చిగురుకొను నాస మారుతిన్ జేరదీసి
క్రోడమున హత్తుకొనెను రఘు ప్రవరుడు
డయనమున నేగి రయమున లంకఁ జేరి
ముదిత సీతను గనుగొన్న ముఖ్యు డనుచు
సీతాన్వేషణం సఫలీకృతమయిం దని తెలుసుకొన్న రాముడు ఆంజనేయుని తన క్రోడమునకు (హృదయమునకు) హత్తుకొన్నాడు. డయనంతో (పక్షిలాగా రెక్కకదలనీక ఆకసంలో ఎగరి) లంక జేరి సీతను కనుక్కోగలిగినా డని. ~~~~~~~~~
ఇదె గొను మింతకంటెఁ బ్రియ మిప్పటి కెద్దియు లే దటంచు నే సదమల బుద్ధి నిచ్చెద విశాలభుజా పరిరంభణం బొగిన్
(గోపీనాథ రామాయణము.. యు.కాం.12)
అని రాముడు హనుమను కౌగలించుకున్నా డట!
క్రోడము = రొమ్ము
డయనము = పక్షిగతి, రెక్కకదలనీక ఎగరడం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి