మొత్తం పేజీ వీక్షణలు

13, డిసెంబర్ 2017, బుధవారం

మోక్ష సన్న్యాస యోగ

ఓం శ్రీ పరమాత్మనే నమః
అథ అష్టాదశో2ధ్యాయః
మోక్ష సన్న్యాస యోగ
అర్జున ఉవాచ
సన్యాసస్య మహబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్‌
త్యాగస్య చ హృషీకేశపృథక్కేశినిషూదన 1
అర్జునుడు పలికెను - ఓ మహాబాహూ! అంతర్యామీ! వాసుదేవా! సన్న్యాస తత్త్వమును, త్యాగతత్త్వమును వేర్వేరుగా తెలిసికొన గోరెదను. (1)
శ్రీ భగవాన్‌ ఉవాచ
కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః
సర్వకర్మ ఫత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః 2
శ్రీ భగవానుడు పలికెను - కామ్యకర్మ త్యాగమునే సన్న్యాసమని కొందరు
పండితు తంతురు. కాని విచక్షణాశీురైన మరికొందరు మాత్రము సర్వకర్మ
ఫమును త్యజించుటను త్యాగమని పేర్కొందురు. (2)
త్యాజ్యం దోషవదిత్యేకే కర్మప్రాహుర్మనీషిణః
యజ్ఞదానతపఃకర్మన త్యాజ్యమితి చాపరే 3
కొందరు విద్వాంసు కర్మన్నియు దోషయుక్తములే గావున వాటిని త్యజింపవలెనని యందురు. కాని, యజ్ఞదాన తపశ్చర్యాది కర్ము త్యాజ్యము కావని మరికొందరందురు. (3)
నిశ్చయం శృణు మే తత్రత్యాగే భరతసత్తమ
త్యాగో హిపురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః 4
ఓ పురుషశ్రేష్ఠా! అర్జునా! సన్న్యాసము, త్యాగము అను రెండు విషయములో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్త్వికము, రాజసము, తామసము అని మూడు విధముగా చెప్పబడినవి. (4)
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్‌
యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణామ్‌ 5
యజ్ఞదానతపశ్చర్యాది కర్ము త్యజింపదగవు. అవి అవశ్యము అనుష్టింపదగినవి. ఏనన యజ్ఞదాన తపస్సు అను ఈ మూడు కర్మలే  బుద్ధిమంతులైన వారిని పవిత్రమొనర్చును. (5)
ఏతాన్యపి తు కర్మాణిసంగం త్యక్త్వాఫలానిచ
కర్తవ్యానీతిమే పార్థనిశ్చితంమతముత్తమమ్‌ 6
కావున ఓ పార్థా! ‘‘ఈ యజ్ఞదాన తపోరూప కర్మను మరియు కర్తవ్య కర్మను అన్నింటిని ఫలాసక్తును త్యజించి, అవశ్యమాచరింపవలెను’’ అనునది నా నిశ్చితాభిప్రాయము (6)
నియతస్యతు సన్న్యాసః కర్మణో నోపపద్యతే
మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః 7
(నిషిద్ధ కర్మ, కామ్యకర్మ ఆచరణను త్యాగము చేయుట సముచితమే) కాని శాస్త్ర విహిత కర్మాచరణమును త్యజించుట ఉచితము గాదు. కావున మోహ వశమున దానిని త్యజించుట ‘తామస త్యాగము’ అనబడును. (7)
దుఃఖమిత్యేవయత్కర్మకాయక్లేశభయాత్‌ త్యజేత్‌
సకృత్వా రాజసం త్యాగం నైవత్యాగఫం భేత్‌ 8
కర్మన్నియును దుఃఖకారకములే యని భావించి, శారీరక క్షేశమునకు భయపడి కర్తవ్య కర్మను త్యజించుటను రాజస త్యాగము అని యందురు. అట్టి త్యాగము వన ఎట్టి ఫమూ భింపదు. (3)
కార్యమిత్యేవయత్కర్మనియతం క్రియతే2 ర్జున
సంగం త్యక్త్వాఫం చైవ సత్యాగ సాత్త్వికోమతః 9
ఓ అర్జునా! శాస్త్ర విహిత కర్మను కర్తవ్యముగా భావించి, వాటి యందలి ఫలాసక్తును త్యజించి చేయుటయే సాత్త్విక త్యాగము అని భావింపబడును. (9)
నద్వేష్ట్యకుశం కర్మకుశలేనానుషజ్ఞతే
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః 10
అకుశ కర్మను ద్వేషింపని వాడు, కుశ కర్మ యందు ఆసక్తి కలిగియుండని వాడు, శుద్ధ సత్త్వగుణ యుక్తుడు, సంశయ రహితుడు, బుద్ధిమంతుడు అయిన వాడు నిజమైన త్యాగి. (10)
నహిదేహభృతా శక్యం త్యక్తం కర్మాణ్యశేషతః
యస్తు కర్మఫత్యాగీ సత్యాగీత్యభిధీయతే 11
ప్రతి శరీరధారికిని కర్మను సంపూర్ణముగ త్యజించుట అవశ్యకము. కావున కర్మను గాక కర్మఫమును త్యజించినవాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. (11)
అనిష్టమిష్టం మిశ్రం చత్రివిధంకర్షణఃఫమ్‌
భవత్యత్యాగీనాం ప్రేత్యన తు సన్న్యాసినాం క్వచిత్‌ 12
కర్మఫ తాగ్యము చేయని మనుష్యు కర్మకైతే మంచి, చెడు, మిశ్రమమని మూడు విధముగా ఫముండును. మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించియే తీరవయును. కాని కర్మఫ త్యాగమొనర్చిన కర్మయోగు తమ కర్మ ఫమును ఏ కాము నందైనను, ఏ విధముగను అనుభవింపవసిన పని యుండదు. (12)
పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే
సాంఖ్యేకృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్‌ 13
ఓ మహాబాహూ! సర్వకర్మ సిద్ధికి ఐదు హేతువు గవని కర్మను అంతము చేయు ఉపాయమును తొపు సాంఖ్య శాస్త్రము నందు పేర్కొనుట జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలిసికొనుము. (13)
అధిష్టానం తధాకర్తాకరణం చ పృథగ్విధమ్‌
వివిధాశ్చపృథక్‌ చేష్టాదైవం చైవాత్రపంచమమ్‌ 14
కర్మ సిద్ధి యందు అధిష్ఠానము, కర్త, వివిధములైన కరణము(సాధనము) నానావిధ చేష్టు, దైవము అను ఐదును హేతువు. 14).
శరీరవాఙ్మనోభిర్యత్‌ కర్మప్రారభతేనరః
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్యహేతవః 15
మానవుడు మనస్సు, వాక్కు, శరీరముతో ఆచరించు శాస్త్రానుకోమైన లేక విపరీతమైన యే కర్మలైనను ఈ jైుదు హేతువుతో ఒప్పుచుండును. (15)
తత్రైవం సతి కర్తారమ్‌ ఆత్మానం కేవం తు యః
పశ్యత్యకృతబుద్ధిత్వాత్‌ న స పశ్యతి దుర్మతిః 16
అట్లయినప్పటికిని (సర్వ కర్మకును ఐదు హేతువులే మూమైనప్పటికిని) విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేమడు (నిరంజనుడు), శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మకు కర్తగా భావించునో, అట్టి మలినబుద్ధి గ అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. (16)
యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే
హత్వాపి స ఇమాన్‌ లోకాన్న హంతి న నిబధ్యతే 17
అంతఃకరణము నందు కర్త ృత్వభావము లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్ధము యందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకమును అన్నింటిని హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతనిని ఎట్టి పాపమును అంటవు. (17)
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధాకర్బచోదనా
కరణం కర్మకర్తేతి త్రివిధః కర్మసంగ్రహః 18
జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి మూడు విధములైన కర్మ ప్రేరణము. కర్త, కరణము, క్రియ అను కర్మ సంగ్రహము మూడు విధము. (18)
జ్ఞానం కర్మచకర్తా చత్రిదైవగుణబేదతః
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి 19
గుణము సంఖ్యను వివరించు సాంఖ్య శాస్త్రము నందు జ్ఞానము, కర్మ కర్త అనునవి గుణభేదముతో మూడేసి విధముగా పేర్కొనబడినవి. వానిని గూర్చి విశదపరచెదను, వినుము. (19)
సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే
అవిభక్తం విభక్తేషు తద్‌జ్ఞానం విద్ది సాత్వికమ్‌ 20
వేర్వేరుగా కన్పించు సమస్త ప్రాణు యందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగ రహితుడుగా సమభావముతో స్థితుడై యున్నట్లు జ్ఞానిjైున వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలిసికొనుము. (20)
పృథక్త్వేన తు యద్‌జ్ఞానం నానాభావాన్‌ పృథగ్విధాన్‌
వేత్తి సర్వేషు భూతేషు తద్‌ జ్ఞానం విద్ధి రాజసమ్‌ 21
సమస్త ప్రాణు యందును నానా విధములైన వివిధ భావమును వేర్వేరుగా భావించు వారి జ్ఞానమును రాజసము అని యెరుంగుము. (21)
యత్తు కృత్స్నవదేకస్మిన్‌ కార్వేసక్తమ హైతుకమ్‌
అతత్త్వార్థవద్పం చతత్తామసముదాహృతమ్‌ 22
ప్రకృతి కార్యమైన శరీరమునే (శరీరమునకు సంబంధించిన భౌతిక వస్తువునే) సమస్తముగా భావించి, దాని యందే ఆసక్తిని కల్గించునట్టియు, తాత్త్వికముగా అర్థ రహితమైనదియు, హేతుబద్ధము కానిదియు, తుచ్ఛమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము అని యందురు. (22)
నియతం సంగరహితమ్‌ అరాగద్వేషతః కృతమ్‌
అఫప్రేప్సునా కర్మ యత్తత్సాత్త్వికముచ్యతే 23
కర్త ృత్వాభిమానము గాని, ఫలాపేక్షగాని లేని పురుషునిచేత రాగద్వేష రహితముగా చేయబడు శాస్త్ర విహితమైన కర్మను సాత్త్విక కర్మయని యందురు. (23)
యత్తుకామేప్సునా కర్మ సాహంకారేణ వాపునః
క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతమ్‌ 24
భోగలాసుడైన పురుషుని చేతను, అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన రాజస కర్మ అని యందురు. (24)
అనుబంధం క్షయం హింసామ్‌ అనవేక్ష్యచ పౌరుషమ్‌
మోహాదారభ్యతే కర్మయత్తత్తామసముచ్యతే 25
పరిణామము (మంచిచెడ్డు) హాని, హింస, సామర్థ్యమును చూచుకొనక కేవము అజ్ఞానముచే ఆరంభింపబడు కర్మను తామస కర్ము అని యందురు. (25)
ముక్తసంగో2నహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః
సిద్ద్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే 26
ఆసక్తిని త్యజించినవాడు, అహంకార రహితముగా భాషించువాడు ధైౖర్యోత్సాహము గవాడును, సిద్ది - అసిద్దు యెడ హర్ష శోకాదివికారముకు లోను కానివాడును అగు పురుషుడు సాత్త్విక కర్త యనబడును. (26)
రాగీ కర్మఫప్రేప్సుఃబ్ధో హింసాత్మకో2శుచిః
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః 27
ఆసక్తియుతుడు, కర్మఫముకై ఆరాటపడువాడు, లోభి, ఇతరును కష్టపెట్టు స్వభావము గవాడు, అపవిత్ర ప్రవర్తన గవాడు, హర్షశోకముకు లోనగువాడు రాజసకర్తగా భావింపబడును. (27)
ఆయుక్తఃప్రాకృతః స్తబ్దఃశఠోనైష్క ృతికో2సః
విషాదీ దీర్ఘసూత్రీచ కర్తా తామస ఉచ్యతే 28
జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు (మొండివాడు) ధూర్తుడు, అకారణముగ ఇతరు వృత్తుకు విఘాతము కల్గించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణము నందు ఉపేక్షతో కాము గడుపుచుండువాడు అను (దీర్ఘసూత్రి) - క్షణమును గవానిని తామసకర్త అని యందురు. (28)
బుద్దేర్భేదం ధృతేశ్చైవగుణతస్త్రివిధంశృణు
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేనధనంజయ 29
ఓ ధనంజయా! ఇప్పుడు నీవు బుద్ధి, ధ ృతును గూడ గుణభేదము ననుసరించి మూడు విధముగా, విభాగపూర్వకముగా సంపూర్ణముగా నానుండి వినుము. (29)
ప్రవృత్తిం చ నివృత్తిం చకార్యాకార్యే భయాభయే
బంధం మోక్షం చయావేత్తిబుద్ధిః సా పార్థసాత్వికీ 30
ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధమును, మోక్షమును యథార్థముగా తెలిసికొను బుద్ధిని సాత్వికమైన బుద్ధి యందురు. (30)
యయా ధర్మమధర్మంచ కార్యం చాకార్యమేవచ
అయధావత్‌ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ 31
ఓ పార్థా! ధర్మాధర్మము యొక్కయు, కార్యాకార్యము యొక్కయు (కర్తవ్యా కర్తవ్యము యొక్కయు), యథార్థ తత్త్వమును తెలియజాని బుద్ధిని రాజసబుద్ధి అని యందురు. (31)
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా!
సర్వార్థాన్‌ విపరీతాంశ్చబుద్ధిః సా పార్థ తామసీ 32
ఓ అర్జునా! తమోగుణావృతమైనందున అధర్మమును ధర్మముగను, అట్లే ఇతర పదార్ధమును (విషయమును) తద్విపరీతముగను భావించు బుద్ధిని ‘‘తామస బుద్ధి’ అని యందురు. (32)
ధృత్యాయయాధారయతే మనఃప్రాణేంద్రియ క్రియాః
యోగేనావ్యభిచారిణ్యాధృతిః సా పార్థసాత్వికీ 33
ఓ పార్థా ఇటునటు చలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగము ద్వారా మనఃప్రాణేంద్రియ క్రియను ధారణ చేయు శక్తిని సాత్త్వికధృతి యందురు. (33)
  యయా తు ధర్మకామార్థాన్‌ ధృత్యాధారయతే2ర్జున
ప్రసంగేన ఫలాకాంక్షీధృతిః సా పార్థ రాజసీ 34
కాని, ఓ పార్ధా! అర్జునా! కర్మఫలేచ్చ గ మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయమును ధారణ చేయు శక్తిని ‘‘రాజసధృతి’’ అని యందురు. (34)
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ
న విముంచతి దుర్మేధా ధృతిఃసా పార్థ తామసీ 35
పార్థా! నిద్ర, భయము, చింతా శోకము, ఉన్మత్తతను విడువక, దుర్మతిjైున మనుష్యుడు వాటినే సతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని ‘తామస ధృతి’ అని యందురు. (35)
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరత్షంభ
అభ్యాసాద్రమతేయత్రదుఃఖాంతం చనిగచ్ఛతి 36
యత్తదగ్రే విషమివ పరిణామే2మృతోపమమ్‌
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్‌ ఆత్మబుద్ధి ప్రసాదజమ్‌ 37
ఓ భరతశ్రేష్ఠా! మూడు విధముగు సుఖమును గూర్చియు నేను చెప్పెదను వినుము. ఏ సుఖము నందు సాధకుడు భజన ధ్యాన సేవాదు నొనర్చి ఆనందించునో, దు:ఖమును అతిక్రమించునో, ప్రారంభము నందు విషత్యుముగా (దుఃఖకరముగా) గోచరించి నప్పటికిని పరిణామమున అమ ృతత్యుమై పరమాత్మకు సంబంధించిన విషయములో నిమగ్నమగునో, అట్టి సుఖమును ‘సాత్త్విక సుఖము’ అని యందురు. (36-37)
విషయేంద్రియసంయోగాత్యత్తదగ్రే2మృతోపమమ్‌
పరిణామే విషమివతత్సుఖంరాజసంస్క ృతమ్‌ 38
విషయేంద్రియ సంయోగము వన కుగు సుఖము మొదట భోగానుభవ సమయము నందు అమృత త్యుముగ అనిపించినను పరిణామమున అది విషత్యుమగును. అట్టి సుఖమును ‘రాజససుఖ’ మందురు. (38)
యదగ్రేచానుబంధేచ సుఖంమోహనమాత్మనః
నిద్రాస్యప్రమాదోత్తం తత్తామసముదాహృతమ్‌ 39
నిద్ర, సోమరితనము, ప్రమాదము (మోహము) వన ఉత్పన్నమగు సుఖమును ‘‘తామస సుఖము’ అని యందురు. ఇట్టి సుఖము భోగ సమయము నందును, పరిణామము నందును ఆత్మను మోహింపజేయు చుండును. (39)
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః
సత్త్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిః స్యాత్త్రిభిర్గుణైః 40
పృథ్వి యందు గాని, ఆకాశమునందు గాని, దేవత యందు గాని, మరేయితర లోకము యందు గాని, ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ మూడు గుణము లేకుండ ఏ ప్రాణియు ఉండదు. (40)
బ్రాహ్మణక్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః 41
ఓ పరంతపా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్యు కర్మునూ, అట్లే శూద్రు కర్మునూ వారి వారి స్వాభావికములైన గుణమును బట్టి విభజింపబడి యున్నవి. (41)
శమోదమస్తపఃశౌచం క్షాంతిరార్జవమేవ చ
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మస్వభావజమ్‌ 42
అంతఃకరణ నిగ్రహము (శమము), ఇంద్రియమును వశము నందుంచు కొనుట (దమము), ధర్మమును పాటించుటలో ఎదురగు కష్టమును సహించుట, బాహ్యాభ్యంతరము శుచిత్వము, ఇతరు అపరాధమును క్షమించుట, ఋజుమార్గ జీవనము (మనశ్శరీరేంద్రియము సరళత్వము)వేదశాస్త్రము యందును ఈశ్వరుని యందును పరలోకాదు యందును, విశ్వాసమును కలిగియుండుట, వేదశాస్త్రము అధ్యయనము, అధ్యాపనము, పరతత్త్వానుభవము - ఇవి యన్నియును బ్రాహ్మణు స్వాభావిక కర్ము. (42)
శౌర్యం తేజోధృతిర్ధాక్ష్యం యుద్దేచాప్యపలాయనమ్‌
దానమీశ్వరభావశ్చక్షాత్రం కర్మస్వభావజమ్‌ 43
శార్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధము నందు వెన్నుచూపకుండుట, దానము నిచ్చుట, స్వామి భావముతో ప్రజను ధర్మపరాయణునుగా చేయుచు పరిపాలించుట మొదగునవి యన్నియును క్షత్రియు స్వాభావిక కర్ము (43)
కృషి గౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్‌
పరిచర్యాత్మకం కర్మశూద్రస్యాపి స్వభావజమ్‌ 44
వ్యవసాయము, గోరక్షణము, క్రయవిక్రయ రూప సత్య వ్యవహారము ఇవి యన్నియును వైశ్యు స్వాభావిక కర్ము. అట్లే అన్ని వర్ణము వారిని సేవించుట శూద్రు స్వాభావిక కర్మ (44)
స్వేస్వేకర్మణ్యభిరతః సంసిద్దిం భతే నరః
స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు 45
తమ తమ స్వాభావిక కర్మ యందు తత్పరులైన వారు భగవత్ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహముగా పొందుదురు. స్వకర్మనిరతులైన మానవు పరమసిద్ధిని పొందుటకు ఆచరింప వసిన విధును తొపుచున్నాము వినుము. (45)
యతఃప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్‌
స్వకర్మణా తమభ్యర్త్య సిద్ధిం విందతిమానవ 46
సమస్త ప్రాణు ప్రాదుర్భావము పరమేశ్వరుని నుండియే జరిగినది. సమస్త జగత్తు నందును అతడు వ్యాపించి యున్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మ ద్వారా పూజించి, మానవుడు పరమసిద్ధిని పొందును. (46)
శ్రేయాన్‌ స్వధర్మోవిగుణః పరధర్మాత్‌ స్వనుష్టితాత్‌
స్వభావనియతం కర్మకుర్వన్నాప్నోతి కిల్బిషమ్‌ 47
బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటెను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. స్వభావమును అనుసరించి (స్వధర్మ రూప వర్ణాశ్రమ ధర్మమును అనుసరించి) కర్మను ఆచరించు మనుష్యునకు ఎట్టి పాపమును ఏ మాత్రము అంటనే అంటవు. (47)
సహజం కర్మకౌంతేయసదోషమపి న త్యజేత్‌
సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృతః 48
ఓ కౌంతేయా! (అర్జునా!) దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏనన, అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మన్నియును ఏదేని ఒక దోషముతో కూడియే యుండును. (48)
అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః
నైష్కర్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగఛ్చతి 49
ఓ అర్జునా! ప్రాపంచిక విషయమున్నింటి యందు ఆసక్తిలేనివాడును, స్ప ృహ రహితుడును, అంతఃకరణమును, జయించినవాడును అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్యసిద్ధిని పొందును. (49)
సిద్ధిం ప్రాప్తోయథా బ్రహ్మతధాప్నోతి నిబోధ మే
సమాసేనైన కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా 50
ఓ కౌంతేయా! జ్ఞానయోగము యొక్క పరానిష్ఠమైన నైష్కర్మ్యసిద్ధిని పొందు విధమును, తద్ద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తి నందు రీతిని సంగ్రహముగా తెల్చెదను వినుము. (50)
బుద్ద్యావిశుద్దయా యుక్తోధృత్యాత్మానం నియమ్యచ
శబ్దాదీన్‌ విషయాన్త్యక్త్వారాగద్వేషావ్యుదస్య చ 51
వివిక్తసేవీ ఘ్వాశీయతవాక్కాయమానసః
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః 52
అహంకారం బం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్‌
విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ క్పతే 53
విశుద్ధమైన బుద్ధి గవాడై, తేలికjైున సాత్త్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు, శబ్దాది విషయమును త్యజించి, పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, సాత్త్విక ధారణా శక్తి ద్వారా అంతఃకరణేంద్రియము సంయమము కలిగి, మనోవాక్కాయమును అదుపులో ఉంచుకొనినవాడు, రాగద్వేషమును సర్వధా త్యజించి, దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించిన వాడు, అహంకారమును, బమును, దర్పమును, కామక్రోధమును, పరిగ్రహమునకు వదిలిపెట్టి నిరంతరము ధ్యానయోగ పరాయణుడై యుండువాడు, మమతారహితుడు, శాంతియుతుడు ఐన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మము నందు అభిన్న భావముతో స్థితుడగుటకు పాత్రుడగును. (51,52,53)
బ్రహ్మభూతః ప్రసన్నాత్మాన శోచతి న కాంక్షతి
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం భతే పరామ్‌ 54
సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై ప్రసన్నమనస్కుడైన యోగి దేనికిని శోకింపడు, దేనినీ కాంక్షిపడు, సమస్త ప్రాణు యందును సమభావము గ అట్టి యోగి నా పరాభక్తిని పొందును. (54)
భక్త్వామామభిజానాతి యావాన్యశాస్మి తత్త్వతః
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్‌ 55
బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో? ఎంతటి వాడనో? యధాతథముగ నా తత్త్వమును తెలిసికొనును. అట్లు భక్తితో నా తత్త్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును. (55)
సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్‌ 56
సమస్త కర్మ యందును కర్తృత్వ భావమును వీడి, ఆయా కర్మ ఫరూపమైన సమస్త భోగమును త్యజించి, నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మను అన్నింటిని సర్వదా చేయుచును నా యనుగ్రహముచే సనాతనమైన శాశ్వతమైన పరమ పదమును పొందును. (56)
చేతసా సర్వకర్మాణిమయి సన్న్యస్యమత్పరః
బుద్ధియోగముపాశ్రిత్యమచ్చిత్తః సతతం భవ 57
సర్వకర్మను నిండు మనస్సుతో నాకే అర్పించి, సమబుద్ధిరూప యోగమును అవంబించి, మత్పరాయణుడవై సతతము చిత్తమును నా యందే న్పిుము. (57)
మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి
అథ చేత్త్వమహంకారాత్‌ న శ్రోప్యసి వినంక్ష్యసి 58
పైన తొపబడిన విధముగా నా యందు చిత్తమును నిల్పినచో, నా యనుగ్రహము వన సమస్త సంకటము నుండియు అనాయాసముగా బయట పడగవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనమును పెడచెవిన బెట్టినచో నష్టము పాగుదువు. అనగా పరమార్థ పథము నుండి భ్రష్టుడవగుదువు. (58)
యదహంకారమాశ్రిత్యనయోత్స్యఇతి మన్యసే
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి 59
అహంకార వశమున ‘‘నేను ఈ యుద్ధమును చేయను’’ అని నీవు నిశ్చయించుకొనుట వృథా. ఏనన నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురి క్పొును. (59)
స్వభావజేన కౌంతేయ నిబద్దఃస్వేనకర్మణా
కర్తుంనేచ్ఛసి యన్మోహాత్కరిష్యస్యవశో2 తత్‌ 60
ఓ కౌంతేయా! మోహ ప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను గూడ నీ పరాకృత స్వాభావిక కర్మచే (సంస్కారముచే) బంధింపబడి, తత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదువు. (60)
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే2ర్జున తిష్టతి
బ్రామయన్సర్వభూతానియంత్రారూఢాని మాయయా 61
అర్జునా! శరీర రూప యంత్రమును అధిరోహించిన సర్వప్రాణు హ ృదయము యందు అంతర్యామిగా నున్న పరమేశ్వరుడు తన మాయ చేత వారి వారి కర్మను అనుసరించి, వారిని భ్రమింప జేయుచున్నాడు. (61)
తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత
తత్ప్రసాదాత్‌ పరాం శాంతిం స్థానం ప్రాప్ప్యసి శాశ్వతమ్‌ 62
ఓ భారతా! (అర్జునా!) అన్ని విధముగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చుము. అతని క ృప చేతనే పరమశాంతిని, శాశ్వతమైన పరమపదమును పొందగవు. (62)
ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా
విమృశ్యైైతదశేషేణ యధేచ్ఛసి తధా కురు 63
ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. ఇప్పడు నీవు ఈ పరమగోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి, నీకిష్టమైన రీతిగా ఆచరింపుము. (63)
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః
ఇష్టో2సి మే దృడమితి తతో వక్ష్యామి తే హితమ్‌ 64
సమస్త గోప్య విషయము యందును పరమ గోప్యమైన నా వచనమును మరొక్కసారి వినుము. నీవు నాకు అత్యంత ప్రియుడవు అగుట వన నీకు మిక్కిలి హితమును గూర్చి వచనమును మర చెప్పచున్నాను. (64)
మన్మనాభవ మద్భక్తోమద్యాజీ మాం నమస్కురు
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో2సి మే 65
ఓ అర్జునా! నీవు నా యందే మనస్సును నిుపుము. నా భక్తుడవు కమ్ము. నన్నే సేవింపుము. నాకు ప్రణమ్లిుము, ఇట్లు చేయుట వన నన్నే పొందగవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నేను చెప్పుచున్నమాట. ఏనన నీవు నా కత్యంత ప్రియుడవు. (65)
సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం తరం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ 66
సర్వ ధర్మమును అనగా సమస్త కర్తవ్య కర్మను నాకు సమర్పింపుము.  సర్వశక్తిమంతుడను, సర్వాధారుడను, పరమేశ్వరుడను ఐన నన్నే శరణు జొచ్చుము.  అన్ని పాపము నుండియు నిన్ను నేను విముక్తుని గావించెదను. (66)
ఇదం తేనాతపస్కాయ నా భక్తాయ కదాచన
న చాశుశ్రూషవే వాచ్యంనచమాంయో2 భ్యసూయతి 67
తపస్సంపన్నుడు కానివానికిని, భక్తి రహితునకును, వినవలెనను కుతూహము లేని వానికిని నీవు ఈ గీతారూప రహస్యోపదేశమును ఎన్నడునూ త్పెరాదు. అట్లే నా యందు దోషదృష్టిగవానికి ఎన్నడునూ ఈ ఉపదేశమును తొపరాదు. (67)
య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి
భక్తిం మయి పరాం కృత్వామామేవైష్యత్యసంశయః 68
నా యందు పరమభక్తి గలిగి, ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును అనగా గీతా శాస్త్రమును నా భక్తు హృదయములో పదిపరచువాడు నన్నే పొందును. ఇందేమాత్రమూ సందేహము లేదు. (68)
నచ తస్మాన్మనుష్యేషు కశ్చినేప్రియకృత్తమః
భవితానచమేతస్మాత్‌ అన్యఃప్రియతరో భువి 69
నాకు ప్రీతిని గూర్చునట్టి కర్మ నాచరించు మనుష్యులో అతనిని మించిన భక్తుడెవ్వడును లేడు. అంతేగాక అతనివలె గాని, అతనిని మించి గాని నాకు ప్రియమైన వాడు భూమండమున మరియొక డెవ్వడును భవిష్యత్తులోను ఉండబోడు. (69)
అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోః
జ్ఞానయజ్ఞేన తేనాహమ్‌ ఇష్టఃస్యామితి మేమతిః 70
ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞాన యజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము, (70)
శ్రద్దావానానసూయశ్చ శృణుయాదపియోనరః
సో2పి ముక్తః శుభాన్‌ లోకాన్‌ ప్రాప్నుయాత్పుణ్యకరణామ్‌ 71
శ్రద్దాదరము గవాడును, దోషదృష్టి (దోషములెన్ను స్వభావము) లేనివాడును ఐన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వన గూడ పాప విముక్తుడై, పుణ్యకర్మను ఆచరించువారు పొందు ఉత్తమ లోకమును పొందును. (71)
కచ్చిదేతచ్చ్రుతం పార్థ త్వjైుకాగ్రేణ చేతసా
కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ 72
ఓ పార్థా ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్ర చిత్తముతో వింటివా? ఓ ధనంజయా! అజ్ఞానజనితమైన నీ మోహము పూర్తిగా నశించినదా? (72)
అర్జున ఉవాచ
నష్టోమోహః స్మ ృతిర్లబ్లాత్వత్ప్రసాదాన్యయాచ్యుత
స్థితో2స్మిగత సందేహఃకరిష్యే వచనంతవ 73
అర్జునుడు పలికెను - ఓ అచ్యుతా! నీ కృపచే నా మోహము పూర్తిగా తొగినది. స్మృతిని పొందితిని. ఇప్పుడు సంశయరహితుడనైతిని. కనుక నీ ఆజ్ఞను తదాల్చెదను. (73)
సంజయ ఉవాచ
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః
సంవాద మిమమశ్రౌషమ్‌ అద్భుతం రోమహర్షణమ్‌ 74
సంజయుడు పలికెను - ఈ విధముగా శ్రీ వాసుదేవునకును మహాత్ముడైన అర్జునకును మధ్య జరిగిన సంవాదమును వింటిని. అది అదుÄ్భతమైనది. తనువును
పుకింపజేయునది (74)
వ్యాసప్రసాదాచ్చ్రుతవాన్‌ ఏతద్గుహ్యమహం పరమ్‌
యోగం యోగేశ్వరాత్‌ కృష్ణాత్‌ సాక్షాత్‌ కథయతః స్వయమ్‌ 75
వేదవ్యాసుని కృప వన దివ్యదృష్టిని పొందినవాడనై పరమగోప్యమైన యోగమును (గీతను) యోగీశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు (స్వయముగ అర్జునునకు చెప్పుచుండగా ప్రత్యక్షముగా వింటిని.
రాజన్‌ సంస్మృత్య సంసృత్య సంవాదమ్‌ ఇమమద్భుతమ్‌
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః 76
ఓ రాజా! (ధృతరాష్ట్రా) శ్రీ కృష్ణ భగవానునకును, అర్జునునకును మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమున ఓలాడుచున్నాను. (76)
తచ్చసంస్మృత్య సంస్మృత్యరూపమత్యద్భుతం హరే
విస్మయో మే మహాన్‌ రాజన్‌ హృష్యామి చపునఃపునః 77
ఓ రాజా! అత్యంత విక్షణము, పరమాద్భుతము. అపూర్వము అయిన ఆ శ్రీహరి రూపమును పదేపదే స్మరించుచు, నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యముకు అవధియే లేదు. తత్ప్రభావమున మర మర హర్షోల్లాసముతో పుకిత గాత్రుడనగుచున్నాను.
యత్రయోగీశ్వరః కృష్ణో యత్ర పార్థోధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ (3 సార్లు) 78
ఓ రాజా! యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును, గాండీవధనుర్ధారిjైున అర్జునుడును ఉండుచోట సంపదును, సర్వ విజయమును, సకలైశ్వర్యమును,
సుస్థిరమైన నీతియు ఉండును - అని నా నిశ్చితాభిప్రాయము. (78)
ఓం తత్పదితి శ్రీమద్బగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
మోక్ష సన్యాసయోగో నామ అష్టాదశో2ధ్యాయ
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

శ్రద్ధాత్రయ విభాగయోగ

ఓం పరమాత్మనే నమః
అథ సప్తదశో2ధ్యాయః
శ్రద్ధాత్రయ విభాగయోగ
అర్జున ఉవాచ
యే శాస్త్రవిధిమత్సృజ్య యజంతే శ్రద్దయాన్వితాః
తేషాం నిష్ఠాతుకా కృష్ణసత్త్వమాహోరజస్తమః 1
అర్జునుడు పలికెను ` శ్రీ కృష్ణా! శాస్త్రవిధిని త్యజించి, భక్తి శ్రద్ధతో యజ్ఞమును గాని, దైవ పూజను గాని కొందరు చేయుచుందురు. వారి నిష్ట (వారి విధానము) సాత్త్వికమా? రాజసమా? తామసమా? (1)
శ్రీ భగవాన్‌ ఉవాచ
త్రివిధా భవతి శ్రద్దా దేహినాం సా స్వభావజా
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు 2
శ్రీ భగవానుడు పలికెను - శాస్త్రోక్తముగా నుండక కేవము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవు శ్రద్ధ సాత్త్వికము, రాజసము, తామసము అని మూడు విధముగా ఉండును. వాటిని గూర్చి వివరించెదను. వినుము. (2)
సత్త్వానురూపా సర్వస్యశ్రద్ధా భవతి భారత
శ్రద్ధామయో2యం పురుషో యో యచ్ఛ్రద్దః స ఏవ 3
ఓ అర్జునా! మనుష్యుందరి శ్రద్దయు వారి అంతఃకరణ రీతుకు తగినట్లు ఉండును. ప్రతి వ్యక్తికి ఏదోఒక శ్రద్ద ఉండనే ఉండును. అతని జీవన విధాన మంతయును అతని శ్రద్దకు అనుగుణముగా కొనసాగు చుండును. దానిని బట్టి అతడెట్టి శ్రద్ద కలిగి యున్నదియు తెలిసికొనవచ్చును. (3)
యజంతేసాత్త్వికాదేవాన్యక్షరక్షాంసి రాజసాః
ప్రేతాన్‌ భూతగణాంశ్చాన్యేయజంతే తామసా జనాః 4
వారిలో సాత్వికు దేవతను, రాజసు యక్ష రాక్షసును, తామసు ప్రేత భూత గణమును పూజించెదరు. (4)
అశాస్త్రవిహితంఘోరం తప్యంతే యే తపో జనాః
దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః 5
దంభము, అహంకారము గవారు, కోరికు ఆసక్తి కలిగియుండువారు, బగర్వితు ఐనవారు, శాస్త్రవిరుద్ధముగా మనః కల్పితమైన ఘోర తపస్సును ఆచరించుచు. (5)
కర్శయంతః శరీరస్థం భూతద్రామమ చేతసః
మాం చైవాంతః శరీరస్థం తాన్‌ విద్ద్యాసురనిశ్చయాన్‌ 6
శరీరము యందున్న జీవును, మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కృశింప జేయువారు అజ్ఞానులైన ఆసుర స్వభావము గవారని యెరుంగుము. (6)
ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః
యజ్ఞస్తపస్తథాదానం తేషాం భేదమిమం శృణు 7
మనుష్యు స్వభావమును అనుసరించి, వారికి ఇష్టములైన ఆహారము గూడ మూడు విధముగా ఉండును. అట్లే ఆయా మనుష్యు ఆచరించు యజ్ఞము, తపస్సు, దానము గూడా మూడేసి విధముగానే ఉండును. వాటిని గూర్చి వేర్వేరుగా విశదపరచెదను వినుము. (7)
ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్థనాః !
రస్యాః స్నిగ్థాఃస్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః 8
ఆయువు, బుద్ధి, బము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధి పరచునవియు, పాు, చక్కెర మొదగు రస పదార్ధమును, వెన్న నెయ్యి మొదగు స్నిగ్ధ పదార్ధమును, ఓజస్సును అభివృద్ధి పరచు స్థిరపదార్ధమును, సాత్త్విక స్వభావమును పెంచు హృద్య పదార్ధమును సాత్త్వికుకు ఇష్టమైనవి, (8)
కట్వమ్లవణాత్యుష్ణ-తీక్షణరూక్షవిదాహినః
ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాః 9
చేదు, పుపు, ఉప్పు, కారము, రుచుకు సంబంధించినవి. మిక్కిలి వేడి వస్తువు, మాడిన పదార్ధము, దాహము కల్గించునవి. అట్లే దుఃఖము, చింత, రోగమును ఉత్పన్నము చేయు ఆహారపదార్ధము రాజస స్వభావము గవారికి ఇష్టముగును. (9)
యాతయామం గతరసం పూతిపర్యుషితం చయత్‌
ఉచ్ఛిష్టమపిచామేధ్యం భోజనం తామసప్రియమ్‌ 10
అర్థ పక్వములైన పదార్ధము (సరిగా ఉడకనివి, పండనివి) రసహీనము, దుర్గంధ యుక్తము (చెడువాసన గవి) పాసిపోయిన పదార్ధము, ఎంగిలి వస్తువు, అపవిత్ర పదార్ధము మొదగునవి తామస స్వభావము గవారికి ఇష్టమైనవి. (10)
అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృషోయ ఇజ్యతే
యష్టవ్యమేవేతి మనఃసమాధాయ స సాత్త్వికః 11
శాస్త్రోక్తమైనదియు, ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున ద ృఢముగా నిశ్చయించుకొన బడినదియు, ప్రతిఫలాపేక్ష లేకుండ చేయబడునదియు ఐన యజ్ఞము సాత్త్విక యజ్ఞము అనబడును. (11)
అభిసంధాయ తుఫం దంభార్థమపిచైపయత్‌
ఇజ్యతే భరతశ్రేష్ట తం యజ్ఞం విద్ది రాజసమ్‌ 12
కానీ, ఓ అర్జునా! సరిjైున నిష్ట లేకుండ ఆడంబరము కొరకు ఆచరింప
బడునదియు, ప్రతిఫలాపేక్షతో చేయబడునదియు అగు యజ్ఞము రాజస యజ్ఞము అని ఎరుంగుము. (12)
విధిహీనమసృష్టాన్నంమంత్రహీనమదక్షిణమ్‌
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే 13
శాస్త్రవిధి ననుసరింపనిదియు, అన్నదాన రహితమైనదియు, మంత్ర హీనమైనదియు, దక్షిణు లేనిదియు, శ్రద్దా రహితమైనదియు అగు యజ్ఞము ‘తామస యజ్ఞము’ అనబడును. (13)
దేవద్విజగురుప్రాజ్ఞపూజసం శౌచమార్జవమ్‌
బ్రహ్మచర్యమహింసా చశారీరం తప ఉచ్యతే 14
దేవతను, బ్రాహ్మణును, గురుజనును, జ్ఞానును సేవించుట, పవిత్రత (రౌచము) నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సు. (14)
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్‌
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే 15
ఉద్వేగమును కలిగింపనిదియు, ప్రియమైనదియు, హితమును గూర్చునదియు, యథార్థమైనదియు అగు భాషణము అట్లే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామజప సాధన మొదగునవి యన్నియును వాక్కునకు సంబంధించిన తపస్సు. (15)
మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః
భావసంశుద్ధిరిత్యేతత్తపోమానసముచ్యతే 16
మనః ప్రసన్నత, శాంత స్వభావము, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతః కరణ శుద్ధి మొదగునవి యన్నియును మానసిక తపస్సు. (16)
శ్రద్దయా పరయా తప్తం తపస్తత్త్రివిధంనరైః
అఫలాకాంక్షిభిర్యకైః సాత్వికం పరిచక్షతే 17
పూర్వోక్తములైన (శారీరిక, వాచిక, మానసిక) తపస్సును ఫలాకాంక్షలేని యోగు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పడు వాటిని ‘సాత్త్విక తపస్సు’ అని యందురు. (17)
సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్‌
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చమధ్రువమ్‌ 18
ఇతరు నుండి సత్కారమును, గౌరవమును, పూజను అందుకొనుటకును, అట్లే తదితర స్వార్థ ప్రయోజనము కొరకును, స్వాభావికముగా గాని, కల్పితముగా గాని చేయబడునవియు, అనిశ్చిత ఫమును గాని, క్షణిక ఫమును గాని ఇచ్చునవియు ఐన తపస్సును ‘రాజస తపస్సు’ అని యందురు, (18)
మూఢగ్రాహేణాత్మనో యత్పీడయాక్రియతే తపః
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్‌ 19
మొండి పట్టుదతో మనోవాక్కాయముకు బాధ కలిగించునవియు, ఇతరుకు కీడు కల్గించుటకై చేయబడునవియు, ఐన తపస్సును ‘తామస తపస్సు’ అని అందురు. (19)
దాతవ్యమితి యుద్దానం దీయతే2నుపకారిణే
దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్క ృతమ్‌ 20
దానము చేయుటయే కర్తవ్యము’ అను భావముతో తగిన ప్రదేశము యందును, దుర్భిక్షాది కాము యందును ఆకలిదప్పుతో బాధపడువారు, అంగవైక్యము గవారు, రోగు మొదగు వారికిని, బ్రాహ్మణు, పండితు, బ్రహ్మచాయి, వానప్రస్తు మొదగు పాత్రులైనవారికి ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థ భావముతో చేయబడు దానము ‘సాత్విక దానము’ అనబడును. (20)
యత్తు ప్రత్యుపకారార్థం ఫముద్దిశ్యవా పునః
దీయతే చ పరిక్లిష్టం తద్దానంరాజసంస్క ృతమ్‌ 21
కాని ప్రత్యుపకారమును ఆశించి గాని, ప్రతిఫలాపేక్షతో గాని వివిధముగు ఒత్తిడుకు లోనై గాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును రాజస దానము అని యందురు. (21)
అదేశకాలే యద్దానమ్‌ అపాత్రేభ్యశ్చదీయతే
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్‌ 22
సద్భావము లేకుండా, దానము పుచ్చుకొనువారి యెడ గౌరవాదరమును చూపక, తృణీకార భావముతో ఛీóకొట్టుచు, అయోగ్యుకును, అపాత్రుకును దానము, దేశకాలోచితము గాని దానమూ, తామస దానము యనబడును. (22)
ఓంతత్సదితి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధః స్మ ృతః
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాఃపురా 23
ఓమ్‌, తత్‌, సత్‌ అని మూడు విధముగు పేరు సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశింపబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్ట్యాది యందు బ్రాహ్మణు, వేదము, యజ్ఞము ఏర్పడుట జరిగినది. (23)
తస్మాదోమిత్యుదాహృత్యయజ్ఞదానతపఃక్రియాః
ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినామ్‌ 24
కనుక వేదమంత్రమును పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞదాన తపశ్చర్యను సర్వదా ‘ఓమ్‌’ అను పరమాత్మ నామమును ఉచ్చరించుచునే ప్రారంభింతురు. (24)
తదిత్యనభిసంధాయ ఫం యజ్ఞతపఃక్రియాః
దానక్రియాశ్చవివిధాఃక్రియంతే మోక్షకాంక్షిభిః 25
మోక్షకాంక్ష గవారు స్వలాభాపేక్ష లేశమాత్రమైనను లేకుండ లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యను ‘ఇదియంతయును పరమాత్మదే’ అను భావము ‘తత్‌’ అను నామమును ఉచ్చరించుచు చేయుదురు. సద్భావేసాధుభావే చసదిత్యేతత్ప్రయుజ్యతే
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్ధయుజ్యతే 26
ఓ పార్థా ‘సత్‌’ అను పరమాత్మ నామము సత్య భావము నందును శ్రేష్ఠభావము నందును అనగా పరమాత్ముడు నిత్యుడు, శ్రేష్ఠుడు అను భావము నందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణము నందును ‘సత్‌’ అను శబ్దము ప్రయుక్తమగుచుండును.
యజ్ఞేతపసి దానే చస్థితికి సదితి చోచ్యతే
కర్మచైవతదర్థీయం సదిత్యేవాభిధీయతే 27
యజ్ఞ దాన తపః క్రియయందలి నిష్ఠ ఆస్తిక, భావమును ‘సత్‌’ అని యందరు పరమాత్మను ఉద్దేశించి, చేయబడు నిశ్చయాత్మక కర్మను కూడ ‘సత్‌’ అని యందురు. (27)
అశ్రద్దయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్‌
అసదిత్యుచ్యతే పార్థన చతత్త్స్రేత్యనో ఇహ 28
ఓ అర్జునా! శ్రద్ద (విశ్వాసము) లేకుండ చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరుపబడు ఇతర శుభకర్మన్నియును, ‘అసత్‌’ అని చెప్పబడును. దాని వన జీవించి యుండగా గాని మరణించిన పిదప గాని ఎట్టి ప్రయోజనమూ కుగదు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశో2ధ్యాయః 17

దైవాసుర సంపద్విభాగ యోగః

ఓం శ్రీ పరమాత్మనే నమః
అథ షోడశో2ధ్యాయః
దైవాసుర సంపద్విభాగ యోగః
శ్రీ భగవాన్‌ ఉవాచ
అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తవ ఆర్జవమ్‌ 1
శ్రీ భగవానుడు పలికెను - నిర్భయత్వము, అంతఃకరణశుద్ధి, తత్త్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగము నందు నిరంతర దృఢస్థితి, సాత్వికదానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని, దేవతను, గురుజనును పూజించుట, అట్లే అగ్నిహోత్రాది - ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రము పఠన, పాఠనము మరియు భగవంతుని నామగుణ కీర్తనము, స్వధర్మాచరణము నందలి కష్టముకు ఓర్చుకొనుట, శరీరేంద్రియాంతః కరణము సరళత్వము (ఆర్జవము) (1)
అహింసా సత్యమక్రోధఃత్యాగః శాంతిరపైశునమ్‌
దయాభూతేష్వలోుప్త్వం మార్దవంహ్రీరచాపమ్‌ 2
అహింస (మనోవాక్కాయము ద్వారా ఎవ్వరికిని ఏ విధముగను కష్టమును కల్గింపకుండుట), సత్యము (యధార్థమైన, ప్రియమైన భాషణము), అక్రోధము (తనకు అపకారము చేయువారిపైన కూడ కోపము లేకుండుట), త్యాగము (కర్మాచరణము నందు కర్త ృత్వాభిమానమును త్యజించుట), శాంతి (చిత్తచాంచ్యము లేకుండుట) ఆపైశునము (ఎవరినీ నిందింపకుండుట), దయ (అన్ని ప్రాణు యెడ నిర్హేతుక కృప), అలోుప్త్యము (ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట), మార్దవము (కోమత్వము), శాస్త్రవిరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట (సిగ్గుపడుట), అచాపము (వ్యర్థ చేష్టు చేయకుండుట). (2)
తేజఃక్షమా ధృతిఃశౌచమ్‌ అద్రోహోనాతిమానితా
భవంతి సంపదం దైవీమ్‌ అభిజాతస్యభారత 3
ఓ అర్జునా! తేజస్సు క్షమ, ధైర్యము, శౌచము (బాహ్యశుద్ధి) అద్రోహము (ఎవ్వరిపైనను శత్రుభావము లేకుండుట) అమానిత్వము (తాను పూజ్యడనను అభిమానము లేకుండుట) మొదగునవి యన్నియును దైవీసంపద గవాని క్షణము. (3)
దంభోదర్పో2భిమానశ్చక్రోధఃపారుష్యమేవ చ
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్‌ 4.
ఓ పార్థా! దంభము (కపటము), దర్పము (మొండితనము), అభిమానము, క్రోధము, పారుప్యము (మాట యందును, చేష్ట యందును కఠినత్వము), అజ్ఞానము మొదగునవి ఆసురీ స్వభావము గవాని క్షణము. (4)
దైవీసంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా
మా శుచః సంపదం దైవీమ్‌ అభిజాతో2సి పాండవ 5
ఓ అర్జునా! దైవీ సంపద ముక్తి దాయకము, ఆసురీ సంపద బంధ హేతువు. నీవు దైవీసంపదతో పుట్టినవాడవు. కనుక శోకింపకుము. (5)
దౌభూతసర్గౌె లోకే2 స్మిన్‌ దైవ ఆసుర ఏవ చ
దైవో విస్తరశఃప్రోక్తః ఆసురంపార్థమే శృణు 6
ఓ అర్జునా! ఈ లోకమున నున్న మానవు రెండు విధముగా ఉందురు. దైవ క్షణము గవారు కొందరు. ఆసుర క్షణము గవారు మరికొందరు. దైవ క్షణము విస్త ృతముగా త్పెబడినవి. ఇప్పుడు ఆసుర క్షణము గవారిని గూర్చి వివరముగా తెల్పెదను వినుము. (6)
ప్రవృత్తిం చ నివృత్తించ జనా న విదురాసురాః
నశౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే 7
ఆసుర స్వభావము గవారు ప్రవృత్తినివృత్తును (కర్తవ్యాకర్తవ్యమును) ఎరుగరు. కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వము గాని, శ్రేష్ఠమైన గాని, ప్రవర్తన గాని, సత్యభాషణము గాని ఉండనే ఉండవు. (7)
అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్‌
అపరస్పరసంభూతం కిమన్యత్‌ కామహైతుకమ్‌ 8
ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియును లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడనెడివాడు లేనేలేడనియు, కామప్రేరితులైన స్త్రీ పురుషు సంయోగ కారణముగ జీవు సహజముగనే పుట్టుచున్నారనియు, కావున స ృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు ఆసుర క్షణము గవారు భావింతురు.
ఏతాం దృష్టిమవష్టభ్యనష్టాత్మానో2్పబుద్ధయః
ప్రభవంత్యుగ్రకర్మాణఃక్షయాయ జగతో2హితాః 9
అసంబద్ధమైన ఇట్టి మిధ్యావాదము చేయు భౌతిక వాదు ఆత్మను గూర్చి తంపరు. (ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు) వారు మందబుద్ధు. వారు అందరికిని అపకారము చేయు క్రూయి. వారి శక్తి సామర్థ్యము ప్రపంచ వినాశమునకే వినియోగపడుచుండును. (9)
కామమాశ్రిత్యదుష్పూరం దంభమానమదాన్వితాః
మోహాద్గృహీత్వా2 సద్గ్రాహాన్‌ ప్రవర్తంతే2 శుచివ్రతాః 10
దంభము, దురభిమానము, మదముతో గూడిన ఈ ఆసుర క్షణము గవారు యుకాయుక్తమును మరచి, తమ వాంఛను ఏదో విధముగ తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞానకారణముగ మిథ్యా సిద్ధాంతమును ఆశ్రయింతురు. శాస్త్రవిరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. (10)
చింతామపరిమేయాంచప్రయాంతాముపాశ్రితాః
కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః 11
మరణించువరకును వారు అంతులేని చింతలోనే మునిగిపోవుచుందురు. విషయభోగానుభవము యందే తత్పరులై అదియే నిజమైన సుఖమని భావింతురు. (11)
ఆశాపాశశతైర్భద్దాఃకామక్రోధపరాయణాః
ఈ హంతేకామభోగార్థమ్‌ అన్యాయేనార్థ సంచయాన్‌ 12
వారు ఆశాపాశపరంపరచే ఎ్లప్పడును బంధింపబడుచుందురు. కామక్రోధ పరాయణులై ప్రవర్తింతురు. విషయ భోగము నిమిత్తమై, అన్యాయ మార్గము ద్వారా ధనార్థనకు ప్పాడుచుందురు. (12)
ఇదమద్యమయా బ్దమ్‌ ఇమం ప్రాప్స్యేమనోరథమ్‌
ఇదమస్తీదమపిమే భవిష్యతి పునర్ధనమ్‌ 13
‘‘నేను మిక్కిలి పురుషార్ధిని గనుక ఈ అభీష్ట వస్తువును పొందితిని. ఇంకను నా మనోరథమున్నింటిని సాధించుకొనగను. ఇప్పటికే నాకడ ఎంతో ధనము ఉన్నది. మన్ముందు ఇంకను ఎంతో ధనమును సంపాదింపగను’’ అని వారు తంచు చుందురు. (13)
అసౌమయా హతః శత్రుఃహనిష్యే చాపరానపి
ఈశ్వరో2హమహంభోగీసిద్ధోహంబవాన్‌ సుఖీ 14
నేను ఈ శత్రువును వధించితిని. ఇతర శత్రువును కూడ వధింపగను. నేనే సర్వాధిపతిని, సమస్తసుఖభోగమును అనుభవింపగవాడను నేనే. సిద్దున్నియు నా గుప్పిటనే యున్నవి. నేనే గొప్ప బవంతుడను. (14)
ఆఢ్యో2భిజనవానస్మికో2న్యో2స్తి సదృశో మయా
యక్ష్యేదాస్యామి మోదిష్యఇత్యజ్ఞానవిమోహితాః 15
అనేక చిత్తవిభ్రాంతాః మోహజాసమావృతాః
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే2శుచౌ 16
‘‘నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గవాడను. నాతో సమానుడు మరియొకడు లేడు. నేను యజ్ఞమును చేయగను. దానము ఇయ్యగను. యథేచ్చముగా వినోదింపగను. - అనుచు అనేక విధముగా అజ్ఞాన మోహితులై చిత్త భ్రమణమునకు లోనై మోహజాము నందు చిక్కుకొని, ఆసుర క్షణము గవారు విషయ భోగము యందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకము యందు పడిపోవు చుందురు. (15-16)
ఆత్మసంభావితాః స్తబ్ధాధనమానమదాన్వితాః
యజంతే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్‌ 17
వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు, గర్వోన్మత్తులై, ధన దురహంకారముతో కన్ను మిన్ను గానక ప్రమత్తులై శాస్త్రవిరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞము నాచరించుదురు. (17)
అహంకారం బం దర్పం కామం క్రోధంచ సంశ్రితాః
మామాత్మపరదేహేషు ప్రద్విషంతో2భ్యసూయకాః 18
అహంకారము, బము, దర్పము, కామము, క్రోధముకు వశులై, ఇతరును నిందించుచు తమ శరీరము యందును ఇతరు శరీరము యందును, అంతర్యామిగా నున్న నన్ను ద్వేషించు చుందురు. (18)
తానహం ద్విషతః క్రూరాన్‌ సంసారేషునరాధమాన్‌
క్ష్షిపామ్యజస్రమశుభాన్‌ ఆసురీష్వేవ యోనిషు 19
అట్ల్లు ఇతరును ద్వేషించు పాపాత్మును, క్రూరులైన నరాధమును మాటిమాటికిని ఈ సంసారము నందు ఆసురీయోనులోనే నేను పడవేయు చుందును. (19)
ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని
మామప్రాప్యైవ కౌంతేయతతో యాంత్యధమాంగతిమ్‌ 20
ఓ అర్జునా! ఈ ఆసురీ ప్రకృతి గ మూఢు, నన్ను పొందకయే, ప్రతి జన్మ యందును ఆసురీయోనునే పొందుచు చివరకు అంతకంటెను హీనమైన గతిని పొందుదురు. అనగా ఘోరమైన నరకము యందు పడెదరు. (20)
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః
కామఃక్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్‌ 21
కామక్రోధ లోభము అను ఈ మూడును నరక ద్వారము. అవి ఆత్మ నాశమునకు కారణము. అనగా మనుజుని అధోగతి పాు చేయునవి. కనుక ఈ మూడిరటిని త్యజింపవలెను. (21)
ఏతైర్విముక్తఃకౌంతేయతమోద్వారైత్రిభిర్నరః
ఆచరత్యాత్మనఃశ్రేయఃతతో యాతి పరాం గతిమ్‌ 22
ఓ అర్జునా! ఈ మూడు నరకద్వారము నుండి బయటపడినవాడు శుభకర్మనే ఆచరించును. అందువన పరమగతిని పొందును. అనగా నన్నే పొందును. (22)
యఃశాస్త్రవిధిమత్సృజ్యవర్తతేకామకారతః
న స సిద్దిమవాప్నోతిన సుఖం న పరాం గతిమ్‌ 23
శాస్త్రవిధిని త్యజించి, యధేచ్చగా (విశృంఖముగా) ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాడు. వానికి ఇహ పరలోక సుఖము భింపవు. పరమగతియు ప్రాప్తింపదు. (23)
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ
జ్ఞాత్వాశాస్త్రవిధానోక్తం కర్మకర్తుమిహార్హసి 24
కర్తవ్యాకర్తవ్యమును నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్తోక్త కర్మను గూర్చి బాగుగా తెలిసికొని, అట్టి కర్మను ఆచరింపుము. (24)
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశో2ధ్యాయః 16

పురుషోత్తమ ప్రాప్తి యోగః

ఓం శ్రీ పరమాత్మనే నమః
అథ పంచదశో2ధ్యాయః
పురుషోత్తమ ప్రాప్తి యోగః
శ్రీ భగవాన్‌ ఉవాచ
ఊర్ధ్వమూమధశ్శాఖమ్‌ అశ్వత్థం ప్రాహురవ్యయమ్‌
ఛందాంసి యస్యపర్ణాని యస్తం వేదస వేదవిత్‌ 1
శ్రీ భగవానుడు ఇట్లు పలికెను - ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూముగా ముఖ్య శాఖగా (కాండముగా)  వేదములే పర్ణము (ఆకు)గా గ ఈ సంసార రూప అశ్వత్త వృక్షము నాశరహితమైనది (శాశ్వతమైనది). ఈ సంసార వృక్ష తత్త్వమును మూ సహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్ధమును ఎరిగినవాడు. (1)
అధశ్చోర్ద్వం ప్రసృతాస్తస్యశాఖా గుణప్రవృద్దా విషయ ప్రవాలాః
అధశ్చమూలాన్యనుసంతతానికర్మానుబంధీని మనుష్యలోకే 2
ఈ సంసార వృక్షమును త్రిగుణమునెడి జము తడుపుచుండును. ఈ జముచే వృద్దిపొందు శాఖలే దేవమనుష్య తిర్యగ్యోనులో జన్మించు ప్రాణు, చిగుళ్లే విషయ భోగము. ఈ శాఖు, చిగుళ్లు సర్వత్ర వ్యాపించి యున్నవి. మనుజును కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసననెడి వేర్లు, ఊడు అన్ని లోకములోను క్రింద, పైన వ్యాపించి ఉన్నవి. (2)
నరూపమస్యేహ తథోపభ్యతేనాంతో న చాదిర్నచసంప్రతిష్ఠా
అశ్వత్థ మేనం సువిరూఢమూమ్‌ అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా 3
ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా భ్యము గాదు. ఏనన ఇది ఆదియు, అంతము, సరిjైున స్థితియు లేనిది, కనుక అహంకార మమకార వాసనారూపములైన దృఢమైన వేర్లు, ఊడు గ ఈ సంసార రూప - అశ్వత్త వృక్షమును నిశితమైన వైరాగ్యమనెడి శస్త్రముతో ఖండిరచి.. (3)
తతఃపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్గతాననివర్తంతి భూయః
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతఃప్రవృత్తిః ప్రసృతా పురాణీ
4
అనంతరము ఆ పరమపద రూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగ అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన పురుషు ఈ జగత్తునకు తిరిగిరారు. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ పురాతన సంసార వ ృక్ష పరంపర విస్తరించి యున్నది. అట్టి ఆది పురుషుడైన నారాయణునే శరణు పొంది, ద ృఢనిశ్చయముతో ఆ పరమేశ్వరుని మనన, నిధి ధ్యాసాదు చేయవలెను. (4)
నిర్మానమోహాజితసంగదోషా అధ్యాత్మనిత్యావినివ ృత్తకామాః
ద్వంద్పైర్విముక్తాఃసుఖదుఃఖసంజ్ఞైగచ్ఛంత్యమూఢాఃపదమవ్యయంతత్‌
5
దురభిమానమును, మోహమును త్యజించినవారును, ఆసక్తియను దోషమును జయించిన వారును, ప్రాపంచిక వాంఛ నుండి పూర్తిగా మలినవారును, పరమాత్మ స్వరూపము సందు నిత్యస్థితులైన వారును, సుఖదుఃఖాదిద్వంద్వము నుండి విముక్తులైన వారును అగు జ్ఞాను శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు.(5)
న తద్భాసయతే సూర్యోన శశాంకోన పావకః
యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ 6
స్వయం ప్రకాశ రూపమైన నా పరంధామమును సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్నిగాని ప్రకాశింప జేయజారు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ము మర ఈ జగత్తున ప్రవేశింపరు. అనగా జన్మింపరు.
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః
మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థానికర్షతి 7
ప్రాణి లోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మనా అంశయే. అది ప్రకృతి యందు స్థితములైన మనస్సు ఇంద్రియమును శబ్దాది విషయము ద్వారా తనవైపు ఆకర్షించును. (7)
శరీరం యదవాప్నోతియచ్చాప్యుత్క్రామతీశ్వరః
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్‌ 8
వాయువు వాసనను ఒక చోటి నుండి మరియొక చోటికి తీసుకొని పోయినట్లుగా దేహాదుకు స్వామిjైున జీవాత్మ ఒక శరీరమును త్యజించునపుడు, మనస్సు ఇంద్రియమును గ్రహించి, వాటితో గూడ మరొక శరీరమును పొందును. అనగా దానిలో ప్రవేశించును. (8)
శ్రోత్రం చక్షుఃస్పర్శనం చ రసనం ఘ్రణమేవ చ
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే 9
ఈ జీవాత్మ త్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణము అనెడి పంచేంద్రియమును మనస్సును ఆశ్రయించి, శబ్దాది విషయమును అనుభవించును. (9)
ఉత్క్రామంతం స్థితం వాపిభుంజానం వా గుణాన్వితమ్‌
విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః 10
జీవాత్మ శరీరమును త్యజించునప్పుడును, శరీరము నుండి స్థితుడైయున్నప్పుడును, విషయ భోగమును అనుభవించుచున్నప్పుడును, అటులే త్రిగుణముతో కూడియున్నప్పుడును అజ్ఞాను తెలిసికొనలేరు. కేవము వివేకశీురైన జ్ఞానులే తమ జ్ఞాన నేత్రము వన స్వస్వరూపమును తెలిసికొన గ్లుదురు. (10)
యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్‌
యతంతో2ప్యకృతాత్యానోనైనం పశ్యంత్యచేతసః 11
అంతఃకరణ శుద్ధిగ యోగు తమ హృదయము యందున్న ఈ ఆత్మ తత్త్వమును ప్రయత్నశీురై తెలిసికొనగరు. కాని, అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞాను ఎంతగా ప్రయత్నించియు, ఈ ఆత్మను తెలిసికొనజారు. (11)
యదాదిత్యగతం తేజో జగద్భాసయతే 2ఖిమ్‌
యచ్చంద్రమసి యచ్చాగ్నౌె తత్తేజోవిద్ధి మామకమ్‌ 12
సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును, అటునే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును, నా తేజస్సేయని యెరుంగుము. (12)
గామా విశ్య చభూతాని ధారయామ్యహమోజసా !
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వారసాత్మకః 13
పృథ్వి యందు ప్రవేశించి, నేను నా శక్తి ద్వారా సక భూతమును ధరించి పోషించుచున్నాను. రసస్వరూపుడనై -అనగా అమృతమయుడైన చంద్రుడనై ఓషధుకు అనగా వనస్పతున్నింటికిని పుష్టిని చేకూర్చుచున్నాను. (13)
అహం వైశ్వానరో భూత్వాప్రాణినాందేహమాశ్రితః
ప్రాణాపానసమాయుక్తఃపచామ్యన్నం చతుర్విధమ్‌ 14
నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరాగ్నిరూపములో సర్వప్రాణు శరీరము యందుండి నాుగు విధములైన ఆహారమును జీర్ణము చేయుచుందును. (14)
(ఆహారము భక్ష్య భోజ్య చోష్య లేహ్యముగా నాుగు విధము. నమబడునవి భక్ష్యము (రొట్టె మొదగునవి) మ్రింగబడునవి భోజ్యము (పాు మొదగునవి), ప్చీబడునవి చోష్యము (ఆస్వాదింపబడునవి, చెఱకు మొదగునవి) నాకుచు తినదగినవి లేహ్యము (తేనె మొదగునవి)
సర్వస్య చాహం హృది సన్నివిష్టోమత్తః స్మృతిర్‌ జ్ఞానమపోహనం చ
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యోవేదాంతకృద్వేదవిదేవ చాహమ్‌ 15
సమస్త ప్రాణు హృదయములో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నా నుండియే స్మ ృతి, జ్ఞానము అపోహనము (సందేహమును తొగించుట) కుగుచున్నవి. వేదము ద్వారా తెలిసికొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను గూడ నేనే.(15)
ద్వావిమౌ పురుషౌ లోకేక్షరశాక్షర ఏవచ
క్షరః సర్వాణి భూతానికూటస్థో2క్షర ఉచ్యతే 16
ఈ జగత్తు నందు క్షరుడు (నశ్వరుడు), అక్షరుడు (వినాశరహితుడు) అని పురుషు రెండు విధముగా గరు. సకప్రాణు శరీరము నశ్వరము. జీవాత్మ నాశ రహితుడు. (16)
ఉత్తమఃపురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహ ృతః
యో లోకత్రయమావిశ్యభిభర్త్యవ్యయ ఈశ్వరః 17
పై ఇద్దరికంటెను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ అతడు ముల్లోకము యందును ప్రవేశించి అందరిని భరించి పోషించుచున్నాడు. (17)
యస్మాత్‌క్షరమతీతో2హమ్‌ అక్షరాదపిచోత్తమః
అతో2 స్మిలోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః 18
ఏనన, నశ్వరమగు జడవర్గము (క్షేత్రము) కంటెను నేను సర్వథా అతీతుడను. నాశరహితమైన జీవాత్మకంటెను ఉత్తముడను. కనుక ఈ జగత్తు నందును, వేదము యందును పురుషోత్తముడనని ప్రసిద్ధి కెక్కితిని (18)
యోమామేవమసమ్మూడో జానాతి పురుషోత్తమమ్‌
స సర్వవిద్భజతిమాం సర్వభావేన భారత 19
ఓ అర్జునా! జ్ఞానిjైునవాడు ఈ విధముగా నన్ను తత్త్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నేనిరంతరము పరమేశ్వరునిగా భజించును. (19)
ఇతిగుహ్యతమం శాస్త్రమ్‌ ఇదముక్తంమయానఘ
ఏతద్‌ బుద్ద్వాబుద్ధిమాన్స్యాత్‌ కృతకృత్యర్ధభారత 20
ఓ పుణ్యపురుషా! ఓ అర్జునా! అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్త్వమును తెలిసికొనిన మనుష్యుడు జ్ఞానిjైు క ృతార్థుడు కాగడు. (20)
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
పురుషోత్తమ యోగో నామ పంచదశో2ధ్యాయః 15

విశ్వరూప సందర్శన యోగ

ఓం శ్రీ పరమాత్మనే నమః
అథ ఏకాదశో2ధ్యాయః
విశ్వరూప సందర్శన యోగ
అర్జున ఉవాచ
మదనుగ్రహాయపరమం గుహ్యమధ్యాత్యసంజ్ఞతమ్‌
యత్త్వయోక్తం వచస్తేన మోహా2యం విగతో మమ 1
అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! నన్ను అనుగ్రహింపదచి పరమగోప్యమైన ఆధ్యాత్మిక విషయమును ఉపదేశించితివి. దాని వన నా అజ్ఞానము (మోహము) తొగిపోయినది. (1)
భవాప్యయౌహి భూతానాం శ్రుతౌ విస్తరతో మయా
త్వత్తః కమపత్రాక్షమాహాత్మ్యమపి చావ్యయమ్‌ 2
ఓ కమలాక్షా! ఓ కృష్ణా! సమస్త ప్రాణు ఉత్పత్తి ప్రళయమును గూర్చి సవిస్తరముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహిమను గూర్చియు వింటిని. (2)
ఏవమేతద్యథాత్థత్వమ్‌ ఆత్మానం పరమేశ్వర
ద్రష్టుమిచ్ఛామితే రూపమ్‌ ఐశ్వరం పురుషోత్తమ 3
ఓపరమేశ్వరా! నీవు చెప్పినదంతయు సత్యమే. అందు సందేహమునకు తావులేదు. కాని ఓ పురుషోత్తమా! జ్ఞాన, ఐశ్వర్య శక్తి బ, వీర్య తేజోమహితమైన నీ షడ్గుణైౖశ్వర్య సంపన్నరూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహ పడుచున్నాను. (3)
మన్యసే యదితచక్యం మయాద్రష్టుమితి ప్రభో
యోగేశ్వరతతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్‌ 4
ఓ యోగేశ్వరా! ఓ ప్రభూ! నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును నాకు చూపింపుము. (4)
తతః స విస్మయావిష్టోహృష్టరోమా ధనంజయః
ప్రణమ్య శిరసాదేవం కృతాంజలిరభాషత 14
అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును జూచి, అర్జునుడు ఆశ్చర్యచకితుడై పుకితగాత్రుడయ్యెను. తేజోమయమైన ఈ విశ్వ (విరాట్‌) రూపమునకు భక్తిశ్రద్ధతో సాష్టాంగ ప్రణామము ఆచరించెను. తదనంతరము చేతు జోడిరచి యిట్లు పలికెను.(14)
అర్జున ఉవాచ
పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూతవిశేష సంఘాన్‌
బ్రహ్మాణమీశం కమలాసనస్థమ్‌ ఋషీంశ్చసర్వానురగాంశ్చ దివ్యాన్‌
15
అర్జునుడు పలికెను - ఓ దేవాదిదేవా! నీ విరాట్‌ రూపమునందు సక దేవతను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషును, దివ్య సర్పమును చూచుచున్నాను. (15)
అనేక బాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో2నంతరూపమ్‌
నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప
16
ఓ విశ్వేశ్వరా విశ్వరూపా! నీ బాహువు, ఉదరము, ముఖము, నేత్రము అసంఖ్యాకము. నీ అనంతరూపము సర్వతోముఖముగ విస్లిచున్నది. నీవు ఆది మధ్యాంత రహితుడవు. మహత్త్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతమును తెలిసికొనలేకున్నాను. (16)
కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్‌
పశ్యామిత్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్‌ దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్‌
17
హే విష్ణో! కిరీటమును, గదను, చక్రమును ధరించి, అంతటను తేజఃపుంజమును విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్నివలెను, జ్యోతిర్మయుడైన సూర్యని వలెను మెగొందుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్ష్యమై యున్నది. (17)
త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్యవిశ్వస్యపరం నిధానమ్‌
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తాసనాతనస్త్వం పురుషో మతో మే 18
పరమ - అక్షర స్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే. కనుక అందరికిని తెలిసికొనదగినవాడవు. ఈ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు. సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు. సనాతన పురుషుడవు అని నా విశ్వాసము. (18)
అనాదిమధ్యాంతమనంతవీర్యమ్‌ అనంతబాహుం శశిసూర్యనేత్రమ్‌
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతమ్‌
19
నీవు ఆది మధ్యాంతరహితుడవు. అపరిమిత శక్తిశాలివి. అసంఖ్యాకములైన భుజము గవాడవు. సూర్యచంద్రు నీ నేత్రము. అగ్ని వలె నీ ముఖము ప్రజ్వర్లిుచున్నది. నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్త మొనర్చు చున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను. (19)
ద్యావాపృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వjైుకేన దిశశ్చసర్వాః
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదంలోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్‌ 20
ఓ మహాత్మా!  దివి నుండి భువి వరకు గ అంతరిక్షము నందంతటను అన్ని దిశను నీవే పరిపూర్ణుడవై యున్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకమును గడగడ లాడుచున్నవి. (20)
అమీ హిత్వాంసురసంఘూ విశంతి కేచిద్భీతాఃప్రాంజయో గృణంతి
స్వస్తీత్యుక్త్వామహర్షిసిద్ధసంఘాఃస్తువంతిత్వాంస్తుతిభిఃపుష్కలాభి: 21
ఇదిగో, ఆ దేవతల్లెరును నీలో ప్రవేశించు చున్నారు. కొందరు భయపడినవారై అంజలి ఘటించి, నీ నామ గుణమును కీర్తించుచున్నారు. మహర్షును, సిద్ధును స్వస్తి వచనముతోడను, ఉత్తమోత్తమ స్తోత్రము తోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు. (21)
రుద్రాదిత్యావసవో యే చసాధ్యావిశ్వే2శ్వినౌ మరుతశ్చోషపాశ్చ
గంధర్వ యక్షాసురసిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే 22
ఏకాదశ రుద్రును, ద్వాదశాదిత్యును, అష్టవసువును, సాధ్యును, విశ్వే దేవతును, అశ్వినీ కుమాయిను, మరుద్గణమును, పితయిను అట్లే గంధర్వ యక్షాసుర సిద్ధ సముదాయమును సంభ్రమాశ్చర్యముతో నిన్నే దర్శించుచున్నారు. (22)
రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదమ్‌
బహూదరం బహుదంప్త్రాకరాళం దృష్ట్వాలోకాఃప్రవ్యధితాస్త్రథాహమ్‌ 23
హే మహాబాహో! అసంఖ్యాకములైన వక్త్రమును, నేత్రమును, చేతును, ఊరువు (తొడ)ను, పాదమును, ఉదరమును, కోరను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి, అందరును భయకంపితుగు చున్నారు. నేను కూడా భయముతో వణికిపోవుచున్నాను. (23)
నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననందీప్త విశానేత్రమ్‌
ధృష్ట్వా హిత్వాం ప్రవ్యధితాంతరాత్మాధృతిం న విందామి
శమం చవిష్ణో 24
ఏనన హే విష్ణో! నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణముతో దేదీప్యమానమై మెగుచున్నది. కాంతును విరజిమ్ముచున్న విశా నేత్రముతో, విస్తరించిన ముఖముతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువన నా ధైర్యము సడలినది. శాంతి దూరమైనది. (24)
దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవకాలానసన్నిభాని
దిశోన జానే నభేచ శర్మప్రసీద దేవేశ జగన్నివాస 25
ఓ జగన్నివాసా! కరాళ దంష్ట్రతో (భయంకరములైన కోరతో) ఒప్పుచున్న నీ ముఖము ప్రళయాగ్నిజ్వాలవలె భీతి గ్పొుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కుతోచకున్నది. నెమ్మది (శాంతి) శూన్యమైనది. ఓ దేవేశా! ప్రసన్నుడవు కమ్మ (25)
అమీచత్వాంధృతరాష్ట్రస్యపుత్రాః సర్వే సహైవావనిపాసంఘైః
భీష్మోద్రోణఃసూతపుత్రస్తధాసా సహాస్మదీjైురపియోధముఖ్యైః 26
వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని
కేచిద్విగ్నాదశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః 27
ఇదిగో (ఇచ్చట చేరియన్న ఈ ధ ృతరాష్ట్ర పుత్రు (దుర్యోధనాదు) ఇతర రాజన్యుతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మపితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షము నందలి ప్రధాన యోధు అందరును భయంకరములైన కోరతో గూడిన నీ ముఖము యందు అతి వేగముగా పరుగు దీయుచు ప్రవేశించుచున్నారు. కొందటి తలు కోర మధ్యబడి నుగ్గునుగ్గై పోవుచుండగా వారు దంతములో చిక్కుకొని వ్రేలాడుచున్నారు. (26-27)
యథా నదీనాం బహవో2ంబువేగాఃసముద్రమేవాభిముఖా ద్రవంతి
తధాతవామీనరలోకవీరాఃవిశంతి వక్త్రాణ్యభివిజ్వంతి 28
అనేకములైన నదీనదము ప్రవాహమున్నియును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు, ఈ శ్రేష్టులైన సమరయోధు (నరలోకవీయి) కూడా జ్వలించుచున్న నీ ముఖము యందు ప్రవేశించుచున్నారు. (28)
యథాప్రదీప్తం జ్వనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగాః
తథైవనాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్దవేగాః 29
మిడుతన్నియును మోహవశమున బాగుగా మండుచున్న అగ్ని వైపు అతి వేగముగా పరుగెత్తి, తమ నాశనము కొరకు అందు ప్రవేశించి, నశించునట్లు ఈ వీరుందును తమ నాశమునకై అతివేగముగా పరుగెత్తి, నీ వక్త్రము యందు ప్రవేశించుచున్నారు, (29)
లేవిహ్యసేగ్రసమానఃసమంతాత్లోకాన్‌ సమగ్రాన్‌ వదనైర్జ్వద్భిః
తేజో2భిరాపూర్యజగత్‌ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో 30
హే విష్ణో! ప్రజ్వలించుచున్న నీ ముఖముతో సమస్త లోకమును అన్నివైపు నుండి కబళించుచు మాటిమాటికిని చప్పరించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి. (30)
ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమో2స్తుతే దేవవరప్రసీద
విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి
తవ ప్రవృత్తిమ్‌ 31
ఓ పరమాత్మా! నీకు నా నమస్కారము. ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తొపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసికొన గోరుచున్నాను. ఏనన నీ ప్రవృత్తిని ఎరుగలేకున్నాను. (31)
శ్రీ భగవాన్‌ ఉవాచ
కాలో2స్మిలోకక్షయకృత్‌ ప్రవృద్ధో లోకాన్‌ సమాహర్తుమిహప్రవృత్తః
ఋతే2పిత్వాంన భవిష్యంతి సర్వే యే2వస్థితాః ప్రత్యనీకేషుయోధాః
32
శ్రీ భగవానుడు పలికెను - నేను లోకము నన్నింటిని తుదముట్టించుటకై విజృంభించిన మహాకాుడను. ఇప్పుడు ఈ లోకమును రూపుమాపుటకై పూనుకొని యున్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్ననూ ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరును మిగురు. (మిగిలియుండరు) (32)
తస్మాత్త్వముత్తిష్ఠ యశో భస్వజిత్వాశత్రూన్‌ భుంక్ష్యరాజ్యం సమృద్ధమ్‌
మjైువైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్‌ 33
కనుక ఓ సవ్యసాచీ! లెమ్ము. కీర్తి గాంచుము. శత్రువును జయించి సర్వ సంపదతో తుతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందరును నా చేత మునుపే హతులైనవారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము. (33)
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తధాన్యనపి యోధవీరాన్‌
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్టా?
యుధ్యస్వజేతాసి రణేసపత్నాన్‌ 34
ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రధ (సైంధవ) కర్ణాది యుద్ధ వీరుందరిని నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువును తప్పక జయింపగవు. కనుక యుద్ధము చేయుము.
సంజయ ఉవాచ
ఏతచ్ఛ్రుత్వావచనం కేశవస్యకృతాంజలిర్వేపమానఃకిరీటీ
నమస్క ృత్వాభూయ ఏవాహ కృష్ణం సగద్దదం
భీతభీతః ప్రణమ్య 35
సంజయుడు పలికెను - ఓ రాజా! శ్రీకృష్ణపరమాత్మ యొక్క ఈ మాటను విని, అర్జునుడు వణకుచు, చేతు జోడిరచి నమస్కరించును. మర మిక్కిలి భయముతో ప్రణమిల్లి, గద్గద స్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. (35)
అర్జున ఉవాచ
స్థానే హృషీకేశతవ ప్రకీర్త్యాజగత్ప్రహ్యష్యత్యనురజ్యతే చ
రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వేనమస్యంతి చ సిద్ధ సంఘాః
36
అర్జునుడు పలికెను - ఓ అంతర్యామీ! కేశవా! నీ నామ గుణ ప్రభావమును కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో, అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసు నుదిక్కుకును పారిపోవుచున్నారు. సిద్ధ గణము వార్లెరును ప్రణమ్లిుచున్నారు. (36)
కస్మాచ్చ తేననమేరన్మహాతన్గరీయసే బ్రహ్మదో2ప్యాదికర్త్రే
అనంతదేవేశ జగన్నివాసత్వమక్షరం సదసత్‌ తత్పరం యత్‌ 37
ఓ మహాత్మా! నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్టికర్తjైున బ్రహ్మకే మూకారకుడవు - కనుక వారు (సిద్ధాదుందరును) నీకు నమస్కరింపక ఎట్లుండగరు? ఓ అనంతా! ఓ దేవేశా! ఓ జగన్నివాసా! సత్‌-అసత్‌ు నీవే. వాటికంటెను పరమైన అక్షర స్వరూపుడవు అనగా సచ్చిదానంద ఘనపరబ్రహ్మవు నీవే. (37)
త్వమాదిదేవఃపురుషఃపురాణః త్వమస్య విశ్వస్వపరం నిధానమ్‌
వేత్తాసి వేద్యంచ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప
38
ఓ అనంతరూపా! నీవు ఆది దేవుడవు, సనాతన పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు. సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమై యున్నది. (38)
వాయుర్యమో2గ్నిర్వరుణ శ్వశాంకఃప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ
నమో నమస్తే2స్తుసహస్రకృత్వఃపునశ్చభూయో2పినమోనమస్తే 39
నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతిjైున బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకు వే కొది నమస్కారము. మర మర నమస్కారము. ఇంకను నమస్కారము. (39)
నమఃపురస్తాదథ పృష్ఠతస్తే నమో2స్తుతే సర్వత ఏవ సర్వ
అనంతవీర్యామితవిక్రమస్త్వం సర్వం సమాప్నోషితతో2సిసర్వః 40
అనంత సామర్థ్యము గవాడా! నీకు ఎదురుగా ఉండియు, వెనుకనుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మా! నీకు అన్నివైపు నుండియు నమస్కారము. ఏనన అనంత పరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించి యున్నవాడవు. అన్ని రూపమును నీవియే. (40)
సఖేతి మత్వాప్రసభం యదుక్తం హే కృష్ణ! హే యాదవ హేసఖేతి
అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్‌ ప్రణయేన వాపి
41
యచ్ఛాపహాసార్థమసత్క ృతో2సి విహార శయ్యాసన భోజనేషు
ఏకో2థవాప్యచ్యుత తత్సమక్షం తత్‌క్షామయే త్వామహమప్రమేయమ్‌
42
నీ మహిమను ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి, చనువుచే గాని, పొరపాటు వన గాని, ఓ క ృష్ణా! ఓ యాదవా! ఓ మిత్రా! అనుచు తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుతా విహార శయ్యాసన భోజనాది సమయము యందును ఏకాంతమున గాని, అన్య సఖు సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి, నేను నిన్ను కించపరచి యుండవచ్చును. ఓ అప్రమేయ స్వరూపా! నా అపరాధము నన్నింటిని క్షమింపుమనివేడుకొనుచున్నాను. (41-42)
యదా సత్త్వే ప్రవృద్దేతు ప్రయం యాతి దేహభ ృత్‌
తదోత్తమవిదాం లోకాన్‌ అమలాన్‌ ప్రతిపద్యతే 14
సత్త్వగుణము వ ృద్ధి చెందినపుడు మనుజుడు మరణించినచో, అతడు ఉత్తమ కర్మను ఆచరించువారు చేరెడి నిర్మములైన స్వర్గాది దివ్యలోకమును పొండును. (14)
రజసిప్రయంగత్వాకర్మసంగీషు జాయతే
తథా ప్రలీనస్తమసిమూఢయోనిషు జాయతే 15
రజోగుణము వృద్ధి చెందినపుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పడు మ ృతి చెందిన మానవుడు పశు పక్షి కీటకాది నీచయోనులో జన్మించు చుండును. (15)
కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మం ఫమ్‌
రజసస్తుఫం దుఃఖమ్‌ అజ్ఞానం తమసః ఫమ్‌ 16
శ్రేష్ఠములైన కర్మను ఆచరించుట వన సాత్త్విక ఫము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదగు నిర్మ ఫము కుగును. రాజస కర్మకు ఫము దుఃఖము. తామసకర్మకు ఫము అజ్ఞానము. (16)
సత్త్వాత్‌ సంజాయతేజ్ఞానం రజసో లోభఏవచ
ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ 17
సత్త్వగుణము వన జ్ఞానమూ, రజోగుణము వన లోభమూ తమో గుణము వన ప్రమాద మోహాదుూ, అజ్ఞానము తప్పక ఉత్పన్నముగుచుండును. (17)
ఊర్ధ్వం గఛ్ఛంతి సత్త్వస్థామధ్యేతిష్ఠంతి రాజసాః
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః 18
సత్త్వ గుణస్థితు స్వర్గాది - ఊర్ధ్వలోకముకు పోవుదురు. రజోగుణస్థితులైన (రాజస) పురుషు మధ్య (మానవ) లోకము నందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాస్యాదు యందు స్థితులైనవారు అధోగతిని అనగా కీట, పశుపక్ష్యాది యోనును, నరకమును పొందుదురు. (18)
నాన్యం గుణేభ్యః కర్తారం యదాద్రష్టానుపశ్యతి
గుణేభ్యశ్చపరం వేత్తి మద్భావం సో2ధిగచ్ఛతి 19
ద్రష్టమైనవాడు గుణములే గుణము యందు వర్తించుచున్నవనియూ, త్రిగుణము తప్ప వేరుగా కర్తు లేరనియూ తెలిసికొని, త్రిగుణముకు అతీతముగా నున్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడనైన నా తత్త్వమును తెలిసికొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందును (19)
గుణానేతానతీత్యత్రీన్‌ దేహీ దేహసముద్దవాన్‌
జన్మమృత్యుజరాదుఃఖైకి విముక్తో2మృతమశ్ముతే 20
దేహోత్పత్తికి కారణరూపులైన ఈ మూడు గుణమును అధిగమించిన పురుషుడు జన్మ, మృత్యు, జరా (వార్థక్య), దుఃఖమునుండి విముక్తుడై పరమానందమును పొందును. (20)
అర్జున ఉవాచ
కైర్లింగైః త్రీన్‌ గుణానేతాన్‌ అతీతో భవతి ప్రభో
కిమాచారః కథం చైతాన్‌ త్రీన్‌ గుణానతివర్తతే 21
అర్జునుడు పలికెను - ఓ ప్రభూ! ఈ మూడు గుణముకును అతీతుడైనవాని క్షణములెవ్వి? అతని లోక వ్యవహార రీతి యెట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి? (21)
శ్రీ భగవాన్‌ ఉవాచ
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవచ పాండవ
న ద్వేష్టి సంప్రవృత్తాని న నిపృత్తాని కాంక్షతి 22
శ్రీ భగవానుడు పలికెను ` ఓ పాండవా ! సత్త్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణకార్య రూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము, తమంతట తామే అర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు ` అనగా వాటిని గోర్చి విచారపడడు. అట్లే అవి తొగిపోయినప్పడు వాటికై కాంక్షపడడు - అనగా ఎ్లప్పుడును ఒకే స్థితిలో నుండును. (22)
ఉదాసీనవదాసీనో గుణైౖర్యో న విచ్యాతే
గుణావర్తంత ఇత్యేవ యో2 వతిష్ఠతినేంగతే 23
త్రిగుణముకును, వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారముకును ఏ మాత్రము చలింపక, త్రిగుణాతీతుడు, ఉదాసీనుని వలె (సాక్షి వలె) ఉండును. గుణములే గుణము యందు ప్రవర్తించుచున్నవని తంచును. అతడు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావస్థితుడై యుండును. ఈ స్థితి ఎన్నడును చలింపడు. (23)
సమదుఃఖసుఖఃస్వస్థః సమలోష్టాశ్మకాంచనః
త్యుప్రియాప్రియోధీరఃత్యునిదాత్మసంస్తుతిః 24
త్రిగుణాతీతుడు స్సస్వరూపమునందే నిరంతరము స్థితుడైయుండును. సుఖదుఃఖమును సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారముయందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడిరటియందును గ్రాహ్యత్యాజ్యభావమును కలిగియుండును. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియముకు గాని, నిందాస్తుకు గాని తొణకడు. అనగా రెండిరటియందును సమస్థితిలోనే యుండును.
(24)
మానావమానయోస్త్యుఃతుల్యోమిత్రారిపక్షయో
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః ఉచ్యతే 25
మానావమానముయందును, మిత్రుయందును, శత్రువు యందును సమభావముతో ప్రవర్తించు వాడును, విధ్యుక్త కర్మను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతుడనబడును. (25)
మాం చయో2వ్యభిచారేణ భక్తియోగేనసేవతే
స గుణాన్‌ సమతీత్యైతాన్‌ బ్రహ్మభూయాయక్పతే 26
అనన్య (నిర్మమైన) భక్తి యోగము ధ్వారా నన్నే నిరంతరము భజించువాడును, ఈ మూడు గుణముకును పూర్తిగా అతీతుడైనవాడును అగు పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. (26)
బ్రహ్మణోహి ప్రతిష్ఠాహమ్‌ అమృతస్యావ్యయస్య చ
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ 27
ఏనన అట్టి శాశ్వత పరబ్రహ్మకును, అమృతత్వమునకును, సనాతన ధర్మమునకును, అఖండానందమునకును నేనే ఆధారము. (27)
ఓం తత్సదితి శ్రీమద్బగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
గుణత్రయవిభాగ యోగో నామ చతుర్దశో2ధ్యాయః 14

విభూతి యోగః

ఓం పరమాత్మనే నమః !
అథ దశమో2ధ్యాయః
విభూతి యోగః
శ్రీ భగవాన్‌ ఉవాచ
భూయ ఏవ మహాబాహో శ ృణు మే పరమం వచః
యత్తే2హంప్రేయమాణాయ వక్ష్యామి హితకామ్యయా 1
శ్రీ భగవానుడు పలికెను - హే! మహాబాహో! నీవు నా మీద ప్రేమ గవాడవు.కావున నీ మేు గోరి నేను మర చెప్పుచున్న వచనమును వినుము. అవి మిక్కిలి గోప్యము, మహిమాన్వితు, (1)
నమే విదుః సురగణాః ప్రభవంన మహరయః
అహమాదిర్షిదేవానాం మహరీణాం చ సర్వశః 2
నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషమును దేవతు గాని, మహర్షు గాని తెలిసికొనజారు. ఏనన, నేను అన్ని విధముగా ఆ దేవతకును, ఈ మహర్షుకును మూకారణమైన వాడను. (2)
యో మామజమనాదించవేత్తిలోకమహేశ్వరమ్‌
అసమూఢఃసమర్యేషు సర్వపాపై ప్రముచ్యతే 3
నన్ను యథార్థముగా జన్మరహితునిగను, అనాదిjైున వానినిగను సక లోక్ష మహేశ్వరునిగను తెలిసికొనువాడు మానవులో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపము నుండియు విముక్తుడగును. (3)
బుద్ధిర్‌ జ్ఞానసమ్మోహః క్షమా సత్యం దమః శమః
సుఖం దుఃఖం భవో2భావో భయం చా భయమేవచ 4
అహింసా సమతా తుష్టిః తపోదానం యశో2యశః
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః 5
నిశ్చయాత్మకశక్తి, యధార్థ జ్ఞానము, మోహ రాహిత్యము, క్షమ, సత్యము, దమము (ఇంద్రియ నిగ్రహము), శమము (మనోనిగ్రహము), సుఖ దుఃఖము, ఉత్పత్తి ప్రళయము, భయము, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణు వివిధ భావము, ఇవి యన్నియును నా వననే కుగును. (4-5)
మహర్షయః సప్తపూర్వే చత్వారోమనవస్తథా
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః 6
సప్త మహర్షును, వారి కంటెను పూర్వులైన సనకాది మహామును నుగురును, స్వాయంభువాది చతుర్ధశ మనువును మొదగు వీరందను నా భక్తులే. అందరూ నా యెడ సద్భావము గవారే. వీరు నా సంక్పము వననే జన్మించిరి. ఈ జగత్తు నందలి సమస్త ప్రాణును వీరి సంతానమే. (6)
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః
సో2వికంపేన యోగేన యుజ్యతేనాత్ర సంశయః 7
ఈ నాపరమైశ్వర్యరూప విభూతిని,యోగశక్తి యొక్క తత్త్వమును తెలిసికొన్నవాడు నిశ్చ భక్తి యుక్తుడగును. ఇందు ఏ మాత్రమూ సందేహమే లేదు (7)
అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే
ఇతి మత్వాభజంతే మాం బుధా భావసమన్వితాః 8
ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడనైన నేనే మూకారణము. నా వననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తు భక్తిశ్రద్ధతో నిరంతరము నన్నే సేవింతురు. (8)
మచిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్‌
కథయంతశ్చమాం నిత్యం తుష్యంతి చరమంతి చ 9
నా భక్తు నాయందే తమ మనస్సును గ్నమొనర్తురు. తమ ప్రాణమును, తమ కర్మన్నింటిని, తమ సర్వస్వమును నాకే అంకితమొనర్తురు. వారు పరస్పర చర్చ ద్వారా నా మహత్త్వమును గూర్చి ఒకరికొకరు తొపుకొనుచు, కథు కథుగా చెప్పుకొనుచు, నిరంతరము సంతుష్టుగుచుందురు. మరియు వారు సంతతము నా యందే రమించు చుందురు. (9)
తేషాం సతత యుక్తానాం భజతాంప్రీతిపూర్వకమ్‌
దదామి బుద్దియోగంతం యేనమాముపయాంతితే 10
అట్లు నిరంతరము ధ్యానాదు ద్వారా నా యందే గ్నమనస్కులై భక్తి శ్రద్ధతో నన్నేభజించువారికి నేను బుద్ధి యోగమును అనగా తత్త్వజ్ఞాన రూప యోగమును ప్రసాదించెదను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు. (10)
తేషామేవాను కం పార్ధమ్‌ అహమజ్ఞానజం తమః
నాశయామ్యాత్మ భావస్థోజ్ఞానదీపేన భాస్వతా 11
ఓ అర్జునా! వారి యంతఃకరణము యందు స్థితుడనైయున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్త్వజ్ఞాన రూప దీపమును (జ్యోతిని) వెలిగించి, వారి అజ్ఞానాంధకారమును పారద్రోలెదను. (11)
అర్జున ఉవాచ:
పరంబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్‌
పరుషం శాశ్వతం దివ్యమ్‌ ఆదిదేవమజం విభుమ్‌ 12
ఆహుస్త్వామ్‌ ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే 13
అర్జునుడు పలికెను - నీవు పరబ్రహ్మవు. పరంధాముడవు. పరమ పవిత్రుడవు. మహర్షు నిన్ను సనాతనుడవనియు, దివ్య పురుషుడవనియు, దేవదేవుడవనియు, జన్మరహితుడవనియు, సర్వవ్యాపివనియు ప్రస్తుతింతురు. దేవర్షి నారదుడు, అసితుడు, దేమడు, వ్యాసమహర్షియు, స్తుతింతురు. నీవును నాకు ఆ విధముగనే తొపు చున్నావు. (12-13)
సర్వమేత ధృతం మన్యే యన్మాం వదసికేశవ
నహితే భగవన్‌ వ్యక్తిం విదుర్దేవా న దానవాః 14
ఓ కేశవా! నీవు చెప్పనది అంతయును సత్యమే. హే భగవాన్‌! నీ లీలా మయ స్వరూపమును దేవతు గాని, దానవు గాని తెలిసికొనజారు. (14)
స్వయమేవాత్మనాత్మానంవేత్తత్వం పురుషోత్తమ
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే 15
ఓ జగదుత్పత్తికారకా! ఓ సర్వభూతేశా! ఓ దేవాదిదేవా! ఓ జగనాథా! ఓ పురుషోత్తమా! నీ తత్త్వమును నీవే స్వయముగా ఎరుగుదువు (15)
వక్తుమర్హస్యశేషేణ దివ్యాహ్యాత విభూతయః
యాభిర్విభూతిభిర్లోకాన్‌ ఇమాంస్త్వం వ్యాప్తతిష్ఠసి 16
సమస్త లోకము యందును నీ దివ్య విభూతు ద్వారా వ్యాపించి, స్థితుడవై యున్నావు. మహామహితములైన ఆ దివ్య విభూతును సంపూర్ణముగా త్పొటకు నీవే సమర్థుడవు (16)
కథం విద్యామహం యోగిన్త్వాంసదా పరిచింతయన్‌
కేషుకేషు చ భావేషు చింత్యో2సి భగవన్మయా 17
ఓ యోగీశ్వరా! నిరంతరము చింతన చేయుచూ నిన్ను ఏవిధముగా తెలిసి
కొనగను? హే భగవన్‌ ఏయే భావముతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు? నిన్ను నేను ఎట్లు చింతన చేయవలెను? (17)
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన
భూయః కథయ తృప్తిర్హిశృణ్వతో నాస్తిమే2మృతమ్‌ 18
ఓ జనార్దనా! నీ యోగశక్తిని గూర్చియూ, నీ విభూతి వైభవమును గురించియు విస్తృతముగా ఇంకను తొపుము. ఏనన, నీ అమృత మయ వచనమును ఎంతగా విన్నను తనివియే తీరదు. (18)
శ్రీ భగవాన్‌ ఉవాచ:
హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మవిభూతయః
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠనాస్త్యంతో విస్తరస్యమే 19
శ్రీ భగవానుడు పలికెను - ఓ అర్జునా! నీవు లెస్సగా పలికితివి. నా దివ్య విభూతు విస్తృతికి (వ్యాప్తికి) అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు తొపుచున్నాను. (19)
అహమాత్మగుడాకేశ సర్వభూతాశయస్థితః
అహమాదిశ్చ మధ్యం చభూతానామంత ఏవ చ 20
ఓ అర్జునా! సమస్త ప్రాణు హృదయము యందున్న ఆత్మను నేనే. సక భూతము (ప్రాణు) ఆదియు, మధ్యస్థితియు అంతము నేనే. (ప్రాణు యొక్క సృష్టిస్థితియముకు కారణము నేనే) (20)
ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్‌
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ 21
అదితియొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యులో విషు?వును నేను. జ్యోతిర్మయ స్వరూపులో నేను సూర్యుడను. 49 మంది వాయుదేవతలోని ‘తేజమును నేను. నక్షత్రాధిపతిjైున చంద్రుడను నేను, (21)
వేదానాం సామవేదో2స్మిదేవానామస్కివాసవః
ఇంద్రియాణాం మనశ్చాస్మిభూతానామస్మిచేతనా 22
వేదములో నేను సామవేదమును. దేవతలో ఇంద్రుడను నేనే. ఇంద్రియములో నేను మనస్సును. ప్రాణులో చైతన్యమును (ప్రాణశక్తిని) నేను. (22)
రుద్రాణాం శంకరశాస్మివిత్తేశో యక్షరక్షసామ్‌
వసూనాం పావకశ్చాస్మిమేరుః శిఖరిణామహమ్‌   23
ఏకాదశ రుద్రులో శంకరుడను నేను. యక్షరాక్షసులో ధనాధిపతిjైున కుబేరుడను నేను. అష్టవసువులో అగ్నిని నేను. పర్వతములో సుమేరు పర్వతమును నేను. (23)
పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్ధ బృహస్పతిమ్‌
సేనానీనామహం స్కందః సరసామస్మిసాగరః 24
పార్ధా! పురోహితులో ముఖ్యుడైన బృహస్పతిని నేనే. సేనాపతులో కుమారస్వామిని నేను. జలాశయములో నేను సాగరుడను. (24)
మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్‌
యజ్ఞానాం జపయజ్ఞో2స్మిస్థావరాణాం హిమాయః 25
మహర్షులో భృగువును నేను. శబ్దములో ఏకాక్షరమును అనగా ఓంకారమును యజ్ఞము యందు జపయజ్ఞమును నేను. స్థావరములో హిమాయమును నేను. (25)
అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః
గంధర్వాణాం చిత్రరథః సిద్దానాం కపిలో మునిః 26
వృక్షములో నేను అశ్వత్థమును (రావిచెట్టును) దేవర్షులో నారదుడను నేను. గంధర్వులో నేను చిత్రరథుడను. సిద్ధులో నేను కపిమునిని. (26)
ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్‌
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్‌ 27
అశ్వములో పా సముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్చైఃశ్రవమును నేను. భద్రజగములో ఐరావతమును నేను. మనుష్యులో ప్రభువును నేను. (27)
128 -
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మికామధుక్‌
ప్రజనశ్చాస్మికందర్పఃసర్పాణామస్మివాసుకిః 28
ఆయుధములో వజ్రాయుధమును నేను. పాడి ఆవులో కామధేనువును నేను. శాస్త్ర విహితరీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మథుడను నేను. సర్పములో వాసుకిని నేను. (28)
అనంతశ్చాస్మినాగానాం వరుణో యాదసామహమ్‌
పితృణామర్యమా చాస్మియమఃసంయమతా మహమ్‌ 29
నాగజాతివారిలో ఆదిశేషుడ (అనంతుడ)ను నేను. జచరముకు అధిపతిjైున వరుణుడను నేను. పితరులో అర్యముడను (పితృగణప్రభువును) నేను శాసకుతో యమధర్మరాజును నేను. (29)
ప్రహ్లాదశ్చాస్మిదైత్యానాంకాఃకయతామహమ్‌
మృగాణాంచమృగేంద్రో2హం వైనతేయశ్చపక్షిణామ్‌ 30
దైత్యులో నేను ప్రహ్లాదుడను. గణించువారిలో (గణకులో) నేను కామును మృగములో మృగరాజు ఐన సింహమును నేను. పక్షులో పక్షిరాజైన గరుత్మంతుడను నేనే (30)
పవనఃపవతామస్మిరామః శస్త్రభృతామహమ్‌
రaషాణాం మకరశ్చాస్మిస్రోతసామస్మిజాహ్నవీ 31
పవిత్రమొనర్చు వానిలో వాయువును నేను. శస్త్రధారులో శ్రీరామచంద్రుడను నేను. మత్స్యములో మొసలిని నేను. నదులో గంగానదిని నేను. (31)
సర్గాణామాదిరంతశ్చమధ్యం చైవాహమర్జున
అధ్యాత్మవిద్యావిద్యానాం వాదఃప్రవదతామహమ్‌ 32
ఓ అర్జునా! సృష్టికి ఆదిమధ్యాంతము నేను. (సృష్టి స్థితి య కారకుడను నేనే) విద్యలో ఆధ్యాత్మ విద్యను అనగా బ్రహ్మ విద్యను నేను. పరస్పర వాద వివాదములో తత్త్వ నిర్ణయమునకై చేయు ‘వాదము’ను నేను. (32)
అక్షరాణామకారో2స్మిద్వంద్వఃసామాసికస్య చ
అహమేవాక్షయఃకాలోధాతాహం విశ్వతోముఖః 33
అక్షరములో ‘అ’కారమును నేను. సమాసములో ‘ద్వంద్వ’ సమాసమును నేను. అక్షయ కాము అనగా మహాకామును నేను. అట్లే విశ్వతోముఖుడైన విరాట్‌ పురుషుడను నేను. అందరిని ధరించువాడను, పోషించువాడను నేను.(88)
మృత్యుః సర్వహరశ్చాహమ్‌ ఉద్భవశ్చభవిష్యతామ్‌
కీర్తిః శ్రీర్వాక్ష నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా 34
అన్ని ప్రాణమును హరించు మృత్యువును నేనే. సమస్త ప్రాణు  ఉత్పత్తి హేతువనఅును కూడా నేనే. స్త్రీలో కీర్తి, శ్రీ, వాక్కు స్మృతి, మేధా, ధృతి, క్షమా అను వారందను నేనే. (34)
బృహత్పామతథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్‌
మాసానాం మార్గశీర్షో2హమ్‌ ఋతూనాం కుసుమాకరః 35
గానము చేయుటకు అనువైన శ్రుతులో బృహతామమును నేను. ఛందస్సులో గాయత్రీ ఛందస్సును నేను. మాసములో మార్గశీర్షమును, ఋతువులో వసంత ఋతువును నేనే (35)
ద్యూతం చయతామస్మితేజస్తేజస్వినామహమ్‌
జయో2స్మి వ్యవసాయో2స్మిసత్త్వం సత్త్వవతామహమ్‌ 36
వంచకులో జూదమును నేనే. ప్రభావశాురలోని ప్రభావమునునేను. విజేతలో జయమును నేను. నిశ్చయాత్మకులో నిశ్చయమును, సాత్త్విక పురుషులో సాత్త్విక భావమును నేనే. (36)
వృష్ణీనాం వాసుదేవో2స్మిపాండవానాం ధనంజయః
మునీనామప్యహం వ్యాసఃకవీనామశనా కవిః 37
వృష్టి వంశజులో వాసుదేవుడను నేను. పాండవులో ధనంజయుడను నేను. అనగా నీవే నేను. మునులో వేదవ్యాసుడనునేను. కవులో శుక్రాచార్యుడను నేనే.
దండోదమయతామస్మినీతిరసిజిగీషతామ్‌
మౌనం చైవాస్మిగుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్‌ 38
శిక్షించువారిలో దండమును అనగా దమనశక్తిని నేనే. జయేచ్చ కవారి నీతిని నేనే. గోప్య విషయరక్షణమున ‘మౌనము’ ను నేను. జ్ఞాను యొక్క తత్త్వజ్ఞానమును నేనే. (38)
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున
న తదస్తి వినాయత్స్యాత్మయా భూతం చరాచరమ్‌ 39
ఓ అర్జునా! సర్వప్రాణు ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఏనన నేను లేని చరాచరప్రాణి యేదియును లేదు. (39)
నాంతో2 స్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప
ఏషతూద్దేశతఃప్రోక్తోవిభూతేర్విస్తరోమయా 40
ఓ పరంతపా! నా దివ్య విభూతుకు అంతమే లేదు. నా విభూతు విస్త ృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించితిని. (40)
యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా
తత్తదేవావగచ్ఛత్వం మమతేజో2ంశసంభవమ్‌ 41
విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము ఐన వస్తువేదైనను నా తేజస్సు యొక్కఅంశము నుండియే కలిగినదిగా తెలిసికొనుము. (41)
అథవా బహునైతేన కిం జ్ఞాతేనతవార్డున
విష్టభ్యాహమిదం కృత్స్నమ్‌ ఏకాంశేన స్థితో జగత్‌ 42
అథవా! ఓ అర్జునా! ఇంతకంటెను విపుముగా తెలిసికొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తును కేవము నా యోగ శక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించుచున్నాను.
ఓం తత్పదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
విభూతి యోగో నామ దశమో2ధ్యాయః 10