శ్రీ పద్మావతి యోర చూపున రసో
ద్రేకంబు జాగ్రత్ స్మరం
బోపంజాలక.. దుష్ట శిక్షణ సమా
ప్త్యుత్సాహ వాత క్రమం
బాపంజాలక.. శౌరి క్రూరపు గుణం
బార్ద్రంబు కాగా నిరా
క్షేపం బైన కృపారసం బగుచు వ
ర్షించున్ సదా నాపయిన్..
పద్మావతీ దేవి ఓర చూపు స్వామివారిపై ప్రసరించింది. ఆ చూపులోని రసోద్రేకమును(న) మేలుకొంటున్న ప్రేమను ఓపజాలక..
దుష్టశిక్షణ పూర్తి అయిం దన్న ఉత్సాహం ఒక వాతక్రమం (గాలితెర) లాగా వీచగా దానిని ఆపజాలక...
శ్రీ హరియొక్క తాత్కాలిక క్రూరత్వం కాస్త ఆర్ద్రమై (కరిగి) పోసాగింది. క్రమంగా అది స్వామియొక్క కృపారసంగా మారి నా మీద వర్షిస్తుంది గాక!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి