శతృవుపై
పగకంటే
ప్రేమను
కురిపించు
అతను
నీ ప్రేమలో
మునిగి
పశ్చాతాపంతో
తలదించుకుని
నీ ముందుకొచ్చి
నిలుస్తడు
అప్పుడు
నువ్వు
రాజసంతో
వెలిగిపోతుంటవు
నువ్వు
విరిసిన
కలువవలె
నవ్వు
మురిసిన
ముత్యంవలె
మాట్లాడు
శత్రువనే
వాడుంటాడా
ప్రేమ
పాలసముద్రంవలె
పొంగుతుండాలె
అందులో
కోపం
ద్వేషం
నశించిపోతవి
ప్రేమ
నిండుగా
పుడుతుంది
సంద్రమై
పరుచుకుంటుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి