మొత్తం పేజీ వీక్షణలు

18, జులై 2022, సోమవారం

లెమ్ము! పయోధి నీవు నవ లీలగ దాఁటి సురారి వీటికిం

    లెమ్ము! పయోధి నీవు నవ

       లీలగ దాఁటి సురారి వీటికిం

    బొమ్ము.. మహీసుత న్వెదకి

       పొల్పుగఁ గాంచి మహా జవంబుతో

    రమ్ము.. మహాత్ముడైన రఘు

       రామునకున్ మితి లేని సంతసం

    బిమ్ము.. వనాట వంశమున

       కెంతయు మేటివి గమ్ము మారుతీ!" 


"హనుమ! చెప్పగా లేము నీ దయిన చేవ -

ఇనుని చిననాడె మ్రింగబోయితివె ! అమర

వినుత! లంఘించు కంధి.. తీరును నెదారు"

హనుమతో జాంబవంతు డి ట్లనెను చూచి--


ఎదారు = చింత (పాలమూరు మాండలికము)


సీతాన్వేషణకై బయలుదేరిన వానరులు అనంతమైన సముద్రాన్ని చూసి దిక్కు తోచని పరిస్థితిలో వుంటే జాంబవంతుడు హనుమంతునితో..


"భూరుహ చర వీర! పుట్టినప్పుడు నీవు 

    బా లాబ్జమిత్ర బింబంబుఁ గాంచి

ఫల మని కాంక్షచే బంధుర జవమున 

    నురువడి మున్నూఱు యోజనములు 

గగనంబునకుఁ బ్రీతి నెగసి... పట్టబోయినావు.

 (గోపీనాథ రామాయణము కి.కాం.1368)

నీ చేవ (శక్తి) యింతటి దని చెప్పజాలము. కంధిని (సముద్రాన్ని) లంఘించు. మా చింత దీర్చు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి