మొత్తం పేజీ వీక్షణలు

31, జులై 2022, ఆదివారం

క్లైబ్యం మాస్మగమః పార్థనైతత్త్వ య్యుపపద్యతే

 క్లైబ్యం మాస్మగమః పార్థనైతత్త్వ య్యుపపద్యతే

క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప. (2-3) 

ఓ అర్జునా అధైర్యమును (భయమును) పొందకుము. ఇట్టి పిరికితనము నీకు తగదు. నీచమగు ఈ హృదయ దౌర్బల్యమును విడనాడి లెమ్ము!! కర్తవ్యమునకు గడంగుము !!

ఈ ఒక్క శ్లోకమును చదివినచో గీతయంతయు చదివిన ఫలితమును  మనుజుడు పొందగలడు. ఏలయనిన, గీత యొక్క సందేశమంతయు ఈ ఒక్క  శ్లోకములోనే ఇమిడియున్నది.

If one reads this one sloka he gets all the merits of reading the entire Gita ; For, in this one sloka lies imbedded the whole Message of the Gita

హృదయములో వెలుగు

 వేల వేలు వెలగల నోట్లను మీరు చూచియున్నారుగదా ! ఆ కాగితపు తునకకు మీరు గౌరవము చేయుటలేదు. ! దానిలోగల ముదలకుగదా వేలకొలది రూపాయ లిచ్చుచున్నారు. 

ఆలాగున జనులజాతి, కుల, ఆశము, ఆడంబరములకు కాదు భక్తులు చూడవలసినది, వారి హృదయములో వెలుగుచుండు

ఆ దివ్యదైవజ్ఞానమున కుండవలయు, నోటు కాని చిత్రవిచిత్ర రంగులతో కూడిన సబ్బుబిళ్ళ మొదలైన వస్తువులకు చుట్టివచ్చెడు కాగితములుపయోగము లేనట్లు కుల ఆశ్రమాది బహిరంగములను చూచి మోసపోకుడు.

joy of freedom

సాంఘిక, రాజకీయ స్వాతంత్య్రాలను పొందినా, ఇంద్రియ కింకరులమై ఉంటే - యదార్ధ స్వాతంత్య్రం, సౌఖ్యం అనుభవించలేం.

One may gain political and social independence but if he is a slave to his passions and desires he cannot feel the pure joy of freedom

స్వరూపజ్ఞానము ద్వారా మోక్షము

ఈ దినమున బ్రతికి రేవు చనిపోవనున్న నీవు ఇపుడే ఈశ్వరుని ధర్మశాసనముననుసరించి నడచుకొందునని ప్రతిజ్ఞ చేసితివా నీ అంతరాత్మ ఇపుడే ప్రజ్వరిలును. 

ఇతరులపై ఆధారపడి వారి కష్టముల మీదనే బ్రతు కదలంచితివా నీకు - నరకప్రాపప్తియే

అధికమైన ధ్యానముతో మననము చేసినచో భ్రమను , జయించవచ్చును. మోక్షమును స్వరూపజ్ఞానము ద్వారా తప్ప ఇతర మార్గముల ద్వారా పొందలేము.

ఇతరుల మంచి లక్షణములనే చూడుము

ప్రపంచములోని మహాపురుషులు లేక భగవంతుడు అయినా ఎంత ఉపదేశము చేసినను లాభము లేదు. 

ఎంత వరకు తన్ను తానుపదేశించుకొనడో, అంతయు నిష్ప్రయోజనమే, ఇతరుల ఉపదేశము ఏ మాత్రము లాభకారికాదు. 

ఈ క్షణములో నీవు సాక్షాత్కారము పొందవచ్చును. మోహము పరిత్యజించుము. 
అసూయా ద్వేషములను పెరికి పారవేయుము. 

మీ ఆత్మను మీరు గౌరవించినచో ప్రతి వ్యక్తి మిమ్ములను గౌరవించును. 

ఇతరుల దోషములను చూడకుము. నీ దోషములనే చూచుచుండుము. 

ఇతరులనుద్దరించుదునను విచారము విడువుము. 

ఇతరుల మంచి లక్షణములనే చూడుము. అహంకారముండరాదు.

నీవు వృక్షానివి అయితే నేను పక్షిని అవుతాను.

స్వామీ! 

నీవు వృక్షానివి అయితే నేను పక్షిని అవుతాను. 

నీవు సరోవరానివి అయితే నేను చేపను అవుతాను. 

నీవు పర్వతము అయితే నేను నెమలిని అవుతాను. 

నీవు వెన్నెలవు అయితే నేను చకోరాన్ని అవుతాను.


మనుజ ధర్మము

మానవుడు తన నియమములను తప్పి ప్రవర్తించు కారణము వల్లనే కలిపురుషుడు పట్టుకొని బాధించును. మానవుడు 25 సంవత్సరముల వరకు ఆధ్యయనము గురుశుశ్రూష గాయత్రి మంత్ర జపము, బ్రహ్మచర్యము శీలించుట చేయవలయును. తర్వాత గృహస్థాశ్రమము స్వీకరించి గృహస్థ జీవితమును ఏబది సంవత్సరముల వరకు శాస్త్రవిధి ప్రకారమున నడుపుకొనుట తరువాత పండ్రెండు సంవత్సరములు అనగా 62 సంవత్సరముల వరకు వాన ప్రస్థాశ్రము గడుపుట ఆ పెని అన్నిటిని వదలి సన్యాసిjైు ఆత్మభావములో ఉండి తనువును చాలించుట ఇదియే మనుజ ధర్మము.

fa1 class 8 questions | maths formative exam | fa model paper | 8th clas...

30, జులై 2022, శనివారం

ఇప్పుడీ గ్రంధ రాజంబు నింపుమీర

 తే. ఇప్పుడీ గ్రంధ రాజంబు నింపుమీర

ముద్రణంబును గావింప ముందు నిలచి

వితరణము సల్పినట్టి వివేక శాలి

పూర్ణముగ జూచుగాతాంధ్ర పూర్ణుడెపుడు.


29, జులై 2022, శుక్రవారం

కామముతోడ నాశనము కాగల దంతయు.. సాధ్వి జానకిన్

   కామముతోడ నాశనము

       కాగల దంతయు.. సాధ్వి జానకిన్

   రాముని వద్ద కంపు.. డిక

       రాదు భయం బది.. క్రోధ మేలనో!

   ఏమిటి కింత లోభ మది?

      ఏ మయిపోయె నుదార బుద్ధి? అ

   య్యో! మహనీయ మౌ తపము

       యొక్క ఫలం బిటువంటి మోహమా!


ఇతఃపరం వా వైదేహీం  ప్రేషయస్వ రఘూత్తమే

ఇకనైనా వైదేహిని రాముని వద్దకు పంపుడు..

    (అధ్యాత్మ రామాయణము యు. కాం. 10-54)

    అని మండోదరి భర్తయైన రావణునికి హితవు చెబుతూ కుమిలిపోయింది.


హనుమ యబ్ధి దాటి యవనిజాతను జూచె..

హనుమ యబ్ధి దాటి యవనిజాతను జూచె..

హనుమ వెనుక నుండినందువలన

వానరులకు గౌరవ మ్మెంతయొ వరించె

లెక్క మీద సున్న లెక్కినట్లు


 వనవాసానంతరం సీతా రామ లక్ష్మణు లయోధ్యను చేరుకోగా పౌరు లిలా ముచ్చటించుకొన్నారు.

   "సీతాన్వేషణ మనే గొప్ప పని హనుమచేత మాత్రమే సాధింపబడినది. హనుమంతునివలన వానరులకు గౌరవ మెంతో కలిగినది ఒకటి పక్కన సున్నలు చేరినట్టు." ~~~~~~~~~



25, జులై 2022, సోమవారం

fa1 | class 8 | maths | formative assessment exam paper | fa question pa...

ముంతలు, స్వర్ణ పాత్రములు మోహన రామున కన్ని యొక్కటే!

ముంతలు, స్వర్ణ పాత్రములు

మోహన రామున కన్ని యొక్కటే!

బొంతలు, పట్టు వస్త్రములుఁ

బోలుప నొక్కటె యేది గట్టినన్..


గుంతలు, మిట్ట లాతని య

కుంఠితమైన ప్రయాణ మాపునే!

పొంతనె యుండు.. నెచ్చటకుఁ

బోవడు నమ్మిన భక్త పాళికిన్


 తమకు దూరమై అరణ్యవాసంలో రాము డెంత కష్టపడుతున్నాడో అని విచారిస్తున్న అయోధ్య పౌరులకు తత్వం తెలిసిన  వాడు కాబట్టి శ్రీ రాముడు ద్వంద్వాతీతు డని, (కారణ జన్ముడు కాబట్టి) అతని జీవిత ప్రయాణం అకుంఠితమైన దని, భక్తుల కెప్పుడూ దగ్గరి వాడే అని వశిష్ఠు డిలా నచ్చజెప్పినాడు. 


బ్రహ్మ వంశజు డయి ప్రసవ బాణుని యజి

   బ్రహ్మ వంశజు డయి ప్రసవ బాణుని యజి

   హ్మగములకు బలి యయి, మడిసె కామ

   చారి రావణుండు... సామీరి బ్రహ్మ చా

   రి యయి నవమబ్రహ్మ రీతి వెలుగు


ఆంజనేయుడు నవమబ్రహ్మ కాబోతున్నా డన్న సంతోషంతో వానర వీరు లిలా ముచ్చటించుకున్నారు.

   "బ్రహ్మ వంశంలో జన్మించిన వాడైనప్పటికీ రావణుడు ప్రసవ బాణుని (మన్మథుని) అజిహ్మగములకు (బాణములకు) బలియై మడిసినాడు (మృతుడైనాడు) కామచారి (కామంతో చరించే వాడు) కాబట్టి.

    (ఉన్నస్థితినుండి దిగజారి పోయినాడు.)

     ఇక సామీరి (ఆంజనేయుడు) బ్రహ్మ చారి (బ్రహ్మమునందు చరించువాడు) కాబట్టి కాబోయే నవమ బ్రహ్మ (తొమ్మిదవ బ్రహ్మ)యై వెలిగిపోతున్నాడు.

   (ఉన్నస్థితినుండి ఎదిగిపోయినాడు.)"



అవనిసుతను, బతిని నవని మాత యపు డ

     అవనిసుతను, బతిని నవని మాత యపు డ

     త్యంత మయిన ప్రేమ, యంతె కినుక

     తనరఁ జూచి, ధరణి తగ విచ్చుకొన వేగ

     ముగను లోని కేగె పుత్రితోడ..


అవని సుత (సీత)ను, పతిని (రాముని) అవని మాత (భూమాత) చూసింది. ఎంతో ప్రేమతో.. అంతే కోపంతో.. ప్రేమతో చూసింది కూతురును.. కోపంతో చూసింది అల్లుణ్ణి. (గర్భవతిని కానలకు పంపినా డని కోపం)

    ఈలోపల భూమి విచ్చుకొన్నది. క్షణాలమీద ఆమె తన పుత్రి యైన సీతను దీసుకొని భూగర్భంలోకి వెళ్ళి అదృశ్యమై పోయింది. 

గర్వ మిసుమంతయును లేని ఘను డతండు

గర్వ మిసుమంతయును లేని ఘను డతండు..

ధ్యాన మింటింటఁ జేయించి, తరలె నతడు..

జగతి దిగినట్టి కారణ జన్ము డతడు..

పత్రిజీకి మ్రొక్కెద గుండె బరువుతోడ..

24, జులై 2022, ఆదివారం

నారాయణీం నవాకారాం - నానా రూపధరాంపరామ్‌ (శ్రీనాగశేషాంబికా స్తవం)

శ్రీనాగశేషాంబికా స్తవం


నారాయణీం నవాకారాం - నానా రూపధరాంపరామ్‌

నళినాక్షీంనభోమధ్యాం - నాగశేషాంబికాం భజే


గణనాతీతగుణాం గౌరీం ` గాంధర్వంఖచరీం గిరామ్‌

గుడా కేశందుణాభాసాం ` నాగశేషాం బికాభజే


శేషచ్చత్రాం శిఖా చూడాం - శేషాఖ్యాం సర్వశేషిణీమ్‌

శేఖరీ భూత శీతాంశుం  ` నాగశేషాంబికాం భజే


షాంప్రదాం శాశ్వతీం శాంతాం - షట్చక్రోపరి సంస్థితామ్‌

షడుర్మోజిత్వరాం శక్తీం - నాగ శేషాంబికాం భజే


బిసకాండ సమానాంగం ` బృహతీం భువనేశ్వరమ్‌

ప్రత్యగాత్మాం పరంజ్యోతీం ` నాగశేషాంబికాం భజే 


కాంతాం కాత్యాయనీం కాళీం ` కన్యాం కారణ సంభవామ్‌

కల్యాణీం కామ సంధాయీం ` నాగశేషాంబికాం భజే


భద్రపుత్రీం మహావిద్యాం ` బాలకృష్ణ పదార్చికామ్‌

భవారణ్యకు దాటంకాం - నాగశేషాంబికాం భజే


జేత్రీం జన్మజరాదుఃఖాం ` జీవభావ విదూరగామ్‌

రాజరాజేశ్వరీం రమ్యాం ` నాగశేషాంబికాం భజే.


శ్రీకరార్చిత సత్యశాశ్వతలోక నిర్మిత నిర్జరా ( విశ్వకర్మ ప్రార్ధన)

 విశ్వకర్మ ప్రార్ధన


శ్రీకరార్చిత సత్యశాశ్వతలోక నిర్మిత నిర్జరా

పాకశాసన పద్మజాది సురాసురార్చిత భాస్కరా

ఏకమేవ బ్రహ్మమూర్తి పినాకి సంస్థిత శంకరా

శోకవర్జిత శంభూనాయక విశ్వకర్మ జగత్ప్రభో

గాయత్రీ ప్రార్ధన

 గాయత్రీ ప్రార్ధన


ముక్తా విద్రుమహేమనీల ధవళచ్చాjైుర్ముఖై స్త్రీక్షణై

ర్యుక్తామిందునిబద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణత్మికాం

గాయత్రీం వరదాభయాం కృశకశాం శుభ్రంశ పాలంగదాం

శంఖచక్ర మధార విదయుగళం హస్తేర్వహతీంభజే

చతుర్ముఖాది సంస్తుతం - సమస్త సాత్వతానుతమ్‌ ( శ్రీకృష్ణాష్టకం - ప్రమాణీవృత్తమ్‌)

 శ్రీకృష్ణాష్టకం - ప్రమాణీవృత్తమ్‌


చతుర్ముఖాది సంస్తుతం - సమస్త సాత్వతానుతమ్‌

హాలా యుధాది సంయుతం - నమామి రాధికాధిపమ్‌


బకాదిదైత్యకాలకం ` సగోపగోపి పాలకమ్‌

మనోహరసితారకం ` నమామి రాధికాధిపమ్‌


సురెేంద్ర గర్వభంజనం ` విరించి మోహ భంజనమ్‌

ప్రజాంగ నానురంజకం - నమామి రాధికాధిపమ్‌


మయూరపించ మండనం - గజేంద్ర దంత ఖండనమ్‌

వృశంసకంస దండనమ్‌ ` నమామి రాధికాధిపమ్‌


ప్రదత్త విప్రబాలకం ` సుధామ ధామ కారకమ్‌

సురద్రుమాపహారకం ` నమామి రాధికాధిపమ్‌


మునీంద్రశాప కారణం ` యదుప్రజాపహారిణమ్‌

ధరాభరావతారణం ` నమామి రాధికాధిపమ్‌


సువృక్షమూలశాయినం ` మృగారిమోక్ష దాయినమ్‌

స్వకీయధామమాయినం ` నమామి రాధికాధిపమ్‌


ఇదం సమాహితోహితం ` వరాష్టకం సదామదా

జపజ్జనో జమర్జరాది ` తో దృతం పముచ్యతే

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్‌ - శ్రీకృష్ణాష్టకమ్‌ - అనుష్ఠుప్‌

 శ్రీకృష్ణాష్టకమ్‌ - అనుష్ఠుప్‌


వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్‌

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌


అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్‌

రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్‌


కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్‌

విలసత్‌ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్‌


మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్‌

బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్‌


ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్‌

యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్‌


రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్‌

అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్‌


గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్‌

శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్‌


శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్‌

శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్‌


కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌

కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి

23, జులై 2022, శనివారం

fa1 social exam paper | class 8 formative test | fa-1 question paper | f...

మస్తకం బెత్తగా జాల.. మా వదినను

    మస్తకం బెత్తగా జాల.. మా వదినను

    జానకమ్మను జూడగా జాల.. నెపుడు

    పాదముల మ్రొక్కెదను భక్తి భావ మూర..

    నవు.. నిదే సుమా! నూపురం.. బా రమణిదె!


నాహం జానామి కేయూరే  నాహం జానామి కుండలే

నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్..

     లక్ష్మణుని సచ్ఛీలాన్ని ఆవిష్కరించటంలో సుప్రసిద్ధమైన దీ శ్లోకం. (రామాయణము.. కిష్కింధా కాండము.. ఆరవ సర్గము 22) ఒక వదినపట్ల మరిది ఎలా ప్రవర్తించా లనే దానికి ఉదాహరణగా లక్ష్మణుని పేర్కొంటూ పై శ్లోకాన్ని చెబుతారు.

     సీతా రామ లక్ష్మణుల వనవాస కాలంలో రావణుడు సీత నపహరించినాడు. రామ లక్ష్మణులు క్రమంగా ఋష్యమూక పర్వతం చేరుకున్నారు. హనుమంతుడు వారితో సుగ్రీవునికి మైత్రి కుదిర్చినాడు.

    రాముడు వాలిని వధిస్తా నని సుగ్రీవునికి వాగ్దానం చేసినాడు.  అతడు కూడా రాము నోదార్చి సీతను తెచ్చి నీ కప్పగించే ఏర్పాటు చేస్తా నని మాట యిచ్చినాడు. అంతేగాక ఒక రాక్షసు డాకాశ మార్గాన ఒక మహిళ నపహరించుకొని పోతూవుంటే ఆమె విలపిస్తూ తన సొమ్ములు చీర చెరగులో మూట గట్టి కిందకు వదలివేసిం దని ఆమె సీతయే అయివుంటుం దని ఆ నగలు తాము దాచినా మని పలికి అవి తెప్పించినాడు.

    రాము డవి చూసి కన్నులనిండా నీళ్ళు తెచ్చుకొని లక్ష్మణుని గుర్తించు మన్నాడు.

     పరిశీలించిన లక్ష్మణు డిలా అన్నాడు.

     "నేను ప్రతినిత్యం మా వదినగారికి భక్తితో పాదాభివందనం చేస్తూ వుండేవాణ్ణి. కాబట్టి ఆమె కాలి యందెలను మాత్ర మెరుగుదును. ఇవి ఆమెవే! చెవిపోగులు గాని దండకడియములనుగాని నే నెరుగను. ఎందుకంటే నే నెన్నడూ తల ఎత్తి చూసినవాణ్ణి కాదు."


20, జులై 2022, బుధవారం

fa1 physics | formative assessment exam | fa physical science questions ...

పవరమున రామ లక్ష్మణులవి శరముల

      పవరమున రామ లక్ష్మణులవి శరముల

      తండు మిండైన వానలు.. బండరాళ్ళ

      జత్తు కపులవి వడగండ్ల చాలె!.. ఆని

      లిది పెను తుఫాను గాలి.. తూలిరి దనుజులు

రామ రావణ యుద్ధం భయంకర రూపం దాల్చింది. రామ లక్ష్మణులు బాణాలు జడివానలా కురియ సాగినవి. వానరులు విసిరే బండరాళ్ళే వడగండ్లైనవి. ఆంజనేయుని విజృంభణం పెను తుఫాను గాలి యైనది. రాక్షసులు తట్టుకోలేకపోయారు.

    పవరము = యుద్ధము

    జత్తు = సమూహం

    తండుమిండు = విపరీతమైన

    (రంగారెడ్డిజిల్లా మాండలికం)

     ఆనిలి = ఆంజనేయుడు

18, జులై 2022, సోమవారం

ఇక పనుపుము న న్నయ మది.. యొక కో తి క్కనగ నవ్వరో! అది నా ముం

     ఇక పనుపుము న.. న్నయ మది..

     యొక కో తి క్కనగ నవ్వరో! అది నా ముం

     దొక ఎ ర్రన రాదే! తే

     లిక నలిపెదపో! తన దగు రిమ్మ కుదరగా..


అశోకవన విధ్వంసం చేస్తున్న ఆంజనేయుని నిరోధించడానికి ఎందరో రాక్షస వీరులను పంపించి విఫలుడైన రావణునితో ఇంద్రజిత్తు అంటున్న మాటలు.

    "ఇక నన్ను పంపించు. అదే నయము.. (నీతి.) ఒకానొక (అల్పమైన) కోతి ఇక్కు (కోతివలన కలిగిన సంకటము.. ప్రమాదము) అంటే విన్నవారు నవ్వరా! (మన మింత గొప్ప రాక్షసులం కదా!)

    అది (ఆ కోతి) నా (బలం) ముందు ఒక ఎర్ర (వానపాము) వంటిదే! (అల్పమైనది). చాలా తేలిగ్గా నలిపివేస్తాను దాని రిమ్మ (పిచ్చి) కుదరేటట్టుగా.."




లెమ్ము! పయోధి నీవు నవ లీలగ దాఁటి సురారి వీటికిం

    లెమ్ము! పయోధి నీవు నవ

       లీలగ దాఁటి సురారి వీటికిం

    బొమ్ము.. మహీసుత న్వెదకి

       పొల్పుగఁ గాంచి మహా జవంబుతో

    రమ్ము.. మహాత్ముడైన రఘు

       రామునకున్ మితి లేని సంతసం

    బిమ్ము.. వనాట వంశమున

       కెంతయు మేటివి గమ్ము మారుతీ!" 


"హనుమ! చెప్పగా లేము నీ దయిన చేవ -

ఇనుని చిననాడె మ్రింగబోయితివె ! అమర

వినుత! లంఘించు కంధి.. తీరును నెదారు"

హనుమతో జాంబవంతు డి ట్లనెను చూచి--


ఎదారు = చింత (పాలమూరు మాండలికము)


సీతాన్వేషణకై బయలుదేరిన వానరులు అనంతమైన సముద్రాన్ని చూసి దిక్కు తోచని పరిస్థితిలో వుంటే జాంబవంతుడు హనుమంతునితో..


"భూరుహ చర వీర! పుట్టినప్పుడు నీవు 

    బా లాబ్జమిత్ర బింబంబుఁ గాంచి

ఫల మని కాంక్షచే బంధుర జవమున 

    నురువడి మున్నూఱు యోజనములు 

గగనంబునకుఁ బ్రీతి నెగసి... పట్టబోయినావు.

 (గోపీనాథ రామాయణము కి.కాం.1368)

నీ చేవ (శక్తి) యింతటి దని చెప్పజాలము. కంధిని (సముద్రాన్ని) లంఘించు. మా చింత దీర్చు.


16, జులై 2022, శనివారం

చదువు చక్కని తనం చక్కబెట్టు తనం

 చదువు చక్కని తనం చక్కబెట్టు తనం

పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే

విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు

గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

kubera chalisa - kubera pooja - kubera swami prayer manthra

కుబేరునికి పూజ చేయడం వల్ల చాలీసాను పఠించడం వల్ల జీవితంలోని అన్ని బాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయి 

చాలీసాను పారాయణం చేయడం వల్ల డబ్బు, ధాన్యం, సుఖ సంతోషాలు కలుగుతాయి. 

కుబేరున్ని తృతీయ తిథికి అధిపతిగా జ్యోతిష్యశాస్త్రం పేర్కొంది. 

కుబేర స్వామికి  అక్షింతలు, చందనం, పూలు, పండ్లు మొదలైనవి పూజా కార్యక్రమంలో సమర్పించాలి


ఓం కుబేరాయ నమః

ఓం ధనదాయ నమః

ఓం శ్రీమతే నమః

ఓం యక్షేశాయ నమః

ఓం గుహ్యకేశ్వరాయ నమః

ఓం నిధీశాయ నమః

ఓం శంకరసఖాయ నమః

ఓం మహాలక్ష్మీనివాసభువే నమః

ఓం మహాపద్మనిధీశాయ నమః

ఓం పూర్ణాయ నమః


ఓం శ్రీమతే నమః

ఓం యక్షేశాయ నమః

ఓం గుహ్యకేశ్వరాయ నమః

ఓం నిధీశాయ నమః

ఓం శంకరసఖాయ నమః

ఓం మహాలక్ష్మీనివాసభువే నమః

ఓం మహాపద్మనిధీశాయ నమః

ఓం పూర్ణాయ నమః


ఓం లక్ష్మీసామ్రాజ్యదాయకాయ నమః

ఓం ఇలపిలాపత్యాయ నమః

ఓం కోశాధీశాయ నమః

ఓం కులోధీశాయ నమః

ఓం అశ్వారూఢాయ నమః

ఓం విశ్వవంద్యాయ నమః

ఓం విశేషజ్ఞాయ నమః

ఓం విశారదాయ నమః 

ఓం నలకూబరనాథాయ నమః

ఓం మణిగ్రీవపిత్రే నమః


ఓం గూఢమంత్రాయ నమః 

ఓం వైశ్రవణాయ నమః

ఓం చిత్రలేఖామనఃప్రియాయ నమః

ఓం ఏకపింగాయ నమః

ఓం అలకాధీశాయ నమః

ఓం బౌలస్థాయ నమః

ఓం నరవాహనాయ నమః

ఓం కైలాసశైలనిలయాయ నమః

ఓం రాజ్యదాయ నమః

ఓం రావణాగ్రజాయ నమః 

fa1 exam | fa-1 physics question paper | 8th class fa1 science | chapter...

14, జులై 2022, గురువారం

ఎవని కారుణ్యలేశాన నివ్వసుధను

 ఎవని కారుణ్యలేశాన నివ్వసుధను

  సూతుడును సద్గురుండయి సొంపు మీరె..

  నట్టి పూజ్యుని, మునులలో నపర హరిని,

  నాత్మవిదుని, వేదవ్యాసు నభినుతింతు

 వేద వ్యాసుడు అష్టాదశ పురాణాలు సంతరించాడు. అతని శిష్యుడైన సూతుడు వాటిని ప్రవచించాడు. అందుకే సూతుడు శౌనకాది మహామునుల కిట్లనియె.. అని ఆరంభ మౌతాయి పురాణాలు. అందరికీ విద్యను ప్రసాదించే సద్గురువైన వ్యాస భగవానుని కృపా ప్రసాద లేశం చేత నిమ్న జాతికి చెందిన సూతుడు సైతం శౌనకాది మహామునులకు ప్రవచించే స్థాయికి చేరుకున్నాడు. అటువంటి మహానుభావుడైన వేదవ్యాస మహర్షికి నమస్సుమాంజలులు.

Salutations to Veda Vyasa, 

the lotus-eyed lord Vishnu among the sages, 

whose mere glimpse of kindness transformed an ordinary Suta into a revered Guru.


12, జులై 2022, మంగళవారం

సందియంబె! వైరి శరణు వేడగను నా

సందియంబె! వైరి శరణు వేడగను నా

దేశ మిత్తు నతని కాశ పడక..

శరణు వేడు వాని దరిఁ జేర్చి కాచుటే

ముఖ్య మగును నాకు..

విభీషణునికి  శరణ మిచ్చి లంకకు రాజుగా నభిషేకించారు. ఒకవేళ రావణుడే శరణాగతుడైతే..!" అని సుగ్రీవుడు సందేహిస్తే "రావణునికి నా కోసల దేశ మిస్తాను. శరణాగతుణ్ణి రక్షించటమే నాకు ముఖ్యం." అన్నాడు రాముడు. ఇదీ పద్యంలో వున్నది.

 

అనఘ చరిత్ర మీకు శర ణాగత రక్ష కులవ్రతంబు, మీ

అనఘ చరిత్ర మీకు శర

         ణాగత రక్ష కులవ్రతంబు, మీ 

     సునిశిత బాణజాలముల 

         చోకున కోర్వక వచ్చి తా దశా 

     నను డభయంబు వేడికొని

         నం దగ వె ట్లగు" నన్న న వ్విభుం 

     డిన సుతుఁ జూచి యట్లయిన

          నిచ్చెద వాని కయోధ్య నావుడున్

    ....రాముని కళ్యాణగుణాలకు, అనుకూల మైనదియే! శరణాగత వత్సలుడైన రాముడు, శర ణనిన రావణుని అనుగ్రహించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అవసరమైతే ఆయోధ్యను త్యజించే త్యాగగుణం రామునికి లేనిదీ కాదు.

చైతన్య రామాయణము 2 వ భా. పు. 298

పలికె త్రిజట "సోదరునితో, పత్నితోడఁ

పలికె త్రిజట "సోదరునితో, పత్నితోడఁ

మేటి పుష్పకమున దిశల్ మెరయ నుత్త

రమున కేగెడు రాముని, ప్రళయ కాల

మృడుని కనుగొంటి.. నంతట మేలు కొంటి"


అశోకవనంలో సీతను భయపెడు తున్న రాక్షస స్త్రీలతో వృద్ధ రాక్షసియైన త్రిజట సీతను భయపెట్టవ ద్దని ఆమె కనుకూలంగా ఎన్నో శుభ శకునాలు కనిపిస్తున్నా యని చెబుతూ తనకు వచ్చిన కల గురించి ఇలా చెప్పింది.


లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా సహ వీర్యవాన్

      "లక్ష్మణేన సహ భ్రాత్రా 

      సీతయా సహ వీర్యవాన్, 18

      ఆరుహ్య పుష్పకం దివ్యం 

      విమానం సూర్య సన్నిభమ్,

      ఉత్తరాం దిశమాలోక్య 

      జగామ పురుషోత్తమః  19"

పరాక్రమవంతుడు, పురుషశ్రేష్ఠుడు అయిన రాముడు, సోదరుని తోను, సీతతోను కలిసి, సూర్యుని లాగా ప్రకాశిస్తున్న, దివ్యమైన పుష్పక విమాన మెక్కి, ఉత్తర దిక్కుకు వెళ్ళాడు.

(సుందరకాండము 27 వ సర్గ)

9, జులై 2022, శనివారం

అప్పులు ముంచునేమొ యని యారట మందవు.. రావణుండు పెన్

    అప్పులు ముంచునేమొ యని

       యారట మందవు.. రావణుండు పెన్

    నిప్పులు రాలు కన్నులను

       నిన్నుఁ గనుంగొనఁ దల్లడిల్ల.. వొ

    క్కప్పుడు రామనామ మను

       నస్త్రము వీడవు.. భీతి నంద.. వే

    మెప్పులు గోర.. వంచును స

       మీర సుతున్ గొనియాడి రా కపుల్..


దశ యోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి, లంకలోని సీత జాడ కనుక్కొని, లంకను దహించి, క్షేమంగా తిరిగి రా గలిగిన హనుమంతు నిట్లు కొనియాడినారు వానరులు.

        అప్పులు = నీళ్ళు (సముద్రజలం)

         సమీర సుతుడు= ఆంజనేయుడు

2022 calendar | telugu full calendar 2022 festivals | hindu calendar fes...

6, జులై 2022, బుధవారం

శ్రవణం కీర్తనం విష్ణో స్స్మరణం పాదసేవనం

శ్రవణం కీర్తనం విష్ణో 

    స్స్మరణం పాదసేవనం

    అర్చనం వందనం దాస్యం

    సఖ్య మాత్మ నివేదనం


కేశవ! నారాయణ! భో

    మాధవ! గోవింద! హే మహావిష్ణో!

    మధుసూదన! త్రివిక్రమ!

    వామన! భో శ్రీ ధర! ప్రభు! హృషీకేశ!


శ్రీ నాథ! నారాయణ! వాసుదేవ!

    శ్రీ కృష్ణ! భక్తప్రియ! చక్రపాణే!

    శ్రీ పద్మనాభాచ్యుత! కైటభారే!

    శ్రీ రామ! పద్మాక్ష! హరే! మురారే!

సారసనేత్రుడున్ జలజ సంభవుడున్ సువశిష్ట మౌని సొం

    సారసనేత్రుడున్ జలజ

        సంభవుడున్ సువశిష్ట మౌని సొం

    పారెడు శక్తి తత్ సుతుడు 

        నా శుకుడున్ శుభ గౌడపాదుడున్

    సారెకు వారి శిష్యులును

        శంకరులున్ గలయట్టి యొజ్జపుం

    బారె శరణ్య మయ్యె గద 

        పండిత పామరు లెల్ల వారికిన్


    విష్ణువు, బ్రహ్మ, వశిష్టుడు, శుకుడు మున్నగు మహామహులు గౌడపాదులు, వారి శిష్యులు ఆది శంకరులు మొదలైన గురువుల పరంపరయే పండిత పామరు లందరికీ శరణ్యం కదా! అని భావం.


లలితాదిత్య వధానం

బిలలోన నపూర్వ మగుచు నింపొనగూర్చెన్

లలిత పద బంధములు, కొల

తల కందని భావ సంపదలు మెరయంగన్  1


ఆయు రారోగ్య భాగ్యంబు లమరు గాక!

దేవతల దేశికుల గొప్ప దీవన లవి

యహరహము చిరంజీవికి నందుగాక!

ఇలను శ్రీ లలితాదిత్య వెలుగుగాక! 2

6th class | fa1 english test paper | class 6 english | formative exam | ...

3, జులై 2022, ఆదివారం

పావనీ! వార్ధి లంఘించు వాడ వీవె..

     పావనీ! వార్ధి లంఘించు వాడ వీవె..

     తారకము రామ నామమే!..చేరి కళవ

     ళ పడ నక్కరయే లేదు.. రామ కార్య

     మునకు నవరోధ మున్నదే ముజ్జగముల!


సీతాన్వేషణలో  సాగరతీరం చేరుకున్నారు వానర వీరులు. హనుమతో జాంబవంతు డిలా అన్నాడు.

    రామ కార్యార్థ మేవ త్వం

    జనితోఽసి మహాత్మనా

    రామ కార్యం కోసమే నీవు జన్మించినావు.

    (అధ్యాత్మ రామాయణం.. కి.కాం. 9-18)

     అతస్త్వద్బల మాహాత్మ్యం 

     కో వా శక్నోతి వర్ణితుం

     ఉత్తిష్ఠ కురు రామస్య 

     కార్యం నః పాహి సువ్రత 20

         నీ బలా న్నెవరు వర్ణించగలరు? లే! రామ కార్యం సాధించు. మమ్మల్ని రక్షించు.

    "పవననందనా! సముద్రాన్ని లంఘించ గలవాడవు నీవే!.. తరింపజేసేది.. రామ నామమే! (నీ వెప్పుడూ అదే పలుకుతుంటావు.) కలవరపడ వలసిం దేమీ లేదు. రామ కార్యాన్ని అడ్డుకునేది మూడు లోకాల్లో వున్నదా!"


గంగే చ యమునే చైవ

గంగే చ యమునే చైవ 

గోదావరి సరస్వతి

నర్మదే సిందు కావేరి

జలే-స్మిన్‌ సన్నిధిం కురు

ఒక్కొక్కసారి సదీస్నానానికి నోచుకోక పోయినట్లైతే చదువుకో దగినది పైశ్లోకం. ఆయా పుణ్యనదుల నీరు నేనిప్పుడు స్నానం చేయబోతున్న నీటిలో సన్నిధి చేస్తాయి గాక అని సంకల్పించడం ఇందులోని సారాంశం.

మన ప్రాచీనులు ప్రతినిత్యము, పుణ్యనదీ స్మరణం చేస్తూ, నదీ దర్శనం కోసం, నదీ స్నానం కోసం తహతహలాడేవారు. ఎందుకంటే నిలువున్న నీటికన్న ప్రవాహజలం ఆరోగ్యకరం. నదీజలం ప్రవాహజలం. ఇలాంటి జలంపై సూర్యకిరణాలు ప్రసరించి చెఱుపు చేసే క్రిములను నశింపజేస్తాయి.

పరోపకారాయ ఫలంతి వృక్షాః

పరోపకారాయ ఫలంతి వృక్షాః 

పరోపకారాయ వహంతి నద్యః

పరోపకారాయ దుహంతి గావః

పరోపకారార్థ మిదం శరీరం

పరోపకారం కోసం వృక్షాలు ఫలాలనిస్తున్నాయి. పరోపకారం కోసం నదులు ప్రవహిస్తున్నాయి. పరోపకారం కోసం ఆవులు పాలిస్తున్నాయి. ఈ శరీరం పరోపకారం కోసమే! అని భావం. ఇందులో వృక్షాలు, నదులు, పశువులు (ముఖ్యంగా ఆవులు) చెప్పబడినవి. ఆవన్నీ ప్రకృతిలో భాగాలే! పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడివున్నవి. వీటిని చక్కగా పరిరక్షించుకోలేకపోతే మానవుని మనుగడకే ముప్పు వాటిల్లుతుందనేది నగ్నసత్యం. నదులను వ్యర్థపదార్థాలతో, రసాయనాలతో కలుషితంచేసి, అరణ్యాలను నిర్మూలించి, పశువులను కబేళాలకు తరలించి మాంసాన్ని విదేశీయులకు విక్రయించుకొని ధన మార్జింతామనే దౌష్ట్యానికి మానవుడు పాల్పడితే భగవంతుడిచ్చిన బుద్ధివైభవం దుర్వినియోమవుతుంది కదా! అప్పుడు భగవదనుగ్రహానికి నోచుకోక తన వినాశానికి తానే కారణమవుతాడు మానవుడు.

భాను బింబమ్ము దాక దివానఁ బెరిగె..

భాను బింబమ్ము దాక దివానఁ బెరిగె..

గరుడుడో యన నెగిరెఁ.. గేసరి తనయుడు

వనధి లంఘింపఁ దిలకించు ఘనతర సుకృ

తంబునకు నోచితిమి.. మాదె ధన్యత సుమి!


          సముద్రంలోని సర్పాలు, ఆకాశంలో ఎగురుతున్న హనుమను చూసి, గరుత్మంతు డేమో అనుకొన్నవి. (శ్రీమద్రాయణము. సుందరకాండ 1వ సర్గ 75 శ్లో)

    హనుమంతుడు ఉన్నట్టుండి క్రమక్రమంగా పెరిగిపోయి సముద్రం మీదుగా  ఎగిరిపోతుంటే వానరు లెంతో సంబరంతో ఇలా అనుకున్నారు.

   "సూర్య మండలం తాకుతాడో యేమో అన్నట్టు పెరిగిపోయినాడు. గరుత్మంతు డేమో యనుకునేటట్టు ఎగిరిపోసాగినాడు. కేసరి తనయుడైన ఆంజనేయుడు సముద్రాన్ని లంఘిస్తూ వుంటే తిలకించే గొప్ప పుణ్యానికి నోచుకున్నాము. మాదే ధన్యత సుమా!"


ప్లవమానం సమీక్ష్యాథ భుజఙ్గాః సాగరాలయాః

వ్యోమ్ని తం కపి శార్దూలం సుపర్ణ ఇతి మేనిరే

విభవము లెల్ల వీడి, పతి వెంటనె కారడవుల్ గమించి

    విభవము లెల్ల వీడి, పతి

       వెంటనె కారడవుల్ గమించి, గొ

    ప్ప భయము లొక్కపెట్టునను

        ప్రాణములన్ బెకలింప జూచినన్

    ప్రభు వగు రామునే మదిని

        భద్రముగా నెలకొల్పి మించెనే!

    త్రిభువనముల్ ప్రియంబుగ ను

        తించెనె అగ్ని పునీత జానకిన్!

 రావణవధానంతరం అయోధ్య కేతెంచిన సీతా రామ లక్ష్మణులను దర్శించి సంభాషించి జరిగిన సంఘటనలను ఆనం దాశ్చర్యాలతో విని పులకించి అయోధ్యలోని ముత్తైదువు లిలా సీతాదేవిని కొనియాడినారు.

   "జానకి అయోధ్యా నగర జీవితమూ వదలి పెట్టింది. అంతః పుర కాంతగా పొందే రాజ భాగా లన్నీ విడిచి పెట్టింది. క్రూర మృగాలూ రాక్షసులూ సంచరించే నిర్జ నారణ్యాలలో నివసించడానికి భర్తయైన రాముని వెంట వెళ్లిపోయింది. రామ లక్ష్మణులు తనను వరించకపోతే శూర్పణఖ ప్రాణాలు పెకలింప జూసినా.. తనను వరించకపోతే ప్రాణాలు తీస్తా నని రావణుడు బెదిరించినా.. రాముణ్ణే మనసులో స్థిరంగా నిలుపుకొని సీతమ్మ తొణకలేదు బెణకలేదు. అగ్నిపరీక్ష లోకూడ ఉత్తీర్ణురాలై నిలిచి నారీలోకానికే ఆదర్శప్రాయురా లయింది. మూడులోకాలూ ఆమెను కొనియాడినవి"