మొత్తం పేజీ వీక్షణలు

19, జూన్ 2022, ఆదివారం

శంకర స ఖావతార! విశ్వ ప్రవీర!..

శంకర స ఖావతార! విశ్వ ప్రవీర!..

భోజనం బివ్వి నీకు నీ పూట తండ్రి!

రామచంద్ర! "ఎంగిలి పం డ్లి వేమి?" యనకు..

వాసి కెక్కిన రుచి యున్న పండ్లు సుమ్మి!

సీతారామ లక్ష్మణులు పంపాసరస్సు పశ్చిమ తీరంలోని శబరి ఆశ్రమానికి చేరుకున్నారు. గురుభక్తి, సేవాభావం, వ్రతాచరణ, ధర్మనిష్ఠ కల శబరి రామునికోసం పెద్దకాలం నిరీక్షించింది. రాగానే పూజించి ఎంతో భక్తితో మధురఫలాలు సమర్పించింది.


వశి.. వనధి దాటెఁ..బనిఁ జేసె..ఫల మడుగడు..

వశి.. వనధి దాటెఁ..బనిఁ జేసె..ఫల మడుగడు..

వైనతేయ నిభ వరిష్ఠుడైన హనుమ..

ఎవరు ద్రవిణమునం దాశ యెరుగ? రొకడు

దక్క..నాకలిం గమలాప్తు దాకు హనుమ..

ఆంజనేయుడు వశి. (ఇంద్రియాలను వశమునం దుంచుకున్నవాడు). వైనతేయుని (గరుత్మంతుని) వంటి వరిష్ఠుడు (శ్రేష్ఠుడు). అనంతమైన సముద్రాన్ని లంఘించగలిగినాడు. లంకలో ప్రవేశించ గలిగినాడు. జానకి జాడ కనుక్కో గలిగినాడు. తన ప్రతాపాన్ని చూపగలిగినాడు. తిరిగి రాగలిగినాడు. ఇవన్నీ ఎవ్వడూ చేయలేని పనులే! పైగా నిష్కామంగా చేశాడు. 

ద్రవిణము (ధనము)నం దాశ ఎవ రెరుగరు? ఆకలితో కమలాప్తుని (సూర్యుని) తాక బోయే హనుమ ఒక్కడు తప్ప.

బాల్యంలో సూర్యుని పం డనుకొని మింగ బోయాడు హనుమ.

   (పదాలు అన్యార్థంలో ప్రయోగించ బడినవి.)



18, జూన్ 2022, శనివారం

ధర్మమూర్తి వీవు తండ్రి! నన్ బ్రోవవా!

      ధర్మమూర్తి వీవు తండ్రి! నన్ బ్రోవవా!

      నిర్మలమతి వీవు.. నిన్నుఁ జేర

      వచ్చినాను రామ! భక్త రక్షణ చణా!

      నాదు జనము వీడినాను రోసి..


     త్యక్త్వా పుత్రాంశ్చ దారాంశ్చ రాఘవం శరణం గతః

     నివేదయత మాం క్షిప్రం రాఘవాయ మహాత్మనే

     సర్వలోక శరణ్యాయ  విభీషణ ముపస్థితమ్

          "భార్యాబిడ్డల్ని విడిచి రాముణ్ణి శరణు వేడుతున్నాను. సర్వలోక శరణ్యుడైన రామునికి విభీషణుడు అనే పేరుగల నేను వచ్చినట్లు చెప్పండి" అని చెప్పి పంపాడు విభీషణుడు.

    అతడు సోదరులను రోసి లంకను వీడి వచ్చి రాముని శరణువేడుతూ ఇలా అన్నాడు.

(భక్త రక్షణ చణా!= భక్త రక్షణలో నేర్పరీ!)



భావన శుద్ధమౌ శబరి పల్కెను "మద్గురు నాజ్ఞ నిన్ని నా....

     భావన శుద్ధమౌ శబరి

        పల్కెను "మద్గురు నాజ్ఞ నిన్ని నా

     ళ్ళీ వరుదెంతు వంచును ని

        రీక్షణ సల్పితిఁ.. బూజ లందుకో!

     పావన మాయె జీవనము

        భద్రద! రాఘవ! నీవు దక్క నే

     దేవుడు లేనె లే డని మ

        దిన్ కడు నమ్ముచు గొల్తు భక్తితోన్."


సీతారామ లక్ష్మణులు పంపా సరస్సు పశ్చిమ తీరంలోని శబరి ఆశ్రమానికి చేరుకున్నారు. సేవాభావం, వ్రతాచరణ, ధర్మనిష్ఠ కల శబరి రాముని పట్ల శరణాగతి భావంతో పెద్దకాలం నిరీక్షించింది. రాగానే పూజించింది. మధుర ఫలాలు సమర్పించింది. రాము డెంతో ప్రేమతో స్వీకరించాడు.

    "అద్య మే సఫలం జన్మ  స్వర్గశ్చైవ భవిష్యతి 

     త్వయి దేవవరే రామ!  పూజితే భరతర్షభ! 

         దేవ శ్రేష్ఠుడవైన నీవు పూజితుడ వౌటచే నా జన్మ సఫల మయింది. నాకు పరమపదం సిద్ధిస్తుంది.

    మా గురువులు మతంగ మహర్షి దివ్య లోకాలకు వెళుతూ రాముడు వస్తా డని, చూడగానే నీకు ముక్తి లభిస్తుం దని చెప్పారు."

    అని వనమంతా చూపించి గురువుగారి పావన జీవనాన్ని కొనియాడింది. ఆమె గురుసేవను మెచ్చుకొని రాముడు అర్చితోఽ హం త్వయా భక్త్యా గచ్ఛ కామం యథా సుఖమ్.. (నన్ను భక్తితో పూజించినావు. కోరిన పుణ్య లోకానికి సుఖంగా పొమ్ము.) అన్నాడు.

    శబరి రామునితో పలికిన పలుకు లివి...



palamuru labour troubles

 పాలమూరు కూలీల బతుకులు

పాలమూరు కూలీలు భారత దేశమంతా పేరు గాంచినారు. దేశంలో ఏ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టినా, కాలువలు త్రవ్వినా, కొండల్ని పిండిచేసి కోనల్ని నరికి రహదార్లు వేసినా అక్కడ పాలమూరు కూలీల చెమట బొట్లు పునాదిరాల్లుగా మారిపోకుండా ఉండవు.

ఈ జిల్లాలో ముఖ్యంగా కొల్లాపూర్‌, నాగర్‌ కర్నూల్‌, అచ్చంపేట, గద్వాల, వనపర్తి ఆత్మకూరు తాలూకాలలో నుండి లక్షల సంఖ్యల్లో దినసరి కూలీలు తను జానెడు పొట్ట నింపుకోవడం కోసం దేశంలోని అన్ని మిగతా రాష్ట్రాలకు వెళ్తుంటారు. అయితే అక్కడ వీళ్ళు తమ అమాయకత్వం వల్ల అనాదిగా విపరీతమైన శ్రమ దోపిడికి గురవుతున్నారు. కొంత డబ్బు వీళ్ళకు అడ్వాన్సుగా యిచ్చి వీళ్ళని దూర తీరాలకు కంట్రాక్టర్లు తమ వెంట తీసుకుని వెళ్తారు. అక్కడ వీళ్ళు నిర్భంధంగా వెట్టిచాకిరి చేయవలసి వస్తుంది. మూడు నెలల జీతం అడ్వాన్సుగా పొందిన వీళ్ళు మూడు సంవత్సరాలైనా కూలీ చేస్తూనే ఉంటారు. భార్యా పిల్లలకు దూరమై కొండలలో కోనలలో దిక్కూ దివాణం లేకుండా దారి తెన్నూ తెలియకుండా  మేస్త్రీలు చెప్పిందల్లా బానిసల్లా తలవంచి రెక్కలను ముక్కలను చేసుకోవడమే వీళ్ళ పని.

ఈ నిర్బంధ దాస్యాన్ని ఎంతో కష్టం మీద తప్పించుకొని బయటపడిన వాళ్ళూ ఊరూరా వీధి వీధినా బిచ్చమెత్తుకుంటూ రెండు మూడు సంవత్సరాలకు కానీ ఇల్లు చేరని వాళ్ళు కోకొల్లలు. దిక్కూ దివానం లేకుండి అక్కడే చచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలాగోలా తిరిగి వచ్చిన వాళ్ళలో ఎంతో మంది చావు తప్పి కన్నులొట్టపోయిన చందాన తయారవుతారు.

ఇన్ని ఘోరాలు జరుగుతున్నా వీళ్ళు ఇంకా ఎందుకు వెళ్తున్నారు? తింటనికి రొట్టె లేక కట్టడానికి బట్ట లేక తలదాచు కోవడానికి నీడలేక యిక్కడ కూడా వాళ్ళకు అంతకంటే మంచి బతుకులు లేక వెళ్తున్నారనే చెప్పుకోవాలి.

ఏళ్ల తరబడిగా వస్తున్న ఈ సమస్య గతంలో పాలమూరునుంచి ఢల్లీి పార్లమెంటు దాక వెళ్ళింది. అయినా సమస్య సమస్యగానే వుంది తప్ప పెద్దగా వారికి లాభించినట్టు లేదు. దీనికి పరిష్కార మార్గం ఏమిటి?

ఈ జిల్లాలో ఏ ఏ ప్రాంతాలనుంచి ఎక్కువగా యీ రకపు కూలీలు వెళ్తున్నారో ఆ ప్రాంతాలలోకి లేబర్‌ డిపార్టుమెంటు వాళ్ళు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలు వెళ్ళి సమగ్ర సర్వే జరపాలి. వాళ్ళకందరికీ వెంటనే భూములు, ఇళ్ళు ఉచితంగా సమకూర్చి తగిన జీవనోపాధికై తక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. రాష్ట్ర నిర్మాణాల సంస్థ ద్వారా వీరికి తగినన్ని పనులు కల్పించాలి.

Polytechnic diploma exam question paper | diploma students semester test...

july telugu calendar | Hindu calendar | telugu panchangam july 2022 telu...