మొత్తం పేజీ వీక్షణలు

6, జులై 2022, బుధవారం

సారసనేత్రుడున్ జలజ సంభవుడున్ సువశిష్ట మౌని సొం

    సారసనేత్రుడున్ జలజ

        సంభవుడున్ సువశిష్ట మౌని సొం

    పారెడు శక్తి తత్ సుతుడు 

        నా శుకుడున్ శుభ గౌడపాదుడున్

    సారెకు వారి శిష్యులును

        శంకరులున్ గలయట్టి యొజ్జపుం

    బారె శరణ్య మయ్యె గద 

        పండిత పామరు లెల్ల వారికిన్


    విష్ణువు, బ్రహ్మ, వశిష్టుడు, శుకుడు మున్నగు మహామహులు గౌడపాదులు, వారి శిష్యులు ఆది శంకరులు మొదలైన గురువుల పరంపరయే పండిత పామరు లందరికీ శరణ్యం కదా! అని భావం.


లలితాదిత్య వధానం

బిలలోన నపూర్వ మగుచు నింపొనగూర్చెన్

లలిత పద బంధములు, కొల

తల కందని భావ సంపదలు మెరయంగన్  1


ఆయు రారోగ్య భాగ్యంబు లమరు గాక!

దేవతల దేశికుల గొప్ప దీవన లవి

యహరహము చిరంజీవికి నందుగాక!

ఇలను శ్రీ లలితాదిత్య వెలుగుగాక! 2

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి