మొత్తం పేజీ వీక్షణలు

23, జులై 2022, శనివారం

మస్తకం బెత్తగా జాల.. మా వదినను

    మస్తకం బెత్తగా జాల.. మా వదినను

    జానకమ్మను జూడగా జాల.. నెపుడు

    పాదముల మ్రొక్కెదను భక్తి భావ మూర..

    నవు.. నిదే సుమా! నూపురం.. బా రమణిదె!


నాహం జానామి కేయూరే  నాహం జానామి కుండలే

నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్..

     లక్ష్మణుని సచ్ఛీలాన్ని ఆవిష్కరించటంలో సుప్రసిద్ధమైన దీ శ్లోకం. (రామాయణము.. కిష్కింధా కాండము.. ఆరవ సర్గము 22) ఒక వదినపట్ల మరిది ఎలా ప్రవర్తించా లనే దానికి ఉదాహరణగా లక్ష్మణుని పేర్కొంటూ పై శ్లోకాన్ని చెబుతారు.

     సీతా రామ లక్ష్మణుల వనవాస కాలంలో రావణుడు సీత నపహరించినాడు. రామ లక్ష్మణులు క్రమంగా ఋష్యమూక పర్వతం చేరుకున్నారు. హనుమంతుడు వారితో సుగ్రీవునికి మైత్రి కుదిర్చినాడు.

    రాముడు వాలిని వధిస్తా నని సుగ్రీవునికి వాగ్దానం చేసినాడు.  అతడు కూడా రాము నోదార్చి సీతను తెచ్చి నీ కప్పగించే ఏర్పాటు చేస్తా నని మాట యిచ్చినాడు. అంతేగాక ఒక రాక్షసు డాకాశ మార్గాన ఒక మహిళ నపహరించుకొని పోతూవుంటే ఆమె విలపిస్తూ తన సొమ్ములు చీర చెరగులో మూట గట్టి కిందకు వదలివేసిం దని ఆమె సీతయే అయివుంటుం దని ఆ నగలు తాము దాచినా మని పలికి అవి తెప్పించినాడు.

    రాము డవి చూసి కన్నులనిండా నీళ్ళు తెచ్చుకొని లక్ష్మణుని గుర్తించు మన్నాడు.

     పరిశీలించిన లక్ష్మణు డిలా అన్నాడు.

     "నేను ప్రతినిత్యం మా వదినగారికి భక్తితో పాదాభివందనం చేస్తూ వుండేవాణ్ణి. కాబట్టి ఆమె కాలి యందెలను మాత్ర మెరుగుదును. ఇవి ఆమెవే! చెవిపోగులు గాని దండకడియములనుగాని నే నెరుగను. ఎందుకంటే నే నెన్నడూ తల ఎత్తి చూసినవాణ్ణి కాదు."


20, జులై 2022, బుధవారం

fa1 physics | formative assessment exam | fa physical science questions ...

పవరమున రామ లక్ష్మణులవి శరముల

      పవరమున రామ లక్ష్మణులవి శరముల

      తండు మిండైన వానలు.. బండరాళ్ళ

      జత్తు కపులవి వడగండ్ల చాలె!.. ఆని

      లిది పెను తుఫాను గాలి.. తూలిరి దనుజులు

రామ రావణ యుద్ధం భయంకర రూపం దాల్చింది. రామ లక్ష్మణులు బాణాలు జడివానలా కురియ సాగినవి. వానరులు విసిరే బండరాళ్ళే వడగండ్లైనవి. ఆంజనేయుని విజృంభణం పెను తుఫాను గాలి యైనది. రాక్షసులు తట్టుకోలేకపోయారు.

    పవరము = యుద్ధము

    జత్తు = సమూహం

    తండుమిండు = విపరీతమైన

    (రంగారెడ్డిజిల్లా మాండలికం)

     ఆనిలి = ఆంజనేయుడు

18, జులై 2022, సోమవారం

ఇక పనుపుము న న్నయ మది.. యొక కో తి క్కనగ నవ్వరో! అది నా ముం

     ఇక పనుపుము న.. న్నయ మది..

     యొక కో తి క్కనగ నవ్వరో! అది నా ముం

     దొక ఎ ర్రన రాదే! తే

     లిక నలిపెదపో! తన దగు రిమ్మ కుదరగా..


అశోకవన విధ్వంసం చేస్తున్న ఆంజనేయుని నిరోధించడానికి ఎందరో రాక్షస వీరులను పంపించి విఫలుడైన రావణునితో ఇంద్రజిత్తు అంటున్న మాటలు.

    "ఇక నన్ను పంపించు. అదే నయము.. (నీతి.) ఒకానొక (అల్పమైన) కోతి ఇక్కు (కోతివలన కలిగిన సంకటము.. ప్రమాదము) అంటే విన్నవారు నవ్వరా! (మన మింత గొప్ప రాక్షసులం కదా!)

    అది (ఆ కోతి) నా (బలం) ముందు ఒక ఎర్ర (వానపాము) వంటిదే! (అల్పమైనది). చాలా తేలిగ్గా నలిపివేస్తాను దాని రిమ్మ (పిచ్చి) కుదరేటట్టుగా.."




లెమ్ము! పయోధి నీవు నవ లీలగ దాఁటి సురారి వీటికిం

    లెమ్ము! పయోధి నీవు నవ

       లీలగ దాఁటి సురారి వీటికిం

    బొమ్ము.. మహీసుత న్వెదకి

       పొల్పుగఁ గాంచి మహా జవంబుతో

    రమ్ము.. మహాత్ముడైన రఘు

       రామునకున్ మితి లేని సంతసం

    బిమ్ము.. వనాట వంశమున

       కెంతయు మేటివి గమ్ము మారుతీ!" 


"హనుమ! చెప్పగా లేము నీ దయిన చేవ -

ఇనుని చిననాడె మ్రింగబోయితివె ! అమర

వినుత! లంఘించు కంధి.. తీరును నెదారు"

హనుమతో జాంబవంతు డి ట్లనెను చూచి--


ఎదారు = చింత (పాలమూరు మాండలికము)


సీతాన్వేషణకై బయలుదేరిన వానరులు అనంతమైన సముద్రాన్ని చూసి దిక్కు తోచని పరిస్థితిలో వుంటే జాంబవంతుడు హనుమంతునితో..


"భూరుహ చర వీర! పుట్టినప్పుడు నీవు 

    బా లాబ్జమిత్ర బింబంబుఁ గాంచి

ఫల మని కాంక్షచే బంధుర జవమున 

    నురువడి మున్నూఱు యోజనములు 

గగనంబునకుఁ బ్రీతి నెగసి... పట్టబోయినావు.

 (గోపీనాథ రామాయణము కి.కాం.1368)

నీ చేవ (శక్తి) యింతటి దని చెప్పజాలము. కంధిని (సముద్రాన్ని) లంఘించు. మా చింత దీర్చు.