జీవిత సత్యాలు
జీవితంలో ప్రత్యేకంగా ఉండడానికి ఉండడానికి నీవంతు ప్రయత్నించు. పదిమందిలో ఉన్నా విభిన్నంగా ఉండడం ఒక కళ. ప్రతి ఒక్కరిలో ఎదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది. గుంపులో గోవిందలాగా కాకుండా వందలొ ఒకరిగా వుండటానికి ప్రయత్నించు. నీకున్న లక్ష్యాలు నీకున్న ఆదర్శాలు నీకున్న ఆశయాలు నిన్ను విభిన్నంగా ఎదగడానికి సహకరిస్తాయి.
చదవు మనిషికి విజ్ఞానాన్ని అందిస్తుంది. సంస్కారాన్ని నేర్పిస్తుంది. అందాన్ని పెంచుతుంది. సమాజంలో గౌరవాన్ని కలిగిస్తుంది. చదవడం వలన మనకు ఒకగూరే ప్రయోజనం ఎమంటె నలుమూలల నుండి వచ్చే విజ్ఞానాన్ని అంది పుచ్చుకోవడం, దాని నుంచి మేలైన గుణపాఠాలు నేర్చుకోవడం తద్వారా మన జీవితాలని సుగమం చేసుకోవడం. అందుకే చదువుని కించపరచరాదు. నిర్లక్ష్యం చేయరాదు. పనికిరాని పనులకి చదువుని పణంగా పెట్టరాదు. చదువు పెంచడానికి... అందరికి పంచడానికి....
సత్యమునె పలుకు , సత్యమునె విను, సత్య సందతని పాటించు. సత్యము ఎంతో విలువైనది. వజ్రంకంటె మిగుల స్థిరమైనది. బంగారం కంటె గొప్ప వన్నె కలిగినది. సర్వ వేళలా మనలని ఆపదలనుండి కాపాడేది సత్యము మాత్రమే. జ్ఞానులెందరో సత్యాన్ని పాటించి సద్గతిని పొందారు. సత్యమే మనలని చివరి మజిలీ వరకు తోడు నీడగా ఉండేది. పొరపాటున సత్యాన్ని విడిచి దిద్దుకోలేని పెద్ద తప్పిదం చేయకు.
సేవా భావం ఎంత గొప్పదంటే అది ఒకానొక దశలో మనల్ని మైమరపింప జేస్తుంది. అందుకే మనం మన విలువైన సేవలని ఏ విదంగానూ వృధా చేయరాదు. సొదర మానవుల సేవలో పరసరాలు పరవసించేలా , ప్రక్రుతి పులకరించేలా మన సేవా కార్యక్రమాలుండాలి. నిరంతరం పరుల సేవలో మునిగి తేలేవారు సదా ధన్యులు. అలాంటి వారెపుడూ మనసులోఆనందంగా వుంటూ జీవితంలో కడసరి విజేతలుగా నిలుస్తారు. తోటివారిని ఆనంద సాగరంలో ముంచెత్తుతారు.
మనం చేసే మంచి పని గోడకు కొట్టిన బంతిలా తిరిగి మనకే మేలు చేస్తుంది. మంచిని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది. డబ్బు, సంపదలు, పేరు, హోదాలు అన్నీ మనతోనే అంతరించి పోతాయి. కానీ మనం పరులకొసం చేసే కేవలం ఒకే ఒక మంచి పని మాత్రం ఆచంద్రార్కం జగతిలో శాశ్వతంగా నిలిచిపొతుంది. ఇది జగమెరిగిన సత్యం. అంతేకాని ఎవరో కవులు, పూర్వీకులు తమ గొప్పల కోసం చెప్పిన నుడివి కాదు.
మనిషికి సహనం ఎంతో అవసరం. లక్ష్యసాధనలో మనం గమిస్తుంటాం. ఆ గమనమే గమ్యాన్ని చేరుస్తుంది. ఆ గమనం ఉరకలు ఉండకూడదు. ఆవేశపడి గెలవడానికి తొందర పడరాదు . సహనంతో ఆవేశానికి కళ్లెం వేయాలి . సహనంతో కూడిన ప్రయత్నమే విజయానికి చేరువ చేస్తుంది . గెలవాలని ఆవేశపడితే కచ్చితంగా ఓడిపోతాం. జీవితంలో గెలవాలన్న ఓడాలన్న సహనం కీలక పాత్ర వహిస్తుంది. సహనమే గమ్యానికి చక్కని రహదారి.
డబ్బులు లేని వాడ్ని చూసి పేదరికం వెక్కిరిస్తుంది. కాసుల గలగలలు ఉన్న ఇంట్లోకే లక్ష్మి ప్రవేశిస్తుంది. యుద్ధంలో ఓడిన రాజుకు విలువ లేనట్లే ధనం లేని మనిషికి ఏ విలువా ఉండదు. మనిషి ఏ పని చేసైనా సంపాదించాలి. కుటుంబ బాధ్యతలని సక్రమంగా నెరవేర్చాలి. ధర్మ మార్గంలో సంపాదించిన సొమ్ముని జనవినియోగానికి ప్రత్యేకించాలి.
మనం జీవితంలో మరవకూడని వారు మన బాధ్యతలని గుర్తుచేస్తుంటారు. అందులో మొదటి వారు కనింపెంచిన తలిదండ్రులు. (వారిని సమాదరించి ఋణం తీర్చుకోవాలి). మిగతా వారు ఆత్మీయ బంధువులు మరియు ప్రేమించే స్నేహితులు. (వీరిని ఆపదలో ఆదుకుంటూ పరస్పర సహకారంతో మెలగాలి). కడపటి వారు ఇంటి కుటుంబ సభ్యులు. జీవితాంతం వీరిని కనిపెట్టుకొంటుండాలి. తన పర్యవేక్షణలో ఎలాంటి కష్టనష్టాలు వారు ఎదుర్కోకుండా కంటికి రెప్పలా తన కుటుంబాన్ని కాపాడుకోవాలి.
రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది డబ్బు. అది ఎంతటి అనర్ధాన్ని కలిగిస్తుందంటే చక్కగా కాపురం చేసుకునే ఆలుమగల మధ్యన చిచ్చు పెడుతుంది. అన్నదమ్ముల మధ్యన స్పర్ధలను కలిగిస్తుంది. మిత్రుల మధ్య స్నేహాన్ని నాశనం చేస్తుంది. కన్నతలిదండ్రులను దూరం చేస్తుంది. కని పెంచిన పిల్లలలో సంబంధాలని తెగ్గొడుతుంది... అందుకే మనం డబ్బుని కూరగాయల్ని తరిగే కత్తిలా మాత్రమే వాడాలి సుమా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి