మొత్తం పేజీ వీక్షణలు

14, జూన్ 2022, మంగళవారం

పావనమైన నామ మని పండితు లెల్ల ప్రశంస సేయగా...

     పావనమైన నామ మని

         పండితు లెల్ల ప్రశంస సేయగా..

     భావనలో స్థిరం బయిన

         పావన జీవన మిచ్చి కావగా..

     పావని జీవన మ్మయిన

         భద్రద రాముడు దక్క వేరు నే

     దేవుడు లేనె లే డని మదిన్  కడు

         నమ్ముచు గొల్తు భక్తితోన్


రామనామం గనుక భావనలో స్థిరపడిందా పావనమైన జీవన మిస్తుంది. రక్షిస్తుంది. భద్రదుడు.. భద్రము లిచ్చేవాడు.. రాముడు.. పావని (ఆంజనేయస్వామి) సర్వజీవనమూ రాముడే.



అమ్మ యనంగ లేదు, మరి....................

అమ్మ యనంగ లేదు, మరి

   యయ్య యనంగ కనంగ రాదు, మో

హమ్ము చనంగ లేదు, మరి

   హాయియె లోకమునందు లేదు, మో

ద మ్మన నేమిటో తెలియ

   దయ్య కటంచును తిట్టుచుండగా 

నమ్మయు పిల్లలున్.. ముదిమి

   యారయ దుర్భర మౌ నిజంబుగా..

సరస పదాలు లేవు, సిరి.......

సరస పదాలు లేవు, సిరి

   సంపద లన్నియు వీడసాగెడిన్,

నిరత మ దేదొ చింత మది

   నిండుచు లంకపతిన్ దహించెడిన్,

కొరకొర చూపులున్, మిగుల

   కోపము రేగుచునుండె, పిచ్చి వా

నర మొక టేదొ యీ వనము

   నంతను తొక్కునె యంచు కుందెడిన్

గాత్రము చాలకున్న, వడి ......

గాత్రము చాలకున్న, వడి 

   గా మరి పద్యము సాగకున్న, లో 

నాత్రము మీరుచున్న, సమ 

    యం బది యేగుచు చాలకున్న, నే

ఛత్రము లేక నాతపము

    సర్రున పై బడుచున్న నింక నా

క్షేత్రము వీడి పోదగును 

    చేయగ లేక వధాన మిచ్చటన్

మడత నాల్కది యూర్మిళమ్మ చెలి...telugu padhyam and its meaning

మడత నాల్కది యూర్మిళమ్మ చెలి "బీడి

పడకు, సిగ రెట్టుకొనవే! మగ డరుదెంచుఁ,

గను లయొ! పొగాకు మండుఁ గూ చొనకు మిచట,

గుట్క తాగి వత్తు"న టంచు గొణిగె నపుడు


సీతా రామ లక్ష్మణులు రావణ వధానంతరం అయోధ్యకు తిరిగివచ్చారు. రామునికి వైభవంగా పట్టాభిషేకం జరిగింది. తోడికోడళ్ళలో ఒక్క  ఊర్మిళయే పెద్దకాలం భర్తృ వియోగాన్ని భరించిం దని రాముడు ఆమె అంతఃపురాన్ని  సర్వాంగ సుందరంగా అలంకరించు మని ఆదేశించాడు. ఊర్మిళా లక్ష్మణుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, వారి పునస్సమాగమానికి యథోచితంగా ఏర్పాట్లు గావింపు డని చెలికత్తెలను పురమాయించాడు. 

     ఊర్మిళకు నాలుక మడత పడిన చెలికత్తె ఒకతె వుండేది. (అంటే చిన్నప్పుడే ప్రమాద వశాత్తు నాలుక ఒకింత మడత పడి అలాగే అతుక్కు పోయింది.) ఆమె మాటలు కొన్ని మన కర్థం కావు. కొత్తగా వింటాం కదా! (అక్క డుండేవాళ్ళు రోజూ వింటూవుంటారు కాబట్టి వాళ్ళకు అర్థ మౌతుంటాయి.) ఆమె ఊర్మిళతో ఇలా అన్నది.

    "బిడియ పడకు. సిగ కట్టుకొనవే! మగడు వచ్చే వే ళయింది. అయ్యో! పొగకు కన్నులు మండుతున్నై. ఇక్కడ కూర్చోకు. నే నిప్పుడే గట్క (సంకటి) తాగి వస్తాను."

    కాని ఆమె మాటలు మనకు వేరే విధంగా వినిపిస్తున్నాయి. ఆమె మాట తీ రది. ఏం చేస్తాం.

కాకి యెన్నడైన "కావు కా" వనవలె.. telugu padhya tatparyam

  కాకి యెన్నడైన "కావు కా" వనవలె..

  కోకిలమ్మ మురిసి కూయగవలె..

  తల్లి వోలె నితర తరుణులన్ గనవలె..

  కాకి కోకి లౌనె కనక.. రాజ!

సీతాపహరణానికి ప్రేరేపిస్తున్న రావణునికి హితవు చెబుతూ మారీచుడు  నర్మగర్భంగా ఇలా మందలించినాడు.

     "కాకి ఎన్నడైనా కావు.. కావు.. అనవలసియే వుంది. (అంటే నన్ను రక్షించు.. రక్షించు.. అనాల్సియే వుంది.) కాని కోకిల మాత్రం సంతోషంతో కూయవలసియే వుంది. పర స్త్రీలను తల్లి లాగా కనవలె. (చూడవలె.) కనకపోతే (చూడకపోతే) ఓ రాజా! కాకి లాంటి వాడు కోకిల లాంటి వాడు అవుతాడా! (మాతృవత్ పరదారాంశ్చ.. అనేది ప్రసిద్ధమే కదా!)

    నీ వా విధంగా చూడడం లేదు.  రాముని భార్య నపహరిస్తా నంటున్నావు. కాబట్టి కాకి లాంటి వాడివే! (అంటే కావు.. కావు.. అంటూ ఇకముందు ఆర్తనాదం చేయవలసిందే! ఎందుకంటే రాముని బలం నీకు తెలియదు. ఎవరూ నిన్ను రక్షించలేరు.) కాని కోకిలలాగా మురిసి, మురిపించా లనే భ్రమలో వుంటున్నావు. ఎక్కడైనా కాకి కోకిల అవుతుందా మహారాజా!"

class students telugu project work book | story on animals in circus | s...