మొత్తం పేజీ వీక్షణలు

26, జులై 2021, సోమవారం

తెలంగాణ సంకీర్తనాచార్యుడు శీ తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్

 శీ తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్ కవి గారి పరిచయ పరిమళ వీచిక.


పదహారు వేల భక్తి రక్తి సంకీర్తనల కర్త శ్రీ తాళ్ల లక్ష్మీనారాయణగౌడ్ గారు శ్రీవెంకాగౌడ్, శ్రీమతి కిష్టమ్మ గార్లకు తేదీ 31.05.1939వ సం॥ల ప్రమాది నామ సంవత్సరమున జ్యేష్టశుద్ధ త్రయోదశి సాయంత్రం 10.58 ఘడియల 54 విఘడియలకు విశాఖానక్షత్రం నాల్గవ పాదం అమ్మమ్మగారింట్లో అనగా కీసర మండలం, తిమ్మాయపల్లి గ్రామము, రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. 

ఇతని అన్న సత్యనారాయణ పుట్టిన తరువాత వీరి తాత అయిన తాళ్ల ముత్తాగౌడ్ మరియు వీరి నాయనమ్మ అయిన అంతమ్మ గారు కీసర మండలం కుశాయి గూడా గ్రామంలోనే నివసించేవారు. 

కప్పర గుట్ట కల్లు మామ్ లా (మౌలాలీ పాడ్) లో నష్టం రావడం వల్ల వీరి తాత వీరి బిడ్డ అయిన మండల కళావతికి వీరు ఉన్న పాత ఇల్లు మరియు వీరి వ్యవసాయ భూమి కప్పర గ్రామ నివాసి అయిన కళావతికి అప్పగించి నిజామాబాద్ లో అప్పటి నిజాం గారు నిజాం సాగర్ డామ్ నిర్మించే తరుణంలో కాలువలు తవ్వుచుండగా కార్మికులు అవసరం కావడంచేత ఇప్పటి ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామానికి వలస వచ్చి ఆ గ్రామంలో వీరి తాత ఉండి తెల్లగల్లు మామ్ లా పట్టి ఎడపల్లి మండలం జానకమ్ పేటలో స్తిరనివాసం ఏర్పర్చుకున్నారు.

కొన్ని రోజుల తరువాత వీరి తాత ముత్తాగౌడ్ మరణించడంతో వీరి నాయనమ్మ సంసార బాధ్యతలు నిర్వహించారు. వీరి తండ్రి వెంకాగౌడ్ శరాబు కమీషన్ మీద వ్యాపారం చేస్తూ ఐదుగురు పిల్లల సంతానం తరువాత మరణించారు. 

కోడలు కిష్టమ్మతో అంతమ్మ మనుమలు మనవరాలితో సంసారం నెట్టుకొచ్చింది. ఇలా ఉండగా సంసారం నడవక వీరి నాయనమ్మ పెద్దవాడగు సత్యనారాయణను కల్లు డిపోలో జీతం ఉంచింది. ఇక రెండవ వాడు అయిన లక్ష్మీనారాయణను వీరి నాయనమ్మ మండల కళావతి ఇంట్లో చదువు కోసం ఉంచినది. 

లక్ష్మీనారాయణ కప్పర గ్రామంలో అయిదవ తరగతి పాసయి ఆరవ తరగతి కప్పర గ్రామంలో లేనందున ఇతను బొల్లారం స్కూలులో ఆ రవ తరగతి చదివేవాడు. 

రోజు మక్క గట్కతో పచ్చి పులుసు పోసుకొని తిని బొల్లారం కప్పరగ్రామం నుండి నడుచుకుంటూ స్కూలుకుపోయి సాయంత్రం వచ్చేవాడు. ఇలా ఉండగా బొల్లారం స్కూల్ లో ఆరవ తరగతి పాసయిన సమయంలో వీరి నాయనమ్మ అతనికి ఒక ఇనుప గొట్టం ఇచ్చింది. అది వీరి కుషాయిగూడ భూముల టెనెంటు సర్టిఫికెట్.  ఇది తెలిసిన మండల కళావతి కొడుకు హనుమంతరావు ఆ టెనెంటు సర్టిఫికెట్ ఇవ్వు మని వేదించ సాగాడు. అప్పుడితను; మేము నలుగురం అన్నదమ్ములం ఒక చెల్లె, మేము చిన్నగ ఉన్నప్పుడే మానాయన చనిపోయి మేమెన్నో బాధలు పడుతున్నాము. మా భూమి టెనెంటు సర్టిఫికెట్ ఇవ్వనన్నారు. అందుకు ఇక లక్ష్మీనారాయణను వేదించ సాగారు. ఈ వేదన బడలేక లక్ష్మీనారాయణ జానకంపేటకు వచ్చి నాయనమ్మతో ; నేనిక అక్కడ ఉండలేను అని మొర పెట్టుకొని నేను చదువుతా అనగా, నాయనమ్మ ఇల్లు గడవడమే కష్టంగా ఉంది నిన్ను ఎట్లు చదివించేది అనగా ఇతను అన్నం తినక అట్లే ఉండగా నాయనమ్మ వచ్చి భోధన్ రాఘవులునన్నా అడుగుతానని నీవు మాత్రం తినుమని తినిపించింది. బోధనకు పోయి ఈ విషయం చెప్పగా రాఘవులు, రమ్మను అతను ఎంతచదివితే అంతవరకు చదివిస్తానన్నాడు. లక్ష్మీనారాయణ బొల్లారంలో ఆరవ తరగతి సర్టిఫికెట్ తీసుకొని బోధన్ లో హైస్కూలులో జాయిన్ అయినాడు. 

రాఘువులు ఇంట్లోనే ఉంటూ వారికి ఐదారు బర్లు ఉండేవి. మబ్బుల మూడు గంటలకు లేచి ఒక గంట చది విన తరువాత నాలుగు గంటల నుండి బర్లకు కుడిది పెట్టి పాలు పిండేవాడు. తెల్లవారిన తర్వాత పాలను హోటల్ లో పోసి వచ్చేవాడు. 

ఇక ఇంటిలో సలి అన్నం తిని స్కూలుకు పోయేవాడు. సాయంత్ర స్కూలు విడువగనే రాఘవులు గారి చెరకుతోట రాకాసి పేటలో ఉండేది. దాని కావలి కాసి సాయంత్రం ఇంటికి వ చ్చేవాడు. చెరకు కావలి కాయనప్పుడు వారికి రైస్ మిల్లు ఉండేది. అందులో పనిచేస్తూ ఒడ్లు పట్టించుకునేవారి బియ్యం వారి వారి సంచులలో పోసేవాడు. ఇలా రాఘవులు గారి పెంపుడు కొడుకైన ప్రహ్లాదుడు ఇతనికి అప్పుడప్పుడు ఒక్కొ రూపాయి ఇచ్చేవాడు. ఇతనికి ఒకే ఒక షర్టు పాయింట్ ఉండేది. అతని ఇచ్చిన రూపాయలతో సబ్బు తెచ్చుకొని పాయింటు షర్టు పిండుకొనేవాడు. 

ఇలా లక్ష్మీనారాయణ జీవితం గడుపుతూ స్కూలులో ఫస్టు క్లాసులోనే పాసవడమే కాక ఆటలలో కబడ్డీ, ఫుడ్ బాల్ ఆటలాడి క్యాప్టెన్ గా ఉం డేవాడు. ఇలా రాఘవులు వద్ద నున్న ఒక సంవత్సరం తరువాత ఇతని నాయనమ్మ; నువు లేనిది ఇక్కడ కష్టంగా ఉంది. నీవు జానకమ్ పేటకు రావాలని  పట్టు పట్టగా బోధన్ లో సెవంత్ సర్టిఫికెట్ తీసుకొని నిజామాబాద్ లో శ్రీనూతన వైశ్య పాఠశాలలో ఎనిమిదవ తరగతి లో  జాయిన్ అయ్యాడు. 

వీరి నాయన ఎక్కిన సైకిల్ ఉండేది. ఆ సైకిల్ పైననే రోజూ జానకమ్ పేట నుండి నిజామాబాదు వస్తూ పోయేవాడు. ఇతను దగ్గర చేతిపం పు ఉండి సైకిల్ గాలి పోయినప్పుడల్లా పంపుచారు అయితే జోడాయంచ పైసలుండేవి కావు. సైకిలులో మిరప యిత్తులు పోసి గాలి కొడితే కొంత సేపటి వరకు అది ఉండేది. అలా నడిపించేవాడు. స్కూలులో ఫస్టు వచ్చేవాడు. అందుకని ఇతనికి అన్ని ఫీజులు మాఫ్ అయినా నెలకొక్క రూపాయి గేమ్స్ ఫీజు కట్టాలి. ఆ రూపాయి గూడా లేక వీరు క్లాసుటీచరుకు వేపపుల్లల కట్ట తీసుకుపోయి ఇచ్చుట వల్ల వీరి క్లాసుటీచరు గేమ్స్ ఫీజు కట్టేవాడు. 

ఇతను రెండు సంవత్సరాలు కబడ్డీ ఫుడ్ బాల్ కాప్టెన్ గా ఉండేవాడు. హెచ్. ఎస్.సి పాసయిన తరువాత ఇక కొలువు గురించి అన్వేషణ మొదలైంది. ఇంతలో వీరి నాయనమ్మ గారు మరణించారు . ఇతను మళ్లీ రాఘవులును ఆశ్రయించాల్సి వచ్చింది. అతని ఇంట్లోనే ఉండగా ఒకనాడు ఎలక్ట్రిసిటీలో బిల్లు కలెక్టర్ కావాలని పేపర్ లో ఎనౌన్స్ వచ్చింది. రాఘవులు గారు వీరిని తీసుకొని పోయి ఎలక్ట్రిసి టీ ఆఫీసర్ తో మాట్లాడితే; ఇతని హయ్యర్ మాథమెటిక్ సర్టిఫికెట్ చూసి సరే జీతం మీదికి తీసుకుంటాను గాని 500 రూపాయల డిపాజిట్  చేయాలన్నారు. 500 వందలు చెల్లించి జీతం ఎక్కించినాడు రాఘవులు గారు. 

ఇలా రోజూ సైకిల్ మీద వస్తు డ్యూటీ చేయసాగాడు. ఇంత సహాయం చేసిన రాఘవులు గారు ఎవరో తెలుసు కోవడం ముఖ్యం. లక్ష్మీనారాయణ చెల్లెలిని చేసుకున్న గౌరయ్య గౌడ్ గారి బావనే ఈ అంబాల రాఘవులు గారు. ఇది ఇలా ఉండగా అక్కడ కప్పర గ్రామంలో హనుమంతరావు వీరి అమ్మ మండల కళావతి పెంచుకున్న కొడుకు వెంకటసామి వీరి బావి పై వీరి పాత ఇంటిలో ఉండి చూసుకునేవారు. వీరు నాయినమ్మ చనిపోయిన తరువాత వీరు కుషాయిగూడెం వచ్చి వీరి భూమిని కబ్జా చేయదలచుకున్నారు. అప్పుడు వీరి మేనబావ అయిన కప్పర హనుమంతరావు, లక్ష్మీనారాయణ నీవద్ద ఉన్న టెనెంటు సర్టిఫికెట్ ఇవ్వు నీవు, నేను, మా అన్న వెంకటసామి ముగ్గురం భాగస్తులుగా  ఇల్లు,  భూములను ముగ్గురం పంపంచుకుందాం అని అనగానే లక్ష్మీనారాయణ- నేను నా తమ్ములకు ద్రోహం చేయనని వారి మాటలు తిరస్కరించి వీరి మామలైన తిమ్మాయపల్లి మల్లారపు నర్సయ్య, జగ్గయ్య, రామయ్యలకు ఈ విషయం చెప్పగా నర్సయ్య కుమారునికి కప్పర రామదాసు బిడ్డను ఇచ్చుట వల్ల ( రామదాసు ఎక్సైజ్ లో పేరు మోసిన కాంట్రాక్టర్) ఎక్సైజ్ కాంట్రాక్టర్ అవుటవల్ల నర్సయ్య ప్రోద్బలంతో వీరి భూమిపై ఉన్న వెంకటసామిని పిలిపించి నిజామాబాద్ నుండి పిల్లలు వస్తున్నారు. నీవు పాత ఇల్లు, వ్యవసాయ భూమిని ఖాళీ చేయాలని అతనితో ఆరునెలల్లో ఖాళీ చేసేట్లు ఒప్పందం రాయించు కున్నారు. ఈ ఆరు నెలల గడువులో అతను ఖాళీ చేయగానే నిజాం బాద్ నుండి లక్ష్మీనారాయణ వీరి అన్నను, తల్లిని తమ్ములను కుషాయిగూడెం పంపించినారు. వీరు వచ్చి రాయి బావి కబ్జా తీసుకొని ఉండగా వెళ్లిపోయిన వెంకటసామి కొడుకులు, వీరికి ఊరిలో మంగళివాడు, కమ్మరివాడు, ఒండ్రంగి వాడు రాకుండా చేసినారు. అయినా ఇతని మామలు తిమ్మాయిపల్లి నుండి ఎడ్లు వీరికి తగిన సౌకర్యాలన్నీ సమకూర్చారు. ఇక లక్ష్మీనారాయణ ఎలక్ట్రిసిటీలో బిల్ కలెక్టర్‌గా పనిచేయంగ వీరి నాయనమ్మ ఇచ్చిన ఇనుప గొట్టంలో ఉన్న కాగితాలు అవి ఉర్దూ లో ఉండుటవల్ల మిత్రుడు అబ్బాస్ అలీఖాన్ కు చూపగా అతను ఇది రాగి బావి టెనెంట్ సర్టిఫికెట్ తాళ్ల వెంకా గౌడ్, సన్నాప్ ముత్తాగౌడ్  గ్రామము, కుషాయి గూడ అని చెప్పగా అప్పుడు ఇందిరాగాంధి ఫిరియడ్ జాగీరులన్నీ రద్దు చేయబడినవి. ఆ టెనెంట్ సర్టిఫికెట్ లక్ష్మీనారాయణ వీరి మామ అయిన జగ్గయ్య ఇచ్చాడు. పట్టా చేయించమని ఈ జగ్గయ్య బిడ్డనే లక్ష్మీనారాయణ అన్న అయిన సత్యనారాయణకు జనాబాయిని ఇచ్చి పెండ్లి చేశారు. 

ఇలా ఉండగా జగ్గయ్య బాయి పట్టా కారువాయి చేస్తూ ఇతని అల్లుడయిన సత్యనారాయణను ఘట్ కేసర్ బ్రూక్ బ్రాండ్ కంపెనీ లో జీతం కుదిర్చినాడు. ఇక్కడ నిజామ్ బాద్ లో లక్ష్మీనారాయణ ఉద్యోగం చేయంగ పొన్నాజీపేట్ గంగా గౌడ్ బిడ్డను ఇవ్వాలని జానకమ్ పేటకు లక్ష్మీనారాయణ కొరకు వచ్చినాడు. కాని ఆ రోజు లక్ష్మీనారాయణ దోస్తుల దగ్గర ఉండి జానకమ్ పేటకు రాలేదు. పొన్నాజిపేట గంగాగౌడ్ పెద్ద ఎక్సైజ్ కాంట్రాక్టర్. లక్ష్మీ నారాయణ రాకపోవడం చేత జానకమ్ పేటలోని ఎక్సయిజ్ కాంట్రాక్టర్ ఇంట ఉండగా అతను నేను లక్ష్మీనారాయణ రాగానే సంప్రదించి నీకు తెలుపుతాననగానే అతను వెడలిపోగా మరునాడు లక్ష్మీనారాయణ రాగానే పిలిపించి బాల్ రాజ్ గౌడ్ ఈ విషయం చెప్పగా లక్ష్మీనారాయణ మా అన్న పెండ్లి కానిది నేను ఎట్లు చేసుకుంటాననగా, మీ అన్న పెండ్లి కూడా చేస్తామని అనగా అది కుదరదన్నాడు. ఇంత పెద్ద కాంట్రాక్టర్ పిల్లనే వద్దన్నాడనే అప్పుడు అతను నా బిడ్డను ఎందుకు ఇవ్వవద్దని లక్ష్మీనారాయణ మేనత్త అయిన మండల క ళావతిని కప్పర గ్రామం నుండి పిలిపించి ఆమె సమక్షంలో పెండ్లి ఖాయం చేసినాడు. ఇలా పదేండ్లు గడిచిన తరువాత అందరి అన్నదమ్ముల పెండ్లిళ్లు అయిపోయినాయి. లక్ష్మీనారాయణకు నిజామాబాద్ నుండి బోధన్ ట్రాన్స్ఫర్ కాగానే ఆఫీసు పని రోజూ రెండున్నర కల్లా అయిపోయేది. రెండున్నర తరువాత నాలుగు గంటల వరకు సేదతీసి వీరు బోధన్ లైబ్రరీ కి  పోయి శరద్ బాబు రవీంద్రనాథ టాగూర్, గోపీచంద్ నవలలు అంటే రోజుకు ఒక నవల తప్పక చదివేవారు. ఇక్కడి నుండే ఇతనికి సాహిత్యంలో రచనలు చేయడం సురువైంది. ఇలా 1971 వరకు నిజామాబాద్ జిల్లా మాండలిక పదాలలో మూడు వేల జానపద గేయాలు రాసినాడు. వీరి ప్రధమ ముద్రణ గంగిపాట పుస్తకమునకు వానవమలై వరదాచార్యులవారు పీఠిక వ్రాసినారు. 

ఒకనాడు ఇతను గ్రంథాలయంలో పుస్తకాలు వెదుకుతుండగా క్షేత్రయ్య పదాల పు స్తకం ఒకటి లభించింది. అది కూడిపూడి నృత్యాలకు అనుకూలంగా ఉండే ఆ కీర్తనలను బాగా ఎనిమిది ఏండ్లు చదువుట వల్ల క్షేత్రయ్య ఈయనకు మొదటి గురువు అయ్యాడు. క్షేత్రయ్య కీర్తనలవలె అన్నమయ్య కీర్తనలు కూడా ఏకలవ్య శిష్యరికంతో అన్నమయ్య రాసిన పదాలలో సగం రాయాలని సంకల్పించి ఇతను 2012 శ్రీకృష్ణునిపై పదహారు వేల సంకీర్తనలు పూర్తి చేసినాడు. 

మూడువేల సంకీర్తనలు కాగానే ఇ తను వందపాట పుస్తకం శ్రీ కృష్ణ గోపికా ప్రళయ రసతరంగిని పుస్తకానికి సాహిత్య అకాడమీ హైదరాబాద్  వారు ఐదువేల రూపాయలు పుస్తకం ప్రింటు కొరకు సాంక్షన్ చేసినారు. 

2007లో ఆధ్యాత్మిక సంకీర్తన సీడీ రిలీజప్పుడు మంగారి రాజేందర్ సివిల్ జడ్జి చేతులమీదుగా ఇతనికి జానపద రత్న బిరుదు ప్రధానం చేసినారు. 

పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు ఇతని రెండవ ప్రబంధమునకు 2001-2002 సంవత్సరమునకు శ్రీకృష్ణ ప్రబంధమునకు 4500 రూపాయలు పుస్తక ప్రింటు కొరకు సాయం చేసినారు. ఇతని జానపద గేయాలు వింజమూరి సీతాదేవి సమక్షంలో ఆకాశవాణి హైదరాబాద్ లో పలు సార్లు ప్రసారమయ్యాయి. తరువాత నిజామాబాద్ ఎఫ్ ఎం  రేడియో నుండి కూడా ఇతని జానపద గేయాలు  పలుసార్లు ప్రసారమయ్యాయి. 

ఇలా ఉండగా కుషాయిగూడాలో నలుగురు అన్నదమ్ముల పేర వీరి మామ పట్టా చేసి మరణిం చాడు. ఇక సత్యనారాయణ ఇతని బావమరదులు ముత్యము, ఇతని బావమరిది కలిసి కలెక్టర్ ట్రాన్స్ఫర్  అయి పోయేటప్పుడు నీవు లేవు కాబట్టి మీ అన్నదమ్ముల పేరనే పట్టా అయినది బదలాయించినారు.

ఇలా పదిహేను సంవత్సరాలు వాటా ఇవ్వకుండా అట్లనే ఉండగా ఇంతలో లక్ష్మీనారాయణ రెండవ కొడుకు హైకోర్టు వకీలు అవ్వగా లక్ష్మీనారాయణ మా నలుగురు పేర కారువాయి చేసినాడు.  మామ నీవు ఒకసారి కలెక్టర్ ఆఫీసులో చూడుమనగా అజయ్ మేడ్చల్ తాసీల్ ఆఫీసునుండి నలుగురు పేర పట్టా అయినది కాపీ తీసినాడు. ఇవి అందరి ముందు పెడితే ఇజ్జత్ పోతుందని నలుగురి పేర పట్టా ఉన్నది చూసి అప్పుడు నాలుగు భాగాలు పంచినాడు. 

లక్ష్మీనారాయణ రాసిన శ్రీకృష్ణ గోపి ప్రళయ రసతరంగినిలోని 13 పాటలు  శ్రీకృష్ణ దివ్యలీలలు, సీడీని డాక్టర్ సి. నారాయణరెడ్డి చేతుల మీదుగా పదమూడు + ఎనిమిది ఆధ్యాత్మిక పాటలు తేది 3.12.2012 నాడు ఆంధ్ర సారస్వత పరిషత్ హైదరాబాదులో రిలీజు చేసినారు. 

ఇదే నెల 27.12.2012 రోజున త్యాగరాజ  గాన సభలో లక్ష్మీనారాయణ గారికి  గోల్డెన్ స్టార్ యూత్  కల్చరల్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారు 2012 సాహితీ రత్నబిరుదు జ్ఞాన పీఠ గ్రహీత డా.సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. 

బోధన్ నుండి నిజామాబాదుకు  లక్ష్మీనారాయణ ట్రాన్స్ఫర్ కాగానే ఇతను శంకర్ భవన్ నిజామాబాద్లో శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంగీత కళానిలయమ్ 1982వ సంవత్సరమున రిజిస్టర్ చేసి డ్యాన్స్ స్కూలును స్థాపించి ఇతను రాసిన శ్రీకృష్ణగోపిక ప్రణయ తరంగిణి నుండే కాక జానపద గేయాలతో అన్నమయ్య సంగీత కళానిలయం నుండి దాదాపు రెండువందల ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మం దితో సత్కరించబడ్డాడు. 

ఇతని భార్య సక్కుబాయికి ఒకనాడు రాత్రి మూడుగంటల సమయమున కలలో శేషతల్పంపై ఉన్న శ్రీవిష్ణువు భార్య లక్ష్మీదేవి సహితంగా దర్శనం ఇవ్వగా ఆ సంఘటన భర్త లక్ష్మీనారాయణకు తెల్పగా; అబ్బ నీవెంత అదృష్టవంతురాలివే? నీకు దర్శన భాగ్యం లభించింది. నేను స్వామిపై మూడువేల సంకీర్తనలు రాసినా నాకు దర్శన భాగ్యం లభించలేదని బాధపడే సమయంలో ఒకనాటి రాత్రి మబ్బున నాలుగు గంటల సమయంలో ఒక ముసలాయన వచ్చి తలుపు తట్టి లక్ష్మీనారాయణ ఎవరు? ఈ పుస్తకము పోస్టులో వచ్చినదని అనగానే నేనే లక్ష్మీనారాయణను అని తలుపుతీయగా అతను ప్రబంధమైన శ్రీకృష్ణ గోపికా ప్రణయ రసతరంగిణి అది పుస్తక ప్రింటుకై సాహిత్య అకాడమీకి సమర్పించిన వ్రాత పత్రి.  అది తీసి అందులో ఒక్కొక్క పుట విప్పుచుండగా సినిమాపోకసువలె పోయి రాథాకృష్ణులు బృందావనిలో నృత్యము చేయసాగిరి. ఇలా రెండు పాటలపై నృత్యం చూసిన గౌడ్ గారు, ఇన్నాళ్లకు శ్రీకృష్ణుడు నాపై కరుణించెనా అని సంబరపడ్డారట. ఇది జరిగిన సంవత్సరం తరువాత శ్రీకృష్ణ గోపికా ప్రణయ తరంగిణి ప్రబంధమును సాహిత్య అకాడమీ అయిదువేల రూపాయలు పుస్తక ప్రింటుకై సాంక్షన్ అయిన లెటర్ వచ్చినది. అంటే ఈ విషయం గౌడుగారికి సంవత్సరం ముందే తెలిసిందన్నమాట. ఇతనికి నలుగురు కొడుకులు. 

19, జులై 2021, సోమవారం

Social Studies Project Notes | 10th class students home work notes | 2021

విద్యార్థుల హోమ్ వర్క్ ప్రాజెక్ట్ నోట్స్ | X class social notes | 10th S...

వందనం నీకు దుర్గామాతా! : Durgamatha Vandanam

దండము నీకు ఓ దుర్గామాతా

మా గుండెగుడిలోన నీ నామమే నిండు మాతా

శివుని హృదయమంతా నీవే కదా మాతా

జగజ్జనని నీవేనమ్మా కరుణించుమా

నీ కంటి చూపు తోనె దుష్టశక్తులన్ని దూరమౌను

ఓం కారము నీవే ; ఐం కారమూ నీవే

హీం కారము నీవే ; శ్రీం కారము నీవే

లక్ష్మీమాతే శారదమాతా

శారదమాతే మాత దుర్గామాతా

మా ప్రాణము నీవే ; మా జీవము నీవే

మా గానము నీవే ; మా ధ్యానము నీవే

నీవు లేని ఈ లోకం మా కెందుకు

అంతా అంధకార బంధురమే కాదా

త్రిమూర్తులు సహితం నీకు లొంగెదరే

నీ పాదమే మాకు శరణు మాతా

శరణు మాయమ్మ దుర్గామాతా

నీ దివ్య నామమే మాకు సదా

అమృత స్వరూపమమ్మా మాతా

18, జులై 2021, ఆదివారం

క్లాస్ సబ్జెక్టు హోమ్ వర్క్ ప్రాజెక్ట్ నోట్స్ | X Grade students social ...

కృష్ణాతీరమందలి పుణ్య క్షేత్రాలు

మహారాష్ట్ట్రము:  

కృష్ణ పుట్టిన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మహాబలేశ్వరం వద్ద కృష్ణ అవతరించినందున కృష్ణమాత పేరున మందిరం కట్టబడిరది.

నర్సోబాడ :

కృష్ణవేణీ హృదయంగా పేర్కొనబడే నర్సోబాడ (గాణుగాపురం) సమీపంలో భీమానది కుస్తుంది. యీ సంగమస్థానం అతి పవిత్రమైనది.

సహ్యాద్రి పర్వతము:

సహ్యాద్రిపైన ఉద్భవించిన కృష్ణానదిలో పరశురాముడు సుస్నాతుడై తండ్రి అయిన జమదగ్నికి ఉత్తరప్రక్రియు నిర్వర్తించాడు. 

యీ కర్మకాండను శ్రీదత్తాత్రయుల వారు పూర్తి చేయించారు. 

ఈ సహ్యాద్రిపై కృష్ణానదిలో తీర్థస్నానం చేసిన వారికి పాపనివృత్తి ద్వారా పుణ్యం భిస్తుంది.

తెంగాణ రాష్ట్రము:

మూసీనది రంగారెడ్డి జిల్లా అనంతగిరి కొండల్లో జన్మించింది. 

తూర్పుగా ప్రవహిస్తూ వచ్చి హైదరాబాదులో ఉస్మాన్‌సాగర్‌ చెరువులో కలు స్తుంది. 

అక్కడి నుండి ముందుకుసాగి న్లగొండ జిల్లాలో 64 కిలో మీటర్లు ప్రవహించింది. 

ఆలేరు నదిని  తనలో కలుపు కొని ఆగ్నేయదిశగా ప్రవహిస్తూ వజీరాబాదు దగ్గర కృష్ణవేణిలో కుస్తుంది. 

దీనికే ముచుకుంద అనే పేరుంది. 

కృష్ణమ్మ తల్లి పొడవు 1440 కిలో మీటర్లు. 

ఆంధ్రప్రదేశ్‌ తెంగాణాల్లో కలిపి 720 కిలో మీటర్ల దూరం ప్రవహిస్తుంది.

శ్రీ జోగులాంబ దేవాయం : ఆలం పురం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో  కర్నూల్ పట్టణానికి సుమారు 27 కి. మీ. దూరంలో  ఆలం పురం ఉంది. 

ఇక్కడున్న నవబ్రహ్మ ఆలయాలు అధ్యాత్మికంగా, శిల్ప పరంగా ప్రసిద్ధి చెందాయి. 

నవబ్రహ్మలు  ప్రతిష్ఠించినట్టుగా  చెప్పబడుతూ వున్న శివాయాల్లో ప్రధానదైవం శ్రీ బాల బ్రహ్మేశ్వరస్వామి. 

ఈ ఆయంలో మహాశక్తి శ్రీ జోగులాంబదేవిగా కొలువై ఆరాధనందుకొంటూ ఉంది. 

తుంగ, భద్రనదు  కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో ఆలం పురం ఉంది. 

ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలో ఒకటి. 

ఆలం పురంకి ఉత్తర వాహినిగా తుంగభద్రా నది ఉంది. 

ఇక్కడి బ్రహ్మేశ్వరుడు, జోగులాంబ, పాపనాశిని, మణికర్ణిక మొదలైన 64 ఘ;టాలు న్నాయి. 

ఈ ఆలం పురాన్ని దక్షిణకాశిగా పిలు స్తారు. 

జోగులాంబ పీఠాన్ని ఆదిశంకరులు సందర్శించారని చెబుతారు.

కృష్ణానది పరీవాహకతీరం

కృష్ణానది సహ్యాద్రి పర్వతాగ్రమునుండి ప్రవహించుచూ మహాబలేశ్వర క్షేత్రమున భూమియందు ప్రవేశించింది. 

వేదగిరి  పర్వత శిఖరాగ్రమున ఆమక వృక్షము నుంచి వేణి నది జనించెను. 

పర్వతాల  మీద కొంత దూరం ప్రవహించి సతారా అను ప్రాంతమున కృష్ణను కలిసెను. 

ఈ ప్రాంతము కృష్ణ వేణి సంగమం అని ప్రశస్తి పొందియున్నది. 

బ్రహ్మశిఖరమునకు దక్షిణమునుండి కకుద్మతీ నది బయుదేరి కృష్ణవేణిలో కలిసినది. 

కృష్ణవేణి సహ్యాద్రి పర్వతము నుంచి ప్రవహిస్తూ 60 నదీ, నదమును అనేక వాగును వంకను కుపుకొనుచూ అనేక ప్రాంతములో పంటకు, త్రాగునీటికి ఉపయోగపడుతూ అనేక పుణ్యక్షేత్రము యందు ప్రవహించుచూ కృష్ణాజిల్లా హంసదీవి వద్ద సాగరమునందు కలియుచున్నది. 

కృష్ణవేణినది పశ్చిమకనుమల్లో మహాబలేశ్వరాన గోముఖం నుండి ఒక ఊట కొనులో జన్మించినది. 

కృష్ణమ్మ మహారాష్ట్ర, కర్ణాటకల్లో 560 కి.మీ. ప్రవహించి మహబూబ్‌ నగర్‌  జిల్లా అంపురం దగ్గర తెంగాణలో ప్రవేశిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో 720 కి.మీ. దూరం ప్రవహించి కృష్ణాజిల్లా పులిగడ్డ వద్ద రెండు పాయలు చీలి ఏటిమొగ, ఎదురుమొండి దగ్గర సముద్రంలో కలు స్తోంది. 

కృష్ణానదికి దిండి, మూసి, పాలేరు, మున్నేరు, తంగభద్ర వంటి ఉపనదున్నాయి

కృష్ణానది ఆలం పురం వద్ద తెలం గాణలో ప్రవేశించినపుడు ఉత్తరదిశగా ప్రవహిస్తుంది. 

కృష్ణానది శ్రీశైలం వద్ద న్లమ కొండ మధ్యగా ఒక సన్నని కనుమ గుండా ప్రవహిస్తుంది. 

శ్రీశైలం నుంచి కృష్ణానది తూర్పుగా ప్రవహించి నాగార్జునాసాగర్‌ చేరుకుంటుంది. 

నాగార్జునకొండ దాటి కృష్ణానది అమరావతి క్షేత్రం చేరుకుంటుంది. 

బౌద్ధమతం క్షీణించి వైదిక మత ప్రాబల్యం పెరగడంతో తూర్పుచాణక్యరాజు భీమదేవుడు ఇక్కడ అమరేశ్వరాయాన్ని నిర్మించినట్టు శాసనాలు తెలుపు తున్నాయి. 

అమరావతి దాటాక కృష్ణానది పులిచింత దగ్గర మైదానాల్లో ప్రవేశిస్తుంది. 

విజయవాడ మీదుగా సముద్రం వైపు పయనిస్తూ పులిగడ్డ దగ్గర రెండు పాయల వుతుంది. 

ఈ రెండు పాయల  మధ్య ప్రాంతమే దివిసీమ. 

మరి కొంతదూరం ప్రవహించి మూడు పాయలు చీలి కృష్ణవేణి సముద్రంలో కుస్తుంది.

కృష్ణానది విశ్వరూపిణిగా లోక ప్రసిద్ధి. 

లోకాను తరింపజేయటానికి కృష్ణ పరమాత్మ సహ్యాద్రిపైన అశ్వత్థ వృక్షరూపంలో నిలిచాడని, ఆ చెట్టు వ్రేళ్ళ నుండి కృష్ణానది అవతరించిందని ఐతిహ్యం. 

మహారాష్ట్ర, కర్ణాటక, తెలం గాణ, ఆంధ్రరాష్ట్రా చారిత్రక సాంస్కృతిక జీవనంలో ఈ నది ప్రముఖస్థానం పొందింది.

చరిత్రలో నేడు : జులై 18 : ఎస్. వి. రంగారావు వర్ధంతి

సామర్ల వెంకట రంగారావు (జులై 3, 1918 - జులై 18, 1974) ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత.

కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు మద్రాసులో, ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు.

చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా ఉద్యోగం చేశారు.

జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. 

నటన కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు.

1946లో వచ్చిన వరూధిని అతనుకు నటుడిగా తొలి చిత్రం. 

దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించారు.

రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలలో రాణించారు 

పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన సినిమాలు. 

నటుడిగా ఆయన చివరి చిత్రం యశోదకృష్ణ (1975)

నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. 

ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు అందుకున్నాయి. 

విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ మొదలైనవి ఆయన బిరుదులు. 

1974 లో యాభై ఆరేళ్ళ వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించారు. 


10th ఇంగ్లీష్ మోడల్ పేపర్ | 10th Class English Question Paper | X Englis...

17, జులై 2021, శనివారం

నీ జ్ఞాపకం చాలదా నాకు

నిను ఆర్తిగా ఆశగా వెతికే ఎదురు చూపులకి

నా కంటి పాప నువ్వే నని ఎలా చెప్పను! 

నాయెద లోని నీ ప్రతి జ్ఞాపకానికి

గుండె చప్పుడు నువ్వు కాదని ఎలా చెప్పను! 

నా ప్రేమ మీద ఏ కవిత రాయను ?

చెలి నా చెంత లేదని దిగులు చెందనా? 

ఇక మరలిరాని గతంలో ...

ఎప్పటికీ మరువలేని జ్ఞాపకం ...నీ ప్రేమ!

నీతో గడిపిన ఆనంద క్షణాలను తలచుకొంటూ... 

నీవు లేని క్షణాలను ఆలా గడుపుతున్నా...

కలత చెందిన మదిలో కదిలెను 

నీ రూపు మరి మరి 

చెంత చేరవని ఎంత చెప్పినా,

మది నమ్మనంటోంది ఎం చేయను?

ఎవరివి నీవు...?  నాకే మౌతావు...?

ఎందుకు నన్ను కలవర పెడతావు...

ఏమీ కాని నన్ను కవిని చేశావు...

నా ప్రేమ నిజ మైనది ఐతే 

నీవెందుకు నాకిక 

నీ జ్ఞాపకం చాలదా నాకు... 

ప్రేమంటే పదవులపై కదిలే పదాలు కాదు...

పెదాలు సైతం పలకలేని భావాలు... 

నీకు ఎంతో దూర దూరంగా...

ఒంటరి తనానికి మరింత దగ్గరగా...

నీ కోసం ఎదురు చుస్తూ...

నీ జ్ఞాపకాల్లో మత్తుగా ఒదిగిపోతూ ... 


శ్రీవిష్ణు సహస్రనామస్తోత్ర వైభవము

భీష్మపితా మహుడు లోకానికి ప్రసాదించిన శ్రీవిష్ణు సహస్రనామస్తోత్రము.

భారత సంగ్రామం అనంతరం అంపశయ్యపై పడి యుండిన భీష్మపితామహుని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ఉపదేశం చేయిస్తూ లోకాన్ని తరింపచేసాడు.

భారతీయ సంస్కృతికి  వాల్మీకి రామాయణము, వ్యాస మద్భారతము ఇతిహాసాలు వల్లనే గౌరవం దక్కుతుంది 

భగవద్గీత కంటే శ్రీవిష్ణు సహస్రనామస్తోత్రంవల్లనే సులభంగా తరించవచ్చని అంటారు 

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవము శ్రీకృష్ణుని అభిమతం. 

శ్రీకృష్ణుడు పాండవుల నందరినీ తీసుకొని భారతసంగ్రామా నంతరం అంపశయ్య పైనున్న భీష్మపితామహుని దగ్గరకు వస్తాడు.

ధర్మరాజుకు కలిగిన ధర్మసంశయములను తీర్చమని శ్రీకృష్ణుడు భీష్ముని కోరుతాడు. 

తనకు అవేవీ జ్ఞాపకంలేవు, చెప్పే శక్తిలేదు అంటాడు భీష్ముడు. 

అతనికి తెలిసినవన్నీ జ్ఞాపకం వచ్చేటట్లు పూర్వపు శక్తికలుగు నట్లు, నోటనీరూరునట్లు దేహబాధ తెలియనట్లుగా శ్రీకృష్ణుడు వరాలిస్తాడు. భీష్ముడు "అన్ని వరాలు నాకిచ్చి, నాచే చెప్పించడమెందుకు కృష్ణా! నీవే చెప్పవచ్చు కద!” అని ప్రశ్నిస్తాడు.

లోకంలో ఎవరైనా తనను గూర్చి తనే చెప్పుకుంటే సొంతడబ్బా కొడుతున్నాడని అను కుంటారు. 

ఎదుటివారు గుర్తించి పొగిడితే, లోకం కూడా ఆ గొప్పతనాన్ని అంగీకరిస్తుంది.

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవము తత్వసారం చెప్పానే కాని, తత్వము తనను గూర్చి తాను చెప్పుకోరాదు కద!

భీష్మపితామహా! నీవు తత్త్వదర్శనం చేసిన ఆచార్యుడవు. నీ నుంచి తెలుసుకోవాలని పాండవులు కోరుతున్నారు. వారికి తత్త్వమును, హితమును ఉపదేశముచేయి” అంటాడు శ్రీకృష్ణుడు.

దాహం కలిగిన వానికి సముద్రం తనలో నీరు నిండావున్నా యివ్వటానికి వీలులేదు. 

యిచ్చినా త్రాగడానికి పనికిరావు. 

ఆ నీటినే మేఘము గ్రహించి వర్షంగా కురిపిస్తేనే త్రాగ వీలవుతుంది. 

కృష్ణుడు సముద్రములాంటి వాడు. 

అతని గుణ ప్రవాహాన్ని గ్రహించిన భీష్ముడు మేఘములాంటి వాడు. 

కనుక, శ్రీకృష్ణుడు వరాలిచ్చి ఆతనిని ప్రోత్సహించాడు. 

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవము కల్గించాలన్నది నా అభిప్రాయం అని భీష్ముని ప్రేరేపిస్తాడు. 

భీష్ముడు పాండవులకు ఉపదేశం చేస్తుంటే తాను చేతులు కట్టుకొని విని,  ఆమోదిస్తాడు 

ముందుగ సామాన్య ధర్మాలను గురించి ధర్మరాజు అనేక సమాధాన ములు పొందెను. 

జన్మనెత్తిన ఏ జీవి అయినా ఈ సంసార చక్రము నుండి బయట పడాలంటే తెలియ వలసిన తత్త్వమేది? 

ఈ జీవులపుడు ఎక్కడ చేరుతారు? 

ఆ చేరడానికేమి చేయాలి? 

ఎవరిని స్తుతిస్తే అర్చిస్తే మానవులు కోరిన సుఖాలన్నీ పొందు తారని “భవతః పరమో మతః” తాతా! నీవు భావిస్తున్నావో దానిని అనుగ్రహించు” అని ధర్మరాజు ప్రశ్నిస్తాడు. 

సర్వజగత్కారణమైన సర్వలోకేశ్వరుడయిన శ్రీమన్నారాయణుని స్తుతి చేయుచు 'తమేవ చ అర్చయన్' అతనినే ప్రేమతో పూజిస్తే 'సర్వదుఃఖాతిగో భవేత్' అన్ని దుఃఖములను దాటి పోవచ్చు నయ్యా. 

ఆ పుండరీకాక్షుని అర్చించడమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవము

'ఏష మే... అధికతమో మతః' అన్ని ధర్మాలలోకి శ్రేష్ఠమైన ధర్మము 

నామములను కీర్తిస్తే నకల పాపాలూపోతాయి. 

పవిత్రులౌతారు. 

ఏ కోరిక కోరినా అవన్నీ లభిస్తాయి. 

దీనిని మించిన గొప్ప మంత్రము మరొకటి లేదు. 

వేయి నామాలు కల మూలమంత్రమీ స్తోత్రము.

వేయిమంత్రాలు గౌణాని విఖ్యాతాని ఋషిభిః పరి గీతాని ఋషులచే గానము చేయబడినవి. 

శ్రీమన్నారాయణుని గుణములననుభవించిన ఋషులు, ఆ అనుభవ సారంగ ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కీర్తించి ఆనందించారు. అక్కడక్కడా గల ఆ ఋషుల వాగమృతం కలిసి పరీవాహమై లోకములో మనం కూడా పాడ గలిగేటట్లు శ్రీవ్యాస భగవానుడు సేకరించి కృప చేయగా నేను దర్శించాను. 

సర్వ జీవులు ఉజ్జీవించ డానికని చెప్పుచున్నాను విను అని భీష్ముడు ఉపదేశిస్తాడు.

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మహాభారతసారము, పరమ ఋషులచే దర్శితము, శ్రీ భీష్మపితా మహుని అభిమతము, శ్రీ వేదవ్యాస ఉపదేశలబ్దము, భగవద్గీతకంటే శ్రేష్ఠము. 

ఎందరో ఆధునికులు గూడ ఇదే సకల శ్రేయస్సంధాయ కమని స్వీకరించిన ఈ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని మనమూ నిత్యం పాడి కోరినవన్నీ పొందుతారు 

ఇందులో 107 శ్లోకాలున్నాయి. 

వనమాలీ... శ్లోకంతో కలిపి 108 శ్లోకాలు అవుతాయి. 

మనకి ఉన్న నక్షత్రాలు 27. 

ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 

ఒక్కొక్క నక్షత్రానికి 4 శ్లోకాలు చొప్పున కేటాయిస్తే (27x4)108పాదాలకు 108 శ్లోకాలు అవుతాయి. 

ఏ నక్షత్రంలో ఏ పాదానికి 108శ్లోకాలు అవుతాయి. 

ఏనక్షత్రంలో ఏ పాదానికి చెందివవారు ఆయా పాద సంఖ్య శ్లోకాన్ని ఎన్నుకొని పారాయణం చేయవచ్చు. 

ఆ శ్లోకాలలో నామాలకు ముందు 'ఓంకారం' లేదా చివర'నమః పదం చేర్చి పఠించటం ద్వారా తమ అభీష్టాన్ని పొందవచ్చును.


కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు తినకూడనివి

మన శరీరంలోని మలినాలను ఎక్కువ మెుత్తంలో విసర్జించేవి మూత్రపిండాలే. 

రక్తంలోని విషపదార్ధాలను, శరీరంలో అనవసరపు నీటిని ఎప్పటికప్పుడు ఇవి తొలగిస్తూ ఉంటాయి. 

లవణాలు, ఖనిజాలు, కాల్షియం, యూరిక్ ఆమ్లాలు మూత్రపిండాల్లో చేరితే  అవి కఠినమైన రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.

మారిన జీవన శైలి, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవడం, సమయానికి తినకపోవడం, నీరు ఎక్కువగా తాగకపోవడం, స్ధూలకాయం లాంటివి  కిడ్నీ స్టోన్స్ కు ప్రధాన కారణాలు.


కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు తినకూడనివి 


పాలకూర

గుమ్మడికాయ

సపోట

గోడంబి 

టమోట

నట్స్

క్యాలీఫ్లవర్

పుట్టగొడుగులు

ఎండుచిక్కుడు

ఉసిరికాయ

దోసకాయ

పంకాయ

క్యా బేజి

చికెన్

మాంసం 

పోర్క్ 

షుగర్ 

అధిక ఉప్పు 

చాకొలేట్ 

కాఫీ 

సొయా 

వేరుశనగ 

సి విటమిన్ సప్లిమెంట్స్ 

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్

----------------------------------------


కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు తినవలసినవి


బేకింగ్ సోడా నీరు 

మెంతులు

అరటిచెట్టు బెరడు జ్యూస్‌

పాలు 

పెరుగు 

కొబ్బరిబోండం

బార్లీ బియ్యం

అరటిపండ్లు

బాదంపప్పు

క్యా రెట్

కాకరకాయ

మొక్కజొన్న

నిమ్మకాయ

పైనాపిల్

ఉలవలు

బత్తాయి

చేపలు

దానిమ్మ పండు

కొత్తిమీర 


మనం ఇంట్లో వాడే గడియారం వాస్తు నియమాలు

సౌత్ లో వాచ్ ఎప్పుడూ ఉంచరాదు 

దాన్ని నార్త్ దిశలోనే ఉంచాలి 

ఇంట్లో ఎల్లో కలర్ వాచ్ లని వాడితే మంచిది 

పెండ్యులం ఉన్న వాచ్ వాడితే మరీ మంచిది 

ఏ కారణం చేతైనా ఆగిన వాచ్ ని వెంటనే మార్చాలి 

బయట రిపేర్ చేసిన వాచ్ లని ఎంత మాత్రం వాడరాదు 

దుమ్ము, ధూళి  పడిన వాచ్ లని వాడరాదు 

బూజు పట్టిన వాచ్ లని వాడరాదు 

సౌండ్లెస్ వాచ్ లని వాడాలి 

మెటల్ బెల్ట్ వాచ్ లని వాడాలి

యెల్లో కలర్ వాచ్ లని ధరించాలి 

లెథర్ బెల్ట్ కలిగిన వాచ్ లని వాడరాదు 

ప్లాస్టిక్, ఫైబర్ బెల్ట్ వాచ్ లని వాడరాదు 

తోలు పదార్థాలలో రాహు ప్రభావం ఉంటుంది కాబట్టి చర్మానికి తాకరాదు 

పాలిటెక్నిక్ డిప్లొమా సెమిస్టరు టెస్ట్ పేపర్స్ | Polytechnic Diploma que...

12, జులై 2021, సోమవారం

కృష్ణాతీర వైభవం

శివాజి మహారాజ్ 

కృష్ణవేణి తాను పుట్టిన జన్మభూమి మహాబలేశ్వరం నుండి సాగర సంగమం చేసే హంసదీవి వరకు తన ప్రవాహా ప్రస్థానంలో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్ర, తెంగాణ రాష్ట్రా భూమును పునీతం చేసింది. 

తన జన్మస్థానంలోని చక్రవర్తిగా అనాడు అన్ని మతావారికీ పూజ్యనీయుడుగా, ధీశాలిగా కీర్తింపబడ్డ యోధుడైన శివాజీ క్రీ.శ.1627లో జన్మించాడు. స్వాభిమానం, సాహసం, ధర్మశీత, మూర్తీభవించిన ఈ మరాఠా పీఠం వీరుడ్ని ప్రజు పురాణ పురుషుడుగానూ, మహాచక్రవర్తిగా ఆరాధించారు. 

ఆంధ్రావనిలోని కృష్ణామండంలో విస్లిుతూ అశేష భక్తజనావళితో శోభయమానంగా పూజింపబడుతున్న శ్రీశైంలోని భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామిని శివాజీ దర్శించి కృష్ణవేణి అందాల కు ముగ్దుడై పదిరోజు గడిపాడట.

శివాజీ శ్రీశై దేవాయానికి ఉత్తర గోపురం నిర్మించాడని చెబుతారు.


శ్రీకృష్ణ దేవరాయలు  

నాగాంబకు నరసరాజు ద్వారా క్రీ.శ. 1465లో జన్మించిన బిడ్డడే శ్రీకృష్ణదేవరాయలు బాల్యం లోనే ఆంధ్ర, సంస్కత భాషలో సాహిత్యజ్ఞానం సంపాదించి, కర్ణాటక హిందూస్థానీ భాషను కూడా నేర్చుకున్నాడు. 

తిమ్మరసు వద్దనే రాజనీతి, దండనీతి మొదగు రాజతంత్ర విధానాలో ఆరితేరాడు.

రాయలు విష్ణుభక్తుడై వేంకటేశ్వరుని, అహోబిల నృసింహుని, సింహాచలేశ్వరుని దర్శించి, మతసహనముతో అన్ని మతసును ఆదరించాడు. 

1515లో హంపీదేవాయాన్ని నిర్మించాడు. భువనవిజయమనే ఆస్థాన మండపాన్ని నిర్మించి అందులో రాయు తరచుగా సమావేశాు ఏర్పాటు చేశారు. 

రాయలు నీటివనరును ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, ఆదాయాన్ని బట్టి పన్ను వసూలు చేశాడు. 

రాజ్యంలో దేశరక్షణ, వర్తక, వ్యాపారాలను వద్ధి చేశాడు. 

ప్రధాన న్యాయపాలనాధికారి బాధ్యతు చేపట్టి దేశమంతటా న్యాయధర్మాులు  నెల కొనేటట్లు చేశాడు. 

మహారాజుగా మహాకవిగా, మహాదాతగా, మహాబశాలిగా ప్రసిద్ధికెక్కిన కృష్ణదేవరాయు ఆంధ్ర సామ్రాజ్యం కృష్ణా, తుంగభద్రా నదుల  అంతిమ స్థానాల వరకు విస్తతంగా యుద్ధాు చేసి, రాజ్యాన్ని విస్తరించి ఆంధ్రభోజుడుగా కీర్తి సంపాదించాడు.


రెడ్డి రాజులు 

కాతీయ సామ్రాజ్యం అస్తమించిన తర్వాత ఒక శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని పాలించినవారు రెడ్డి రాజు. 

కృష్ణానది దక్షిణ తీరాన అద్దంకి, కొండవీడు, వినుకొండ రాజ్యాు ఉన్నాయి. అంతవరకూ ఆ ప్రాంతాన్ని సురక్షితంగా తన బాహుబంతో సామ్రాజ్యం తరఫున కాపాడుతున్న వ్యక్తి ప్రోయ వేమారెడ్డి. ప్రోయ వేమారెడ్డి రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. 

వీరి మొదటి రాజధాని అద్దంకి తరువాత రాజధాని కొండవీడు. ఎర్రాప్రగడ ఇతని పోషణలో ఉన్న కవి. రెడ్డి రాజ్యాు విజయనగరంలో కలిసిపోయాయి. రెడ్డి రాజుందరూ విద్యావంతులే. సంగీత నాట్యశాస్త్రపారంగతుడు. వసంతరాజీయమనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. 

వినుకొండ వ్లభరాయుడు, వెన్నెకంటి సూరన, విన్నకోట పెద్దన, నిశ్శంక కొమ్మన, మడిగి సింగన, రావిపాటి త్రిపురాంతకుడు, కాశీనాథుడు, ఎర్రాప్రగడ మొదలైన కవు ఈ కాంలో ఉన్నవారే. రెడ్డి రాజు శైవమతస్థులు .

రాచకొండ నేలిన పద్మనాయకు: పద్మనాయకు క్రీ. శ. 14వ శతాబ్దంలో కృష్ణా మండంలోని న్లగొండ జిల్లా, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూమండలాన్ని పాలించారు.

పల నాటి సీమలో అనుగురాజు గుఱజా రాజధానిగా చేసికొని బ్రహ్మనాయుణ్ణి మంత్రిగా నియమించాడు. 

బ్రహ్మనాయుడు గుండెధైర్యం కవాడు. మహామేధావి. రాజకీయ చతురత, యుద్ధకౌశం, మూర్తీభవించిన ధీశాలి. అందుకే బ్రహ్మన్న పనాడుసీమ ప్రజకు పరమాత్ముడంతటి వాడయ్యాడు. 

బ్రహ్మనాయుడు వైష్ణవ భక్తుడు కావటం చేత చెన్నకేశవాయం మాచర్ల రాజధానిలో ప్రతిష్ఠ చేశాడు.

కృష్ణాతీరంలో ప్రథమాంద్రపాకుడు ` శాతవాహనాంధ్ర చరిత్రకారుడు: అశోకుని తర్వాత శాతవాహన వంశం అధికారంలోకి వచ్చింది. శ్రీముఖుడు ఆంధ్రజాతిలోని శాతవాహన కులానికి చెందినవాడు. ఈ శాతవాహనునే శాలివాహను, శాతకర్ణుని కూడా అంటారు. ఈ ఆంధ్రరాజు 31 మంది. సుమారు 450 సంవత్సరాలు పరిపాలించాడు.


నాగార్జున కొండపై నివసించిన బౌద్ధపీఠాధిపతి : నాగార్జున కొండ సాగర్‌ ఆనకట్ట నుండి 7 కి.మీ.దూరంలో ఉంది. 

సుమారు 2500 సం.కు పూర్వం ఈ ప్రాంతం ఇక్ష్వాకు వంశస్థు పానలో ఉండేది. 

విజయపురి వీరి రాజధాని. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ విద్యాపీఠం ఉండేది. 

కళాతపస్వి, బౌద్ధపండితుడు అయిన ఆచార్య నాగార్జునుడు ఇక్కడ ఒక బౌద్ధ విద్యాపీఠాన్ని నెల కొల్పెను. 

ఇతని బుద్ధిబమునకు మెచ్చి శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీపరత్వంపై ఒక విశామైన సంఘారామాన్ని కట్టించి ఇచ్చెను. 

ఇక్కడ వందకొది బౌద్ధభిక్షువు నివసించుటకు తగిన ఏర్పాట్లు చేయబడినవి. 

నాగార్జునుడు ఇక్కడ గురువుగా ఉండి విద్యార్థుకు విద్యను నేర్పించుచుండెను. 

అప్పటినుండి శ్రీపర్వతము ‘నాగార్జునకొండగా మారెను. దీనికి నాగార్జున కొండ, నందికొండ, శ్రీపర్వతం అన్న పేర్లున్నాయి.

కూచిపూడి నృత్యదాత నర్తించిన కళాక్షేత్రము

కూచిపూడి భాగవతు అగ్రహారంగానే పేరొచ్చింది. 

ఈ గ్రామంలోని పౌరాణిక పెద్దు భాగవతమును తమ నాట్యకళ ద్వారా ప్రదర్శిస్తూ విస్తరించిన కళగా కూచిపూడి గ్రామం పేరుతో జనస్రవంతిలో మారుమ్రోగింది. 

కూచిపూడి కళకు పసుమర్తివారు, వేదాంతవారు, దర్భా వారు, చింతావారు కసి భాగవతు కూచిపూడిగా ప్రసిద్ధి చెందటానికి మూస్తంభాలై నిబడ్డారు. 

భాగవతంతో ప్రారంభమై రామాయణ, మహాభారత కథలే కాక అష్టాదశ పురాణ సంహిత గాథు ఈ కూచిపూడి నాట్యం ద్వారా జనస్రవంతికి కృష్ణవాహినిలా ఆంధ్రదేశంలో విస్తరించింది. శ్రీకృష్ణదేవరాయు కూచిపూడి అగ్రహారాన్ని ఇనాముగా ఇచ్చాడని చెబుతారు.

సిద్ధేంద్రయోగి కూచిపూడి నృత్యానికి ఆది పురుషుడు, నృత్యకర్త. 15వ శతాబ్దివారు. 

ఇతను అనాథ, నిరాశ్రయుడు. ఉడిపి ఆనందతీర్ధు శ్రీకాకుళంలో నెకొల్పిన మఠంలో ఉంటుండేవారు. మహాకవి క్షేత్రయ్య వంటి ఆనాటివారు అక్కడ గజ్జకట్టి పాడినవారే. 

ఆయన జీవించే వరకు భాసిల్లినచోట కూచిపూడిలో ఆయన పేర ‘సిద్దేంద్రయోగి’పై గ అభిమానంతో గుర్తుగా సిద్దేంద్ర కళాక్షేత్రం అనే నృత్యకళాశా 1963లో స్థాపించారు.

మహాకవి క్షేత్రయ్య: కృష్ణానదీ తీరంలో ఉన్న శ్రీ కాకుళంకు 5 కి.మీ. దూరంలో మొవ్వ అన్న గ్రామంలో మువ్వ గోపాుని ఆయం ఉంది. మహాకవి క్షేత్రయ్య అసు పేరు. వరదయ్య. ఇతడు 17వశతాబ్దంవాడు. జన్మస్థం ఈ మొవ్వగ్రామమే.

తుకారాం: పాండురంగన్ని 97 కోట్ల శ్లోకాతో  స్తుతించిన నామదేవుడే తుకారాంగా జన్మించాడని ప్రతీతి.

స్వామిగుప్త: 1891 వ సంవత్సరంలో కర్నూులో జన్మించిన వేంకట స్వామి గుప్తగారు శ్రీయుతు సదాశివశాస్త్రి. గద్వా కృష్ణమాచార్యు, ఇంద్రకంటి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, బుక్కపట్టణం శ్రీనివాసాచార్యు, అనుము విశ్వనాథ శాస్త్రు వద్ద విద్య నభ్యసించిన పిమ్మట జగదాశ్చర్యకరావధాన కవితా సంపన్ను, అద్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాతలైన తిరుపతి శాస్త్రి, వేంకట శాస్త్రు వద్ద కావ్యము, అవధాన విద్య యందలి మెకుమ గ్రహించి అవధానాు నిర్వహించడం మొదుపెట్టారు.

కృష్ణాతీరంలో కవులు, చక్రవర్తుల ప్రభావం

చక్రవర్తులు : 

శాతవాహను, ఇక్ష్వాకు, విష్ణుకుండిన్యు, పల నాడు రాజు, కాకతీయ గజపతులు , రెడ్డిరాజు, విజయనగరం దేవరాయలు, రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, తర్వాత 1770 నుండి బ్రిటిష్‌ వారి అగమనం తరువాత భారత స్వాతంత్య్రం వరకు విశిష్ఠమైన చరిత్ర జరిగింది. గుంటూరు సీమ కొండవీడు, వినుకొండ, బ్లెంకొండ, అమరావతి, పనాడు, మాచర్ల, గురజా, చేబ్రోు రాజరిక కేంద్రాుగా, జమీందారి సంస్థానాలు గా విసిల్లాయి.

కవులు :

మహాకవు అల్లసాని పెద్దన, శ్రీనాథుడు, ప్కాురికి సోమన వంటి దిగ్గజము సాహిత్యానికి అంకారమై నేటితరం కవులు  విశ్వనాథ, నదును వర్ణిస్తూ కృష్ణాతరంగ నిర్ణిద్రగానముతోడ శ్పిమ్ము తొలి పూజ సేయువారు అని, పాపయ్య శాస్త్రి కోటితీర్థాు, ముక్కోటి దేవతు నీ పైటలో దాచిన వేణీ, రాణి అంటూ వారి సాహిత్యంలో నేపథ్యం మరియు వారి పదవర్ణనకు ఆధారమయ్యింది. 

నేటితరం రచయితలు వ్రాసే కవితు, గేయాు కృష్ణవేణిని వర్ణించిన వర్ణను కోక్లొు. సినారె ఒక చరణంలో కృష్ణను కీర్తిస్తూ, ‘కృష్ణవేణీ తరంగిణీ జాతి గుండెjైు సాగరమ్మై రూపు సవరించుకొని నీటి’ అంటూ కన్య సోయగాు, వర్ణిస్తూ పాటపాడితే ‘నేనీదరినీ నువ్వాదరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అని ప్రేయసీ ప్రియు పాడుకునే పాటను వ్రాసారు ఆత్రేయ. ‘కృష్ణవేణీ తొగింటి అలివేణీ...సిరివేణీ’ అంటూ పాడే పాటలో కృష్ణవేణి కవి సాహిత్యంలో పాళి అయ్యింది. 

బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను... అని ఇలా ఎందరో కవు సాహిత్యానికి తానే గురువయ్యింది కృష్ణవేణి.

కృష్ణాప్రస్థానంలో మహాకవు: కొట్టరపు తిక్కన, ఎఱ్ఱ్రాప్రగడ, పోతన, ప్లిమఱ్ఱి పినవీరభద్రుడు, శ్రీనాథుడు, అ్లసాని పెద్దన, కవిత్వంపై మోజువున్న శ్రీకృష్ణదేవరాయు ఇంకా తుకారాం, క్షేత్రయ్య నేటి 20వశతాబ్దపు ఆధునిక కవు, త్రిపురనేని, జాషువా, విశ్వనాథ, కరుణశ్రీ వంటి భక్తి కవుకు కృష్ణవేణి జప్రవాహం హోరులా వారి కవిత్వం జోరుగా సాగింది.

కవిబ్రహ్మ ఉభయకవి మిత్రుడు తిక్కన ప్రబంధపరమేశ్వరుడు, శంభుదాసుడు, ఎర్రన ప్రజాకవి యోగి వేమన, కవిసార్వభౌమ శ్రీనాథుడు, ప్కాురికి సోమనాథకవి, కృష్ణామండంలో పుట్టి పెరిగిన శ్రీనాథకవిసార్వభౌముడు కంటే ముందు అవతరించిన ప్కాురికి సోమనాథకవి. వీరంతా కృష్ణాతీరవాసులే!

ఆంధ్రకవితా పితామహుడు: శ్రీకృష్ణదేవరాయలు 

            తొగుదే యన్న? దేశంబు దొ గేను

            దొగు వ్లభుండ దొగొ కండ

            ఎ్లనృపు గొువ నెఱుగవే బాసాడి

            దేశ భాషందు దొగు లెస్స

హంపీ విజయనగర సామ్రాజ్యాధినేత ఆంధ్రభోజుడుగా కీర్తించబడిన శ్రీకృష్ణదేవరాయు ఆస్థానకవులో అగ్రగణ్యుడుగా పేరుపొందిన అల సాని పెద్దన కవి కృష్ణామండం కర్నూు జిల్లా రూపాటిసీమ గ్రామమందు జన్మించాడు రాయవారు. 

అష్టదిగ్గజకవుగా పేరుపొందిన పెద్దన కవితోపాటు ఇంకా సప్తకవు నంది తిమ్మన, ధూర్జటి, మల్లన, అయ్యరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణుడు వంటి కవుతో గోష్ఠి కార్యక్రమాు నిర్వహించుచుండెడివారు.

పింగళి సూరన: పింగళి గ్రామం కృష్ణాతీరంలోనినిదే. ఈ మహాకవి అబ్బమ్మ, అమరనార్యుకు పుత్రుడు. శ్రీకృష్ణదేవరాయ అష్టదిగ్గజకవులో ఒకడు. భారత రామాయణము రెండర్థము వచ్చు రీతిలో తనదైన శైలిలో పద, శబ్దప్రయోగాు, రసపుష్ఠి కావ్య నిర్మాణం చేసే ఉద్దండ పండితుడుగా మెగొందాడు.

వికట కవి తెనాలి రామకృష్ణుడు: హాస్య సంభాషణా చతురుడు, సమయస్ఫూర్తి గ దిట్టకవిగా ఎంతటి తీవ్ర సమస్యనైనా క్షణంలో ఉపాయం పుట్టించే వక్తగా, బమ్మిని తిమ్మిని చేయగ అఘటన ఘటనా సమర్థుడుగా తొగు సాహిత్యంలో ఏకైక వికటకవిగా ప్రసిద్ధి చెందిన రామకృష్ణుడు అసుపేరు రామలింగం. వైష్ణవరాజు రాయ నాశ్రయించినందున ఆయన ప్రీతి కోసం, భుక్తి కోసం, వైష్ణవం స్వీకరించి రామకృష్ణుడయ్యాడు. ఈయన ఇంటిపేరు గార్లపాటి. జన్మస్థం తెనాలి. జన్మించిన సంవత్సరం 1464. 1510 లో దేవరాయ ఆస్థానంలో స్థానం సంపాదించే సమయంలో ఆంధ్రలోని తెనాలి రామలింగడుగా హంపి విజయనగరసామ్రాజ్యంలో పిువబడ్డాడు.

కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ:

            కృష్ణాతరంగ నిర్ణిద్రగానము తోడ

            శ్పిమ్ము తొలిపూజ సేయునాడు

            అక్షరజ్ఞాన మెఱుగదో యాంధ్రజాతి?

            విమ కృష్ణానదీ సైకతము యందు

            కోకిపు బాట పిచ్చుక గూండ్లు కట్టి

            నేర్చుకొన్నది పూర్ణిమా నిశియందు

అని చెప్పుకున్న శ్రీ విశ్వనాథుని జన్మస్థానం నందమూరు,  జన్మదినం సెప్టెంబరు,10, 1895. నిశిరాత్రిలో కూడా కసిగా సంస్కృతాంధ్రీయ శబ్దా బ్దా లోతు ఎత్తు కూంకషంగా అధ్యయనం చేసి విద్వత్కవిగా పరిపూర్ణుడయ్యాడు. 

1970 లో జ్ఞానపీట్‌ పురస్కారం శ్రీరామాయణ క్పవృక్షం గ్రంథరచన ద్వారా భిస్తే అనంతరం భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ బిరుదునిచ్చి గౌరవించింది.

జంధ్యా పాపయ్యశాస్త్రి:  తొగు సాహిత్య స్రవంతిలో నవరసాలోని కరుణరసం నేపథ్యంగా పుష్పవిలాపం లోని పూగుబుర్లు నోర్లు విప్పి బావురుమని మనిషిని కరుణతో ప్రశ్నించినట్లు రచించిన కరుణరస కవి. తొగు సాహిత్య కవులో అరుదైన కవి, అరుణకవి, కరుణకవి. కరుణరసం తన కవిత్వశక్తిగా గ ఆయన కరుణశ్రీ.

మొల్ల  కృష్ణా మండం తెనాలి ప్రాంతానికి చెందిన మట్టితో కుండు చేసే కుమ్మరి ఆతుకూరి కేతన కూతురు మొల్ల.   

లితకళారాధనకు కుం అడ్డం కాదని స్వశక్తే గురువుగా, జీవితంలో ప్రపంచమే ఒక పాఠశాగా, సమాజంలో మంచి చెడును గ్రహించి, చదివిన చదువు చిన్నదైనా అవగాహనే కంగా వనకవి, మహాకవి వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని 571 పద్య, గద్యాతో 6 ఖండాుగా వ్రాసిన ఒక మహిళా రచయిత్రి కాదు కవయిత్రే ఆమె పేరు మొల్ల 

సింగమనాయకుడు: తెంగాణలోని రాచకొండలో రేచర్ల సింగమనాయకుడు పద్మనాయకు రాజ్యాన్ని స్థాపించాడు. నలోపాఖ్యానం, నవనాథోపాఖ్యానం మొదలైన ద్విపదగ్రంథాను వ్రాసాడు.

పిల్లల మర్రి పినవీరభద్రకవి: శ్రీనాథయుగంలోని మరొక ప్రతిభావంతుడైన కవి ప్లిమర్రి పినవీరభద్రుడు. శారదాపీఠంగా ప్రసిద్ధికెక్కిన పండిత వంశానికి చెందిన పినవీరన ‘వాణి నా రాణి’ అని చెప్పుకున్నాడని అంటారు. ప్లిమర్రివారి స్వగ్రామం తెంగాణా, నల్గొండజిల్లాలోని ప్లిమర్రి గ్రామం అనీ, ఆ తర్వాత న్లెూరు వాసుయ్యారనీ తొస్తోంది. పినవీరస అవతారదర్పణం, నారదీయపురాణం, మాఘమహాత్మ్యం, మానసోల్లాససారం రచించాడని చెబుతారు.

సహజ పండితుడు పోతన : శ్రీనాథునికి సమకాలికుడు. పదిహేనవ శతాబ్దికి చెందిన భక్తకవి పోతన బమ్మెర గ్రామంలో జన్మించాడు. ఈ గ్రామం తెంగాణలోనిది. పోతనకి సహజపాండిత్య అనే బిరుదువుంది. పోతన భాగవతం కాక వీరభద్ర విజయం, భోగినీ దండకం రచించాడు. నారాయణ శతకం కూడా పోతన రచించాడని చెబుతారు. పోతన రాచకొండనేలిన పద్మనాయకరాజు సర్వజ్ఞసింగభూపాుని ఆస్థానంలో ఉండేవాడని చెబుతారు. అక్కడున్నపుడే ఈయన భోగినీ దండకాన్ని రచించాడు.

            ఒనరన్‌ నన్నయ తిక్కనాదికవులీ యుర్వింబురాణావశుల్‌

            తెనుగుల్‌ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో

            తెనుగుంజేయరు మున్ను భాగవతమున్‌ దీనిన్‌ దెనిగించినా

            జననంబున్‌  సఫంబు చేసెద బునర్జంన్మంబు లేకుండగన్‌

            పలికెడిది భాగవతమట

            పలికించు విభుండు రామభద్రుండటనే

            పలికిన భవహరమగుటనట

            పలికెద, వేఱొండు గాథ బుకగనేలా?

పుష్కరా సందర్భంగా పుష్కర ఘాట్లలో పుష్కర యాత్రీకు పుష్కర స్నానం చేయుటకు ఆంధ్రప్రదేశ్‌, తెంగాణ రాష్ట్రాలో కృష్ణానదీ ప్రవహించు మహబూబ్‌నగర్‌, కర్నూు, నల్గొండ, గుంటూరు మరియు కృష్ణాజిల్లాలోని నదికి అనుసంధానమైన జిల్లాలో పుష్కర రేవు అనువైన ప్రదేశాలు:

కర్నూులు జిల్లాలోని శ్రీశైలం  ఎడమవైపు, కుడివైపు రేవు, పాతాళగంగ, సంగమేశ్వరం ప్రదేశాలు 

గుంటూరు జిల్లా లోని అమరావతి, వైకుంఠపురం, సీతానగరం, తంగెడ, గోవిందపురం మున్నగు ప్రదేశాలు 

కృష్ణాజిల్లాలోని విజయవాడ, భవానీపురం, ఇబ్రహీం పట్నం, గుడిమెట్ల, చాగంటిపాడు, గొల్ల పూడి తదితర ప్రదేశాలు 

            సంగచ్ఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతామ్‌

            దేవా భాగం యథాపూర్వే సంజానానా ఉపాసతే     (ఋగ్వేదం)

Model Papers for 10th Science | Model Question Paper Science Part A & B ...

7, జులై 2021, బుధవారం

దిలీప్ కుమార్ బయోగ్రఫీ

దిలీప్ కుమార్మొ దటి పేరు యూసుఫ్‌ ఖాన్‌

భారతీయ చిత్రసీమకు మెథడ్‌ యాక్టింగ్‌ టెక్నిక్‌ పరిచయం చేసినది దిలీప్ 

1944 నుంచి 1998 వరకు దిలీప్‌ కుమార్‌ చిత్రసీమను పాలించారు 

1966లో ప్రఖ్యాత నటీమణి సైరా బానును  వివాహం చేసుకున్నాడు 

2000 - 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ దిలీప్‌ కుమార్‌ సేవలందించారు. 

దిలీప్‌ కుమార్‌ 1922 డిసెంబర్‌ 11న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. 

దిలీప్‌ కుమార్‌ (98) అనారోగ్యంతో 07-07-2021 న కన్నుమూశారు. 

సినిమాల్లోకి రాకముందు దిలీప్‌ తండ్రితో కలిసి పండ్లు అమ్మేవారు

బాంబే టాకీస్‌ యజమాని ఈయనకు దిలీప్‌ కుమార్‌ అని పేరు పెట్టాడు 

1944లో జ్వర్‌ భాతా చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. 

జ్వార్ భాటా (పోటు, పాట్లు) అంతగా గుర్తింపు పొందలేదు

1947 లో నిర్మించిన జుగ్ను (మిణుగురు పురుగు) ఇతని మొదటి హిట్ సినిమా.

1955లో ఆజాద్‌, దేవదాస్‌ సినిమాలతో హిట్ కొట్టారు 

అధిక వసూళ్లు సాధించిన సినిమా 'ఆజాద్‌'  

దిలీప్ నటించిన పౌరాణిక చిత్రం 'మొఘల్‌-ఎ-ఆజామ్‌'


దిలీప్ కుమార్  పొందిన అవార్డులు : 

ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందాయి 

1993లో ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది 

1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. 

1991లో పద్మభూషణ్‌ లభించింది. 

2015లో పద్మవిభూషణ్‌ లభించింది 

1998లో నిషాన్‌-ఇ-ఇంతియాజ్‌ అవార్డు లభించింది

1992 జీవితకాలం సాధన అవార్డు

దిలీప్ కుమార్ పొందిన  బిరుదులు : ట్రాజెడీ కింగ్, దిలీప్ సాహెబ్

దిలీప్ కుమార్  సేవలు : నటన, సినీ నిర్మాణం,  సినిమా దర్శకత్వం, రాజ్యసభ సభ్యత్వం 

జన్మదినం : 1922 డిసెంబరు 11 (మరణించే నాటికి వయస్సు 98)

పుట్టిన స్థలం : పెషావర్, పాకిస్తాన్

లభించిన పురస్కారాలు:  ఫిలిం ఫేర్ అవార్డులు

ఉత్తమ నటుడు అవార్డు సినిమాలు : 1954 దాగ్, 1956 ఆజాదీ, 1957 దేవదాస్, 1958 నయా దౌర్, 1961 కోహినూర్, 1965 లీడర్, 1968 రామ్ ఔర్ శ్యామ్, 1983 శక్తి

1960 లో వచ్చిన  'మొఘల్ ఎ ఆజం' ఇతడి జీవితంలో ఒక కీర్తి పతాకం. 

1947 లో నిర్మించిన జుగ్ను (మిణుగురు పురుగు) ఇతని మొదటి హిట్ సినిమా. 

ఇతడి మొదటి సినిమా జ్వార్ భాటా (పోటు, పాట్లు) 1944

దీదార్ (1951), అమర్ (1954), దేవదాస్ (1955), మధుమతి (1958) సినిమాల్లో ఇతని నటన ఇతనికి "ట్రాజెడీ కింగ్" అనే ఖ్యాతి తెచ్చి పెట్టింది. 


General studies model papers | GK model question papers | civils si dsc ...

5, జులై 2021, సోమవారం

Popular Telugu Books presentation | Famous Books and Writers Cover Page ...

పుష్కర సమయంలో ఏ రోజు ఏ దానం చేయాలి

పురాణాలలో చెప్పబడిన పుష్కర సమయంలో చేయవలసిన దానాలు.


మొదటి రోజు

సువర్ణ దానం, రజితము దానం, ధాన్య దానం , భూదానం చేయాలి.

రెండవరోజు

వస్త్ర దానం, లవణ దానం, రత్న దానం చేయాలి.

మూడవ రోజు

గుడ(బెల్లం), అశ్వశాఖ, ఫల దానం చేయాలి.

నాల్గవ రోజు

ఘృతం(నెయ్యి)దానం,తైలం(నూనె)దానం,క్షీరం(పాలు),మధువు(తేనె)దానం చేయాలి.

ఐదవ రోజు

ధాన్యదానం , శకట దానం,వృషభదానం, హలం దానం చేయాలి.

ఆరవవ రోజు

ఔషధదానం, కర్పూరదానం,చందనదానం, కస్తూరి దానం చేయాలి.

ఏడవ రోజు

గృహదానం, పీట దానం, శయ్య దానం చేయాలి.

ఎనిమిద రోజు

చందనం, కందమూలాల దానం, పుష్ప మాల దానం చేయాలి.

తొమ్మిదవ రోజు

పిండ దానం, దాసి దానం, కన్యాదానం, కంబళి దానం చేయాలి.

పదవ రోజు

శాకం(కూరగాయలు)దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం చేయాలి.

పదకొండ రోజు

గజ దానం చేయాలి.

పన్నెండవ రోజు

తిల(నువ్వులు)దానం చేయాలి.


పుష్కరకాల స్నానం


నీటిలో రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది. దాహార్తిని తీర్చడం,శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం,యజ్ఞనం అనేశక్తులున్నాయని వేదం వివరిస్తుంది.

మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే యాజ్ఞనం అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన.

నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానంద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు.తీర్ధ స్నానం ఉత్తమం దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం. 

ఆసమయంలో దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని,పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం లభిస్తుందని, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రంహాండ పురాణం వర్ణిస్తుంది.

నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక ఋగ్గ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది.ఇసుకతో కాని, మట్టితో కాని పార్థీవ శివలింగాన్ని చేసి పూజించాలంటారు. 

నదీ తీరంలోని ఇసుకను నదిలోకి వేయాలంటారు. పురోహితులు భక్తుల తలపై మూడు దోసిళ్ల నీళ్లతో ఆశీస్సులు అందజేస్తారు. గోదావరికి దీప దానం కూడా చేస్తారు. -


నారదుడు పేర్కొన్న శత పుణ్య తీర్థాలు

 1. పుష్కరం

2. జంబూమార్గం, 

3. తండులికాశ్రమం, 

4. అగస్త్యవటం, 

5. కణ్వాశ్రమం, 

6. ధర్మారణ్యం, 

7. యయాతి పతనం, 

8. మహాకాళం, 

9. కోటితీర్థం, 

10. భద్రవటం, 

11. నర్మదాతీర్ధం, 

12. దక్షిణసింధూతీర్థం, 

13. చర్మణ్వతీ తీర్ధం, 

14. వసిష్ఠాశ్రమం, 

15. పింగం, 

16. ప్రభాస తీర్థం, 

17. వరదానం, 

18. సరస్వతీసాగరసంగమం, 

19. పిండాకరం, 

20. సాగర సింధు సంగమం, 

21. శంకు కర్ణేశ్వరం, 

22 వసుధార, 

23. వసుసరం, 

24 సింధూత్తమతీర్థం, 

25. బ్రహ్మతుంగ, 

26. శక్రకుమారి, 

27. శ్రీకుండం, 

28. విమం, 

29. బడబ, 

30. దేవిక, 

31. కామతీర్ధం, 

32. రుద్రతీర్ధం, 

38. యజనం, 

34. యాజనం, 

35. బ్రహ్మవాుకం, 

36. దీర్ఘసత్రం, 

37. వినశనం, 

38. నాగోద్భేదం, 

39. శివోద్భేదం, 

40. చమసోద్భేదం, 

41. సరస్వతి, 

42. శశయానం, 

43. రుద్రకోటి, 

44. నైమిశం, 

45. కురుక్షేత్రం, 

46. శమంతకపంచకం, 

47. రామప్రదం, 

48. విష్ణుస్థానం, 

49. పారిప్లవం, 

50. పృథివీతీర్థం, 

51. శాూకిని, 

52. సర్పతీర్థం, 

58. వరాహతీర్థం, 

54. అశ్వినీతీర్థం, 

55. జయంతిలో సోమతీర్ధం, 

56. కృతశాచతీర్థం, 

57. అగ్నివటం, 

58. ముంజవటం, 

59. యక్షిణీతీర్థం, 

60. కురుక్షేత్రద్వారం, 

61. కాయశోధనం, 

62. లోకోద్దారం, 

63. శ్రీతీర్ధం, 

64. కపితీర్థం, 

65. సూర్యతీర్థం, 

66. గోభవనం, 

67. శంఖినీతీర్థం, 

68. యక్షేంద్రతీర్థం, 

69. మాత ృతీర్థం, 

70. బ్రహ్మావర్తం, 

71. శరవణం, 

72 శ్వావిల్లోమాపహం, 

73. మానుషతీర్థం, 

74 ఆపగానది, 

75. బ్రహ్మోదంబరం, 

76. సప్తర్షికుండం, 

77. కేదారం, 

78. కపికేదారం, ‘

79. సరకం, 

80. ఇలాస్పదం, 

81. కిందానం, 

82. కింజప్యం, 

83. నారదతీర్థమైన అంబాజన్మం, 

84. పుండరీకం, 

85. వైతరణి, 

86. ఫకీవనం, 

87. మిశ్రకం, 

88. వ్యాసవనం, 

89. మనోజవం, 

90. మధువటి, 

91. కౌశికీ ద్రుషద్వతీ సంగమం, 

92. కిందత్తం, 

93. అహస్పదిన తీర్థాలు,  

94. మృగధూమం, 

95. వామనం, 

96. పావనం, 

97. శ్రీకుంజం, 

98. నైమిశకుంజం, 

99. బ్రహ్మతీర్ధం, 

100. సప్తసారస్వతతీర్ధం, 

గ్రామ సచివాలయ ఉద్యోగులు

 ప్రజాస్వామ్యంలో గ్రామ స్వపరిపాలన ఎంతో ముఖ్యమైనదిగా గాంధీజీ చెప్పారు 

"దేశానికీ పట్టు కొమ్మలు గ్రామాలు " అని అంటారు. 

మనం నివసించే గ్రామంలో ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తూ ప్రజాసేవలను అందిస్తుంటారు 

వీళ్ళంతా ప్రతి రోజు గ్రామ సచివాలయం లో సంతకాలు పెట్టి, వారి విధుల్లోకి పోతారు 


సర్పంచ్ = 1

ఉప సర్పంచ్ =1

వార్డ్ సభ్యులు =12

యం.పి.టి.సి =1

కార్యదర్శి =1 

వి.ఆర్.ఓ =1

వి.ఆర్.ఏ =1

ఏ.ఎన్.యం = 1

టీచర్స్ = 8

షకిదర్(నీటిపారుదల) = 1

లైన్ మెన్  = 1

హెల్పర్  = 1

వి.సి.ఓ(సాక్షరభారతి)  = 2

వేటర్నిటీ అసిస్టెంట్  = 1

విలేజ్ పోలీస్ ఆపిసర్  = 1

ఫీల్డ్ అసిస్టెంట్  = 1

AEOఅసిస్టెంట్(అగ్రి) = 1

ఆర్టికాల్చర్ (నర్సరీ)  = 1

సుంకరులు(సపాయి)  = 2 

ఐకేపీ అధ్యక్షులు  = 2

ఆశా వర్కర్స్  = 2

ఐకేపీ యనిమేనేటర్(సి.ఏ)  = 2

అంగన్వాడీ టీచర్స్  = 2

వాటర్ మెన్  = 1

రేషన్ షాప్ డీలర్ = 2

విద్యావాలంటీర్స్  = 1

అంగనీవాడి ఆయాలు = 2

ఈ లెక్కన దాదాపు 50 మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది  ప్రజలకి అందుబాటు లో ఉంటున్నారు.  

నవారాధనలు

శ్రవణం,

కీర్తనం,

మననం,

పదసేవ,

అర్చన,

మంత్రం,

సేవ,

మైత్రి,

శరణం.

పుష్కరవిధులు - (స్నానవిధి, దానవిధి)

స్నానవిధి : 

సప్తవిధస్నానములో వారుణ స్నానము శ్రేష్ఠమని చెప్పబడిరది. వారుణస్నాన మనగా మంత్రపఠన సహితంగా జమునందు మునుగుట. వారుణ స్నానమును సముద్ర, నదీ, తటాక, వాపీ, కూప, భాండోదకముతో చేయవచ్చును. కృష్ణానదిలో స్నానం చేయునపుడు...

కృష్ణే! కృష్ణాంగ సంభూతే! జంతూనాం పాపనాశిని ।

కృష్ణవేణి! నమస్తుభ్యం పునీహీ స్నానగం జనమ్‌ ॥

మొట్టమొదట నదులో దిగబోవునపుడు ఈ క్రింది శ్లోకంతో నదిఒడ్డున ఉన్న మట్టిని తీసుకుని నదిలో మూడుసార్లు వేయవలెను.

పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకభయంకరి ।

మృత్తికాం తే మయాదత్తాం ఆహారార్థం ప్రక్పయ ॥

జచరాకు బియ్యపు గింజు వేయవలెను. స్నానము చేయునపుడు నదికి ప్రార్థన చేయవయును.    

ఆర్ఘ్యప్రదానాదు ఇవ్వవలెను. 

స్నానం అయిన తర్వాత గట్టు ఎక్కేటపుడు మూడు దోస్లితో నీటిని, యక్ష్మకు తర్పణము ఇవ్వవలెను. అంటే నీటిని గట్టుమీద పోయాన్నమాట.

పుష్కరమునకు సంబంధించిన పుణ్యనదులో పితృదేవతకు శ్రాద్ధకర్మ చేయవలెను. . 

ఇదియే పుత్రుకు ప్రధాన కర్తవ్యోపదేశము. పుష్కరకాంలో పితృదేవత తిథి వచ్చినపుడు ఆ తిథినాడు శ్రాద్దకర్మ చేయుట ఉత్తమము. లేనిచో పండ్రెండు రోజులో ఎన్నడైనను చేయవచ్చును.


దానవిధి:  

పిండమును ఎత్తే ముందు పితృదేవతకు పునరావృత్తిరహిత శాశ్వత విష్ణులోక ప్రాప్తికై బ్రాహ్మణునికి దానము చేయవయును. పుష్కరకామందు మాత్రమే కాక సర్వకా సర్వావస్థయందు క్షేత్ర తీర్థ దైవ దర్శనము మానవాళికి అభ్యున్నతిని కల్గిస్తాయి.

            కృష్ణవేణి నమస్తుభ్యం శుభే హరిహరాత్మకే ।

            నిర్మితాసి పురాదేవి జగతామఘనుత్తయే ॥


            కృష్ణవేణి! నమస్తుభ్యం సర్వపాప ప్రణాశిని ।

            త్రిలోకీ పావనజలే రంగత్తుంగతరంగిణి ॥


            శంఖచక్రగదాపద్మధారిణీం విష్ణురూపిణీమ్‌ ।

            ఇంద్రనీసమాకారాం కృష్ణాం త్వాం ప్రణతో-స్మృహమ్‌ ॥


           దశకోటి సహస్రాణి తీర్థానాం వై మహామతే ।

           సాన్నిథ్యం పుష్కరే యేషే త్రిసంధ్యం కురునన్దన ॥  (వనపర్వం)


            నమామి సుకృతశ్రేణీం కృష్ణవేణీం తరంగిణీమ్‌ ।

            యద్వీక్షణం కోటిజన్మకృత దుష్కరశిక్షణమ్‌ ॥

సనాతన హిందూ ధర్మ సంరక్షణకు దీక్షా కంకణధారణం చేసిన దేవాదాయ శాఖ కృష్ణాపుష్కరా సందర్భంగా సత్సంగాను, ఆధ్యాత్మిక ప్రవచనాను, సాధుసమ్మేళనాను, స్ఫూర్పిదేవాయసముదాయాన్ని, ఏకోన్ముఖమైన ధర్మప్రచార కృషిని కొనసాగిస్తోంది. 


పెరుగు దాని ముఖ్యమైన ఉపయోగాలు

పెరుగు క్లారగుణం కలిగి ఉంటుంది 

జీర్ణం అయ్యేటప్పుడు అది కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా మారిపోతుంది.

జీర్ణవ్యవస్థను  పటిష్టం చేస్తుంది 

విరేచనాలతో బాధపడేవారికి మేలు చేస్తుంది 

విరేచనం సాఫీగా అవ్వని వారికి ఉపయుక్తకరం 

కడుపులో అల్సర్లను తగ్గిస్తుంది 

గ్యాస్టిక్ ఇరిటెషన్ ను నిరోధిస్తుంది 

హైపర్ ఎసిడిటీతో బాధపడేవారికి మంచి ఔషధం .

కడుపులో ఇన్ఫెక్షన్ ని కలిగించే రకరకాల సూక్ష్మజీవులని  చంపుతుంది

కామెర్లు నివారణకు ఉపకరిస్తుంది 

డీసెంట్రీ, ఎమీబియాసిస్ లాంటి వాటికి మందులా పనిచేస్తుంది  

ఎపెండిసైటిస్ కు సింహస్వప్నం లాంటిది .

నిద్రలేమితో బాధపడే ఎవరికి ఉపశమనాన్ని ఇస్తుంది 

పెరుగుని తలకి  పట్టించి తర్వాత స్నానం చేస్తే నిద్ర వస్తుంది.

ఫిట్స్ తో బాధపడేవారికి ఇది ఎంతో ఉపయోగకరం 

మానసిన సమస్యలున్నవారికి  పెరుగు మంచి చేస్తుంది

రోజూ పెరుగు తీసుకుంటే వయసు మీదపడదు 

శరీరంలోని కణాలకు క్షీణతని  అరికడుతుంది 

పెరుగుని రోజూ తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెంచటం జరుగుతుంది.

సొరియాసిస్, ఎగ్జిమా, చర్మవ్యాధులున్నవారికి  పెరుగు ఉపయోగం అమోఘం.


10th class test paper | Social subject model paper I 20 marks exam paper