మొత్తం పేజీ వీక్షణలు

26, జులై 2021, సోమవారం

తెలంగాణ సంకీర్తనాచార్యుడు శీ తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్

 శీ తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్ కవి గారి పరిచయ పరిమళ వీచిక.


పదహారు వేల భక్తి రక్తి సంకీర్తనల కర్త శ్రీ తాళ్ల లక్ష్మీనారాయణగౌడ్ గారు శ్రీవెంకాగౌడ్, శ్రీమతి కిష్టమ్మ గార్లకు తేదీ 31.05.1939వ సం॥ల ప్రమాది నామ సంవత్సరమున జ్యేష్టశుద్ధ త్రయోదశి సాయంత్రం 10.58 ఘడియల 54 విఘడియలకు విశాఖానక్షత్రం నాల్గవ పాదం అమ్మమ్మగారింట్లో అనగా కీసర మండలం, తిమ్మాయపల్లి గ్రామము, రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. 

ఇతని అన్న సత్యనారాయణ పుట్టిన తరువాత వీరి తాత అయిన తాళ్ల ముత్తాగౌడ్ మరియు వీరి నాయనమ్మ అయిన అంతమ్మ గారు కీసర మండలం కుశాయి గూడా గ్రామంలోనే నివసించేవారు. 

కప్పర గుట్ట కల్లు మామ్ లా (మౌలాలీ పాడ్) లో నష్టం రావడం వల్ల వీరి తాత వీరి బిడ్డ అయిన మండల కళావతికి వీరు ఉన్న పాత ఇల్లు మరియు వీరి వ్యవసాయ భూమి కప్పర గ్రామ నివాసి అయిన కళావతికి అప్పగించి నిజామాబాద్ లో అప్పటి నిజాం గారు నిజాం సాగర్ డామ్ నిర్మించే తరుణంలో కాలువలు తవ్వుచుండగా కార్మికులు అవసరం కావడంచేత ఇప్పటి ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామానికి వలస వచ్చి ఆ గ్రామంలో వీరి తాత ఉండి తెల్లగల్లు మామ్ లా పట్టి ఎడపల్లి మండలం జానకమ్ పేటలో స్తిరనివాసం ఏర్పర్చుకున్నారు.

కొన్ని రోజుల తరువాత వీరి తాత ముత్తాగౌడ్ మరణించడంతో వీరి నాయనమ్మ సంసార బాధ్యతలు నిర్వహించారు. వీరి తండ్రి వెంకాగౌడ్ శరాబు కమీషన్ మీద వ్యాపారం చేస్తూ ఐదుగురు పిల్లల సంతానం తరువాత మరణించారు. 

కోడలు కిష్టమ్మతో అంతమ్మ మనుమలు మనవరాలితో సంసారం నెట్టుకొచ్చింది. ఇలా ఉండగా సంసారం నడవక వీరి నాయనమ్మ పెద్దవాడగు సత్యనారాయణను కల్లు డిపోలో జీతం ఉంచింది. ఇక రెండవ వాడు అయిన లక్ష్మీనారాయణను వీరి నాయనమ్మ మండల కళావతి ఇంట్లో చదువు కోసం ఉంచినది. 

లక్ష్మీనారాయణ కప్పర గ్రామంలో అయిదవ తరగతి పాసయి ఆరవ తరగతి కప్పర గ్రామంలో లేనందున ఇతను బొల్లారం స్కూలులో ఆ రవ తరగతి చదివేవాడు. 

రోజు మక్క గట్కతో పచ్చి పులుసు పోసుకొని తిని బొల్లారం కప్పరగ్రామం నుండి నడుచుకుంటూ స్కూలుకుపోయి సాయంత్రం వచ్చేవాడు. ఇలా ఉండగా బొల్లారం స్కూల్ లో ఆరవ తరగతి పాసయిన సమయంలో వీరి నాయనమ్మ అతనికి ఒక ఇనుప గొట్టం ఇచ్చింది. అది వీరి కుషాయిగూడ భూముల టెనెంటు సర్టిఫికెట్.  ఇది తెలిసిన మండల కళావతి కొడుకు హనుమంతరావు ఆ టెనెంటు సర్టిఫికెట్ ఇవ్వు మని వేదించ సాగాడు. అప్పుడితను; మేము నలుగురం అన్నదమ్ములం ఒక చెల్లె, మేము చిన్నగ ఉన్నప్పుడే మానాయన చనిపోయి మేమెన్నో బాధలు పడుతున్నాము. మా భూమి టెనెంటు సర్టిఫికెట్ ఇవ్వనన్నారు. అందుకు ఇక లక్ష్మీనారాయణను వేదించ సాగారు. ఈ వేదన బడలేక లక్ష్మీనారాయణ జానకంపేటకు వచ్చి నాయనమ్మతో ; నేనిక అక్కడ ఉండలేను అని మొర పెట్టుకొని నేను చదువుతా అనగా, నాయనమ్మ ఇల్లు గడవడమే కష్టంగా ఉంది నిన్ను ఎట్లు చదివించేది అనగా ఇతను అన్నం తినక అట్లే ఉండగా నాయనమ్మ వచ్చి భోధన్ రాఘవులునన్నా అడుగుతానని నీవు మాత్రం తినుమని తినిపించింది. బోధనకు పోయి ఈ విషయం చెప్పగా రాఘవులు, రమ్మను అతను ఎంతచదివితే అంతవరకు చదివిస్తానన్నాడు. లక్ష్మీనారాయణ బొల్లారంలో ఆరవ తరగతి సర్టిఫికెట్ తీసుకొని బోధన్ లో హైస్కూలులో జాయిన్ అయినాడు. 

రాఘువులు ఇంట్లోనే ఉంటూ వారికి ఐదారు బర్లు ఉండేవి. మబ్బుల మూడు గంటలకు లేచి ఒక గంట చది విన తరువాత నాలుగు గంటల నుండి బర్లకు కుడిది పెట్టి పాలు పిండేవాడు. తెల్లవారిన తర్వాత పాలను హోటల్ లో పోసి వచ్చేవాడు. 

ఇక ఇంటిలో సలి అన్నం తిని స్కూలుకు పోయేవాడు. సాయంత్ర స్కూలు విడువగనే రాఘవులు గారి చెరకుతోట రాకాసి పేటలో ఉండేది. దాని కావలి కాసి సాయంత్రం ఇంటికి వ చ్చేవాడు. చెరకు కావలి కాయనప్పుడు వారికి రైస్ మిల్లు ఉండేది. అందులో పనిచేస్తూ ఒడ్లు పట్టించుకునేవారి బియ్యం వారి వారి సంచులలో పోసేవాడు. ఇలా రాఘవులు గారి పెంపుడు కొడుకైన ప్రహ్లాదుడు ఇతనికి అప్పుడప్పుడు ఒక్కొ రూపాయి ఇచ్చేవాడు. ఇతనికి ఒకే ఒక షర్టు పాయింట్ ఉండేది. అతని ఇచ్చిన రూపాయలతో సబ్బు తెచ్చుకొని పాయింటు షర్టు పిండుకొనేవాడు. 

ఇలా లక్ష్మీనారాయణ జీవితం గడుపుతూ స్కూలులో ఫస్టు క్లాసులోనే పాసవడమే కాక ఆటలలో కబడ్డీ, ఫుడ్ బాల్ ఆటలాడి క్యాప్టెన్ గా ఉం డేవాడు. ఇలా రాఘవులు వద్ద నున్న ఒక సంవత్సరం తరువాత ఇతని నాయనమ్మ; నువు లేనిది ఇక్కడ కష్టంగా ఉంది. నీవు జానకమ్ పేటకు రావాలని  పట్టు పట్టగా బోధన్ లో సెవంత్ సర్టిఫికెట్ తీసుకొని నిజామాబాద్ లో శ్రీనూతన వైశ్య పాఠశాలలో ఎనిమిదవ తరగతి లో  జాయిన్ అయ్యాడు. 

వీరి నాయన ఎక్కిన సైకిల్ ఉండేది. ఆ సైకిల్ పైననే రోజూ జానకమ్ పేట నుండి నిజామాబాదు వస్తూ పోయేవాడు. ఇతను దగ్గర చేతిపం పు ఉండి సైకిల్ గాలి పోయినప్పుడల్లా పంపుచారు అయితే జోడాయంచ పైసలుండేవి కావు. సైకిలులో మిరప యిత్తులు పోసి గాలి కొడితే కొంత సేపటి వరకు అది ఉండేది. అలా నడిపించేవాడు. స్కూలులో ఫస్టు వచ్చేవాడు. అందుకని ఇతనికి అన్ని ఫీజులు మాఫ్ అయినా నెలకొక్క రూపాయి గేమ్స్ ఫీజు కట్టాలి. ఆ రూపాయి గూడా లేక వీరు క్లాసుటీచరుకు వేపపుల్లల కట్ట తీసుకుపోయి ఇచ్చుట వల్ల వీరి క్లాసుటీచరు గేమ్స్ ఫీజు కట్టేవాడు. 

ఇతను రెండు సంవత్సరాలు కబడ్డీ ఫుడ్ బాల్ కాప్టెన్ గా ఉండేవాడు. హెచ్. ఎస్.సి పాసయిన తరువాత ఇక కొలువు గురించి అన్వేషణ మొదలైంది. ఇంతలో వీరి నాయనమ్మ గారు మరణించారు . ఇతను మళ్లీ రాఘవులును ఆశ్రయించాల్సి వచ్చింది. అతని ఇంట్లోనే ఉండగా ఒకనాడు ఎలక్ట్రిసిటీలో బిల్లు కలెక్టర్ కావాలని పేపర్ లో ఎనౌన్స్ వచ్చింది. రాఘవులు గారు వీరిని తీసుకొని పోయి ఎలక్ట్రిసి టీ ఆఫీసర్ తో మాట్లాడితే; ఇతని హయ్యర్ మాథమెటిక్ సర్టిఫికెట్ చూసి సరే జీతం మీదికి తీసుకుంటాను గాని 500 రూపాయల డిపాజిట్  చేయాలన్నారు. 500 వందలు చెల్లించి జీతం ఎక్కించినాడు రాఘవులు గారు. 

ఇలా రోజూ సైకిల్ మీద వస్తు డ్యూటీ చేయసాగాడు. ఇంత సహాయం చేసిన రాఘవులు గారు ఎవరో తెలుసు కోవడం ముఖ్యం. లక్ష్మీనారాయణ చెల్లెలిని చేసుకున్న గౌరయ్య గౌడ్ గారి బావనే ఈ అంబాల రాఘవులు గారు. ఇది ఇలా ఉండగా అక్కడ కప్పర గ్రామంలో హనుమంతరావు వీరి అమ్మ మండల కళావతి పెంచుకున్న కొడుకు వెంకటసామి వీరి బావి పై వీరి పాత ఇంటిలో ఉండి చూసుకునేవారు. వీరు నాయినమ్మ చనిపోయిన తరువాత వీరు కుషాయిగూడెం వచ్చి వీరి భూమిని కబ్జా చేయదలచుకున్నారు. అప్పుడు వీరి మేనబావ అయిన కప్పర హనుమంతరావు, లక్ష్మీనారాయణ నీవద్ద ఉన్న టెనెంటు సర్టిఫికెట్ ఇవ్వు నీవు, నేను, మా అన్న వెంకటసామి ముగ్గురం భాగస్తులుగా  ఇల్లు,  భూములను ముగ్గురం పంపంచుకుందాం అని అనగానే లక్ష్మీనారాయణ- నేను నా తమ్ములకు ద్రోహం చేయనని వారి మాటలు తిరస్కరించి వీరి మామలైన తిమ్మాయపల్లి మల్లారపు నర్సయ్య, జగ్గయ్య, రామయ్యలకు ఈ విషయం చెప్పగా నర్సయ్య కుమారునికి కప్పర రామదాసు బిడ్డను ఇచ్చుట వల్ల ( రామదాసు ఎక్సైజ్ లో పేరు మోసిన కాంట్రాక్టర్) ఎక్సైజ్ కాంట్రాక్టర్ అవుటవల్ల నర్సయ్య ప్రోద్బలంతో వీరి భూమిపై ఉన్న వెంకటసామిని పిలిపించి నిజామాబాద్ నుండి పిల్లలు వస్తున్నారు. నీవు పాత ఇల్లు, వ్యవసాయ భూమిని ఖాళీ చేయాలని అతనితో ఆరునెలల్లో ఖాళీ చేసేట్లు ఒప్పందం రాయించు కున్నారు. ఈ ఆరు నెలల గడువులో అతను ఖాళీ చేయగానే నిజాం బాద్ నుండి లక్ష్మీనారాయణ వీరి అన్నను, తల్లిని తమ్ములను కుషాయిగూడెం పంపించినారు. వీరు వచ్చి రాయి బావి కబ్జా తీసుకొని ఉండగా వెళ్లిపోయిన వెంకటసామి కొడుకులు, వీరికి ఊరిలో మంగళివాడు, కమ్మరివాడు, ఒండ్రంగి వాడు రాకుండా చేసినారు. అయినా ఇతని మామలు తిమ్మాయిపల్లి నుండి ఎడ్లు వీరికి తగిన సౌకర్యాలన్నీ సమకూర్చారు. ఇక లక్ష్మీనారాయణ ఎలక్ట్రిసిటీలో బిల్ కలెక్టర్‌గా పనిచేయంగ వీరి నాయనమ్మ ఇచ్చిన ఇనుప గొట్టంలో ఉన్న కాగితాలు అవి ఉర్దూ లో ఉండుటవల్ల మిత్రుడు అబ్బాస్ అలీఖాన్ కు చూపగా అతను ఇది రాగి బావి టెనెంట్ సర్టిఫికెట్ తాళ్ల వెంకా గౌడ్, సన్నాప్ ముత్తాగౌడ్  గ్రామము, కుషాయి గూడ అని చెప్పగా అప్పుడు ఇందిరాగాంధి ఫిరియడ్ జాగీరులన్నీ రద్దు చేయబడినవి. ఆ టెనెంట్ సర్టిఫికెట్ లక్ష్మీనారాయణ వీరి మామ అయిన జగ్గయ్య ఇచ్చాడు. పట్టా చేయించమని ఈ జగ్గయ్య బిడ్డనే లక్ష్మీనారాయణ అన్న అయిన సత్యనారాయణకు జనాబాయిని ఇచ్చి పెండ్లి చేశారు. 

ఇలా ఉండగా జగ్గయ్య బాయి పట్టా కారువాయి చేస్తూ ఇతని అల్లుడయిన సత్యనారాయణను ఘట్ కేసర్ బ్రూక్ బ్రాండ్ కంపెనీ లో జీతం కుదిర్చినాడు. ఇక్కడ నిజామ్ బాద్ లో లక్ష్మీనారాయణ ఉద్యోగం చేయంగ పొన్నాజీపేట్ గంగా గౌడ్ బిడ్డను ఇవ్వాలని జానకమ్ పేటకు లక్ష్మీనారాయణ కొరకు వచ్చినాడు. కాని ఆ రోజు లక్ష్మీనారాయణ దోస్తుల దగ్గర ఉండి జానకమ్ పేటకు రాలేదు. పొన్నాజిపేట గంగాగౌడ్ పెద్ద ఎక్సైజ్ కాంట్రాక్టర్. లక్ష్మీ నారాయణ రాకపోవడం చేత జానకమ్ పేటలోని ఎక్సయిజ్ కాంట్రాక్టర్ ఇంట ఉండగా అతను నేను లక్ష్మీనారాయణ రాగానే సంప్రదించి నీకు తెలుపుతాననగానే అతను వెడలిపోగా మరునాడు లక్ష్మీనారాయణ రాగానే పిలిపించి బాల్ రాజ్ గౌడ్ ఈ విషయం చెప్పగా లక్ష్మీనారాయణ మా అన్న పెండ్లి కానిది నేను ఎట్లు చేసుకుంటాననగా, మీ అన్న పెండ్లి కూడా చేస్తామని అనగా అది కుదరదన్నాడు. ఇంత పెద్ద కాంట్రాక్టర్ పిల్లనే వద్దన్నాడనే అప్పుడు అతను నా బిడ్డను ఎందుకు ఇవ్వవద్దని లక్ష్మీనారాయణ మేనత్త అయిన మండల క ళావతిని కప్పర గ్రామం నుండి పిలిపించి ఆమె సమక్షంలో పెండ్లి ఖాయం చేసినాడు. ఇలా పదేండ్లు గడిచిన తరువాత అందరి అన్నదమ్ముల పెండ్లిళ్లు అయిపోయినాయి. లక్ష్మీనారాయణకు నిజామాబాద్ నుండి బోధన్ ట్రాన్స్ఫర్ కాగానే ఆఫీసు పని రోజూ రెండున్నర కల్లా అయిపోయేది. రెండున్నర తరువాత నాలుగు గంటల వరకు సేదతీసి వీరు బోధన్ లైబ్రరీ కి  పోయి శరద్ బాబు రవీంద్రనాథ టాగూర్, గోపీచంద్ నవలలు అంటే రోజుకు ఒక నవల తప్పక చదివేవారు. ఇక్కడి నుండే ఇతనికి సాహిత్యంలో రచనలు చేయడం సురువైంది. ఇలా 1971 వరకు నిజామాబాద్ జిల్లా మాండలిక పదాలలో మూడు వేల జానపద గేయాలు రాసినాడు. వీరి ప్రధమ ముద్రణ గంగిపాట పుస్తకమునకు వానవమలై వరదాచార్యులవారు పీఠిక వ్రాసినారు. 

ఒకనాడు ఇతను గ్రంథాలయంలో పుస్తకాలు వెదుకుతుండగా క్షేత్రయ్య పదాల పు స్తకం ఒకటి లభించింది. అది కూడిపూడి నృత్యాలకు అనుకూలంగా ఉండే ఆ కీర్తనలను బాగా ఎనిమిది ఏండ్లు చదువుట వల్ల క్షేత్రయ్య ఈయనకు మొదటి గురువు అయ్యాడు. క్షేత్రయ్య కీర్తనలవలె అన్నమయ్య కీర్తనలు కూడా ఏకలవ్య శిష్యరికంతో అన్నమయ్య రాసిన పదాలలో సగం రాయాలని సంకల్పించి ఇతను 2012 శ్రీకృష్ణునిపై పదహారు వేల సంకీర్తనలు పూర్తి చేసినాడు. 

మూడువేల సంకీర్తనలు కాగానే ఇ తను వందపాట పుస్తకం శ్రీ కృష్ణ గోపికా ప్రళయ రసతరంగిని పుస్తకానికి సాహిత్య అకాడమీ హైదరాబాద్  వారు ఐదువేల రూపాయలు పుస్తకం ప్రింటు కొరకు సాంక్షన్ చేసినారు. 

2007లో ఆధ్యాత్మిక సంకీర్తన సీడీ రిలీజప్పుడు మంగారి రాజేందర్ సివిల్ జడ్జి చేతులమీదుగా ఇతనికి జానపద రత్న బిరుదు ప్రధానం చేసినారు. 

పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు ఇతని రెండవ ప్రబంధమునకు 2001-2002 సంవత్సరమునకు శ్రీకృష్ణ ప్రబంధమునకు 4500 రూపాయలు పుస్తక ప్రింటు కొరకు సాయం చేసినారు. ఇతని జానపద గేయాలు వింజమూరి సీతాదేవి సమక్షంలో ఆకాశవాణి హైదరాబాద్ లో పలు సార్లు ప్రసారమయ్యాయి. తరువాత నిజామాబాద్ ఎఫ్ ఎం  రేడియో నుండి కూడా ఇతని జానపద గేయాలు  పలుసార్లు ప్రసారమయ్యాయి. 

ఇలా ఉండగా కుషాయిగూడాలో నలుగురు అన్నదమ్ముల పేర వీరి మామ పట్టా చేసి మరణిం చాడు. ఇక సత్యనారాయణ ఇతని బావమరదులు ముత్యము, ఇతని బావమరిది కలిసి కలెక్టర్ ట్రాన్స్ఫర్  అయి పోయేటప్పుడు నీవు లేవు కాబట్టి మీ అన్నదమ్ముల పేరనే పట్టా అయినది బదలాయించినారు.

ఇలా పదిహేను సంవత్సరాలు వాటా ఇవ్వకుండా అట్లనే ఉండగా ఇంతలో లక్ష్మీనారాయణ రెండవ కొడుకు హైకోర్టు వకీలు అవ్వగా లక్ష్మీనారాయణ మా నలుగురు పేర కారువాయి చేసినాడు.  మామ నీవు ఒకసారి కలెక్టర్ ఆఫీసులో చూడుమనగా అజయ్ మేడ్చల్ తాసీల్ ఆఫీసునుండి నలుగురు పేర పట్టా అయినది కాపీ తీసినాడు. ఇవి అందరి ముందు పెడితే ఇజ్జత్ పోతుందని నలుగురి పేర పట్టా ఉన్నది చూసి అప్పుడు నాలుగు భాగాలు పంచినాడు. 

లక్ష్మీనారాయణ రాసిన శ్రీకృష్ణ గోపి ప్రళయ రసతరంగినిలోని 13 పాటలు  శ్రీకృష్ణ దివ్యలీలలు, సీడీని డాక్టర్ సి. నారాయణరెడ్డి చేతుల మీదుగా పదమూడు + ఎనిమిది ఆధ్యాత్మిక పాటలు తేది 3.12.2012 నాడు ఆంధ్ర సారస్వత పరిషత్ హైదరాబాదులో రిలీజు చేసినారు. 

ఇదే నెల 27.12.2012 రోజున త్యాగరాజ  గాన సభలో లక్ష్మీనారాయణ గారికి  గోల్డెన్ స్టార్ యూత్  కల్చరల్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారు 2012 సాహితీ రత్నబిరుదు జ్ఞాన పీఠ గ్రహీత డా.సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. 

బోధన్ నుండి నిజామాబాదుకు  లక్ష్మీనారాయణ ట్రాన్స్ఫర్ కాగానే ఇతను శంకర్ భవన్ నిజామాబాద్లో శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంగీత కళానిలయమ్ 1982వ సంవత్సరమున రిజిస్టర్ చేసి డ్యాన్స్ స్కూలును స్థాపించి ఇతను రాసిన శ్రీకృష్ణగోపిక ప్రణయ తరంగిణి నుండే కాక జానపద గేయాలతో అన్నమయ్య సంగీత కళానిలయం నుండి దాదాపు రెండువందల ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మం దితో సత్కరించబడ్డాడు. 

ఇతని భార్య సక్కుబాయికి ఒకనాడు రాత్రి మూడుగంటల సమయమున కలలో శేషతల్పంపై ఉన్న శ్రీవిష్ణువు భార్య లక్ష్మీదేవి సహితంగా దర్శనం ఇవ్వగా ఆ సంఘటన భర్త లక్ష్మీనారాయణకు తెల్పగా; అబ్బ నీవెంత అదృష్టవంతురాలివే? నీకు దర్శన భాగ్యం లభించింది. నేను స్వామిపై మూడువేల సంకీర్తనలు రాసినా నాకు దర్శన భాగ్యం లభించలేదని బాధపడే సమయంలో ఒకనాటి రాత్రి మబ్బున నాలుగు గంటల సమయంలో ఒక ముసలాయన వచ్చి తలుపు తట్టి లక్ష్మీనారాయణ ఎవరు? ఈ పుస్తకము పోస్టులో వచ్చినదని అనగానే నేనే లక్ష్మీనారాయణను అని తలుపుతీయగా అతను ప్రబంధమైన శ్రీకృష్ణ గోపికా ప్రణయ రసతరంగిణి అది పుస్తక ప్రింటుకై సాహిత్య అకాడమీకి సమర్పించిన వ్రాత పత్రి.  అది తీసి అందులో ఒక్కొక్క పుట విప్పుచుండగా సినిమాపోకసువలె పోయి రాథాకృష్ణులు బృందావనిలో నృత్యము చేయసాగిరి. ఇలా రెండు పాటలపై నృత్యం చూసిన గౌడ్ గారు, ఇన్నాళ్లకు శ్రీకృష్ణుడు నాపై కరుణించెనా అని సంబరపడ్డారట. ఇది జరిగిన సంవత్సరం తరువాత శ్రీకృష్ణ గోపికా ప్రణయ తరంగిణి ప్రబంధమును సాహిత్య అకాడమీ అయిదువేల రూపాయలు పుస్తక ప్రింటుకై సాంక్షన్ అయిన లెటర్ వచ్చినది. అంటే ఈ విషయం గౌడుగారికి సంవత్సరం ముందే తెలిసిందన్నమాట. ఇతనికి నలుగురు కొడుకులు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి