మొత్తం పేజీ వీక్షణలు

12, జులై 2021, సోమవారం

కృష్ణాతీర వైభవం

శివాజి మహారాజ్ 

కృష్ణవేణి తాను పుట్టిన జన్మభూమి మహాబలేశ్వరం నుండి సాగర సంగమం చేసే హంసదీవి వరకు తన ప్రవాహా ప్రస్థానంలో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్ర, తెంగాణ రాష్ట్రా భూమును పునీతం చేసింది. 

తన జన్మస్థానంలోని చక్రవర్తిగా అనాడు అన్ని మతావారికీ పూజ్యనీయుడుగా, ధీశాలిగా కీర్తింపబడ్డ యోధుడైన శివాజీ క్రీ.శ.1627లో జన్మించాడు. స్వాభిమానం, సాహసం, ధర్మశీత, మూర్తీభవించిన ఈ మరాఠా పీఠం వీరుడ్ని ప్రజు పురాణ పురుషుడుగానూ, మహాచక్రవర్తిగా ఆరాధించారు. 

ఆంధ్రావనిలోని కృష్ణామండంలో విస్లిుతూ అశేష భక్తజనావళితో శోభయమానంగా పూజింపబడుతున్న శ్రీశైంలోని భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామిని శివాజీ దర్శించి కృష్ణవేణి అందాల కు ముగ్దుడై పదిరోజు గడిపాడట.

శివాజీ శ్రీశై దేవాయానికి ఉత్తర గోపురం నిర్మించాడని చెబుతారు.


శ్రీకృష్ణ దేవరాయలు  

నాగాంబకు నరసరాజు ద్వారా క్రీ.శ. 1465లో జన్మించిన బిడ్డడే శ్రీకృష్ణదేవరాయలు బాల్యం లోనే ఆంధ్ర, సంస్కత భాషలో సాహిత్యజ్ఞానం సంపాదించి, కర్ణాటక హిందూస్థానీ భాషను కూడా నేర్చుకున్నాడు. 

తిమ్మరసు వద్దనే రాజనీతి, దండనీతి మొదగు రాజతంత్ర విధానాలో ఆరితేరాడు.

రాయలు విష్ణుభక్తుడై వేంకటేశ్వరుని, అహోబిల నృసింహుని, సింహాచలేశ్వరుని దర్శించి, మతసహనముతో అన్ని మతసును ఆదరించాడు. 

1515లో హంపీదేవాయాన్ని నిర్మించాడు. భువనవిజయమనే ఆస్థాన మండపాన్ని నిర్మించి అందులో రాయు తరచుగా సమావేశాు ఏర్పాటు చేశారు. 

రాయలు నీటివనరును ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, ఆదాయాన్ని బట్టి పన్ను వసూలు చేశాడు. 

రాజ్యంలో దేశరక్షణ, వర్తక, వ్యాపారాలను వద్ధి చేశాడు. 

ప్రధాన న్యాయపాలనాధికారి బాధ్యతు చేపట్టి దేశమంతటా న్యాయధర్మాులు  నెల కొనేటట్లు చేశాడు. 

మహారాజుగా మహాకవిగా, మహాదాతగా, మహాబశాలిగా ప్రసిద్ధికెక్కిన కృష్ణదేవరాయు ఆంధ్ర సామ్రాజ్యం కృష్ణా, తుంగభద్రా నదుల  అంతిమ స్థానాల వరకు విస్తతంగా యుద్ధాు చేసి, రాజ్యాన్ని విస్తరించి ఆంధ్రభోజుడుగా కీర్తి సంపాదించాడు.


రెడ్డి రాజులు 

కాతీయ సామ్రాజ్యం అస్తమించిన తర్వాత ఒక శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని పాలించినవారు రెడ్డి రాజు. 

కృష్ణానది దక్షిణ తీరాన అద్దంకి, కొండవీడు, వినుకొండ రాజ్యాు ఉన్నాయి. అంతవరకూ ఆ ప్రాంతాన్ని సురక్షితంగా తన బాహుబంతో సామ్రాజ్యం తరఫున కాపాడుతున్న వ్యక్తి ప్రోయ వేమారెడ్డి. ప్రోయ వేమారెడ్డి రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. 

వీరి మొదటి రాజధాని అద్దంకి తరువాత రాజధాని కొండవీడు. ఎర్రాప్రగడ ఇతని పోషణలో ఉన్న కవి. రెడ్డి రాజ్యాు విజయనగరంలో కలిసిపోయాయి. రెడ్డి రాజుందరూ విద్యావంతులే. సంగీత నాట్యశాస్త్రపారంగతుడు. వసంతరాజీయమనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. 

వినుకొండ వ్లభరాయుడు, వెన్నెకంటి సూరన, విన్నకోట పెద్దన, నిశ్శంక కొమ్మన, మడిగి సింగన, రావిపాటి త్రిపురాంతకుడు, కాశీనాథుడు, ఎర్రాప్రగడ మొదలైన కవు ఈ కాంలో ఉన్నవారే. రెడ్డి రాజు శైవమతస్థులు .

రాచకొండ నేలిన పద్మనాయకు: పద్మనాయకు క్రీ. శ. 14వ శతాబ్దంలో కృష్ణా మండంలోని న్లగొండ జిల్లా, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూమండలాన్ని పాలించారు.

పల నాటి సీమలో అనుగురాజు గుఱజా రాజధానిగా చేసికొని బ్రహ్మనాయుణ్ణి మంత్రిగా నియమించాడు. 

బ్రహ్మనాయుడు గుండెధైర్యం కవాడు. మహామేధావి. రాజకీయ చతురత, యుద్ధకౌశం, మూర్తీభవించిన ధీశాలి. అందుకే బ్రహ్మన్న పనాడుసీమ ప్రజకు పరమాత్ముడంతటి వాడయ్యాడు. 

బ్రహ్మనాయుడు వైష్ణవ భక్తుడు కావటం చేత చెన్నకేశవాయం మాచర్ల రాజధానిలో ప్రతిష్ఠ చేశాడు.

కృష్ణాతీరంలో ప్రథమాంద్రపాకుడు ` శాతవాహనాంధ్ర చరిత్రకారుడు: అశోకుని తర్వాత శాతవాహన వంశం అధికారంలోకి వచ్చింది. శ్రీముఖుడు ఆంధ్రజాతిలోని శాతవాహన కులానికి చెందినవాడు. ఈ శాతవాహనునే శాలివాహను, శాతకర్ణుని కూడా అంటారు. ఈ ఆంధ్రరాజు 31 మంది. సుమారు 450 సంవత్సరాలు పరిపాలించాడు.


నాగార్జున కొండపై నివసించిన బౌద్ధపీఠాధిపతి : నాగార్జున కొండ సాగర్‌ ఆనకట్ట నుండి 7 కి.మీ.దూరంలో ఉంది. 

సుమారు 2500 సం.కు పూర్వం ఈ ప్రాంతం ఇక్ష్వాకు వంశస్థు పానలో ఉండేది. 

విజయపురి వీరి రాజధాని. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ విద్యాపీఠం ఉండేది. 

కళాతపస్వి, బౌద్ధపండితుడు అయిన ఆచార్య నాగార్జునుడు ఇక్కడ ఒక బౌద్ధ విద్యాపీఠాన్ని నెల కొల్పెను. 

ఇతని బుద్ధిబమునకు మెచ్చి శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీపరత్వంపై ఒక విశామైన సంఘారామాన్ని కట్టించి ఇచ్చెను. 

ఇక్కడ వందకొది బౌద్ధభిక్షువు నివసించుటకు తగిన ఏర్పాట్లు చేయబడినవి. 

నాగార్జునుడు ఇక్కడ గురువుగా ఉండి విద్యార్థుకు విద్యను నేర్పించుచుండెను. 

అప్పటినుండి శ్రీపర్వతము ‘నాగార్జునకొండగా మారెను. దీనికి నాగార్జున కొండ, నందికొండ, శ్రీపర్వతం అన్న పేర్లున్నాయి.

కూచిపూడి నృత్యదాత నర్తించిన కళాక్షేత్రము

కూచిపూడి భాగవతు అగ్రహారంగానే పేరొచ్చింది. 

ఈ గ్రామంలోని పౌరాణిక పెద్దు భాగవతమును తమ నాట్యకళ ద్వారా ప్రదర్శిస్తూ విస్తరించిన కళగా కూచిపూడి గ్రామం పేరుతో జనస్రవంతిలో మారుమ్రోగింది. 

కూచిపూడి కళకు పసుమర్తివారు, వేదాంతవారు, దర్భా వారు, చింతావారు కసి భాగవతు కూచిపూడిగా ప్రసిద్ధి చెందటానికి మూస్తంభాలై నిబడ్డారు. 

భాగవతంతో ప్రారంభమై రామాయణ, మహాభారత కథలే కాక అష్టాదశ పురాణ సంహిత గాథు ఈ కూచిపూడి నాట్యం ద్వారా జనస్రవంతికి కృష్ణవాహినిలా ఆంధ్రదేశంలో విస్తరించింది. శ్రీకృష్ణదేవరాయు కూచిపూడి అగ్రహారాన్ని ఇనాముగా ఇచ్చాడని చెబుతారు.

సిద్ధేంద్రయోగి కూచిపూడి నృత్యానికి ఆది పురుషుడు, నృత్యకర్త. 15వ శతాబ్దివారు. 

ఇతను అనాథ, నిరాశ్రయుడు. ఉడిపి ఆనందతీర్ధు శ్రీకాకుళంలో నెకొల్పిన మఠంలో ఉంటుండేవారు. మహాకవి క్షేత్రయ్య వంటి ఆనాటివారు అక్కడ గజ్జకట్టి పాడినవారే. 

ఆయన జీవించే వరకు భాసిల్లినచోట కూచిపూడిలో ఆయన పేర ‘సిద్దేంద్రయోగి’పై గ అభిమానంతో గుర్తుగా సిద్దేంద్ర కళాక్షేత్రం అనే నృత్యకళాశా 1963లో స్థాపించారు.

మహాకవి క్షేత్రయ్య: కృష్ణానదీ తీరంలో ఉన్న శ్రీ కాకుళంకు 5 కి.మీ. దూరంలో మొవ్వ అన్న గ్రామంలో మువ్వ గోపాుని ఆయం ఉంది. మహాకవి క్షేత్రయ్య అసు పేరు. వరదయ్య. ఇతడు 17వశతాబ్దంవాడు. జన్మస్థం ఈ మొవ్వగ్రామమే.

తుకారాం: పాండురంగన్ని 97 కోట్ల శ్లోకాతో  స్తుతించిన నామదేవుడే తుకారాంగా జన్మించాడని ప్రతీతి.

స్వామిగుప్త: 1891 వ సంవత్సరంలో కర్నూులో జన్మించిన వేంకట స్వామి గుప్తగారు శ్రీయుతు సదాశివశాస్త్రి. గద్వా కృష్ణమాచార్యు, ఇంద్రకంటి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, బుక్కపట్టణం శ్రీనివాసాచార్యు, అనుము విశ్వనాథ శాస్త్రు వద్ద విద్య నభ్యసించిన పిమ్మట జగదాశ్చర్యకరావధాన కవితా సంపన్ను, అద్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాతలైన తిరుపతి శాస్త్రి, వేంకట శాస్త్రు వద్ద కావ్యము, అవధాన విద్య యందలి మెకుమ గ్రహించి అవధానాు నిర్వహించడం మొదుపెట్టారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి