దండము నీకు ఓ దుర్గామాతా
మా గుండెగుడిలోన నీ నామమే నిండు మాతా
శివుని హృదయమంతా నీవే కదా మాతా
జగజ్జనని నీవేనమ్మా కరుణించుమా
నీ కంటి చూపు తోనె దుష్టశక్తులన్ని దూరమౌను
ఓం కారము నీవే ; ఐం కారమూ నీవే
హీం కారము నీవే ; శ్రీం కారము నీవే
లక్ష్మీమాతే శారదమాతా
శారదమాతే మాత దుర్గామాతా
మా ప్రాణము నీవే ; మా జీవము నీవే
మా గానము నీవే ; మా ధ్యానము నీవే
నీవు లేని ఈ లోకం మా కెందుకు
అంతా అంధకార బంధురమే కాదా
త్రిమూర్తులు సహితం నీకు లొంగెదరే
నీ పాదమే మాకు శరణు మాతా
శరణు మాయమ్మ దుర్గామాతా
నీ దివ్య నామమే మాకు సదా
అమృత స్వరూపమమ్మా మాతా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి