మొత్తం పేజీ వీక్షణలు

4, ఆగస్టు 2022, గురువారం

fa1 questions | hindi fa1 paper | 8th class fa1 exam | formative assessm...

తండ్రీ! నీ దయతో నిక గుండ్రాతిని గా.. నహల్యఁ.. గుందితి నిందన్

"తండ్రీ! నీ దయతో నిక

గుండ్రాతిని గా.. నహల్యఁ.. గుందితి నిందన్

వేండ్రముతో.." నని పలికెను..

గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్..


రాముని పాద ధూళి సోకి రాయిగా పడివున్న  అహల్య శాపం తొలగింది.

చతుర్భుజం శంఖచక్ర గదా పంకజ ధారిణమ్

ధనుర్బాణధరం రామం లక్ష్మణేన సమన్వితం 38

         లక్ష్మణునితో కూడిన రాముడు శ్రీ మన్నారాయణునిగా దర్శన మీయగా ఆమె ఇలా పలికింది.

      "అహో కృతా ర్థాస్మి జగన్నివాస! తే

      పాదాబ్జ సంలగ్న రజః కణా నహమ్"

          జగన్నివాసా! నీ పాదపద్మాల ధూళి కణం తాకి నేను ధన్యురాల నైనాను.

(అధ్యాత్మ రామాయణం బా.కాం. 5-43)

    "తండ్రీ! నీ కరుణతో ఇక నేను గుండ్రాతిని కాను. అహల్యను. నిందవలన ఇన్నాళ్ళూ ఎంతో వేండ్రముతో (తాపంతో) కుందినాను."

   అలా చిత్రంగా గుండ్రాయి వనితగా మారి అందరూ చూస్తుండగా గునగునా నడిచివెళ్ళింది.      

చిగురుకొను నాస మారుతిన్ జేరదీసి

చిగురుకొను నాస మారుతిన్ జేరదీసి

క్రోడమున హత్తుకొనెను రఘు ప్రవరుడు

డయనమున నేగి రయమున లంకఁ జేరి

ముదిత సీతను గనుగొన్న ముఖ్యు డనుచు

   సీతాన్వేషణం సఫలీకృతమయిం దని తెలుసుకొన్న రాముడు ఆంజనేయుని తన క్రోడమునకు (హృదయమునకు) హత్తుకొన్నాడు. డయనంతో  (పక్షిలాగా రెక్కకదలనీక ఆకసంలో ఎగరి) లంక జేరి సీతను కనుక్కోగలిగినా డని.  ~~~~~~~~~

ఇదె గొను మింతకంటెఁ బ్రియ మిప్పటి కెద్దియు లే దటంచు నే సదమల బుద్ధి నిచ్చెద విశాలభుజా పరిరంభణం బొగిన్

(గోపీనాథ రామాయణము.. యు.కాం.12)

అని రాముడు హనుమను కౌగలించుకున్నా డట!

క్రోడము = రొమ్ము

డయనము = పక్షిగతి, రెక్కకదలనీక ఎగరడం.


1, ఆగస్టు 2022, సోమవారం

వందవ యవధానంబును

 వందవ యవధానంబును

పొందుగ గావించినారు పొరబడకుండన్..

ముందర శతావధానము

సుందరముగఁ జేయగలరు సూరులు మెచ్చన్