యుడు ఈ సకల సృష్టికి తన ప్రకాశాన్ని ఎలా లక్షల జీవరాశులకు, ప్రకృతికి తన ప్రకాశాన్ని సమానంగా ఇస్తున్నాడో అలాగే పరమాత్మ సృష్టి అంతటికి తన జ్ఞాన ప్రసాదాన్ని సమానంగా పంచుతున్నాడు. ఏవిధమైన వివక్షతి చూపించడము లేదు. ఆ తత్వాలను సరిగా అర్దం చేసుకోలేక మనుషులే తమ సొంత కవిత్వాలు జోడించి, వక్రీకరించి విద్వేషాలు పెంచిపోషిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. అమÖల్యమైన ఆ జ్ఞాన సంపదని మనం సరిగ్గా అర్ధంచేసుకోవాలి. జీర్ణించుకోవాలి. ఆచరించాలి.
అలా మనం అర్థం చేసుకొని ఆచరించిన వాటికి ఇతరులకు కూడా శివప్రసాదంలా పంచాలి. ఇలా చేయటంలోనే జీవనసాఫల్యం దాగి ఉంది. మనచుట్టూ ఉన్నవారికి మన జ్ఞానాన్ని, అనుభవాలను పంచుతూ వెళ్ళాలి. సమాజంలో అన్ని వర్గాల మధ్య సయోధ్య, సామరస్యము ఉండటం వలన మంచి వాతావరణము ఏర్పడుతుంది. తద్వారా సమాజం పురోగమిస్తుంది. అందరూ ఆనందంగా ఉంటారు. అందరూ కలిసి కట్టుగా జీవించగలుగుతారు.
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలి. విద్యానైపుణ్యాలను పెంచటంతోపాటు సంస్కారాన్ని కూడా పెంచాలి. అటువంటి మంచి విద్యావిధానాన్ని రూపొందించుకోవాలి. అలాగే మన శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్న మంచి విషయాలను కూడా శ్రద్ధ్దగా అధ్యయనం చేయాలి. వాటిలోని మంచి విషయాలు గ్రహించాలి. జీవితంలో వాటిని ఆచరణలో పెట్టాలి. ఎప్పటికప్పుడు స్వయాన్ని సరిచూసుకొంటూ సరిచేసికుంటూ ముందుకు వెళుతుండాలి. పురోగతిని సాధించాలి. కాలం చెల్లిపోయినవి, ఈ రోజున ఉన్న పరిస్థితులకు సమంజసం కాని వాటికి, చాదస్తపు విధానాలను వదిలేయాలి. కొత్తదనాన్ని జవితాలలోకి ఆహ్వానించాలి. వైయక్తిక క్రమశిక్షణను అలవర్చుకోవాలి. నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి. పాతదంతా మంచిది కొత్తదంతా చెడ్డది అనే అపోహలను వదిలివేయాలి. పాతదైనా కొత్తదైనా మంచి అయిన దాన్ని గ్రహించాలి. చెడును వదిలేయాలి. మనకున్న స్వేచ్చ, స్వాతంత్రము ఇతరులకు కూడా ఉన్నాయని గ్రహించాలి. ఇతరుల మనోభావాలను దెబ్బతిసే అధికారం మనకు లేదని గ్రహించాలి. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి. సంయమనం పాటించాలి. ఈ విశ్వంలో ఏ ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు. ఒకేలా ఆలోచించరు. ప్రపంచము వైవిద్యం, వైరుద్యంతో కూడుకొన్నది. పరివర్తన చెందుతుంది. కాలానుగుణంగా విలువలు కూడా మారుతుంటాయి. ఆచారవ్యవహారాలు మారుతుంటాయి. పద్దతులు మారుతుంటాయి. అవసరాలు మారుతుంటాయి. అవసరాల ఆధారంగా ఆవిష్కరణలు జరుగుతుంటాయి. ఆవిష్కరణలు జరిగినప్పుడు వాటివల్ల కొన్ని సత్ప్రయోజనాలు ఉంటాయి. అలాగే కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి. కొన్ని సానుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయి. అన్నింటిని సమానంగా స్వీకరించాలి. క్షీరసాగర మధనంలో గరళం కూడా వచ్చింది. శివుడు దాన్ని గ్రహించి కంఠంలో నిలుపుకునే గరళకంఠుడయ్యాడు. తద్వారా శివుడు ఈ విశ్వానికి తానే మంగళాకారుడు అని నిరూపించాడు. శివుడంటేనే శుభకరుడు, మంగాళాకారుడు, కళ్యాణ కారుడు. ఇదే శివతత్వ్యం.
సృజనాత్మకత దేవుని యొక్క మరో రూపం. ఈ సృష్టి ఒకగొప్ప సృజనాత్మక అద్భుతం. కొన్ని వేల లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో ఏర్చి, కూర్చి, పేర్చి నిర్మించబడిన ఒక అద్భుత సౌధం. దీనికి ఏ దేవుడు. ఎవరి దేవుడు ఎన్ని రోజులలో ఎలా సృష్టించాడు అనేది అప్రస్తుతం. ఎంతో సృజనాత్మకమైన ఈ అద్బుతాన్ని అంతే సృజనాత్మకతతో అస్వాదించటమే అవసరం. ఈ అద్బతం జరిగినప్పుడు గుర్తించడానికి ఎవరులేరు. అద్భుతం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు గుర్తించాల్సిన అవసరము లేదు. ఇక దానిని ఆస్వాదించటమే. దానితో మమైకం కావడమే. ప్రకృతిలో మమైకం కావటం అంటే దేవునితో మమైకం అవ్వటమే. ఎందుకంటే ప్రకృతి కూడా దేవుని యొక్క ప్రత్యక్ష స్వరూపమే. అది దేవునిలో సగభాగం. ‘జగదః పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ’ పురుషుడు సగం. ప్రకృతి సగం. ప్రకృతి పురుషులు. పరమేశ్వరుడు సగం. పార్వతి సగం, పార్వతి పరమేశ్యలు ఇదేగదా అర్ధనారీశ్వరతత్వం సృష్టి సంపూర్ణ స్వరూపం. దైవము మరియు శక్తి యొక్క కలిసిన స్వరూపం. దివ్యత్వము మరియు సహజత్వము యొక్క స్వరూపం. దివ్యత్వము ఎంత అవసరమో సహజత్వము కూడా అంతే అవరసం. దివ్యత్వమును. సాధించే క్రమములో సహజత్వాన్ని కోల్పోకూడదు. అపుడు కృత్రిమత్వము వచ్చేస్తుంది. జీవనం అసహజంగా, కృతికంగా మారుతుంది. ఇప్పుడు సమాజం దాదాపు ఇలాగే వుంది. ఇటువంటి సమాజంలో ఉంటూ కూడా మనం ప్రతక్షణం మనల్ని మనం తెలుసుకుంటు మెరుగుపరుచుకుంటూ, బలపరచుకుంటూ మన యొక్క బెటర్ వెర్సన్‌గా తయారవుతూ వెళ్ళడమే నిజమైన సాధన. అత్యంత క్రమశిక్షణతో శారీరకంగా, మానసికంగా ఎమోషనల్‌గా, ఇంకా ఇంకా బలిష్టంగా తయారవుతూ వెళ్ళడమే మన లక్ష్యంగా ఉండాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం, పౌష్టికాహారసేవనము, స్వాధ్యాయం, మనన చింతన, సేవ చేస్తూ అత్యంత ఉత్సాహవంతమైన, ఉల్లాసకరమైన ఙవితం గడపడమే మన లక్ష్యం కావాలి. ఇటువంటి మనుషులతో కూడిన సమాజమే అభ్యుదయం సాధిస్తుంది. అభివృద్ది చెందుతుంది. సామాజిక, రాజకీయ, కళా, సాంస్కృతిక రంగాలలో ఉన్న అందరూ శారీరకంగా, మానసికంగా ఎమోషనల్‌గా తమను తాము ధృడంగా తయారు చేసుకోవాలి. నైతికబలం ఉండాలి.
ఈ సృష్టి ఒక యుగచక్రంలో తిరుగుతున్నది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇలా నాలుగు యుగాలుగా. ఇది పారమార్ధిక సత్యం కావచ్చు కాకపోవచ్చు కానీ ఇది వ్యావహారిక సత్యం. గడియారంలోని భాగాలుగా ఇది ఒకలెక్క కోసం ఏర్పాటు చేసుకొన్న విధానం కూడా కావచ్చు, సింబాలిక్ కావచ్చు, ఒకరోజును కూడా మనం ఇలా విభజించు కోవచ్చు. తెల్లవారి 3 గంటలకు బ్రహ్మముహూర్తంతో మొదలయి 9 వరకు కృత యుగం లాంటిది. ఇది శుద్దానుత్వికము లేదా సత్‌ప్రధాన సమయం. ధ్యానం, జపతపాదులు, వ్యాయామం, కాలకత్యాలు తీర్చుకోవడం, పూజాపునస్కారాలుa, స్వాధ్యయనం, శాస్త్రాధ్యయనం వీటిìకి 6 గంటల సమయం చాల అనుకూలమైనదిగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఈ సమయంలో తప్పక చేయాలి. ఎంతో అవసరం కనుక క్రమం తప్పకుండా చేయాలి. ప్రతిరోజూ చేయాలి. అనివార్యంగా చేయాలి. ఇక 9 గంటల నుంచి మద్యాహ్నం మÖడు గంటల వరకు త్రేతాయుగం. ఇది కూడా సాత్వక యుగమే. ఉదారపోషణ కొరకు న్యాయమైన సంపాదన, కుటుంబ, సంస్థాగత, వ్యవస్ధాగత వ్యవహారాలు చక్కబెట్టుకోవటం ఈ సమయంలో ఇవి తప్పక చేయాలి. విద్యుక్త ధర్మనిర్వహణకి ఇది తగిన అనువైన సమయం. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇది ద్వాపరం. ఇది రాజోతమోగుణాల మిశ్రమం. వీటి సమతూకం పాటించాలి. ఈ సమయంలో సేవాకార్యక్రమాలు, సత్సంగాలు, ఇష్టాగోష్టులు, రచనావ్యాసంగం. కళా సాంస్కృతిక సేవ, పురాణ కాలక్షేపం, దేవాలయ సందర్శనము, భజనలు, కీర్తనలు, బందుమిత్రులను కలవటం, కుటుంబంతో గడపటం ఇవన్నీ ఈ ఆరుగంటల కాలంలో చేసుకోవాలి.
ఇకరాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు ఇది కలియుగం. అయోమయ యుగం. మొదటి 18 గంటల వ్యాయామం వల్ల శరీరము అలసి పోయి విశ్రాంతి కోరుకుంటుంది. కాబట్టి ఈ సమయంలో నిద్రించాలి. మామÖలుగా అయితే రోజుకు 3, 4 గంటల నిద్ర సరిపోతుంది. కాని ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు, రద్దీగా ఉండే జీవిన విధానానికి అలసట ఎక్కువ వస్తుంది కాబట్టి ఆరు గంటల నిద్ర అవసరం. అనివార్యం. శౌనకాది మునులు కలి ప్రభావానికి లోను కాకుండా ఉండడానికి నైమిశారణ్యం వెళ్ళిపోయినట్లు మనం ఈ కతి కలి ప్రాభావానికి లోనుకాకుండా నిద్రలోకి వెళ్ళాలి. ఈ కలికాలంలో అనగా రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య ఎంత మెలకువలో ఉంటే అంత నష్టం. ఎన్నో వికృత కార్యాలు ఈ సమయంలోనే జరుగుతాయి. అవే మనకు నరక£ హేతువులుగా మారతాయి.
మన కష్టసుఖాలకు పూర్తి భాద్యత మనమే మనదే. వాటిని మన భుజాలపై వేసుకోవాలి. వాటికి ఎవరినీ బాధ్యులను చేయకూడదు. ఎందుకంటే ప్రతిదీ మన స్వయంకృతమే. మన పాపాల ఫలంగానే మనకు దుఃఖము వస్తుంది. మన పుణ్యఫలమే మనకు సుఖాన్నిస్తుంది. కాబట్టి ఎవరినీ నిందించి ప్రయోజనము లేదు. మనల్ని మనం సరిచూసుకోవటం. నరిచేసుకోవటం మాత్రమే మన చేతుల్లో ఉంది. ¹ఏది మనం చెయ్యాలి. ఇతరులను సరిచేసే పని మనదికాడు. వ్యవస్థ సరిగా నడవటం కోసం చిన్న చిన్న సూచనలు, సవరణలు మాత్రమే మనం ఇతరులకు ఇవ్వగలం. అది కూడా వాళ్ళు తెసుకోనంతవరకే. లేకపోతే అదికూడా చేయకూడదు. స్వపరివర్తనే విశ్వపరివర్తన అన్న సూత్రాన్ని సదా గుర్తుంచుకోవాలి. క్రమశిక్షణ అలవర్చుకోవాలి. ఇంద్రియ భోగాన్ని తగ్గించాలి. ఆహారంలో, వస్త్రంలో, నిద్రలో నియమం ఉండాలి. అత్యంత సాధారణంగా ఉండాలి. సాత్వికంగా ఉండాలను కొన్నప్పుడు సాత్వికాహారమే తినాలి. మీ శరీరం యొక్క శ్రమను బట్టి ఆహారం తీసుకోవాలి. మితంగా తినాలి. సాత్వికత్వాన్ని పెంచుకొంటూ వెళ్లాలి. శీతలంగా అయిపోవాలి. ఉద్రేకాలు, ఉద్వేగాలు బాగా తగ్గించుకోవాలి. ప్రపంచంలోని అన్ని విషయాలను ఎడాపెడా తెలుసుకొని మస్తకాన్నంతా కూడా విషయ సంగ్రహాలయంగా మార్చుకొనే ఆసక్తి తగ్గించాలి. తేనెటీగల ఆహారపు అలవాట్లు తెలుసుకోవటం అనేది సాధకుడికి ఏమాత్రం సహాయపడదు. విషయ పరిజ్ఞానము ఎక్కువ అవసరం లేదు. స్వ ఉన్నతికి తోడ్పడే విషయాలపై దృష్టి పెట్టాలి. ఎదుటి వానిలోని దైవత్వాన్ని చూడకుండా వాడిలోని దోషాలు మాత్రమే చూస్తా ఉంటే మనలోని దోములు ఎప్పటికి తొలగవు. అందరిలో దేవుడ్ని చూడటం అలవాటు అయ్యేంతవరకు ప్రతిమ పూజ చేయటంలో తప్పులేదుగాని జీవితాంతం ఉన్నతి సాధించకుండా అలానే ప్రతిమ పూజలు చేస్తూనే ఉండటం తప్పు. పై క్లాసుకు ప్రమోట్ అవుతూ వెళ్ళాలి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండకూడదు. నీలో జరిగే మార్పు, ఉన్నత నీకే అశ్చర్యం కలిగించేట్టు ఉండాలి. సాటి మనిషిలో దేవుడ్ని చూసే అలవాటు చేసుకోకుండా. జీవితాంతం ప్రతిమ పూజలు చేసుకుంటూ, సాటి మనుషులను ద్వేషించే వారు కొండంత కుంకుమ, లక్ష పత్రిలు, కోటి బిల్వ పత్రాలతో పూజలు చేసినా దేవుడు స్వీకరించడు.
కపిల మహర్షి సాధన క్రియా సప్తకం గురించి అద్భుతంగా వివరించారు.
1. ఫలాభిలాష విడిచి పెట్టడం.
2 శక్త్యానుసారం తన ఆశ్రమానికి తగిన ధర్మం చేయటం.
3. నిషిద్ద వ్యాపారాలను విడిచి పెట్టడం
4. దైవం తన ప్రయత్నానికి ఎంతిస్తే అంతలో తృప్తి పడటం.
5. ఆత్మవేత్తలను సేవించడం - మంచి పుస్తకాలు తోడుంచుకోవడం
6. ధర్మార్థకామాల కోసం ఇంద్రియాలతో పని చేయించకపోవడం
7. మోక్ష ధర్మాల ఎడ ఆసక్తి కలిగి ఉండటs.
బ్రహ్మచార్యము, గృహస్తము, వానప్రశము, సన్యాసము ఇలా ఏ ఆశ్రమంలో ఉన్న వారికైనా పైన పేర్కొన్న సాధనా సప్తకాలు ఉపయోగపడతాయి. పైవాటితో పాటు ఇంకా కొన్ని విషయాలు మనకు సాధనకు సహకారం అందిస్తాయి. అవి.
1. సాత్వకాహారము
2. సజ్జన సాంగత్యము
3. దైహిగుణధారణ
4. ఉపవాసము
సాత్వికాహారము: సాత్వికాహరము వలన సాత్వికత్వము పెరుగుతుంది. బుద్ది స్పష్టంగా ఉంటుంది. సంకల్పుల శుద్ధి అవుతుంది. వికసిస్తుంది. దీనితో తత్వము స్పష్టముగా అవగాహనకు వస్తుంది. అవగాహనకు రాగానే ఆచరణలోకి కావటము మొదలవుతుంది. సాత్వికాహారము వలన అనవసర ఉద్వేగాలు, ఉద్రేకాలు కలుగకుండా శాంతిగా ఉంటుంది.
సజ్జన సాంగత్యము: సాదు సజ్జనుల సాంగత్యంలో ఉండటం వలన వారి యొక్క మంచిగుణాలు, స్వభావాలు, సంస్కారాలు మనకి అలవాటు అవుతాయి. అలాగే సాధనలో వారి సహయోగము, సహకారము మనకు అందుతాయి. ఆధ్యాత్మిక పురోగతికి అవి సహకరిస్తాయి.
దైవీగుణ ధారణ:- దైవీగుణాలను ఆభరణాలుగా ధరించాలి - మన గుణాల ప్రభావము వలన మన సంభంద సంపర్కములో ఉన్నవారంతా ప్రభావితం అవుతారు. తద్వారా మనకు సహయోగము ఇస్తారు. కనీసం అవరోధాలు కల్పించకుండా ఉంటారు. దైవీగుణాల వలన అంత:కరణం శుద్ది అవుతుంది.
ఉపవాసము : భగవంతునికి దగ్గరగా నివాస ముండటమే ఉపవాసము. అలా భగవంతునికి దగ్గరగా ఉండటానికి అవసరమైన మితాహారం, జపం, తపం, ధ్యానం, నామస్మరణ, భజన, కీర్తన ఇవన్నీ ఉపవాసములోకే వస్తాయి.
భాగవతంలో ధృవుడి చరిత్ర అత్యంత ప్రేరణ దాయకం, స్పూర్తి దాయకం. ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు, సునీతి, సురుచి. సునీతి బుద్ధిశాలి. సురుచి రూపవతి. ఉత్తానపాదుడికి సునీత వలను దృవుడు మరియు సురుచి వలన ఉత్తముడు అనే ఇద్దరు కుమారులు.
ఉత్తానపాదుడు సునీతిని ఆదరించేవాడుకాదు. సురుచి వద్దే ఉండేవాడు. దృవుడికి అప్పుడు ఐదు సంవత్సరాలు. ఒక రోజు ఉత్తానపాదుడు సురుచితోకలిసి సింహాసనముపై ఆసీనుడయి ఉన్నాడు. ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉన్నాడు. అపుడు దృవుడు కూడా తండ్రి వద్దకు వచ్చి ఆయన తొడపై కూర్చోబోయాడు. సురుచి అతన్ని ఆపి ‘నీవు నా కొడుకువు కాదు. నీకు అర్హతలేదు అని లాగేసింది. దీనికి ఉత్తానపాదుడు కూడా స్పందించక మిన్నకుండిపోయాడు. అపుడు దృవుడు అవమానంతో తన తల్లి సునీతి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పాడు. తాను ఏమీ చేయలేనని తమ కర్మ అలా ఉందని ఆమె అన్నది. నువ్వు అర్హత సంపాదించాలంటే అరణ్యానికి వెళ్ళి విష్ణువు గురించి తపస్సు చేయమని చెప్పింది. దృవుడు అడవిలోకి వెళ్ళాడు. నారదుడు కనిపించి ‘నీవు బాలుడవు అడవిలో కూృర మృగాలుంటాయి. నువ్వు తపస్సు చేయలేవు. ఇంటికి తిరిగి వెళ్ళిపొమ్మంటాడు. దృవుని దృఢ సంకల్పము చూసి ముచ్చటపడి తన శిష్యునిగా చేసుకొని నారాయణ మంత్రం ఉపదేశించాడు. ధృవుడు అత్యంత దీక్షతో తపస్సు చేయగా అంతిమంగా విష్ణువు ప్రత్యక్షం అయి దృవుడిని అనుగ్రహించాడు. తరువాత దృవుడు వేల సంవత్సరాలు రాజ్యం చేసి శరీరం త్యజించి తారామండలములో అన్నింటి కంటె పైన ధృవ మండలముగా అవతరించి కల్పాంతము వరకు చిరస్థాయిగా నిలిచాడు. తన అకుంటిత దీక్షతో తపస్సుతో విష్ణువుని సాక్షాత్కరింప చేసుకొని శాశ్వత కీర్తిని ఉన్నతిని పొందిన ధృవుడు ఆద్యాత్మిక మార్గంలో సాధకులందరికి ఆదర్ష ప్రాయుడు. దృవతారగా వెలుగొందాడు. దీక్ష, తపస్సు వలన ఏదైనా సాధ్యమని నిరూపించాడు. మన లక్ష్యం పట్ల అకుంటితమైన దీక్ష ఉంటే సాధించలేనిది లేదని లోకానికి చాటి దేవతల రాజయిన ఇంద్రుని కంటె ఉన్నత స్థితికి ఎదిగి ఇంద్రుడే తల ఎత్తి చూసేంత ఉన్నత స్థానానికి ఎదిగాడు. దృవతారగా వెలుగుతున్నాడు.
ఆధ్యాత్మిక మార్గానికి సంభందించి అనేక తప్పు దోరణులు ఉన్నాయి. వాటి గురించి తెలసుకొని సరి చేసుకోవాలి. సక్రమంగా చేయాలి. కలియుగంలో యజ్ఞాలు ఫలించవు. ఇవి కేవలం కర్మకాండగానే పనిచేస్తాయి. యజ్ఞం వ్యాపారం. యజ్ఞంలో దేవతలకు హవిష్షులుగా ఇస్తే వారు దానికి తగిన ఫలితం ఇస్తారు. ఇది ఒకరకమైన వ్యాపారం. ప్రతివానికి, ప్రతి వ్యాపారానికి దాని నియమాలు దానికి ఉంటాయి. ఆ వ్యాపారం మనాకి నచ్చకపోతే వదిలేయాలి. వాక్కు, మనసు, మననం ఈ మÖడు సాధనల ద్వారా జ్ఞానాన్ని ఆర్జించాలి. స్వధర్మం చేయటం, స్వధర్మÛంలో దోషాలు లేకుండా చేయటం. ఇదే భగవంతుడికి మనం చేసే గొప్ప సేవ. మన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించటమే భగవంతుడికి మనం చేసే గొప్ప సేవ. అదే అసలైన మాధవ సేవ. ఈ కలియుగంలో యజ్ఞాలు, కర్మకాండ చేయకూడదు. అవి ఫలించవు. ఫలించకపోగా దానికి చేయటంలో దోషాలు మనల్ని నాశనం చేస్తాయి. అనేక ఇబ్బందుల పాలు చేస్తాయి. కలియుగంలో అసలు కర్మకాండల అవసరమే లేదు. అందరిలో పరమాత్మనుచూసే అభ్యాసం చేయాలి. విచక్షÁణతో ఉండాలి.
ఒకసారి ఒక ఏనుగు మతి భ్రమించి మదం ప్రకోపించి అదుపు తప్పి జనం మీదకు వస్తున్నదట. దానిపై కూర్చున్న మావటివాడు అందరూ తప్పుకోండి ఏనుగు అదుపు తప్పింది అని గట్ట్టిగా అరుస్తూ ఏనుగును అంకుశంతో నియంత్రించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా అది అదుపులోకి రాకుండా జనం మీదకి దూసుకొస్తున్నదంట. జనం అందరూ భయంతో చెల్లాచెదురై పరుగెత్తుతున్నారట. అప్పుడు ఒకడు ఏనుగుకి ఎదురెల్లా డట: ఏనుగు వాడిని తొండంతో చుట్టి ఎత్తి విసరి దూరంగా పడేసి¾ందట. వాడికి బాగా గాయాలయి మÖర్ఛపోయాడట. చుట్టు ఉన్న వాళ్ళు కాస్త సపర్యలు చేశాక మెల్లిగా తేరుకున్నాడు. “ఏవయ్యా! నీకు బుద్దుందా? అదుపు తప్పిన ఏనుగు ముందుకెళ్ళి ఎందుకు నిలబడ్డావు” ? అని అడిగితే దానికతడు అందరిలోను, అన్నింటిలోను దేవుడున్నాడు అని ఇటీవల ఒక సాధువు చెప్పాడు. అందుకే ఏనుగులో దేవుడ్ని చూద్దామని ముందుకు వెళ్ళాను” అన్నాడట. మరి దాని మీద కూర్చొన్న మావడివాడిలో దేవుడు లేడా? వాడు తప్పుకోమని అరుస్తూనే ఉన్నాడు గదా?” అనడిగితే అతను తెల్లబోయాడు. నిజమేగదా? ఇంత చిన్న విషయం నాకు తట్టలేదు అని వాపోయాడట. కొన్నిసార్లు మన విచక్షణలు అలా ఉంటాయి. ఒక ఉపదేశాన్ని తీసుకొన్నప్పుడు దానికి పూర్తిగా తీసుకోవాలి. బుద్ధి ద్వారా ప్రతిపాదించబడిన సిద్ధాంతాలు బౌద్ధనిద్దాంతాలు. అనుభవంలో లేనిది కూడా బుద్దికి అర్థం అవుతుంది. కాని ఆచరణలోకి రాదు. ఇటువంటి వారు రెంటికి చెడ్డరేవళ్ళు అవుతారు. ప్రపంచంలో చాలా మార్గాలున్నాయి. కానీ వాటిని పాటించే సామర్ధ్యము నీకుందా అని గ్రహించాలి.
సాధనా పంచకం గురించి ఇలా వివరించారు.
1. శ్రద్ధ` సత్యము పైన శ్రద్ద పెట్టటం
2. శ్రద్ధతో భగవధర్మాలను వినాలి.
3. విన్నదానిని ఆచరించటం - ఆచరణను చెక్ చేసుకోవటం
4. ఆచరణ వల్ల కలిగిన అనుభవం ద్వారా తత్వవిచారణ
5 విచారణ వల్ల నిగ్గు తేలిన విషయం అర్దమయి దానిలో స్ధిరపడటం. దాని ప్రత్యక్ష ప్రమాణంగా నిలవటం
ఆద్యాత్మికత లేకుండా ప్రాపంచిక పురోగతికి అర్ధం లేదు. అలా పెరిగిన వారు అసురులు అవుతారు. ప్రాపంచిక పురోగతి మరియు ఆద్యాత్మిక పురోగతి సమాంతరంగా జరగాలి. మన పిల్లల్ని మనం అలాగే పెంచాలి. లేకపోతే ఇబ్బంది పడతాము. ఈ తరం వాళ్ళు వ్యాపార సూత్రాలు బాగా వంట పట్టించుకొంటున్నారు. కాని నైతిక విలువలు పాటించటం లేదు.
ఒక దంపతులున్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అలా 50 వేలు జీతం వస్తున్నది. అంతలో వారి తల్లిదండ్రులు 60 దాటి వారి వద్ద ఉండటానికి వచ్చారు. వారిని చూసుకోవాలంటే ఇద్దరిలో ఒకరు ఉద్యోగం మానేయాలి. ఉద్యోగం పురుష లక్షణం. అతడు మానేడు. ఆ అమ్మాయి మానేస్తే ఆదాయం 50 వేలు తగ్గిపోతుంది. ఖరీదైన విలాసవంతమైన ఇల్లు కొనాలని ప్రణాళిక వేసుకొని ఉన్నారు. వాయిదాలు కట్టాలంటే ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిందే. చాలా ఆలోచనాలు, చర్చలు, వాదోపవాదాలు అయిన తరువాత ముసలి వాళ్ళను ఇద్దరిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేశారు నెలకి 25 వేలు కట్టి. ఇంకా 30 వేలు మిగిలాయి. ఇంత అద్బుతమైన ఆలోచన వచ్చినందుకు జబ్బలు చరుచుకున్నారు.
తమను వెంటాడుతున్న ఆ ముసలి వాళ్ళ జాలి చూపులను పట్టించుకోవటం లేదు. లేదు. పట్టుంచుకోనట్లు నటిస్తున్నారు ఒక్కరి జీతం 25 వేలతో కూడా బ్రతకొచ్చు అనే ఒక ఆప్షను ఉందని తెలియక కాదు. అలా సింపుల్ గా బతకటం ఇష్టం లేక చాతగాక ఈమద్య ఆ ముసలాళ్ళను చూడ్డానికి ఆ వృద్ధాశ్రమంకు వెళ్ళినపుడు వాళ్ళ దుఖం చూసి నాకు కడుపులో దేవినట్లయింది. ఎవరి లెక్కలు వాళ్ళని. ఎవరి తిక్కలు వాళ్ళవి. ఎవరి తిప్పలు వారివి. అందరికి ఒకే క్షమత ఉండదు. అందరికి ఒకే అర్హత ఉండదు. ఇచ్చేవాడి క్షమత. పుచ్చుకొనే వాడి అర్హత మీద ఈ ఇచ్చి పుచ్చుకోవటాలు ఆధారపడి ఉంతాయి. వేరు వేరుగా ఉంటాయి.
ఒకసారి సాయిబాబా దగ్గరికి ఒకతను వచ్చాడట. కొన్ని రోజులుగా బాగా కడుపు నొప్పిగా ఉందని ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదని చెప్పాడట. అప్పుడు సాయి బాబా దగ్గర్లో అందు బాటులో ఉన్న గుపెÚ్పడు వేరు శనగ పప్పులు తీసి మంత్రించి అతనికిచ్చి తినమని చెప్పాడట. అతను అలాగే తిన్నాడట, చేత్తో చేసేసినట్లు నొప్పి తగ్గిపోయింది. ఇదంతా పక్కనే ఉన్న ఇంకొకతను చూసాడట. తరువాత అతనికి కూడా ఒకసారి కడుపు నొప్పి వస్తే అప్పుడు వేరుశనగ పప్పులు తిన్నాడట. దాంతో కడుపు నొప్పి ఎక్కువయి ఆసపత్రి పాలయ్యాడట. అందరికీ ఒకే మందు పని చేయదు. సొంత వైద్యము ఆసలే పని చేయదు. బుద్ధి ఆధారంగా పనిచేయటం వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి. అన్ని సార్లు బుద్ది యొక్క డైరక్షన్‌లో పనిచేయ కూడదు. అతిగా తినటం వలన దాన్ని జీర్ణం చేయటానికి ఎక్కువ ప్రాణ శక్తి ఖర్చయిపోతుంది. తద్వారా అలసట వస్తుంది. మితంగా తింటే శక్తి వస్తుంది. అతిగా తింటే నీరసం వస్తుంది. ఎక్కవగా తింటే ఎక్కువ శక్తి రావాలి కదా? కాని అలా జరగదు. నీరసం వస్తుంది. నిద్రవస్తుంది. మత్తు వస్తుంది. బద్దకం వస్తుంది. సోమరితనం వస్తుంది. అందుకే సాధకులకు ముఖ్యంగా మితాహారం అవసరం. అనివార్యం. ముఖ్యంగా 60 దాటిన వారు మితంగా తినాలి. ప్రాణశక్తిని కాపాడు కోవాలి. ఆద్యాత్మమార్గంలో మనం చేస్తున్న మÖఢాచారాల వలన ఈ తరం వాళ్ళు మన ఆధ్యాత్మిక మార్గాన్నే ఏవగించుకొంటున్నారు. తద్వారా వాళ్ళు ఆద్యాత్మిక మార్గంలో నడవడానికి ఇష్ట పడటంలేదు. ఫలితంగా వారు భాతకంగా ప్రగతి సాగిస్తున్నారు. కాని ఆధ్యాత్మిక ప్రగతి సాధించటంలేదు. అందువలన వారి ప్రగతి సంపూర్ణము కావటంలేదు. కాబట్టి మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మÖఢాచారాలను, కర్మకాండనీ మనం వెంటనే వదిలి వెయ్యాలి. అర్దం లేని మÖర్తి పూజలు, యజ్ఞ యుగాలు, క్రతువులు, ఇవన్నీ వెంటనే మానివేయాలి. పురోహితుడికి డబ్బులిచ్చి మనల్ని పొగిడించుకోవటం నీచం. నారాయణుడిని కీర్తించాల్సిన నోటితో నరుడిని పొగడటం పురోహితుడికి తగదు. ఆద్యాత్మిక మార్గంలో నామస్మరణ చేసుకొంటూ. ధ్యానం చేసుకొంటూ, మనన చింతన చేసుకొంటూ, శాస్త్రాధ్యయనం చేస్తూ, స్వయాన్ని పరిశీలించుకుంటూ, సాధన చేస్తూ ఉన్నతిని సాగిస్తూ అందరిలోను భగవంతుడ్ని చూడటం అలవాటు చేసుకోవటం. ఇది నిజమైన ఆద్యాత్మికత. అర్ధం లేని చాదస్తపు ఆచారవ్యవహారాలను ఆచరించటం వలన ఏమి లాభం లేదు. ఉపయోగంలేదు. ఇది మన ఆద్యాత్మిక సంస్కృతి కాదు. కొన్ని ప్రాంతాలలో కొంత మంది అంటారు. ఏదైనా శుభకార్యం ముంగిళ్ళలో జరిగిడే మేము మేకల్ని కోసుకొని, కల్లు కుండలు తెచ్చుకొని ఇంట్లో అందరం కూర్చొని తాగుతాము అంటాము. చిన్న పిల్లలచేత కూడా తాగిస్తాము. ఇది మా సంస్కృతి అంటారు. ఇది తప్పు. అది సంస్కృతి కాదు. ఆచారం అనొచ్చు. వాస్తవానికి దానిని ఆచారం అని కూడా అనకూడదు. అలవాటు అని మాత్రమే అనాలి. సంస్కృతి అంటే మనల్ని సంస్కరించి ఉన్నతికి తీసుకెళ్ళేది. అంతేగాని మనల్ని పతనం చేసేది సంస్కృతి కాదు. వైయక్తిక క్రమ శిక్షణతో, సాధనతో, జ్ఞానసముపార్జనతో, ఆచరణతో, ఆదర్శంతో ప్రగతి సాధించేదే సంస్కృతి. అందుకు దోహదపడే అంశాలే సంస్కృతి అనబడుతుంది. మనల్ని పతనం చేసేది తిరోగమనం వైపు నడిపించేది సంస్కృతి కాదు. నిన్నటి కంటె ఈ రోజు, ఈ రోజు కంటె రేపు, రేపటి కంటె ఎల్లుండి ఇలా ప్రతి రోజు ప్రగతి సాధిస్తే మన యొక్క బెటర్ వెర్షన్‌గా తయారవుతూ ముందుకు వెళ్ళటమే సంస్కృతి.
త్యాగం చెయ్యకుండా, సాధన చెయ్యకుండా, ఎవరో మహాత్ముడు లేదా దేవుడు ఒక శుభముహుర్తంలో ఒక సాక్షాత్కారంతో మనల్ని ఉద్దరించేస్తాడు అనేది కేవలం ఒక భ్రమ. అత్యాశ. అలా ఎప్పుడు జరగదు. ప్రయత్నం అనివార్యం. అవసరం. త్యాగమే పునాది. భగవద్భిన్నమైనదంతా త్యాగం చేయాలి. భగవంతునిపై ద్యాస పెట్టాలి. సంకల్పం దృడంగా ఉండాలి. ఎవరో మనమీద దయచూపాలి, జాలిచూపాలి అనుకోవటం అసహ్యకరమైన సంకల్పం. అటువంటి వారిని ఎవరు ప్రేమించŠరు. ఆనందంగా ఉన్న వారినే అందరు ప్రేమిస్తారు. ఏ దుఃఖం వచ్చినా దాని మÖలం నాలోనే ఉంది అని దానిని సరిదిద్దు కోవాలి. సరిచేసుకోవాలి. ప్రతి దుఃఖానికి మÖలం మనలోనేవుంది. మనలో ఉన్న దానికి సరిచేయకుండా అవతలది సరి అవ్వదు. ప్రతి దుఃఖానికి పేరు మన బుద్దిలో ఉంది. కామ, క్రోధ, లోభాలే మన దుఃఖానికి కారణం. మోక్షం, ఆనందం, ముక్తి ఇవి లక్ష్యాలు. చేసిన తప్పును ఒప్పుకొని సరిదిద్దు కోవటం దైవీగుణం. ఎప్పుడయితే తప్పుకు మÖలం నాలోనే ఉందని వెదుకుతావో అప్పుడే తప్పు జరగటం ఆగిపోతుంది. ధర్మాన్ని అపవిత్రం చేసినప్పుడు విష్ణువు రంగంలోకి దిగుతాడు. సంస్కారాలను శుద్ధి చేసుకోవటానికి ఈ శరీరం అవసరం. నియమించి పాలించేవాడే ఈశ్వరుడు.
హిరణ్య కశిపుని అరాచకాలతో నిరీశ్వరవాదం పెరిగిపోయింది. ప్రహ్లాదుడికి తల్లి గర్భంలో ఉండగానే హరిభక్తి అబ్బింది. ప్రహ్లాదుడు తనకు రాక్షస విద్యలు భోదించ తల పెట్టాడు. గురువులకే సమస్త జ్ఞానము తానే భోదించారు. మనకు భౌతికవాదం భోధించే వారికే తిరిగి ఆద్యాత్మికజ్ఞానం భోదించటమే తగిన విధి. అపుడు హిరణ్య కశిపుడు హరిభక్తిని ఆపకపోతే నిన్ను చం పేస్తాను అంటాడు. నా చావు నా చేతిలో నీ చేతిలో లేదు. నేను మాత్రం సత్యాన్ని వదలను అంటాడు. దండనాయకులను పిలిచి ఎలాగైనా ప్రహ్లాదుని చంపమంటాడు. వారు ఎన్నో విధాలుగా ప్రయత్నించినా చంపలేకపోతారు. ప్రతిసారి ఒక అదృశ్యశక్తి ప్రహ్లాదున్ని కాపాడుతుంది. తన కొడుకునే చంపుకోవాల్సి వచ్చినందుకు హిరణ్యకశిపుడు బాధపడతాడు. అసలిదంతా ఎందుకు? నీ శ్రీహరిని చూపించు అంటే ప్రహ్లాదుడు చూపిస్తాడు. అపుడు శ్రీహరినే చంపేస్తే తన శత్రువు పోతాడని తన కొడుకు తనకు దక్కుతాడు అని హిరణ్యకశిపుడు ఆలోచిస్తాడు. నీ శ్రీహరిని చూపించు అని ప్రహ్లాదుడుని అడుగుతాడు. అన్నిచోట్లు ఉంటాడు అని చెబుతాడు. స్థంబంలో చూపించ మని సంభాన్ని విరగ్గొడతాడు. దాని లోంచి నరసింహ అవతారంలో విష్ణువు వచ్చి అతన్ని అతనికి బ్రహ్మ వరమిచ్చిన దానికి విఘాతం కలుగకుండా గోళ్ళతో చీల్చి సంహరిస్తాడు. అపుడు ప్రహ్లాదుడు విష్ణువును స్తుతిస్తూ స్తోత్రం చెబుతాడు. దానికి విష్ణువు ప్రసన్నమై నీక్కావలసిన వరం కోరుకోమంటాడు. నాకు నీపై ఉన్నది భక్తి. భక్తిలో కోరికలుండవు. ప్రేమ మాత్రమే ఉంటుంది అని ప్రహ్లాదుడు అంటాడు. అయినా, ఏదైనా కోరుకోమని విష్ణువు అంటాడు. అసలు నాకు ఎప్పుడూ ఏ కోరిక కలుగకుండా ఉండేలా వరమివá్వమని ప్రహ్లాదుడు కోరుకుంటాడు. అలాగే ఇస్తాడు. అయితే నేను నిన్న ఒక కోరిక కోరతాను అది నాకివ్వు అని విష్ణువు అడుగుతాడు. ఈ భూమండలాన్ని పాలించే నైతిక క్షమత నీకుంది. నువ్వు తప్పక లోక కళ్యాణం కోసం ఆలా చేయాలి అంటాదు. ప్రహ్లాదుడు దానికి అంగీకరిస్తాడు. అదే లోక కల్యాణం కోసమే. తరువాత ప్రహ్లాదుడు చాలా కాలం భూమండలాన్ని ధర్మానుసారంగా పాలించి విష్ణువులో కలిసి పోతాడు. మనకు తెలుసు. అన్ని దుఃఖాలకు మÖలం కోరికలేనని. అటువంటిది కోరికలే కలుగకుండా వరమివ్వమని కోరిన ప్రహ్లాదుడు ఎంతటి జితేంద్రియుడు. అంతటి నైతిక క్షమత కలిగి ఉండడం వలననే అతను విష్ణువు యొక్క ప్రియమైన భక్తుడయ్యాడు. ప్రహ్లాదుడు సమస్త మానవ జాతికి ఆదర్శప్రాయుడయినాడు. అలాగే భక్తులలో కూడా అగ్రగణ్యుడైనాడు భక్త ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి చరిత్ర చదువుతుంటేనే మనకు భక్తి పారవశ్యం కలుగుతుంది. శరీరం పులకరిస్తుంది, నిష్కామ భక్తికి నిదర్శనం.
భాగవతం వినటం ఒక యోగం. యోగం అంటే కలయిక. భాగవతం చదువుతున్నప్పుడుగాని, వింటున్నప్పుడుగాని మనము పరమాత్మతో జోడించబడినట్టుగా భావిస్తాము. ఆ అనుభవం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందులోనూ భాగవతం వినిపిస్తున్న వక్త లేదా ప్రవచనకారుడు మంచి అనుభవ జ్ఞానముతో చెబుతున్నప్పుడు అది ఇంకా ఎంతో మధురంగా, హృద్యంగా ఉంటుంది. దృవుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు, బలిచక్రవర్తి, అంబరీషుడు, గజేంద్రుడు, శ్రీకృష్ణుడు, నారదుడు, ఇలా ఏ ఎపిసోడ్ తీసుకొన్నా ఎంతో అద్బుతంగా ఉంటాయి. ఆ మహానుభావుల త్యాగం, తపస్సు, సేవ, దీక్ష వీటన్నింటిని సమిశ్రంగా మనకు సాక్షాత్కారం చేపిస్తుంది భాగవతం, ఇంకా ఎన్నో అద్బుతమైన సంఘటనలు, సన్నివేశాలు మన కళ్ళ ముందు సజీవంగా నిలబడతాయి. మన ఆధ్యాత్మిక సాహిత్యంలో భాగవతం ఒక అద్భుత, విశిష్ట గ్రంధం. మానవజాతికి ఇది చేసినంత మేలు ప్రపంచంలో ఏగ్రంధం చేయలేదు. ముఖ్యంగా మన భారతీయులకు ఇది ఒక గొప్ప పెన్నిది. భగవంతుని సన్నిది. దీని యొక్క పూర్తిప్రయోజనం మనం పొందాలి. వీలయినన్ని ఎక్కువసార్లు దీని యొక్క అధ్యయనం, మననం మనం చేయాలి. అందరితో చేయించాలి. ఎక్కడ భాగవత ప్రవచనాలు జరుగుతున్నా మన వంతు సేవ, సహకారం అందించాలి. ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పట్నుంచి దీనిని చదివించటం చేయాలి. వాళ్ళ సంస్కారాల నిర్మాణానికి మనం ఇతోదికంగా సహాయం చెయ్యాలి. దీని వలన వాళ్ళు ఒక సమగ్రమైన ఆలోచనా విధానాన్ని అలవరచుకొంటారు. భాధ్యత గల వ్యక్తులుగా ఎదుగుతారు. జ్ఞానయుక్తమైన ఆద్యాత్మిక జీవనం గడపగలుగుతారు. ప్రాపంచకపురోగతితోపాటు ఆధ్యాత్మక పురోగతి సాధించగలుగుతారు. ఈ రోజు ఇది సమాజానికి ఎంతో అవసరం. అనివార్యం. నా మటుకు నేను చిన్నప్పట్నుంచి ముఖ్యంగా నా పదహారవ ఏట నుంచి ఎక్కడ భాగవత ప్రవచనాలు జరిగినా నేను ప్రత్యక్షంగా వెళ్లటమో లేదా వివిధ మాధ్యమాల ద్వారా వినటమో, చదవటమం చేస్తు వచ్చాను. నా జీవితంలో ఇది చాలా ఉపయోగ పడింది.
స్వధర్మానికి అవసరమైనంత వరకే ఇంద్రియ భోగం అనుభవించాలి. అపుడు స్థితి స్థిరంగా ఉంటుంది. స్వధర్మం మార్పులు గమనిస్తూ ఉండాలి. వెళ్ళిన కొద్ది ఆసక్తి తగ్గుతూ వెళ్ళాలి. వయసు పెరిగిన కొద్దీ ఇంద్రియ భోగాల వినియోగం తగ్గాలి. ఎక్కువ తింటే జీర్ణంకాదు. తక్కువ తింటే నీరసం వస్తుంది. సమతూకం ఉండాలి. లేకి అలవాట్లు తగిలించుకోవటం మంచిదికాదు. తగిలించు కుంటే అంత తేలికగా వదలవు. మన స్వధర్మానికి అవసరం అయిన వాటికి ధర్మబద్ధంగా పొందాలి. అవసరమైనంత మేరకే వినియోగించాలి. వయసొచ్చిన తరువాత పాతకోరికలు తీర్చుకొనే వారు మÖర్కులు. వయసు పెరిగిన కొద్దీ సింపుల్‌గా అయి పోవాలి. కోరికలు తగ్గిపోవాలి. వినియోగం తగ్గాలి. ధ్యానం పెరగాలి. సేవ పెరగాలి. భగవత్సంబంధŠŠ విషయులపై ఆసక్తి, సేవ పెరగాలి. మన స్థాయిని బట్టి, క్షమతను బట్టి, సామర్థ్యాన్ని బట్టి మనం చేయాలి. వయసు పెరిగే కొద్ది మన వినియోగం తగ్గించాలి. వితరణ పెరగాలి. ఇతరుల అవసరాలు తీర్చటంలో ఆనందŠము పొందాలి. మీ పిల్లలు, కుటుంబ సభ్యులు, పొరుగువారు వీళ్ళ తెలుసుకొని మరీ అవసరాలు తీర్చాలి. మీ అవసరాలు బాగా తగ్గించుకోవాలి. భౌతిక సంపదలు తగ్గించుకొంటూ ఆధ్యాత్మిక సంపదాలు పెంచుకుంటూ వెళ్ళాలి. పుణ్య క్షేత్రాలలో పుట్టినవారంతా గొప్పవారు కాదు.
కొండŠ ప్రాంతాల్లో ఉండేవారికి తిండి తక్కువ. ఆరోగ్యం ఎక్కువ. మైదాన ప్రాంతాలలో ఉండేñ వారికి తిండి ఎక్కువ. ఆరోగ్యం తక్కువ. వయస్సు పెరిగే కొద్దీ స్వధర్మాన్ని పట్టుకోవాలి. భగవంతుడ్ని పట్టుకోవాలి. ప్రపంచ విషయాలలో ఎవరి తోను పోలిక పెట్టుకోకూడదు. ఆద్యాత్మికంగా ఇతరులతో పోల్చుకొని వారిని మించిన స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. పోలిక దుఃఖాన్నిస్తుంది. ఈర్ష్యను రేకెత్తిస్తుంది. ఆనందం యొక్క ఉన్నతత్వం మారిన కొద్ది వినాయోగం మారిపోతుంది. వానప్రస్త అవస్థలో చాలా సింపుల్గా ఉండాలి. ప్రాపంచిక విషయాలు వదిలేయాలి. రెండు పడవల మీదకాలు పెట్టం కుదరదు. ఉంటే శ్రీశైలంలో ఉండాలి. లేదంటే హైదరాబాదులో ఉండాలి. కాని ఒకేసారి రెండుచోట్లా ఉండటం కుదరదు.
పావనంగా అయ్యే ప్రయత్నం నిరంతరం చేస్తు ఉండాలి. ఎప్పుడూ ఆనందంగా ఉండటం ముఖ్యం. మిగతా విషయాలన్నీ అప్రస్తుతం. ఇంద్రియ భోగాలు ఎక్కువగా అనుభవించడం వల్లే దుఖాలు వస్తాయి. సింపుల్ లివింగ్ హై థిóంకింగ్. సాధారణంగా జీవించు. ఉన్నతంగా ఆలోచించు. ఇదే ఆధ్యాత్మికత. మన పనివాళ్ళ జీతాలు పెంచకుండా మన జీవితాల స్టాండర్డ్స్ ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్ళడం సమంజసంకాదు. మనం ఉన్న స్థానంలోనే మనం ఉన్నతిని సాధించడానికి కృషి చేయాలి. ఉన్న ఊళ్లో చేసే తపస్సు ఫలించదు. గుర్తింపు రాదు అంటారు. ఎవడిక్కావాలి గుర్తింపు? ఎవడి గుర్తింపు కావాలి? మనల్ని చూసేవాడు, గుర్తించేవాడు, మునల్ని ఆదుకొని పైకిచేరుకొనేవాడు పైవాడే. వాడు మనల్ని నిత్యం చూస్తూనే ఉంటాడు. కాస్తూనే ఉంటాడు. ఈ ప్రపంచంలోని దేహధారుల గుర్తింపులతో మనకు పనేమిలేదు.
ఇది ప్రక్కువ పెడితే మనల్ని మనం నిజాయితీగా, నిష్పక్షపాతంగా పరిశీలించుకొంటూ, పరికించకుంటూ ఉంటే మన సాధన, స్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. మనల్ని మనం సరిచేసుకొంటూ లక్ష్యం వైపు పయనించాలి. మనలో ఉన్నది మనకు భిన్నంగా ఉన్నది ఒకటే. వేరుకాదు. లక్ష్యము ఎలా ఉంటే లక్షకాలు అలా ఉండాలి. లక్ష్యాలకు తగిన లక్షణాలు లేకపోతే లక్ష్యం ఎప్పుడూ దగ్గరవదు. ఇంకా ఇంకా దూరంగా జరిగిపోతూనే ఉంటుంది. సాధన చాలా తీవ్రస్థాయిలో ఉండాలి. అయితే అది సహజంగా ఉండాలి. యంత్రికంగా ఉండరాదు. యాంత్రికత్వం అసలు పనికిరాదు. లౌకికం, అలౌకికం ఎందులోనైనా యాంత్రికత్వం అసలు పనికిరాదు. సృజనాత్మకత ఉండాలి. అహంకారం అసలు ఉండకూడదు.
ఈ సృష్టిలో నీ కంటే గొప్పది ఏదీ లేదు. నీకంటే తక్కువది ఏదీ లేదు. నీకు సమానమైనది లేదు. నీ స్థానం ప్రత్యేకం. అది యÖనిక్. నీకు ఎవరితో పోటీ లేదు. నీవు ఎవ్వరికి పోటి కాదు. అత్యంత వైరుద్యంతో, వైవిధ్యంతోనూ కూడిన నీ స్థానం ఈ సృష్టిలో ప్రత్యేకమైనది. విశేషమైనది. నీ లక్ష్యం కూడా ప్రత్యేకమైనదే. కాబట్టి నీ లక్షణాలు కూడా ప్రత్యేకంగానే ఉండాలి. అదే ఆధ్యాత్మికత.
భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టం అత్యంత మనోహరం. అర్థవంతం. గజేంద్రుడు అనే ఏనుగు తన వేల మంది భార్యలతో ఒక మనోహరమైన సరోవరంలో దిగి భీభత్సం చేసేసి వినోదించాడు. మడుగంతా బురదమయం అయిపోయింది. పూర్తిగా విద్వంసము చేసేసాయి. అపుడు ఆ మడుగులో ఉన్న ఒక మొసలి ఇది చూసి విచారించి గజేంద్రుడికి బుద్ది చెప్పాలని నీటి అడుగున బురదలోనే వచ్చి గజేంద్రుడు యొక్క కాలు గట్టిగా పట్టు కొన్నది. గజేంద్రుడు బాధతో గట్టిగా అరిచాడు. ఈ సంఘటనతో గజేంద్రుడితో ఉన్న ఆడ ఏనుగులన్నీ సరస్సులోంచి బయటకి వెళ్ళిపోయాయి. గజేంద్రుడు తన శక్తి కొద్ది మొసలి నుంచి తనను తాను విడిపించుకోవటానికి విశ్వప్రయత్నాలు చేస్తాడు. కానీ అలవి కాలేదు. ఇది సహస్ర వర్షాల పర్యంతము జరిగిందట. గజేంద్రుడి శక్తి క్షీణించి పోతున్నది. చివరిగా గజేంద్రుడు భగవంతుడిని ప్రార్ధన చేసి ఆయన్ని పిలవటం మొదలు పెట్టాడు. మొసలి తన పళ్ళతో ఇంకా గట్టిగా కొరికింది. భాద ఎక్కువయింది. శక్తి ఇంకా క్షిణించి పోతున్నది. అంతిమంగా పరమాత్మ ఇక నాకు నేవే దిక్కు నీవే నన్ను కాపాడాలి అని శరణు వేడుకొన్నాడు. ఆ సమయానికి వైకుంఠములో జగన్మాతతో ఏకాంతంలో ఉన్న విష్ణువు తన భక్తుడి ఆర్తనాదాలు విని అతని శరణాగతికి మెచ్చి ఎలా ఉన్న వాడు అలాగే సిరికిం జెప్పక శంఖచక్రాయుధ·ములను ధరించక అలాగే కిందకు వచ్చి ఆ సరస్సులో దిగి మొసలిని పట్టుకొని పైకెత్తి దాని తలను నరికి గజేంద్రుడికి విముక్తి కలిగించాడు. అపుడు గజేంద్రుడు మొసలితో జీవన్ముత్య్రు పోరాటం చేసి అలసిపోయి డస్సిపోయి ఉన్నాడు. గజేంద్రుడు దగ్గరలో ఉన్న పుష్పాన్ని తొండంతో అందుకొని విష్ణువు పాదాల వద్ద ఉంచి ఆయన పాదాలపై తల ఉంచి శరీరం వదిలి విష్ణువులో ఐక్యం అయి పోయాడు. ఈ మొత్తం ఎపిసోడు మనం ఆద్యాత్మికంగా చూసినట్లయితే వికారాలనే మొసలిచే పట్టి పీడించబడుతున్న మనిషి తన సొంత ప్రయత్నము చేత దాన్నుంచి విడివడటానికి తీవ్ర ప్రయత్నం చేసినా కుదరక మొదటగా భగవంతుడి ప్రార్ధన చేసి తర్వాత ఆయా సంపూర్తి శరణాగతి వేడుకొని పూర్తిగా ఆయనకు సరెండర్ అయితే ఆయన స్వయంగా మన హృదయం అనే సరస్సులో దిగి వికా రాలినే మొసలిని పైకెత్తి తల నరికి మనకు వికారాల నుంచి విముక్తి కలిగించి మనకు మోక్షం ప్రసాదిస్తాడు.
భాగవతంలో శ్రీకృష్ణుని జననం, ఆయన బాల్యం ఇదంతా అత్యంత మనోహరమైన ఘట్టం. దేవకి గర్భాన జన్మించిన కృష్ణుడు యశోద వద్దకు చేరాడు. ఆయనకు కృష్ణుడు అని పేరు పెట్టడానికి కారణం. కృష్ అనగా లాగేయటం. మనలోని వికారాలను, దుర్గుణాలను బయటికి లాగేసి మనల్ని పావనం చేసే వాడే కృష్ణుడు. మన దేహ భావనలను, వాసనలను పూర్తిగా తీసేసేవాడే కృష్ణుడు.
అయితే మనం ఆయనను పూర్తిగా నమ్మి శరణు వేడు కోవాలి. ఆయన చాలా చిన్నవయసులోనే అనేకమంది రాక్షసులను చంపేశాడు. ఆ రాక్షనలు మనలోకి దుర్గుణాలను, దుష్ట సంస్కారాలకు చిహ్నం. తన దివ్య అలౌకిక సౌందర్యముతో, దివ్యచేష్టలతో అందరినీ ఆనంద పరవశులను చేసేవాడు కృష్ణుడు. యమునానదిలో కాళింది సర్పముపైకెక్కి దూకి అన్ని తలల మీదను నాట్యం చేసి ఆ తలలలోని విషాన్నంతా బయిటికి లాగేసి దానిని విముక్తి జేసాడు. మనలోనికి భేదబుద్ది విషంలాగా శరీరమంతా వ్యాపించి ఉంటుంది. భేదబుద్ధి వలన మనలో కలిగే వాసనలు మనను విషతుల్యం చేస్తాయి. ఇదే అసలైన ఇన్‌ఫెక్షన్. మన శిరస్సుపైన అనగా మన బుద్దిలో పరమాత్మ నిలబడటానికి తావిస్తే ఆయన తాండవం చేసి మనలోని విషమంతా లాగేసి మనల్ని పావనం చేసి మనలో ఉన్న ఇన్‌ఫె¾క్షన్ తొలగించి వేస్తాడు. మనలోని భేదబుద్దిని బయటకు తోసేస్తాడు.
యశోద కృష్ణుడిని రోటికి బంధించడం, ఆయన దాన్ని ఆనాయాసంగా తెంచేయడం అనే ఎపిసోడ్‌లో కూడా అర్థం దాగుంది. మనస్సనే కుండలో సాధన అనే కవ్వంతో చిలుకు తుండగా వెన్నలుగా ఆయన వచ్చాడు. ఆమె ఆయనని భగవంతుడిగా గుర్తించలేదు. ఇంకా తన కొడుకే అనుకొన్నది. అపుడు ఆకుండను పగులకొట్టాడు. దానికి ఆమె కోపించి ఆయనని రోటికి కట్టివేయ టానికి ప్రయత్నించింది. ఎన్ని తాళ్లు చాలలేదు. యశోద వేదాద్యయనం చేయలేదు. జ్ఞానం లేదు. కాని తన యొక్క అవ్యాజ్యమైన ప్రేమతో శ్రీకృష్ణుడ్ని బందించగలిగింది. ఆమె ప్రేమ బలమైనది. సాదారణ స్త్రీకి భగవంతుడు భక్తి, వాత్సల్యము చేత బందింపబడ్డాడు. అటువంటి భక్తులను భగవానుడు తన లీలా వినోదంతో bంటర్‌టైన్‌మెంట్ చేస్తాడు. ఎంతసమయం దొరికితే అంత సమయం భగవన్నామ చేస్తూ ఉండాలి. నిరవధికమైన నిష్కామమైన స్మరణ చేస్తుండాలి. సకల బ్రహ్మాండాలను తన ఉదరంలో బంధించిన పరమాత్మ తనంతట తానే ఉదరాన్ని వెనక్కి తీసుకొని ఆమెకు తనను బందించే అవకాశం ఇచ్చాడు. అలా భగవంతుడు మనము ముందు తీవ్ర ప్రయత్నం తరువాత ఆయనకు సరెండరు అయితే అయన మనకి సహకరించి మనల్ని గెలిపిస్తాడు. విముక్తి చేస్తాడు. అది మన ప్రయత్నం వల్లే అయ్యిందనే భావన కలిగించి మనల్ని ఆనందింప చేస్తాడు. ఆయన లీలలు యశోదకు అర్థం కాలేదు. ఇతను నా కొడుకు. చిన్ని బాలుడు. ఇతను ఇంత అసాధ్యమైన పనులు ఎలాచేస్తాన్నాడు అని ఒకసారి నందుడిని అడిగింది. ఆ విషయం నందుడికి కూడా తెలియదు. నందుడు చెప్పాడు. ఇతను సామాన్యుడు మాత్రం కాదు అన్నాడు. అవతార వురుషుని గుర్తెరిగి వ్యవహరించటం కొద్ది మందికే సాధ్యం. దానికి సుకృతం కావాలి. మనిషి శరీరంలోకి వచ్చిన దేవుడు వ్యవహరించానికి ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థలో మనుషులు కావాలి. అలా ఆయన ఏర్పరచుకొన్న మనుషులకి ఆయన లీలలు అరŠ్దం కావు. అర్హత ఉన్నవారికే అర్ధం అయ్యేవాడే దేవుడు. అర్హత లేనివారికి అర్థం కాదు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళ వ్యవహరం అలాగే ఉంటుంది. తన కార్యం ముగిసే వరకు అవతారపురుషుడు వాళ్ళను అలాగే ఉంచుతాడు.
పళ్ళు అమ్మే ఆమె అడవిలో పళ్ళు ఏరుకొని వచ్చి అమ్ముతున్నది. కృష్ణుడు తన చిన్ని చేతులతో గింజలు తెచ్చి ఆమె తట్టలో వేసాడు. ఆమె తన తట్టలోని పళ్ళన్నీ ఇచ్చేసింది. తరువాత ఆమె పళ్ళ తట్ట దించి చూస్తే అందులో వెల కట్టలేని మణిమాణిక్యాలున్నాయి. ఆమె ప్రేమతో సేకరించినవి ఇస్తే ఆయన అమÖల్యమైనవి ఇచ్చాడు. మనము ఏదీ ఉత్పత్తి చేయలేదు. సేకరిస్తున్నాము అంతే. అలా సేకరించినవే మనము ఆయనకు సమర్పిస్తున్నాము. మన సొంతమంటూ ఏదీ లేదు. అదీ ఇవ్వటం లేదు. ఆయన సృష్టించినవే ఆయనకు ఇస్తున్నాము. ఆయన సృష్టించినవే ఆయనకు ఇస్తేనే ఆయన వాటికి వేలరెట్లు చేసి మనకి ఇస్తాడు. అదీ ఆయనదే. మనం దానిని అందరికీ పంచాలి. లోభంతో దోచుకుంటే పాపం. దాచుకోవడమే పాపం. పదిమందికీ పంచడమే పుణ్యం. కృష్ణుడి లీలలు తెలుసుకుని కంసుడు అక్రూరుని ద్వారా ద్వారకకు రప్పించాడు. కృష్ణున్ని సంహరించడానికి అనేకమందిని నియమించాడు. వాళ్ళందరికి కృష్ణుడు సంహరించాడు. కంసుడు సుమారు 24 ఏళ్ళŸగా వైరి భావంతో కృష్ణుడ్ని ద్వేషిస్తూ వచ్చాడు. అంతిమంగా కృష్ణుడు కంసున్ని సింహాసనం పైనుంచి కిందకు తోసి అతని గుండెలపై కూర్చుని పిడిగుద్దులు గుద్ది చంపేసాడు. కంసుడు శరీరం వదిలేటప్పుడు కూడా వైరి భావంతో కృష్ణుడ్నే ద్యానిస్తూ శరీరం వదిలాడు. అందుకే ముక్తి పొందారు. భాగవతమును నిత్య అధ్యయనం భాగంగా చేసుకోవాలి. సాధుకులకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నిష్కామ భక్తి కలుగుతుంది. జ్ఞానము అభివృద్ది అవుతుంది. భాగవతతత్వాన్ని అర్ధం చేసుకొనే సామర్థ్యం వస్తుంది. దాని వలన తత్వము యొక్క పూర్తి అవగాహన వస్తుంది. అలా అవగాహననకు వచ్చింది. ఆచరణలోకి వస్తుంది. ఆచారణలోకి వచ్చినపుడే అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి పూర్తిగా రా భగవత్ సాక్షాత్కారం చేయిస్తుంది. మనలోని మాలిన్యాలను తొలగిస్తుంది. పావనం చేస్తుంది. కాబట్టి దీనియొక్క నిత్యపారాయణ ఆధ్యాత్మికంగా ఎంతో అనుకూలం. భగవంతుడి యదార్థ స్వరూపాన్ని తెలుసుకొని, ఆస్వాదించి ఇతరులకు కూడా దీనిని పంచటం కంటె గొప్ప కార్యం ఏమీ లేదు. కాబట్టి భాగవతం యొక్క నిత్య పారాయణం చేయటం, చేయించటం, భాగవత సప్తాహాలు ఏర్పాటు చేయడం, వాటికి సహకరించడం, వాటిలో పాల్గొనడం, భాగవతం పుస్తకాలు అందరికీ పంచడం, ప్రచారం చేయటం ఇలా ఇవన్నీ ఎంతో పుణ్యకార్యాలుగా భావించాలి. భాగవత పారాయణము పట్ల మాకు ఆసక్తి కలిగించి, భాగవత పారాయణము, శ్రవణం, మననం, మీ ఆధ్యాత్మిక సాధనలో భాగంగా చేసుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి