భాను బింబమ్ము దాక దివానఁ బెరిగె..
గరుడుడో యన నెగిరెఁ.. గేసరి తనయుడు
వనధి లంఘింపఁ దిలకించు ఘనతర సుకృ
తంబునకు నోచితిమి.. మాదె ధన్యత సుమి!
సముద్రంలోని సర్పాలు, ఆకాశంలో ఎగురుతున్న హనుమను చూసి, గరుత్మంతు డేమో అనుకొన్నవి. (శ్రీమద్రాయణము. సుందరకాండ 1వ సర్గ 75 శ్లో)
హనుమంతుడు ఉన్నట్టుండి క్రమక్రమంగా పెరిగిపోయి సముద్రం మీదుగా ఎగిరిపోతుంటే వానరు లెంతో సంబరంతో ఇలా అనుకున్నారు.
"సూర్య మండలం తాకుతాడో యేమో అన్నట్టు పెరిగిపోయినాడు. గరుత్మంతు డేమో యనుకునేటట్టు ఎగిరిపోసాగినాడు. కేసరి తనయుడైన ఆంజనేయుడు సముద్రాన్ని లంఘిస్తూ వుంటే తిలకించే గొప్ప పుణ్యానికి నోచుకున్నాము. మాదే ధన్యత సుమా!"
ప్లవమానం సమీక్ష్యాథ భుజఙ్గాః సాగరాలయాః
వ్యోమ్ని తం కపి శార్దూలం సుపర్ణ ఇతి మేనిరే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి