Useful Guide for Hyderabad Telugu People...General Awareness for All ...Education....Movies.... Politics... Social...Cultural.....Events.....and many more things to know updates......
మొత్తం పేజీ వీక్షణలు
10, జూన్ 2022, శుక్రవారం
8, జూన్ 2022, బుధవారం
మనము నిశ్చలముగ గనుక నీ వుంచిన ....శంకర సూక్తి
శంకర సూక్తి
మనము నిశ్చలముగ గనుక నీ వుంచిన
నిన్ను జేర్చు నదియె నిక్కముగను
ధరణిలోన సరిగ పరమాత్మ దరి.. లేదొ..
పూని నిన్ను భ్రమలలోన ముంచు..
ఉబుసుపోని కబుర్లు నుత్తమ జపములౌ...devi padhyam telugu
"ఉబుసుపోని కబుర్లు నుత్తమ జపములౌ..
పొసగఁ జేతులుఁ ద్రిప్ప ముద్ర లగును..
ఇటు నటు తిరుగుడులే ప్రదక్షిణ లగు..
నశనముల్ లో నగ్ని కాహుతు లగు..
పొసగ సెజ్జల మీది పొర్లాటలే సుమ్మి
పొరలుడు దండాల పొలుపు మీరు..
మన సుఖా లన్ని యాత్మ స్వరూపిణి, దేవి
కర్పింప నిటు సపర్య లయి మించు..
దేవీ సాయుజ్యం - సౌందర్య లహరి......జపో జల్ప శ్శిల్పం సకల మపి
దేవీ సాయుజ్యం - సౌందర్య లహరి
జపో జల్ప శ్శిల్పం సకల మపి
ముద్రా విరచనం
గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనా
ద్యాహుతి విధిః
ప్రణామః సంవేశః సుఖ మఖిల
మాత్మార్పణ దృశా
సపర్యా పర్యాయ స్తవ భవతు
య న్మే విలసితమ్
మాటలే జపాలుగా మారుతాయి. చేతులు అటూ ఇటూ తిప్పడమే ముద్ర లౌతాయి.వీధుల్లో తిరుగడాలే ప్రదక్షిణలుగా మారిపోతాయి. తినే తిం డ్లన్నీ యజ్ఞంలో వేస్తున్న హవిస్సు లైపోతాయి. పడుకోవడాలే సాష్టాంగ ప్రణామాలుగా మారిపోతాయి.
ఎప్పుడూ అర్చనలు చేయలేము. నిత్య కృత్యాలూ మానుకోలేము. కాని రోజు వారీ పనులనే దేవీ సేవలుగా భావించి చేస్తే అవన్నీ అలాగే పరిణమిస్తాయి. ముక్తి అన్నది చాలా సులభ మౌతుంది
మాటల్ నీ జప, మంగ విన్యసన మమ్మా!
ముద్ర, లా చోటు లీ
చోటుల్ ద్రిమ్మరుటే ప్రదక్షిణ, హవిస్సుల్
భోజ్యముల్, సెజ్జ పొ
ర్లాటల్ నీకు ప్రణామముల్, సుఖము లి
ట్లాత్మార్పణ న్జేయ నే
చేటున్ గల్గక నీ సపర్య లవుగా!
శ్రీ చక్ర సింహాసనా!
రాళ్ళు రప్ప లనక.. కాళ్ళు నొప్పు లనక....ramayanam - telugu padhyam
రాళ్ళు రప్ప లనక.. కాళ్ళు నొప్పు లనక
నీళ్ళు నమలకుండ నూళ్ళు దాటి,
జానకి, పతి, మరిది కానకుఁ బాకోళ్ళుఁ
జెదరఁ జనిరి.. బీళ్ళు చేలు దాటి
సీతారామ లక్ష్మణుల వనవాస గమనము.
నీళ్ళు నమలకుండా (తండ్రి మాట నిలబెట్ట డానికి రాముడు, అన్న వెంట వెళ్ళడానికి లక్ష్మణుడు, భర్త ననుసరించడానికి జానకి ఏమాత్రం సంశయించకుండా) పాదుక లరిగిపోతుండగా చేలు, బీళ్ళు, ఊళ్ళు దాటి,
కాన (అడవికి) కు జనిరి.
నీళ్ళు నమలుట= సంకోచించుట
పాకోళ్ళు= పాదుకలు
మా తలయె దుష్ట భావాల మాత, మంచి ..... ramayanam - telugu padhyam meaning
మా తలయె దుష్ట భావాల మాత, మంచి
తలపు లను పతివ్రతలను తరిమి చెఱచు
విటులె యీ చెడ్డ యూహ, లీ విటుల తల్లి
మా తలయె, మాయ యను విటున్ మరిగి దైవ
మను పతిని మోసగింప జూచు, నది వేశ్య -
మా తల కుమాత, విటులకు మాత, వేశ్య
రావణుడు మారీచుని ఆశ్రమానికి వెళ్ళాడు. మారీచ స్తత్ర మునివత్ జటా వల్కల ధారకః 6-2 ఆశ్రమంలో మారీచుడు జటావల్కలాలతో ముని వృత్తిలో ఉన్నాడు.
రావణుడు అతణ్ణి సీతాపహరణానికి ప్రేరేపించినాడు. అతను దైవాన్ని మోసగించడం మంచిది కాదు, మనకే ము ప్పన్నాడు.
తవ హితం వదతో మమ భాషితం
పరిగృహాణ పరాత్మని రాఘవే
(అధ్యాత్మ రామాయణం.. అరణ్య 6-25)
నేను నీకు హితము చెబుతున్నాను. పరమాత్మ యైన రాముని యందు వైరం వదలిపెట్టు.
అతో న మానుషో రామః
సాక్షా న్నారాయణోఽ వ్యయః
మాయా మానుష వేషేణ
వనం యాతోఽ తి నిర్భయః 28
రాముడు మానవుడు కాదు. సాక్షాత్తు అవ్యయుడైన నారాయణుడు. మాయా మానుష వేషంతో అడవుల్లోకి నిర్భయుడై వచ్చాడు... అన్నాడు.
కానీ చివరికి ఇష్టం లేకున్నా మారీచుడు రావణునికి సహకరించేందు కొప్పుకోవలసి వచ్చింది - ఒక మిత్రునితో తన ఆవేదన నిలా వెళ్ళగ్రక్కినాడు. మా తల (మా బుఱ్ఱ లేదా మెదడు) కుమాత (చెడ్డతల్లి) అని, విటులకు మాత యని, వేశ్య యని చెప్పినాడు. భావం సులభం.
(మాయకు లొంగిపోకుండా వుండే తల (బుఱ్ఱ)యే తన నుద్ధరించే మంచి మాత అని అతని ఆంతర్యం)
బావు రనలేదు కానల బోవు టనిన - sri ramayanam telugu padhyam
బావు రనలేదు కానల బోవు టనిన
హాలహలమును మ్రింగెడు హరు డిత డన
బాధ్యతగ నెంచె పితృవాక్య పాలనమునె
హిమగిరి నిభుండు రాముండు విమల గుణుడు..
సందర్భం: కి మ్మనకుండా అరణ్యవాసానికి సంసిద్ధుడైన రాముణ్ణి చూసి విస్తుపోయిన పౌరుల మనోగత మిది.