పరగ దాడి నిమ్మ పండు
దాల్చినట్టి తొండమున్,
కరములందు కలువయు, వరి
కంకి, యక్ష మాలయున్,
స్థిరముగాను వీణ బూని
తివి వినీల మూర్తివై
యరయ నెంగిలి గణపతి య
యారె! యన గణేశ్వరా!
Useful Guide for Hyderabad Telugu People...General Awareness for All ...Education....Movies.... Politics... Social...Cultural.....Events.....and many more things to know updates......
పరగ దాడి నిమ్మ పండు
దాల్చినట్టి తొండమున్,
కరములందు కలువయు, వరి
కంకి, యక్ష మాలయున్,
స్థిరముగాను వీణ బూని
తివి వినీల మూర్తివై
యరయ నెంగిలి గణపతి య
యారె! యన గణేశ్వరా!
దేవ దేవ! సిద్ధ గణప
తీ! సువర్ణ వర్ణ! "శ్రీ
"దేవి"యును మరియు "సమృద్ధ
దేవి" శ్రీమతులుగ సం
"భావితుడవు. చెఱుకు గడయు,
పరశువు, విరిగుత్తియున్,
మావి పండు దాల్చి వరలు
మాన్యుడవు గణేశ్వరా!
పుస్తకంబు, నక్షమాల
పొసగ యోగదండమున్
హస్తముల కమండలంబు
నమర దాల్చియుందువే!
నిస్తుల మగు చంద్రకాంతి
నిండిన ద్విజ గణపతీ!
మస్తకంబు జేర్తు పాద
మందునన్ గణేశ్వరా!
పంకజ ముఖి, దేవి ఆకు పచ్చ కాంతు లీనగా
సంకటముల బాపు చేయి సాచి కవుగిలింపగా
నంకుశమును, పల్లు, త్రాడు నలరె మూడు చేతులన్
కంకణము లనంగ శక్తి గణపతీ! గణేశ్వరా!