మొత్తం పేజీ వీక్షణలు

13, డిసెంబర్ 2017, బుధవారం

విశ్వరూప సందర్శన యోగ

ఓం శ్రీ పరమాత్మనే నమః
అథ ఏకాదశో2ధ్యాయః
విశ్వరూప సందర్శన యోగ
అర్జున ఉవాచ
మదనుగ్రహాయపరమం గుహ్యమధ్యాత్యసంజ్ఞతమ్‌
యత్త్వయోక్తం వచస్తేన మోహా2యం విగతో మమ 1
అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! నన్ను అనుగ్రహింపదచి పరమగోప్యమైన ఆధ్యాత్మిక విషయమును ఉపదేశించితివి. దాని వన నా అజ్ఞానము (మోహము) తొగిపోయినది. (1)
భవాప్యయౌహి భూతానాం శ్రుతౌ విస్తరతో మయా
త్వత్తః కమపత్రాక్షమాహాత్మ్యమపి చావ్యయమ్‌ 2
ఓ కమలాక్షా! ఓ కృష్ణా! సమస్త ప్రాణు ఉత్పత్తి ప్రళయమును గూర్చి సవిస్తరముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహిమను గూర్చియు వింటిని. (2)
ఏవమేతద్యథాత్థత్వమ్‌ ఆత్మానం పరమేశ్వర
ద్రష్టుమిచ్ఛామితే రూపమ్‌ ఐశ్వరం పురుషోత్తమ 3
ఓపరమేశ్వరా! నీవు చెప్పినదంతయు సత్యమే. అందు సందేహమునకు తావులేదు. కాని ఓ పురుషోత్తమా! జ్ఞాన, ఐశ్వర్య శక్తి బ, వీర్య తేజోమహితమైన నీ షడ్గుణైౖశ్వర్య సంపన్నరూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహ పడుచున్నాను. (3)
మన్యసే యదితచక్యం మయాద్రష్టుమితి ప్రభో
యోగేశ్వరతతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్‌ 4
ఓ యోగేశ్వరా! ఓ ప్రభూ! నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును నాకు చూపింపుము. (4)
తతః స విస్మయావిష్టోహృష్టరోమా ధనంజయః
ప్రణమ్య శిరసాదేవం కృతాంజలిరభాషత 14
అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును జూచి, అర్జునుడు ఆశ్చర్యచకితుడై పుకితగాత్రుడయ్యెను. తేజోమయమైన ఈ విశ్వ (విరాట్‌) రూపమునకు భక్తిశ్రద్ధతో సాష్టాంగ ప్రణామము ఆచరించెను. తదనంతరము చేతు జోడిరచి యిట్లు పలికెను.(14)
అర్జున ఉవాచ
పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూతవిశేష సంఘాన్‌
బ్రహ్మాణమీశం కమలాసనస్థమ్‌ ఋషీంశ్చసర్వానురగాంశ్చ దివ్యాన్‌
15
అర్జునుడు పలికెను - ఓ దేవాదిదేవా! నీ విరాట్‌ రూపమునందు సక దేవతను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషును, దివ్య సర్పమును చూచుచున్నాను. (15)
అనేక బాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో2నంతరూపమ్‌
నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప
16
ఓ విశ్వేశ్వరా విశ్వరూపా! నీ బాహువు, ఉదరము, ముఖము, నేత్రము అసంఖ్యాకము. నీ అనంతరూపము సర్వతోముఖముగ విస్లిచున్నది. నీవు ఆది మధ్యాంత రహితుడవు. మహత్త్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతమును తెలిసికొనలేకున్నాను. (16)
కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్‌
పశ్యామిత్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్‌ దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్‌
17
హే విష్ణో! కిరీటమును, గదను, చక్రమును ధరించి, అంతటను తేజఃపుంజమును విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్నివలెను, జ్యోతిర్మయుడైన సూర్యని వలెను మెగొందుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్ష్యమై యున్నది. (17)
త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్యవిశ్వస్యపరం నిధానమ్‌
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తాసనాతనస్త్వం పురుషో మతో మే 18
పరమ - అక్షర స్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే. కనుక అందరికిని తెలిసికొనదగినవాడవు. ఈ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు. సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు. సనాతన పురుషుడవు అని నా విశ్వాసము. (18)
అనాదిమధ్యాంతమనంతవీర్యమ్‌ అనంతబాహుం శశిసూర్యనేత్రమ్‌
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతమ్‌
19
నీవు ఆది మధ్యాంతరహితుడవు. అపరిమిత శక్తిశాలివి. అసంఖ్యాకములైన భుజము గవాడవు. సూర్యచంద్రు నీ నేత్రము. అగ్ని వలె నీ ముఖము ప్రజ్వర్లిుచున్నది. నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్త మొనర్చు చున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను. (19)
ద్యావాపృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వjైుకేన దిశశ్చసర్వాః
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదంలోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్‌ 20
ఓ మహాత్మా!  దివి నుండి భువి వరకు గ అంతరిక్షము నందంతటను అన్ని దిశను నీవే పరిపూర్ణుడవై యున్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకమును గడగడ లాడుచున్నవి. (20)
అమీ హిత్వాంసురసంఘూ విశంతి కేచిద్భీతాఃప్రాంజయో గృణంతి
స్వస్తీత్యుక్త్వామహర్షిసిద్ధసంఘాఃస్తువంతిత్వాంస్తుతిభిఃపుష్కలాభి: 21
ఇదిగో, ఆ దేవతల్లెరును నీలో ప్రవేశించు చున్నారు. కొందరు భయపడినవారై అంజలి ఘటించి, నీ నామ గుణమును కీర్తించుచున్నారు. మహర్షును, సిద్ధును స్వస్తి వచనముతోడను, ఉత్తమోత్తమ స్తోత్రము తోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు. (21)
రుద్రాదిత్యావసవో యే చసాధ్యావిశ్వే2శ్వినౌ మరుతశ్చోషపాశ్చ
గంధర్వ యక్షాసురసిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే 22
ఏకాదశ రుద్రును, ద్వాదశాదిత్యును, అష్టవసువును, సాధ్యును, విశ్వే దేవతును, అశ్వినీ కుమాయిను, మరుద్గణమును, పితయిను అట్లే గంధర్వ యక్షాసుర సిద్ధ సముదాయమును సంభ్రమాశ్చర్యముతో నిన్నే దర్శించుచున్నారు. (22)
రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదమ్‌
బహూదరం బహుదంప్త్రాకరాళం దృష్ట్వాలోకాఃప్రవ్యధితాస్త్రథాహమ్‌ 23
హే మహాబాహో! అసంఖ్యాకములైన వక్త్రమును, నేత్రమును, చేతును, ఊరువు (తొడ)ను, పాదమును, ఉదరమును, కోరను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి, అందరును భయకంపితుగు చున్నారు. నేను కూడా భయముతో వణికిపోవుచున్నాను. (23)
నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననందీప్త విశానేత్రమ్‌
ధృష్ట్వా హిత్వాం ప్రవ్యధితాంతరాత్మాధృతిం న విందామి
శమం చవిష్ణో 24
ఏనన హే విష్ణో! నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణముతో దేదీప్యమానమై మెగుచున్నది. కాంతును విరజిమ్ముచున్న విశా నేత్రముతో, విస్తరించిన ముఖముతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువన నా ధైర్యము సడలినది. శాంతి దూరమైనది. (24)
దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవకాలానసన్నిభాని
దిశోన జానే నభేచ శర్మప్రసీద దేవేశ జగన్నివాస 25
ఓ జగన్నివాసా! కరాళ దంష్ట్రతో (భయంకరములైన కోరతో) ఒప్పుచున్న నీ ముఖము ప్రళయాగ్నిజ్వాలవలె భీతి గ్పొుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కుతోచకున్నది. నెమ్మది (శాంతి) శూన్యమైనది. ఓ దేవేశా! ప్రసన్నుడవు కమ్మ (25)
అమీచత్వాంధృతరాష్ట్రస్యపుత్రాః సర్వే సహైవావనిపాసంఘైః
భీష్మోద్రోణఃసూతపుత్రస్తధాసా సహాస్మదీjైురపియోధముఖ్యైః 26
వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని
కేచిద్విగ్నాదశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః 27
ఇదిగో (ఇచ్చట చేరియన్న ఈ ధ ృతరాష్ట్ర పుత్రు (దుర్యోధనాదు) ఇతర రాజన్యుతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మపితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షము నందలి ప్రధాన యోధు అందరును భయంకరములైన కోరతో గూడిన నీ ముఖము యందు అతి వేగముగా పరుగు దీయుచు ప్రవేశించుచున్నారు. కొందటి తలు కోర మధ్యబడి నుగ్గునుగ్గై పోవుచుండగా వారు దంతములో చిక్కుకొని వ్రేలాడుచున్నారు. (26-27)
యథా నదీనాం బహవో2ంబువేగాఃసముద్రమేవాభిముఖా ద్రవంతి
తధాతవామీనరలోకవీరాఃవిశంతి వక్త్రాణ్యభివిజ్వంతి 28
అనేకములైన నదీనదము ప్రవాహమున్నియును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు, ఈ శ్రేష్టులైన సమరయోధు (నరలోకవీయి) కూడా జ్వలించుచున్న నీ ముఖము యందు ప్రవేశించుచున్నారు. (28)
యథాప్రదీప్తం జ్వనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగాః
తథైవనాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్దవేగాః 29
మిడుతన్నియును మోహవశమున బాగుగా మండుచున్న అగ్ని వైపు అతి వేగముగా పరుగెత్తి, తమ నాశనము కొరకు అందు ప్రవేశించి, నశించునట్లు ఈ వీరుందును తమ నాశమునకై అతివేగముగా పరుగెత్తి, నీ వక్త్రము యందు ప్రవేశించుచున్నారు, (29)
లేవిహ్యసేగ్రసమానఃసమంతాత్లోకాన్‌ సమగ్రాన్‌ వదనైర్జ్వద్భిః
తేజో2భిరాపూర్యజగత్‌ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో 30
హే విష్ణో! ప్రజ్వలించుచున్న నీ ముఖముతో సమస్త లోకమును అన్నివైపు నుండి కబళించుచు మాటిమాటికిని చప్పరించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి. (30)
ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమో2స్తుతే దేవవరప్రసీద
విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి
తవ ప్రవృత్తిమ్‌ 31
ఓ పరమాత్మా! నీకు నా నమస్కారము. ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తొపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసికొన గోరుచున్నాను. ఏనన నీ ప్రవృత్తిని ఎరుగలేకున్నాను. (31)
శ్రీ భగవాన్‌ ఉవాచ
కాలో2స్మిలోకక్షయకృత్‌ ప్రవృద్ధో లోకాన్‌ సమాహర్తుమిహప్రవృత్తః
ఋతే2పిత్వాంన భవిష్యంతి సర్వే యే2వస్థితాః ప్రత్యనీకేషుయోధాః
32
శ్రీ భగవానుడు పలికెను - నేను లోకము నన్నింటిని తుదముట్టించుటకై విజృంభించిన మహాకాుడను. ఇప్పుడు ఈ లోకమును రూపుమాపుటకై పూనుకొని యున్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్ననూ ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరును మిగురు. (మిగిలియుండరు) (32)
తస్మాత్త్వముత్తిష్ఠ యశో భస్వజిత్వాశత్రూన్‌ భుంక్ష్యరాజ్యం సమృద్ధమ్‌
మjైువైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్‌ 33
కనుక ఓ సవ్యసాచీ! లెమ్ము. కీర్తి గాంచుము. శత్రువును జయించి సర్వ సంపదతో తుతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందరును నా చేత మునుపే హతులైనవారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము. (33)
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తధాన్యనపి యోధవీరాన్‌
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్టా?
యుధ్యస్వజేతాసి రణేసపత్నాన్‌ 34
ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రధ (సైంధవ) కర్ణాది యుద్ధ వీరుందరిని నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువును తప్పక జయింపగవు. కనుక యుద్ధము చేయుము.
సంజయ ఉవాచ
ఏతచ్ఛ్రుత్వావచనం కేశవస్యకృతాంజలిర్వేపమానఃకిరీటీ
నమస్క ృత్వాభూయ ఏవాహ కృష్ణం సగద్దదం
భీతభీతః ప్రణమ్య 35
సంజయుడు పలికెను - ఓ రాజా! శ్రీకృష్ణపరమాత్మ యొక్క ఈ మాటను విని, అర్జునుడు వణకుచు, చేతు జోడిరచి నమస్కరించును. మర మిక్కిలి భయముతో ప్రణమిల్లి, గద్గద స్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. (35)
అర్జున ఉవాచ
స్థానే హృషీకేశతవ ప్రకీర్త్యాజగత్ప్రహ్యష్యత్యనురజ్యతే చ
రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వేనమస్యంతి చ సిద్ధ సంఘాః
36
అర్జునుడు పలికెను - ఓ అంతర్యామీ! కేశవా! నీ నామ గుణ ప్రభావమును కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో, అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసు నుదిక్కుకును పారిపోవుచున్నారు. సిద్ధ గణము వార్లెరును ప్రణమ్లిుచున్నారు. (36)
కస్మాచ్చ తేననమేరన్మహాతన్గరీయసే బ్రహ్మదో2ప్యాదికర్త్రే
అనంతదేవేశ జగన్నివాసత్వమక్షరం సదసత్‌ తత్పరం యత్‌ 37
ఓ మహాత్మా! నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్టికర్తjైున బ్రహ్మకే మూకారకుడవు - కనుక వారు (సిద్ధాదుందరును) నీకు నమస్కరింపక ఎట్లుండగరు? ఓ అనంతా! ఓ దేవేశా! ఓ జగన్నివాసా! సత్‌-అసత్‌ు నీవే. వాటికంటెను పరమైన అక్షర స్వరూపుడవు అనగా సచ్చిదానంద ఘనపరబ్రహ్మవు నీవే. (37)
త్వమాదిదేవఃపురుషఃపురాణః త్వమస్య విశ్వస్వపరం నిధానమ్‌
వేత్తాసి వేద్యంచ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప
38
ఓ అనంతరూపా! నీవు ఆది దేవుడవు, సనాతన పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు. సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమై యున్నది. (38)
వాయుర్యమో2గ్నిర్వరుణ శ్వశాంకఃప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ
నమో నమస్తే2స్తుసహస్రకృత్వఃపునశ్చభూయో2పినమోనమస్తే 39
నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతిjైున బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకు వే కొది నమస్కారము. మర మర నమస్కారము. ఇంకను నమస్కారము. (39)
నమఃపురస్తాదథ పృష్ఠతస్తే నమో2స్తుతే సర్వత ఏవ సర్వ
అనంతవీర్యామితవిక్రమస్త్వం సర్వం సమాప్నోషితతో2సిసర్వః 40
అనంత సామర్థ్యము గవాడా! నీకు ఎదురుగా ఉండియు, వెనుకనుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మా! నీకు అన్నివైపు నుండియు నమస్కారము. ఏనన అనంత పరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించి యున్నవాడవు. అన్ని రూపమును నీవియే. (40)
సఖేతి మత్వాప్రసభం యదుక్తం హే కృష్ణ! హే యాదవ హేసఖేతి
అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్‌ ప్రణయేన వాపి
41
యచ్ఛాపహాసార్థమసత్క ృతో2సి విహార శయ్యాసన భోజనేషు
ఏకో2థవాప్యచ్యుత తత్సమక్షం తత్‌క్షామయే త్వామహమప్రమేయమ్‌
42
నీ మహిమను ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి, చనువుచే గాని, పొరపాటు వన గాని, ఓ క ృష్ణా! ఓ యాదవా! ఓ మిత్రా! అనుచు తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుతా విహార శయ్యాసన భోజనాది సమయము యందును ఏకాంతమున గాని, అన్య సఖు సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి, నేను నిన్ను కించపరచి యుండవచ్చును. ఓ అప్రమేయ స్వరూపా! నా అపరాధము నన్నింటిని క్షమింపుమనివేడుకొనుచున్నాను. (41-42)
యదా సత్త్వే ప్రవృద్దేతు ప్రయం యాతి దేహభ ృత్‌
తదోత్తమవిదాం లోకాన్‌ అమలాన్‌ ప్రతిపద్యతే 14
సత్త్వగుణము వ ృద్ధి చెందినపుడు మనుజుడు మరణించినచో, అతడు ఉత్తమ కర్మను ఆచరించువారు చేరెడి నిర్మములైన స్వర్గాది దివ్యలోకమును పొండును. (14)
రజసిప్రయంగత్వాకర్మసంగీషు జాయతే
తథా ప్రలీనస్తమసిమూఢయోనిషు జాయతే 15
రజోగుణము వృద్ధి చెందినపుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పడు మ ృతి చెందిన మానవుడు పశు పక్షి కీటకాది నీచయోనులో జన్మించు చుండును. (15)
కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మం ఫమ్‌
రజసస్తుఫం దుఃఖమ్‌ అజ్ఞానం తమసః ఫమ్‌ 16
శ్రేష్ఠములైన కర్మను ఆచరించుట వన సాత్త్విక ఫము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదగు నిర్మ ఫము కుగును. రాజస కర్మకు ఫము దుఃఖము. తామసకర్మకు ఫము అజ్ఞానము. (16)
సత్త్వాత్‌ సంజాయతేజ్ఞానం రజసో లోభఏవచ
ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ 17
సత్త్వగుణము వన జ్ఞానమూ, రజోగుణము వన లోభమూ తమో గుణము వన ప్రమాద మోహాదుూ, అజ్ఞానము తప్పక ఉత్పన్నముగుచుండును. (17)
ఊర్ధ్వం గఛ్ఛంతి సత్త్వస్థామధ్యేతిష్ఠంతి రాజసాః
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః 18
సత్త్వ గుణస్థితు స్వర్గాది - ఊర్ధ్వలోకముకు పోవుదురు. రజోగుణస్థితులైన (రాజస) పురుషు మధ్య (మానవ) లోకము నందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాస్యాదు యందు స్థితులైనవారు అధోగతిని అనగా కీట, పశుపక్ష్యాది యోనును, నరకమును పొందుదురు. (18)
నాన్యం గుణేభ్యః కర్తారం యదాద్రష్టానుపశ్యతి
గుణేభ్యశ్చపరం వేత్తి మద్భావం సో2ధిగచ్ఛతి 19
ద్రష్టమైనవాడు గుణములే గుణము యందు వర్తించుచున్నవనియూ, త్రిగుణము తప్ప వేరుగా కర్తు లేరనియూ తెలిసికొని, త్రిగుణముకు అతీతముగా నున్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడనైన నా తత్త్వమును తెలిసికొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందును (19)
గుణానేతానతీత్యత్రీన్‌ దేహీ దేహసముద్దవాన్‌
జన్మమృత్యుజరాదుఃఖైకి విముక్తో2మృతమశ్ముతే 20
దేహోత్పత్తికి కారణరూపులైన ఈ మూడు గుణమును అధిగమించిన పురుషుడు జన్మ, మృత్యు, జరా (వార్థక్య), దుఃఖమునుండి విముక్తుడై పరమానందమును పొందును. (20)
అర్జున ఉవాచ
కైర్లింగైః త్రీన్‌ గుణానేతాన్‌ అతీతో భవతి ప్రభో
కిమాచారః కథం చైతాన్‌ త్రీన్‌ గుణానతివర్తతే 21
అర్జునుడు పలికెను - ఓ ప్రభూ! ఈ మూడు గుణముకును అతీతుడైనవాని క్షణములెవ్వి? అతని లోక వ్యవహార రీతి యెట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి? (21)
శ్రీ భగవాన్‌ ఉవాచ
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవచ పాండవ
న ద్వేష్టి సంప్రవృత్తాని న నిపృత్తాని కాంక్షతి 22
శ్రీ భగవానుడు పలికెను ` ఓ పాండవా ! సత్త్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణకార్య రూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము, తమంతట తామే అర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు ` అనగా వాటిని గోర్చి విచారపడడు. అట్లే అవి తొగిపోయినప్పడు వాటికై కాంక్షపడడు - అనగా ఎ్లప్పుడును ఒకే స్థితిలో నుండును. (22)
ఉదాసీనవదాసీనో గుణైౖర్యో న విచ్యాతే
గుణావర్తంత ఇత్యేవ యో2 వతిష్ఠతినేంగతే 23
త్రిగుణముకును, వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారముకును ఏ మాత్రము చలింపక, త్రిగుణాతీతుడు, ఉదాసీనుని వలె (సాక్షి వలె) ఉండును. గుణములే గుణము యందు ప్రవర్తించుచున్నవని తంచును. అతడు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావస్థితుడై యుండును. ఈ స్థితి ఎన్నడును చలింపడు. (23)
సమదుఃఖసుఖఃస్వస్థః సమలోష్టాశ్మకాంచనః
త్యుప్రియాప్రియోధీరఃత్యునిదాత్మసంస్తుతిః 24
త్రిగుణాతీతుడు స్సస్వరూపమునందే నిరంతరము స్థితుడైయుండును. సుఖదుఃఖమును సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారముయందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడిరటియందును గ్రాహ్యత్యాజ్యభావమును కలిగియుండును. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియముకు గాని, నిందాస్తుకు గాని తొణకడు. అనగా రెండిరటియందును సమస్థితిలోనే యుండును.
(24)
మానావమానయోస్త్యుఃతుల్యోమిత్రారిపక్షయో
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః ఉచ్యతే 25
మానావమానముయందును, మిత్రుయందును, శత్రువు యందును సమభావముతో ప్రవర్తించు వాడును, విధ్యుక్త కర్మను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతుడనబడును. (25)
మాం చయో2వ్యభిచారేణ భక్తియోగేనసేవతే
స గుణాన్‌ సమతీత్యైతాన్‌ బ్రహ్మభూయాయక్పతే 26
అనన్య (నిర్మమైన) భక్తి యోగము ధ్వారా నన్నే నిరంతరము భజించువాడును, ఈ మూడు గుణముకును పూర్తిగా అతీతుడైనవాడును అగు పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. (26)
బ్రహ్మణోహి ప్రతిష్ఠాహమ్‌ అమృతస్యావ్యయస్య చ
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ 27
ఏనన అట్టి శాశ్వత పరబ్రహ్మకును, అమృతత్వమునకును, సనాతన ధర్మమునకును, అఖండానందమునకును నేనే ఆధారము. (27)
ఓం తత్సదితి శ్రీమద్బగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
గుణత్రయవిభాగ యోగో నామ చతుర్దశో2ధ్యాయః 14

విభూతి యోగః

ఓం పరమాత్మనే నమః !
అథ దశమో2ధ్యాయః
విభూతి యోగః
శ్రీ భగవాన్‌ ఉవాచ
భూయ ఏవ మహాబాహో శ ృణు మే పరమం వచః
యత్తే2హంప్రేయమాణాయ వక్ష్యామి హితకామ్యయా 1
శ్రీ భగవానుడు పలికెను - హే! మహాబాహో! నీవు నా మీద ప్రేమ గవాడవు.కావున నీ మేు గోరి నేను మర చెప్పుచున్న వచనమును వినుము. అవి మిక్కిలి గోప్యము, మహిమాన్వితు, (1)
నమే విదుః సురగణాః ప్రభవంన మహరయః
అహమాదిర్షిదేవానాం మహరీణాం చ సర్వశః 2
నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషమును దేవతు గాని, మహర్షు గాని తెలిసికొనజారు. ఏనన, నేను అన్ని విధముగా ఆ దేవతకును, ఈ మహర్షుకును మూకారణమైన వాడను. (2)
యో మామజమనాదించవేత్తిలోకమహేశ్వరమ్‌
అసమూఢఃసమర్యేషు సర్వపాపై ప్రముచ్యతే 3
నన్ను యథార్థముగా జన్మరహితునిగను, అనాదిjైున వానినిగను సక లోక్ష మహేశ్వరునిగను తెలిసికొనువాడు మానవులో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపము నుండియు విముక్తుడగును. (3)
బుద్ధిర్‌ జ్ఞానసమ్మోహః క్షమా సత్యం దమః శమః
సుఖం దుఃఖం భవో2భావో భయం చా భయమేవచ 4
అహింసా సమతా తుష్టిః తపోదానం యశో2యశః
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః 5
నిశ్చయాత్మకశక్తి, యధార్థ జ్ఞానము, మోహ రాహిత్యము, క్షమ, సత్యము, దమము (ఇంద్రియ నిగ్రహము), శమము (మనోనిగ్రహము), సుఖ దుఃఖము, ఉత్పత్తి ప్రళయము, భయము, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణు వివిధ భావము, ఇవి యన్నియును నా వననే కుగును. (4-5)
మహర్షయః సప్తపూర్వే చత్వారోమనవస్తథా
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః 6
సప్త మహర్షును, వారి కంటెను పూర్వులైన సనకాది మహామును నుగురును, స్వాయంభువాది చతుర్ధశ మనువును మొదగు వీరందను నా భక్తులే. అందరూ నా యెడ సద్భావము గవారే. వీరు నా సంక్పము వననే జన్మించిరి. ఈ జగత్తు నందలి సమస్త ప్రాణును వీరి సంతానమే. (6)
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః
సో2వికంపేన యోగేన యుజ్యతేనాత్ర సంశయః 7
ఈ నాపరమైశ్వర్యరూప విభూతిని,యోగశక్తి యొక్క తత్త్వమును తెలిసికొన్నవాడు నిశ్చ భక్తి యుక్తుడగును. ఇందు ఏ మాత్రమూ సందేహమే లేదు (7)
అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే
ఇతి మత్వాభజంతే మాం బుధా భావసమన్వితాః 8
ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడనైన నేనే మూకారణము. నా వననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తు భక్తిశ్రద్ధతో నిరంతరము నన్నే సేవింతురు. (8)
మచిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్‌
కథయంతశ్చమాం నిత్యం తుష్యంతి చరమంతి చ 9
నా భక్తు నాయందే తమ మనస్సును గ్నమొనర్తురు. తమ ప్రాణమును, తమ కర్మన్నింటిని, తమ సర్వస్వమును నాకే అంకితమొనర్తురు. వారు పరస్పర చర్చ ద్వారా నా మహత్త్వమును గూర్చి ఒకరికొకరు తొపుకొనుచు, కథు కథుగా చెప్పుకొనుచు, నిరంతరము సంతుష్టుగుచుందురు. మరియు వారు సంతతము నా యందే రమించు చుందురు. (9)
తేషాం సతత యుక్తానాం భజతాంప్రీతిపూర్వకమ్‌
దదామి బుద్దియోగంతం యేనమాముపయాంతితే 10
అట్లు నిరంతరము ధ్యానాదు ద్వారా నా యందే గ్నమనస్కులై భక్తి శ్రద్ధతో నన్నేభజించువారికి నేను బుద్ధి యోగమును అనగా తత్త్వజ్ఞాన రూప యోగమును ప్రసాదించెదను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు. (10)
తేషామేవాను కం పార్ధమ్‌ అహమజ్ఞానజం తమః
నాశయామ్యాత్మ భావస్థోజ్ఞానదీపేన భాస్వతా 11
ఓ అర్జునా! వారి యంతఃకరణము యందు స్థితుడనైయున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్త్వజ్ఞాన రూప దీపమును (జ్యోతిని) వెలిగించి, వారి అజ్ఞానాంధకారమును పారద్రోలెదను. (11)
అర్జున ఉవాచ:
పరంబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్‌
పరుషం శాశ్వతం దివ్యమ్‌ ఆదిదేవమజం విభుమ్‌ 12
ఆహుస్త్వామ్‌ ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే 13
అర్జునుడు పలికెను - నీవు పరబ్రహ్మవు. పరంధాముడవు. పరమ పవిత్రుడవు. మహర్షు నిన్ను సనాతనుడవనియు, దివ్య పురుషుడవనియు, దేవదేవుడవనియు, జన్మరహితుడవనియు, సర్వవ్యాపివనియు ప్రస్తుతింతురు. దేవర్షి నారదుడు, అసితుడు, దేమడు, వ్యాసమహర్షియు, స్తుతింతురు. నీవును నాకు ఆ విధముగనే తొపు చున్నావు. (12-13)
సర్వమేత ధృతం మన్యే యన్మాం వదసికేశవ
నహితే భగవన్‌ వ్యక్తిం విదుర్దేవా న దానవాః 14
ఓ కేశవా! నీవు చెప్పనది అంతయును సత్యమే. హే భగవాన్‌! నీ లీలా మయ స్వరూపమును దేవతు గాని, దానవు గాని తెలిసికొనజారు. (14)
స్వయమేవాత్మనాత్మానంవేత్తత్వం పురుషోత్తమ
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే 15
ఓ జగదుత్పత్తికారకా! ఓ సర్వభూతేశా! ఓ దేవాదిదేవా! ఓ జగనాథా! ఓ పురుషోత్తమా! నీ తత్త్వమును నీవే స్వయముగా ఎరుగుదువు (15)
వక్తుమర్హస్యశేషేణ దివ్యాహ్యాత విభూతయః
యాభిర్విభూతిభిర్లోకాన్‌ ఇమాంస్త్వం వ్యాప్తతిష్ఠసి 16
సమస్త లోకము యందును నీ దివ్య విభూతు ద్వారా వ్యాపించి, స్థితుడవై యున్నావు. మహామహితములైన ఆ దివ్య విభూతును సంపూర్ణముగా త్పొటకు నీవే సమర్థుడవు (16)
కథం విద్యామహం యోగిన్త్వాంసదా పరిచింతయన్‌
కేషుకేషు చ భావేషు చింత్యో2సి భగవన్మయా 17
ఓ యోగీశ్వరా! నిరంతరము చింతన చేయుచూ నిన్ను ఏవిధముగా తెలిసి
కొనగను? హే భగవన్‌ ఏయే భావముతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు? నిన్ను నేను ఎట్లు చింతన చేయవలెను? (17)
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన
భూయః కథయ తృప్తిర్హిశృణ్వతో నాస్తిమే2మృతమ్‌ 18
ఓ జనార్దనా! నీ యోగశక్తిని గూర్చియూ, నీ విభూతి వైభవమును గురించియు విస్తృతముగా ఇంకను తొపుము. ఏనన, నీ అమృత మయ వచనమును ఎంతగా విన్నను తనివియే తీరదు. (18)
శ్రీ భగవాన్‌ ఉవాచ:
హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మవిభూతయః
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠనాస్త్యంతో విస్తరస్యమే 19
శ్రీ భగవానుడు పలికెను - ఓ అర్జునా! నీవు లెస్సగా పలికితివి. నా దివ్య విభూతు విస్తృతికి (వ్యాప్తికి) అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు తొపుచున్నాను. (19)
అహమాత్మగుడాకేశ సర్వభూతాశయస్థితః
అహమాదిశ్చ మధ్యం చభూతానామంత ఏవ చ 20
ఓ అర్జునా! సమస్త ప్రాణు హృదయము యందున్న ఆత్మను నేనే. సక భూతము (ప్రాణు) ఆదియు, మధ్యస్థితియు అంతము నేనే. (ప్రాణు యొక్క సృష్టిస్థితియముకు కారణము నేనే) (20)
ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్‌
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ 21
అదితియొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యులో విషు?వును నేను. జ్యోతిర్మయ స్వరూపులో నేను సూర్యుడను. 49 మంది వాయుదేవతలోని ‘తేజమును నేను. నక్షత్రాధిపతిjైున చంద్రుడను నేను, (21)
వేదానాం సామవేదో2స్మిదేవానామస్కివాసవః
ఇంద్రియాణాం మనశ్చాస్మిభూతానామస్మిచేతనా 22
వేదములో నేను సామవేదమును. దేవతలో ఇంద్రుడను నేనే. ఇంద్రియములో నేను మనస్సును. ప్రాణులో చైతన్యమును (ప్రాణశక్తిని) నేను. (22)
రుద్రాణాం శంకరశాస్మివిత్తేశో యక్షరక్షసామ్‌
వసూనాం పావకశ్చాస్మిమేరుః శిఖరిణామహమ్‌   23
ఏకాదశ రుద్రులో శంకరుడను నేను. యక్షరాక్షసులో ధనాధిపతిjైున కుబేరుడను నేను. అష్టవసువులో అగ్నిని నేను. పర్వతములో సుమేరు పర్వతమును నేను. (23)
పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్ధ బృహస్పతిమ్‌
సేనానీనామహం స్కందః సరసామస్మిసాగరః 24
పార్ధా! పురోహితులో ముఖ్యుడైన బృహస్పతిని నేనే. సేనాపతులో కుమారస్వామిని నేను. జలాశయములో నేను సాగరుడను. (24)
మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్‌
యజ్ఞానాం జపయజ్ఞో2స్మిస్థావరాణాం హిమాయః 25
మహర్షులో భృగువును నేను. శబ్దములో ఏకాక్షరమును అనగా ఓంకారమును యజ్ఞము యందు జపయజ్ఞమును నేను. స్థావరములో హిమాయమును నేను. (25)
అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః
గంధర్వాణాం చిత్రరథః సిద్దానాం కపిలో మునిః 26
వృక్షములో నేను అశ్వత్థమును (రావిచెట్టును) దేవర్షులో నారదుడను నేను. గంధర్వులో నేను చిత్రరథుడను. సిద్ధులో నేను కపిమునిని. (26)
ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్‌
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్‌ 27
అశ్వములో పా సముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్చైఃశ్రవమును నేను. భద్రజగములో ఐరావతమును నేను. మనుష్యులో ప్రభువును నేను. (27)
128 -
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మికామధుక్‌
ప్రజనశ్చాస్మికందర్పఃసర్పాణామస్మివాసుకిః 28
ఆయుధములో వజ్రాయుధమును నేను. పాడి ఆవులో కామధేనువును నేను. శాస్త్ర విహితరీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మథుడను నేను. సర్పములో వాసుకిని నేను. (28)
అనంతశ్చాస్మినాగానాం వరుణో యాదసామహమ్‌
పితృణామర్యమా చాస్మియమఃసంయమతా మహమ్‌ 29
నాగజాతివారిలో ఆదిశేషుడ (అనంతుడ)ను నేను. జచరముకు అధిపతిjైున వరుణుడను నేను. పితరులో అర్యముడను (పితృగణప్రభువును) నేను శాసకుతో యమధర్మరాజును నేను. (29)
ప్రహ్లాదశ్చాస్మిదైత్యానాంకాఃకయతామహమ్‌
మృగాణాంచమృగేంద్రో2హం వైనతేయశ్చపక్షిణామ్‌ 30
దైత్యులో నేను ప్రహ్లాదుడను. గణించువారిలో (గణకులో) నేను కామును మృగములో మృగరాజు ఐన సింహమును నేను. పక్షులో పక్షిరాజైన గరుత్మంతుడను నేనే (30)
పవనఃపవతామస్మిరామః శస్త్రభృతామహమ్‌
రaషాణాం మకరశ్చాస్మిస్రోతసామస్మిజాహ్నవీ 31
పవిత్రమొనర్చు వానిలో వాయువును నేను. శస్త్రధారులో శ్రీరామచంద్రుడను నేను. మత్స్యములో మొసలిని నేను. నదులో గంగానదిని నేను. (31)
సర్గాణామాదిరంతశ్చమధ్యం చైవాహమర్జున
అధ్యాత్మవిద్యావిద్యానాం వాదఃప్రవదతామహమ్‌ 32
ఓ అర్జునా! సృష్టికి ఆదిమధ్యాంతము నేను. (సృష్టి స్థితి య కారకుడను నేనే) విద్యలో ఆధ్యాత్మ విద్యను అనగా బ్రహ్మ విద్యను నేను. పరస్పర వాద వివాదములో తత్త్వ నిర్ణయమునకై చేయు ‘వాదము’ను నేను. (32)
అక్షరాణామకారో2స్మిద్వంద్వఃసామాసికస్య చ
అహమేవాక్షయఃకాలోధాతాహం విశ్వతోముఖః 33
అక్షరములో ‘అ’కారమును నేను. సమాసములో ‘ద్వంద్వ’ సమాసమును నేను. అక్షయ కాము అనగా మహాకామును నేను. అట్లే విశ్వతోముఖుడైన విరాట్‌ పురుషుడను నేను. అందరిని ధరించువాడను, పోషించువాడను నేను.(88)
మృత్యుః సర్వహరశ్చాహమ్‌ ఉద్భవశ్చభవిష్యతామ్‌
కీర్తిః శ్రీర్వాక్ష నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా 34
అన్ని ప్రాణమును హరించు మృత్యువును నేనే. సమస్త ప్రాణు  ఉత్పత్తి హేతువనఅును కూడా నేనే. స్త్రీలో కీర్తి, శ్రీ, వాక్కు స్మృతి, మేధా, ధృతి, క్షమా అను వారందను నేనే. (34)
బృహత్పామతథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్‌
మాసానాం మార్గశీర్షో2హమ్‌ ఋతూనాం కుసుమాకరః 35
గానము చేయుటకు అనువైన శ్రుతులో బృహతామమును నేను. ఛందస్సులో గాయత్రీ ఛందస్సును నేను. మాసములో మార్గశీర్షమును, ఋతువులో వసంత ఋతువును నేనే (35)
ద్యూతం చయతామస్మితేజస్తేజస్వినామహమ్‌
జయో2స్మి వ్యవసాయో2స్మిసత్త్వం సత్త్వవతామహమ్‌ 36
వంచకులో జూదమును నేనే. ప్రభావశాురలోని ప్రభావమునునేను. విజేతలో జయమును నేను. నిశ్చయాత్మకులో నిశ్చయమును, సాత్త్విక పురుషులో సాత్త్విక భావమును నేనే. (36)
వృష్ణీనాం వాసుదేవో2స్మిపాండవానాం ధనంజయః
మునీనామప్యహం వ్యాసఃకవీనామశనా కవిః 37
వృష్టి వంశజులో వాసుదేవుడను నేను. పాండవులో ధనంజయుడను నేను. అనగా నీవే నేను. మునులో వేదవ్యాసుడనునేను. కవులో శుక్రాచార్యుడను నేనే.
దండోదమయతామస్మినీతిరసిజిగీషతామ్‌
మౌనం చైవాస్మిగుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్‌ 38
శిక్షించువారిలో దండమును అనగా దమనశక్తిని నేనే. జయేచ్చ కవారి నీతిని నేనే. గోప్య విషయరక్షణమున ‘మౌనము’ ను నేను. జ్ఞాను యొక్క తత్త్వజ్ఞానమును నేనే. (38)
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున
న తదస్తి వినాయత్స్యాత్మయా భూతం చరాచరమ్‌ 39
ఓ అర్జునా! సర్వప్రాణు ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఏనన నేను లేని చరాచరప్రాణి యేదియును లేదు. (39)
నాంతో2 స్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప
ఏషతూద్దేశతఃప్రోక్తోవిభూతేర్విస్తరోమయా 40
ఓ పరంతపా! నా దివ్య విభూతుకు అంతమే లేదు. నా విభూతు విస్త ృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించితిని. (40)
యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా
తత్తదేవావగచ్ఛత్వం మమతేజో2ంశసంభవమ్‌ 41
విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము ఐన వస్తువేదైనను నా తేజస్సు యొక్కఅంశము నుండియే కలిగినదిగా తెలిసికొనుము. (41)
అథవా బహునైతేన కిం జ్ఞాతేనతవార్డున
విష్టభ్యాహమిదం కృత్స్నమ్‌ ఏకాంశేన స్థితో జగత్‌ 42
అథవా! ఓ అర్జునా! ఇంతకంటెను విపుముగా తెలిసికొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తును కేవము నా యోగ శక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించుచున్నాను.
ఓం తత్పదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
విభూతి యోగో నామ దశమో2ధ్యాయః 10

25, మార్చి 2017, శనివారం

జీవిత సత్యాలు

జీవిత సత్యాలు 


జీవితంలో ప్రత్యేకంగా ఉండడానికి ఉండడానికి నీవంతు ప్రయత్నించు.  పదిమందిలో ఉన్నా విభిన్నంగా ఉండడం ఒక  కళ. ప్రతి ఒక్కరిలో ఎదో ఒక ప్రత్యేకత ఉండి  తీరుతుంది.  గుంపులో గోవిందలాగా కాకుండా వందలొ ఒకరిగా వుండటానికి ప్రయత్నించు. నీకున్న లక్ష్యాలు నీకున్న ఆదర్శాలు నీకున్న ఆశయాలు నిన్ను విభిన్నంగా ఎదగడానికి సహకరిస్తాయి. 

చదవు మనిషికి విజ్ఞానాన్ని అందిస్తుంది. సంస్కారాన్ని నేర్పిస్తుంది. అందాన్ని పెంచుతుంది. సమాజంలో గౌరవాన్ని కలిగిస్తుంది. చదవడం వలన మనకు ఒకగూరే ప్రయోజనం ఎమంటె నలుమూలల నుండి వచ్చే విజ్ఞానాన్ని అంది పుచ్చుకోవడం, దాని నుంచి మేలైన గుణపాఠాలు నేర్చుకోవడం తద్వారా మన జీవితాలని సుగమం చేసుకోవడం. అందుకే చదువుని కించపరచరాదు. నిర్లక్ష్యం చేయరాదు.  పనికిరాని పనులకి చదువుని పణంగా పెట్టరాదు. చదువు పెంచడానికి... అందరికి పంచడానికి.... 

సత్యమునె పలుకు , సత్యమునె విను, సత్య సందతని పాటించు. సత్యము ఎంతో విలువైనది. వజ్రంకంటె మిగుల స్థిరమైనది. బంగారం కంటె గొప్ప వన్నె కలిగినది.  సర్వ వేళలా మనలని ఆపదలనుండి కాపాడేది సత్యము మాత్రమే. జ్ఞానులెందరో సత్యాన్ని పాటించి సద్గతిని పొందారు. సత్యమే మనలని చివరి మజిలీ వరకు తోడు నీడగా ఉండేది. పొరపాటున సత్యాన్ని విడిచి దిద్దుకోలేని పెద్ద తప్పిదం చేయకు.  

సేవా భావం ఎంత గొప్పదంటే అది ఒకానొక దశలో మనల్ని మైమరపింప జేస్తుంది.  అందుకే మనం మన విలువైన సేవలని ఏ విదంగానూ వృధా చేయరాదు. సొదర మానవుల సేవలో పరసరాలు పరవసించేలా , ప్రక్రుతి పులకరించేలా మన సేవా కార్యక్రమాలుండాలి.  నిరంతరం పరుల సేవలో మునిగి తేలేవారు  సదా ధన్యులు. అలాంటి వారెపుడూ మనసులోఆనందంగా వుంటూ జీవితంలో కడసరి విజేతలుగా నిలుస్తారు. తోటివారిని ఆనంద సాగరంలో ముంచెత్తుతారు. 

మనం చేసే మంచి పని  గోడకు కొట్టిన బంతిలా తిరిగి మనకే మేలు చేస్తుంది. మంచిని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది. డబ్బు, సంపదలు, పేరు, హోదాలు అన్నీ మనతోనే అంతరించి పోతాయి.  కానీ మనం పరులకొసం చేసే కేవలం ఒకే ఒక మంచి పని మాత్రం ఆచంద్రార్కం జగతిలో శాశ్వతంగా నిలిచిపొతుంది. ఇది జగమెరిగిన  సత్యం.  అంతేకాని ఎవరో కవులు, పూర్వీకులు తమ గొప్పల కోసం చెప్పిన  నుడివి కాదు. 

మనిషికి  సహనం ఎంతో అవసరం. లక్ష్యసాధనలో మనం గమిస్తుంటాం. ఆ గమనమే గమ్యాన్ని చేరుస్తుంది.   ఆ గమనం ఉరకలు  ఉండకూడదు.   ఆవేశపడి గెలవడానికి తొందర  పడరాదు .  సహనంతో ఆవేశానికి కళ్లెం వేయాలి .  సహనంతో కూడిన ప్రయత్నమే విజయానికి చేరువ చేస్తుంది . గెలవాలని ఆవేశపడితే  కచ్చితంగా ఓడిపోతాం.   జీవితంలో గెలవాలన్న ఓడాలన్న సహనం కీలక పాత్ర  వహిస్తుంది. సహనమే గమ్యానికి చక్కని  రహదారి.    

డబ్బులు  లేని వాడ్ని చూసి పేదరికం వెక్కిరిస్తుంది.  కాసుల గలగలలు ఉన్న ఇంట్లోకే లక్ష్మి ప్రవేశిస్తుంది.  యుద్ధంలో ఓడిన రాజుకు విలువ లేనట్లే ధనం లేని మనిషికి  ఏ విలువా ఉండదు. మనిషి ఏ పని చేసైనా సంపాదించాలి.  కుటుంబ బాధ్యతలని సక్రమంగా నెరవేర్చాలి. ధర్మ మార్గంలో సంపాదించిన సొమ్ముని జనవినియోగానికి ప్రత్యేకించాలి.   

మనం జీవితంలో మరవకూడని వారు మన బాధ్యతలని గుర్తుచేస్తుంటారు. అందులో మొదటి వారు కనింపెంచిన తలిదండ్రులు. (వారిని సమాదరించి ఋణం తీర్చుకోవాలి).  మిగతా వారు ఆత్మీయ బంధువులు మరియు ప్రేమించే స్నేహితులు. (వీరిని ఆపదలో ఆదుకుంటూ పరస్పర సహకారంతో మెలగాలి). కడపటి వారు ఇంటి కుటుంబ సభ్యులు. జీవితాంతం వీరిని కనిపెట్టుకొంటుండాలి. తన పర్యవేక్షణలో ఎలాంటి కష్టనష్టాలు వారు ఎదుర్కోకుండా  కంటికి రెప్పలా తన కుటుంబాన్ని కాపాడుకోవాలి.  

రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది డబ్బు. అది ఎంతటి అనర్ధాన్ని కలిగిస్తుందంటే చక్కగా  కాపురం చేసుకునే ఆలుమగల మధ్యన చిచ్చు పెడుతుంది. అన్నదమ్ముల మధ్యన స్పర్ధలను కలిగిస్తుంది. మిత్రుల మధ్య స్నేహాన్ని నాశనం చేస్తుంది. కన్నతలిదండ్రులను దూరం చేస్తుంది. కని  పెంచిన పిల్లలలో సంబంధాలని తెగ్గొడుతుంది... అందుకే మనం డబ్బుని కూరగాయల్ని తరిగే కత్తిలా మాత్రమే వాడాలి సుమా!