వాస్తు శాస్త్రం ప్రకారం తల ఉత్తర దిశలో పెట్టి నిద్రించకూడదు
తల దక్షిణం లేదా తూర్పు దిశలో పెట్టుకుని నిద్రించడం మరచిపోకూడదు
పడకగదిలో ఉన్న అద్దంలో మీరు నిద్రిస్తున్న మంచం లేదా మీ శరీరం ప్రతిబింభించకూడదు
మంచాన్ని నేరుగా పైకప్పు దూలాల (Beams) కింద ఉంచడం వాస్తు ప్రకారం అనుకూలం కాదు
పడకగదిలో హింసాత్మక జంతువులు, యుద్ధ దృశ్యాలు, ముళ్ల మొక్కలు లేదా పదునైన ఆయుధాల చిత్రాలను ఉంచకూడదు
మంచం మీద కూర్చుని ఆఫీస్ పనులు చేయకూడదు
ఆగిపోయిన గడియారాలు ఉంచకూడదు
గోడలకు, బెడ్ షీట్లకు నలుపు, ముదురు ఎరుపు రంగులను వాడకూడదు .
మంచంపై కూర్చుని భోజనం లేదా టిఫిన్ చేయకూడదు.
బెడ్‌రూమ్‌లో ఉగ్రరూపంలో ఉన్న దేవతా మూర్తుల చిత్రాలు పెట్టవద్దు.
పడకగదిలో మూలల్లో చెత్తబుట్టలను ఉంచవద్దు
పడక గది వాస్తురీత్యా ఇంటికి పడమర, దక్షిణ దిశలలో ఉండేలా కట్టుకోవడం మరువకూడదు
పడమర, దక్షిణ, నైరుతిలో నిర్మించే పడకగదికి తగినంత గోప్యత లభిస్తుంది.
ఇంటి యజమానులకు నైరుతి దిశలో పడకగది ఎంతో మంచిది
ఇతర కుటుంబ సభ్యులకు, పిల్లలకు దక్షిణ, పడమర దిశలతోపాటూ వాయవ్యం కూడా అనుకూలమే.
పడక గదికి ఆగ్నేయం లేదా ఈశాన్యం వాస్తుపరంగా అంత అనుకూలం కాదు.
పడక గది దీర్ఘచతురస్రంగా విశాలంగా ఉండాలి
పడక గది చతురస్ర ఆకారంలో ఉంటే ఇరుకుగా ఉంటుంది
పడకగది 10 x 12, 10 x 15, 12 x 15, 15 x 18 అడుగుల నిష్పత్తిలో నిర్మించుకుంటే అనుకూలంగా ఉంటుంది.
మంచం భోగ స్థానం కాబట్టి పసుపు, కుంకుమలు, దేవుడి సామాన్లు పెట్టరాదు
పండ్లు, తమలపాకులను బెడ్ మీద పెట్టకూడదు
భగవంతునికి నైవేద్యం పెట్టిన పదార్థాలను కూడా మంచం మీద పెట్టకూడదు
ముత్యాలు, సాలగ్రామాలు, రుద్రాక్షలు మంచంమీద పెట్టరాదు
వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు మంచం మీద పెట్టకూడదు.
మరకత ఆభరణాల్ని, పచ్చలను మంచం మీద పెట్టకూడదు
మంచం మీద దిండు కింద దేవుడి ఫోటోలను పెట్టుకోవడం ఏ మాత్రం మంచిది కాదు
చీపురు మంచం కింద చీపురు ఉంచడం చాలా అశుభం.
బూట్లు, చెప్పులు బంగారు-వెండి లేదా ఇతర లోహపు నగలు, అద్దం, బూట్లు, చెప్పులు, ఆయిల్ మంచం కింద ఉంచవద్దు
మంచం కింద గాజు లేదా నూనె ఉంచవద్దు
మంచం కింద పాత పాదరక్షలు, చిరిగిన బట్టలు, తుప్పుపట్టిన వస్తువులు, విరిగిన ఎలక్ట్రానిక్ పరికరాలు, పనికిరాని ప్లాస్టిక్ సామగ్రి వంటి వస్తువులను పెట్టకూడదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి