మొత్తం పేజీ వీక్షణలు

5, జులై 2021, సోమవారం

Popular Telugu Books presentation | Famous Books and Writers Cover Page ...

పుష్కర సమయంలో ఏ రోజు ఏ దానం చేయాలి

పురాణాలలో చెప్పబడిన పుష్కర సమయంలో చేయవలసిన దానాలు.


మొదటి రోజు

సువర్ణ దానం, రజితము దానం, ధాన్య దానం , భూదానం చేయాలి.

రెండవరోజు

వస్త్ర దానం, లవణ దానం, రత్న దానం చేయాలి.

మూడవ రోజు

గుడ(బెల్లం), అశ్వశాఖ, ఫల దానం చేయాలి.

నాల్గవ రోజు

ఘృతం(నెయ్యి)దానం,తైలం(నూనె)దానం,క్షీరం(పాలు),మధువు(తేనె)దానం చేయాలి.

ఐదవ రోజు

ధాన్యదానం , శకట దానం,వృషభదానం, హలం దానం చేయాలి.

ఆరవవ రోజు

ఔషధదానం, కర్పూరదానం,చందనదానం, కస్తూరి దానం చేయాలి.

ఏడవ రోజు

గృహదానం, పీట దానం, శయ్య దానం చేయాలి.

ఎనిమిద రోజు

చందనం, కందమూలాల దానం, పుష్ప మాల దానం చేయాలి.

తొమ్మిదవ రోజు

పిండ దానం, దాసి దానం, కన్యాదానం, కంబళి దానం చేయాలి.

పదవ రోజు

శాకం(కూరగాయలు)దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం చేయాలి.

పదకొండ రోజు

గజ దానం చేయాలి.

పన్నెండవ రోజు

తిల(నువ్వులు)దానం చేయాలి.


పుష్కరకాల స్నానం


నీటిలో రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది. దాహార్తిని తీర్చడం,శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం,యజ్ఞనం అనేశక్తులున్నాయని వేదం వివరిస్తుంది.

మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే యాజ్ఞనం అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన.

నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానంద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు.తీర్ధ స్నానం ఉత్తమం దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం. 

ఆసమయంలో దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని,పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం లభిస్తుందని, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రంహాండ పురాణం వర్ణిస్తుంది.

నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక ఋగ్గ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది.ఇసుకతో కాని, మట్టితో కాని పార్థీవ శివలింగాన్ని చేసి పూజించాలంటారు. 

నదీ తీరంలోని ఇసుకను నదిలోకి వేయాలంటారు. పురోహితులు భక్తుల తలపై మూడు దోసిళ్ల నీళ్లతో ఆశీస్సులు అందజేస్తారు. గోదావరికి దీప దానం కూడా చేస్తారు. -


నారదుడు పేర్కొన్న శత పుణ్య తీర్థాలు

 1. పుష్కరం

2. జంబూమార్గం, 

3. తండులికాశ్రమం, 

4. అగస్త్యవటం, 

5. కణ్వాశ్రమం, 

6. ధర్మారణ్యం, 

7. యయాతి పతనం, 

8. మహాకాళం, 

9. కోటితీర్థం, 

10. భద్రవటం, 

11. నర్మదాతీర్ధం, 

12. దక్షిణసింధూతీర్థం, 

13. చర్మణ్వతీ తీర్ధం, 

14. వసిష్ఠాశ్రమం, 

15. పింగం, 

16. ప్రభాస తీర్థం, 

17. వరదానం, 

18. సరస్వతీసాగరసంగమం, 

19. పిండాకరం, 

20. సాగర సింధు సంగమం, 

21. శంకు కర్ణేశ్వరం, 

22 వసుధార, 

23. వసుసరం, 

24 సింధూత్తమతీర్థం, 

25. బ్రహ్మతుంగ, 

26. శక్రకుమారి, 

27. శ్రీకుండం, 

28. విమం, 

29. బడబ, 

30. దేవిక, 

31. కామతీర్ధం, 

32. రుద్రతీర్ధం, 

38. యజనం, 

34. యాజనం, 

35. బ్రహ్మవాుకం, 

36. దీర్ఘసత్రం, 

37. వినశనం, 

38. నాగోద్భేదం, 

39. శివోద్భేదం, 

40. చమసోద్భేదం, 

41. సరస్వతి, 

42. శశయానం, 

43. రుద్రకోటి, 

44. నైమిశం, 

45. కురుక్షేత్రం, 

46. శమంతకపంచకం, 

47. రామప్రదం, 

48. విష్ణుస్థానం, 

49. పారిప్లవం, 

50. పృథివీతీర్థం, 

51. శాూకిని, 

52. సర్పతీర్థం, 

58. వరాహతీర్థం, 

54. అశ్వినీతీర్థం, 

55. జయంతిలో సోమతీర్ధం, 

56. కృతశాచతీర్థం, 

57. అగ్నివటం, 

58. ముంజవటం, 

59. యక్షిణీతీర్థం, 

60. కురుక్షేత్రద్వారం, 

61. కాయశోధనం, 

62. లోకోద్దారం, 

63. శ్రీతీర్ధం, 

64. కపితీర్థం, 

65. సూర్యతీర్థం, 

66. గోభవనం, 

67. శంఖినీతీర్థం, 

68. యక్షేంద్రతీర్థం, 

69. మాత ృతీర్థం, 

70. బ్రహ్మావర్తం, 

71. శరవణం, 

72 శ్వావిల్లోమాపహం, 

73. మానుషతీర్థం, 

74 ఆపగానది, 

75. బ్రహ్మోదంబరం, 

76. సప్తర్షికుండం, 

77. కేదారం, 

78. కపికేదారం, ‘

79. సరకం, 

80. ఇలాస్పదం, 

81. కిందానం, 

82. కింజప్యం, 

83. నారదతీర్థమైన అంబాజన్మం, 

84. పుండరీకం, 

85. వైతరణి, 

86. ఫకీవనం, 

87. మిశ్రకం, 

88. వ్యాసవనం, 

89. మనోజవం, 

90. మధువటి, 

91. కౌశికీ ద్రుషద్వతీ సంగమం, 

92. కిందత్తం, 

93. అహస్పదిన తీర్థాలు,  

94. మృగధూమం, 

95. వామనం, 

96. పావనం, 

97. శ్రీకుంజం, 

98. నైమిశకుంజం, 

99. బ్రహ్మతీర్ధం, 

100. సప్తసారస్వతతీర్ధం,