మొత్తం పేజీ వీక్షణలు

5, సెప్టెంబర్ 2022, సోమవారం

అవధాన బాలభాస్కర..

 అవధాన బాలభాస్కర..

   ప్రవిమల బిరుదాంకితుండు, పండితవరు డీ

   యవధాన విద్యయందున

   ప్రవణుండై పేరు గాంచవలె నని యెంతున్

భారతదేశ సంస్కృతి వైభవం.. వేదము శాస్త్రము సంస్కృతి

 వేదము శాస్త్రము సంస్కృతి

మోదంబు నొసంగును తుద ముట్ట నెరుంగం

గా దరమే భారతమున..

నే దేశమ్మైనను గురుతించగవలయున్

పుడమి సద్విద్య నేర్చి రీ పుత్రు లనుచు

 పుడమి సద్విద్య నేర్చి రీ పుత్రు లనుచు

ముందు తరముల దిద్దెడు ముద్దు బిడ్డ

లనుచుఁ బరవశమును బొందె నఖిలమైన

విద్యలకుఁ దల్లి శ్రీ వాణి ప్రేమమూర్తి

ఆహ్లాదంబుగ దేవతాళి గగనం బం దుండి వీక్షింపగా

 ఆహ్లాదంబుగ దేవతాళి గగనం

   బం దుండి వీక్షింపగా

ప్రహ్లాదున్ బరిరక్ష సేయుటకునై

   భవ్యాకృతిన్ దాల్చె.. నౌ

రా! హ్లాదంబున శౌరి.. సత్సుఖదమై 

   రాజిల్లుచున్ మేటిదౌ

ప్రహ్లాదంబు వరించె లోకమునకున్

   భద్రమ్ముగా నెంతయున్

శ్రీ రమణీయ పద్య రస సిద్ధ కవిత్వ ఘన ప్రదీప్తితో

 శ్రీ రమణీయ పద్య రస 

   సిద్ధ కవిత్వ ఘన ప్రదీప్తితో

సార వివేక పూర్ణ విల

   స న్మతులై చరియించు వారు భా 

షా రతి కల్గి దుర్గుణపు

    షండము వీడగ నందు నా చయం

బారు శరణ్య మయ్యె మన

    పండిత పామర కోటి కియ్యెడన్

అరయ శూల, చక్ర, ముద్గ, రాంకుశ, ధ్వ, జాంబువుల్

 అరయ శూల, చక్ర, ముద్గ,

  రాంకుశ, ధ్వ, జాంబువుల్

 

పరశు వాది యాయుధములఁ

  బదియు నారుఁ బట్టుచున్


అరుణకాంతి మీరఁ బదియు 

 నారు భుజము లొప్పగా


మెరయు వీర గణపతి! వర

 మీయరా! గణేశ్వరా!