Useful Guide for Hyderabad Telugu People...General Awareness for All ...Education....Movies.... Politics... Social...Cultural.....Events.....and many more things to know updates......
మొత్తం పేజీ వీక్షణలు
31, ఆగస్టు 2022, బుధవారం
తోడ బుట్టినట్టి తోబుట్టువులకును
తోడ బుట్టినట్టి తోబుట్టువులకును
"రాఖి"గట్ట గలరు రమణులంత
"రక్ష బంధనంబు" రమణీయ పర్వము
భరత జాతి కిలను భవ్యముగను!
పుట్టినట్టి రోజు పుడమిపై "శ్రీకృష్ణ"
పుట్టినట్టి రోజు పుడమిపై "శ్రీకృష్ణ"
జగము జరుపుకొనును జన్మవేడ్క
ధర్మముద్ధరించ ధరణిపై దిగివచ్చి
మంచి నాయకుడిగ మమ్ముబ్రోవు!
వరములీయుమయ్య వరసిద్ధి గణపతి
వరములీయుమయ్య వరసిద్ధి గణపతి
మంచి బుద్ధినొసగు మాకు నీవు
మానవత్వ గుణము మరుగైన మాయందు
మరల మేలుగొలిపి మార్పుదెమ్ము!
విఘ్నపతివి నీవు విఘ్నము లేకుండ
విఘ్నపతివి నీవు విఘ్నము లేకుండ
పనులు జరుగునట్లు ఫలితమివ్వు
పార్వతమ్మ పుత్ర పరమేశనందనా
వినుతి జేతుమయ్య విఘ్నరాజ!
అరటిపండు, నామ్రఫలము నమరు కుడి కరంబులన్
అరటిపండు, నామ్రఫలము
నమరు కుడి కరంబులన్
చెరుకు గడయు, పనసపండు
చేరు నెడమ చేతులన్
పరగ తొండమందు వెలగ
పండొ, కుడుమొ పట్టుచున్
తిరుగునట్టి బాల గణప
తీ! ప్రభూ! గణేశ్వరా!