మొత్తం పేజీ వీక్షణలు

12, జులై 2022, మంగళవారం

లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా సహ వీర్యవాన్

      "లక్ష్మణేన సహ భ్రాత్రా 

      సీతయా సహ వీర్యవాన్, 18

      ఆరుహ్య పుష్పకం దివ్యం 

      విమానం సూర్య సన్నిభమ్,

      ఉత్తరాం దిశమాలోక్య 

      జగామ పురుషోత్తమః  19"

పరాక్రమవంతుడు, పురుషశ్రేష్ఠుడు అయిన రాముడు, సోదరుని తోను, సీతతోను కలిసి, సూర్యుని లాగా ప్రకాశిస్తున్న, దివ్యమైన పుష్పక విమాన మెక్కి, ఉత్తర దిక్కుకు వెళ్ళాడు.

(సుందరకాండము 27 వ సర్గ)

9, జులై 2022, శనివారం

అప్పులు ముంచునేమొ యని యారట మందవు.. రావణుండు పెన్

    అప్పులు ముంచునేమొ యని

       యారట మందవు.. రావణుండు పెన్

    నిప్పులు రాలు కన్నులను

       నిన్నుఁ గనుంగొనఁ దల్లడిల్ల.. వొ

    క్కప్పుడు రామనామ మను

       నస్త్రము వీడవు.. భీతి నంద.. వే

    మెప్పులు గోర.. వంచును స

       మీర సుతున్ గొనియాడి రా కపుల్..


దశ యోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి, లంకలోని సీత జాడ కనుక్కొని, లంకను దహించి, క్షేమంగా తిరిగి రా గలిగిన హనుమంతు నిట్లు కొనియాడినారు వానరులు.

        అప్పులు = నీళ్ళు (సముద్రజలం)

         సమీర సుతుడు= ఆంజనేయుడు

2022 calendar | telugu full calendar 2022 festivals | hindu calendar fes...

6, జులై 2022, బుధవారం

శ్రవణం కీర్తనం విష్ణో స్స్మరణం పాదసేవనం

శ్రవణం కీర్తనం విష్ణో 

    స్స్మరణం పాదసేవనం

    అర్చనం వందనం దాస్యం

    సఖ్య మాత్మ నివేదనం


కేశవ! నారాయణ! భో

    మాధవ! గోవింద! హే మహావిష్ణో!

    మధుసూదన! త్రివిక్రమ!

    వామన! భో శ్రీ ధర! ప్రభు! హృషీకేశ!


శ్రీ నాథ! నారాయణ! వాసుదేవ!

    శ్రీ కృష్ణ! భక్తప్రియ! చక్రపాణే!

    శ్రీ పద్మనాభాచ్యుత! కైటభారే!

    శ్రీ రామ! పద్మాక్ష! హరే! మురారే!

సారసనేత్రుడున్ జలజ సంభవుడున్ సువశిష్ట మౌని సొం

    సారసనేత్రుడున్ జలజ

        సంభవుడున్ సువశిష్ట మౌని సొం

    పారెడు శక్తి తత్ సుతుడు 

        నా శుకుడున్ శుభ గౌడపాదుడున్

    సారెకు వారి శిష్యులును

        శంకరులున్ గలయట్టి యొజ్జపుం

    బారె శరణ్య మయ్యె గద 

        పండిత పామరు లెల్ల వారికిన్


    విష్ణువు, బ్రహ్మ, వశిష్టుడు, శుకుడు మున్నగు మహామహులు గౌడపాదులు, వారి శిష్యులు ఆది శంకరులు మొదలైన గురువుల పరంపరయే పండిత పామరు లందరికీ శరణ్యం కదా! అని భావం.


లలితాదిత్య వధానం

బిలలోన నపూర్వ మగుచు నింపొనగూర్చెన్

లలిత పద బంధములు, కొల

తల కందని భావ సంపదలు మెరయంగన్  1


ఆయు రారోగ్య భాగ్యంబు లమరు గాక!

దేవతల దేశికుల గొప్ప దీవన లవి

యహరహము చిరంజీవికి నందుగాక!

ఇలను శ్రీ లలితాదిత్య వెలుగుగాక! 2

6th class | fa1 english test paper | class 6 english | formative exam | ...