మొత్తం పేజీ వీక్షణలు

5, జులై 2021, సోమవారం

పుష్కరవిధులు - (స్నానవిధి, దానవిధి)

స్నానవిధి : 

సప్తవిధస్నానములో వారుణ స్నానము శ్రేష్ఠమని చెప్పబడిరది. వారుణస్నాన మనగా మంత్రపఠన సహితంగా జమునందు మునుగుట. వారుణ స్నానమును సముద్ర, నదీ, తటాక, వాపీ, కూప, భాండోదకముతో చేయవచ్చును. కృష్ణానదిలో స్నానం చేయునపుడు...

కృష్ణే! కృష్ణాంగ సంభూతే! జంతూనాం పాపనాశిని ।

కృష్ణవేణి! నమస్తుభ్యం పునీహీ స్నానగం జనమ్‌ ॥

మొట్టమొదట నదులో దిగబోవునపుడు ఈ క్రింది శ్లోకంతో నదిఒడ్డున ఉన్న మట్టిని తీసుకుని నదిలో మూడుసార్లు వేయవలెను.

పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకభయంకరి ।

మృత్తికాం తే మయాదత్తాం ఆహారార్థం ప్రక్పయ ॥

జచరాకు బియ్యపు గింజు వేయవలెను. స్నానము చేయునపుడు నదికి ప్రార్థన చేయవయును.    

ఆర్ఘ్యప్రదానాదు ఇవ్వవలెను. 

స్నానం అయిన తర్వాత గట్టు ఎక్కేటపుడు మూడు దోస్లితో నీటిని, యక్ష్మకు తర్పణము ఇవ్వవలెను. అంటే నీటిని గట్టుమీద పోయాన్నమాట.

పుష్కరమునకు సంబంధించిన పుణ్యనదులో పితృదేవతకు శ్రాద్ధకర్మ చేయవలెను. . 

ఇదియే పుత్రుకు ప్రధాన కర్తవ్యోపదేశము. పుష్కరకాంలో పితృదేవత తిథి వచ్చినపుడు ఆ తిథినాడు శ్రాద్దకర్మ చేయుట ఉత్తమము. లేనిచో పండ్రెండు రోజులో ఎన్నడైనను చేయవచ్చును.


దానవిధి:  

పిండమును ఎత్తే ముందు పితృదేవతకు పునరావృత్తిరహిత శాశ్వత విష్ణులోక ప్రాప్తికై బ్రాహ్మణునికి దానము చేయవయును. పుష్కరకామందు మాత్రమే కాక సర్వకా సర్వావస్థయందు క్షేత్ర తీర్థ దైవ దర్శనము మానవాళికి అభ్యున్నతిని కల్గిస్తాయి.

            కృష్ణవేణి నమస్తుభ్యం శుభే హరిహరాత్మకే ।

            నిర్మితాసి పురాదేవి జగతామఘనుత్తయే ॥


            కృష్ణవేణి! నమస్తుభ్యం సర్వపాప ప్రణాశిని ।

            త్రిలోకీ పావనజలే రంగత్తుంగతరంగిణి ॥


            శంఖచక్రగదాపద్మధారిణీం విష్ణురూపిణీమ్‌ ।

            ఇంద్రనీసమాకారాం కృష్ణాం త్వాం ప్రణతో-స్మృహమ్‌ ॥


           దశకోటి సహస్రాణి తీర్థానాం వై మహామతే ।

           సాన్నిథ్యం పుష్కరే యేషే త్రిసంధ్యం కురునన్దన ॥  (వనపర్వం)


            నమామి సుకృతశ్రేణీం కృష్ణవేణీం తరంగిణీమ్‌ ।

            యద్వీక్షణం కోటిజన్మకృత దుష్కరశిక్షణమ్‌ ॥

సనాతన హిందూ ధర్మ సంరక్షణకు దీక్షా కంకణధారణం చేసిన దేవాదాయ శాఖ కృష్ణాపుష్కరా సందర్భంగా సత్సంగాను, ఆధ్యాత్మిక ప్రవచనాను, సాధుసమ్మేళనాను, స్ఫూర్పిదేవాయసముదాయాన్ని, ఏకోన్ముఖమైన ధర్మప్రచార కృషిని కొనసాగిస్తోంది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి