"తండ్రీ! నీ దయతో నిక
గుండ్రాతిని గా.. నహల్యఁ.. గుందితి నిందన్
వేండ్రముతో.." నని పలికెను..
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్..
రాముని పాద ధూళి సోకి రాయిగా పడివున్న అహల్య శాపం తొలగింది.
చతుర్భుజం శంఖచక్ర గదా పంకజ ధారిణమ్
ధనుర్బాణధరం రామం లక్ష్మణేన సమన్వితం 38
లక్ష్మణునితో కూడిన రాముడు శ్రీ మన్నారాయణునిగా దర్శన మీయగా ఆమె ఇలా పలికింది.
"అహో కృతా ర్థాస్మి జగన్నివాస! తే
పాదాబ్జ సంలగ్న రజః కణా నహమ్"
జగన్నివాసా! నీ పాదపద్మాల ధూళి కణం తాకి నేను ధన్యురాల నైనాను.
(అధ్యాత్మ రామాయణం బా.కాం. 5-43)
"తండ్రీ! నీ కరుణతో ఇక నేను గుండ్రాతిని కాను. అహల్యను. నిందవలన ఇన్నాళ్ళూ ఎంతో వేండ్రముతో (తాపంతో) కుందినాను."
అలా చిత్రంగా గుండ్రాయి వనితగా మారి అందరూ చూస్తుండగా గునగునా నడిచివెళ్ళింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి