ఆ కనులు పున్నమి వెన్నెల కురిపించే సౌందర్య ఝరులు. ఆ వదనం అరుణోదయ కమలం. అమరలోకం నుండి దిగివచ్చి కళారంగంలో సాక్షాత్కరించిన అభినయ అప్సరస. కఠిన పాషాణాలను సైతం కరిగించి కదిలించ గల అతిలోక రూపసి. ఆమె నవ్వితే కవులు కావ్యాలు రాసేవారు తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయగీతిక ఒకనాడు.
మరోనాడు పాలకడలిలో ప్రభవించిన శ్రీమహాలక్ష్మి, జగదేకవీణను శ్రుతిచేసే కలవాణి, కోరిక వారికి కొంగుబంగారం జగదీశ్వరి, భక్తులను కరుణించే కనక దుర్గ. ఆమే సినీ నందనవనంలో వెన్నెలలు కాయించి, నవ్వులు పూయించిన జగదేక సౌందర్య నిలయ కె.ఆర్.విజయ. ఈ సీనియర్ నటీమణి అశేష అనుభవాల్లో కొన్ని...
చాలా మంది నేను తమిళ అమ్మాయిని, మలయాళ అమ్మాయిని అనుకుంటుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. మేము తెలుగు వాళ్ళమే. మా నాన్న రామచంద్రన్ గారిది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు. మా అమ్మది కేరళ రాష్టంలోని త్రిచూర్. మా నాన్న మిలిటరీలో సెకుత్ ఆర్మీగా పనిచేసేవారు. మా మేనమామలు కూడా మిలిటరీలోనే ఉండేవారు. ఓసారి మావయ్యలతో పాటు మా నాన్న కేరళకు వచ్చినపుడు, మా అమ్మని చూసి ప్రేమించారట. పెద్ద వాళ్లంతా ఒప్ప్పుకోవడంతో వాళ్ళ పెళ్లి జరిగిందట. వాళ్ల పెళ్లి జరిగాక మా నాన్న మా అమ్మను తీసుకుని చిత్తూరు వచ్చేశారు. అక్కడే మా పక్కింట్లో ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య గారు ఉండేవారు. నేను చిన్నప్ప్పుడంతా వాళ్లింట్లోనే పెరిగాను. అంచేత నేను తెలుగమ్మాయినే. అయితే నేను మన షావుకారు జానకి గారి లాగా తమిళంలో ఎక్కువ పేరు తెచ్చుకున్నాను గనుక నన్ను అందరూ అరవమ్మాయ్ అనుకుంటారు.
నా అసలు పేరు దైవనాయకి. మా నాన్నకు ఏ ఊర్లో ఉద్యోగమైతే అక్కడికి మకాం మార్చేవాళ్లం. అందువల్ల తమిళనాడులో చాలా ఊర్లు మారాం. మా అమ్మ కల్యాణకుట్టి గారికి నన్నో సినిమా తారగా చూడాలని చాలా ఆశగా ఉండేది. మా నాన్న గారికి కూడా నాటకాలంటే చాలా ఇష్టం. నేను చిన్నప్ప్పుడు చాలా ముద్దుగా ఉండేదాన్నని మా నాన్న నన్ను ఆయనతో పాటు తీసుకువెళ్లి చిన్న చిన్న బాలపాత్రలు వేయించేవాడు.
అంతా బానే ఉండేది కాని, ఇంట్లో వాతావరణమే చాలా కష్టం కలిగించేది. మా అమ్మానాన్నలకు క్షణం పడేది కాదు. వాళ్ల మధ్య సయోధ్యలేని కారణంగా నా ఇద్దరు చెల్లెళ్లు మరియు నా తమ్ముడి పోషణ భారం నా మీద పడింది. కుటుంబం ఆర్థికంగా నిస్సహాయమైపోయింది. అందువల్ల కుటుంబంలో పెద్ద కూతురిగా వాళ్లను ఆదుకోవాల్సివచ్చింది. అందుకే బాగా చదువుకోవాలన్న కాంక్షను ప్రక్కన పెట్టాను. తోడబుట్టిన వారి కోసం నా ఆశలు, ఆశయాలు అన్నీ మరచిపోయాను.
నా కుటుంబాన్ని తీసుకొని చెన్నెí వచ్చేశాను. చిన్నప్ప్పుబడు ‘పళని్ణ లో నేర్చుకున్న నాట్యంతో డబ్బు సంపాదించాలని తొలిసారిగా మధురైలో కాలికి గజ్జె కట్టాను. దరిమిలా చాలా ప్రాంతాలలో నాట్యాలు చేసి కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాను. ఇక్కడే మాంబళం చిన్న అద్దెకు తీసుకున్నాను.
అక్కడ రైల్వేస్టేషను ప్రక్కగా రోజూ చదువుకోవడానికి వెళ్తుండే నా వయస్సు అమ్మాయిలను చూస్తున్నప్ప్పుడల్లా నినేను వాళ్లలా చదువుకోలేక పోతున్నానే!” అనే బాధ నా కన్నీటి తెరల వెనక దాగి ఉండేది. అది గొప్పింటి వాళ్లబ్బాయి చేతిలో ఉన్న ‘తీపి మిఠాయి్ణ ని చూస్తూ, బీద పిల్లవాడు పడే ఆవేదన అలాంటిది! అప్ప్పుడు నేననుకున్నాను - ఈ ప్రపంచమే నాకు పాఠశాల! దేవతా శ్లోకాలు, స్తోత్రాలే పాఠ్యపుస్తకాలు, ఈ ప్రపంచాన్ని సృష్టించి ఇన్ని జరిపించే దేవుడిని నమ్మినపుడు జీవన పోరాటంలో ఎందుకు విజయం లభించదు” ఈ దృష్టితోనే గుండె నిబ్బరాన్ని అలవరచుకున్నాను.
అందుకే నాట్యతారగానే గాక నటిగా కూడా రూపాంతరం చెందాను. నాకు నటన మొదటి నుంచీ పెద్ద సమస్య కాదు. నా పదకొండేళ్ల ప్రాయంలోనే ప్రముఖ నటుడు ఎం.కె. రాధా నన్ను తీసుకొని పోయి స్టేజీ నాటకాలు వేయించాడు. ఆ అనుభవంతోనే రంగస్థల నటిగా మారాను. ప్రముఖ రచయిత బాలమురుగన్ బృందంలో చేరి నాటకాల్లో వేషాలు వేయసాగాను.
సినిమా ప్రపంచం వైపు కూడా దృష్టి సారించాను. అయితే ఈ సినిమా ప్రపంచంలో అడుగు పెట్టకముందు నాటకాలు ప్రదర్శించడం వల్ల ప్రయోజనం ఉంటుందని కొందరు చెప్పారు. అయినా ఫీల్డులోకి కొత్తగా వచ్చిన నాకు నాటకాల్లో విరివిగా అవకాశాలు ఎవరిస్తారు? అందుకే నా దగ్గర ఉన్న డబ్బుతో ధైర్యం చేసి నేనే ఓ నాటకాన్ని ప్రదర్శించాను. అప్ప్పుడు నాకు తెలిసి వచ్చింది నాటకాలు వేయడంలోని సాధక బాధకాలు. అయితే ఆ ప్రయత్నం వృధా పోలేదు. సినిమా ప్రముఖుల దృష్టిలో నేను పడ్డాను. ప్రముఖ తమిళ హీరో జెమినీ గణేశన్ గారు ఓ నాటకంలో నన్ను చూసి నినువ్వు ఎప్పటికైనా సినీ పరిశ్రమను శాసిస్తావు” అని చెప్పారు. అలా మొట్టమొదట నన్ను నినువ్వూ సినిమా రంగానికి పనికి వస్తావు” అని చెప్పింది ఆయనే. ఆ సమయంలో ఏ దేవుడు తథాస్తు అన్నాడో, ఆయన నోటిమాట వృధా పోలేద. సినిమారంగంలో అవకాశాలు వచ్చాయి.
చెన్నెíలో ప్రముఖ వ్యాపార సంస్థ ‘సిప్సన్ణ తమ సంస్థ తరపున కేలండర్లు ప్రచురింపదలచి వాటిపైన నా ఫోటో ప్రచురించడం జరిగింది. అదే నా జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. అదెలాంటి మలుపంటే నన్నూ ఏకంగా హీరోయిన్‌నే చేసేసింది. ఆ సమయంలో తమిళంలో తీయబోయే నికర్పగం” అనే సినిమాకు నూతన కథానాయిక కోసం వెదుకుతున్నారట. ఓ రోజు ఆ సినిమా యÖనిట్ అంతా కూర్చుని ఉనా3్నరు. ఉంటే ఓ వ్యక్తి సింప్సన్ చాక్లెట్ డబ్బాను అక్కడికి తీసుకెళ్లాడట. దాని మీద నా ఫోటో చూసిన దర్శకుడు కె.ఎస్. గోపాలకృష్ణన్ నా గురించి తెలుసుకుని, కబురుచేశారు. వెళ్లాను. తను సినిమాలలో హీరోయిన్‌గా అవకాశమిస్తామన్నారు. నేను వెంటనే ఒప్ప్పుకున్నాను. ఒకప్ప్పుడు నా నృత్యాన్ని, నాటకాన్ని చూసి భవిష్యత్‌లో హీరోయిన్‌వి అవుతావని ప్రశంసించిన జెమినీ గణేశన్. నితొలి సినిమానే నాతో చేస్తున్నావే” అన్నారు ప్రశంసిస్తూ. అప్ప్పుడు నా ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
‘అమరజ్యోతి పిక్చర్స్ణ పతాకంపై వచ్చిన ఆ చిత్రం 15.11.1963 వ దీపావళి పండుగ సందర్భంగా విడుదలై విజయఢంకా మ్రోగించింది. ఈ చిత్రం విడుదల రోజు నేనెంతో ఆతృతపడ్డాను. నేనెలా నటించానో, నా మొదటి చిత్రం ఎలా ఉందో? నని.
థియేటర్‌కు వెళ్లి అందరితో పాట నేనూ ‘టిక్కెట్టు్ణ తీసుకొని లోపలికెళ్లి కూర్చున్నాను. చిత్రం చూస్తున్న ప్రేక్షకులు తనమీద కొత్తన టి అంటూ నన్ను మెచ్చుకున్నారే గానీ, వాళ్లతో పాటు కూర్చుని చూస్తున్న నన్నెవ్వరూ గుర్తు పట్టలేదు! నినూతన నటిని కాబట్టి నన్నెవరు గుర్తు పట్టగలరు?” అనుకున్నాను. అవును మరి! గుర్తు పట్టడం - గుర్తు పట్టకపోవడం అంతా ‘స్టార్ణ కావడం మీదనే ఆధారపడి ఉంటుందని తెలుసుకున్నాను.
ఒకసారి ఒక పెద్ద బట్టల దుకాణంలోకి వెళ్లి ఒక మామÖలు చీర కొనుకున్నాను. అక్కడే కంటికింపుగా మరో చీరె కన్పిస్తే బావుందనిపించి ధర అడిగాను. నిఇవన్నీ నువ్వేం కొంటావమ్మా? అనవసరంగా మా సమయాన్ని వృధా చేయొద్దు” అన్నాడా దుకాణందారు. నా మనసు చివుక్కుమంది. మాట్లాడకుండా వచ్చేశాను. తర్వాత ఇంకో చిత్రం, ఆ తర్వాత మరో చిత్రం - ఇలా వరుసగా అవకాశాలు వచ్చాయి. పేరొచ్చింది, డబ్బూ వచ్చింది.
ఒకరోజు
‘షూటింగ్ణ అయిన తర్వాత ఇంటికి వచ్చాను. నా కోసం ఎవరో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఎవరోకాదు! ఆ రోజు చీర ధర అడిగితే కసిరిన ‘పెద్దమనిషి!్ణ అతని వ్యాపార ప్రకటనల కోసం నా ఫోటో కావాలని వచ్చారట! అప్ప్పుడే తెలుసుకున్నాను సినిమా మహాత్మ్యం ఏమిటో!
సినిమా మనుషులు కూడా చాలా విచిత్రంగా ఉంటారు. ఎంతటి వారినైనా చాలా కేవలంగా మాట్లాడుతారు. ఎప్ప్పుడూ ఇతరుల గత జీవితాల్లోకి తొంగి చూస్తూ హేళన చేస్తుంటారు. అది పైశాచికమని నా భావన. నాకూ ఇలాంటి చేదు సంఘటనలెన్నో ఉన్నాయి. నిఆ... విజయ... ఏం హీరోయిన్. ఏదో కాలెండర్లు, ఆడ్వరర్టెíజ్‌మెంట్లు చేసేది...” అని వెనకాల మాట్లాడుకొని తృణప్రాయంగా లెక్చర్లిస్తుంటారు. అయితే ఆ అనేవాళ్ల స్థాయి నాకు తెలుసు గనుక నేనేం ప్రతిస్పందించేదాన్ని కాదు. ముఖ్యంగా తెలుగు భాషలో కొంతమంది నటీమణులు అలా మాట్లాడారు. అయితే తమిళంలో అలా కాదు, వాళ్లు నటీనటుల్ని ఆరాధిస్తారు, గౌరవిస్తారు.
ఇక్కడే నా పేరు గురించి కొంత చెప్ప్పుకోవాలి. నికర్పగం” చిత్రంలో నటించడానికి ముందు నిమగళే ఉన్ నముత్తు” అనే చిత్రం కోసం మేకప్ టెస్లు జరిగినప్ప్పుడు ఎం.ఆర్.రాధా గారు నా పేరు విని నిఇదేం పేరమ్మా! పాతకాలపు పేరు! ఇది బాగాలేదు ‘విజయ్ణ అని మార్చుకో” అని సలహా ఇచ్చారు. ఆయన సలహాను పాటించాను. నా తల్లిపేరులోని ‘కె్ణ అక్షరాన్ని, తండ్రి పేరులోని ‘ఆర్ణ అక్షరాన్ని తీసుకుని కె.ఆర్.విజయ గా మారాను. పేరులోనే ఉన్నది పెన్నిధి అని స్వానుభవంగా తెలుసుకున్నాను. ఆ పున్ణనామకరణ విశేషమేమో చాలా కొద్దిరోజుల్లోనే స్టార్‌డమ్ నందుకున్నాను.
నికర్పగం” చిత్రం దీపావళి రోజు విడుదలై నా జీఇతంలో నిజంగానే వెలుగుల్ని నింపింది. ఆ చిత్రం శతదినోత్సవాలు చేసుకుంది. అందులో సావిత్రి, జెమినీ వంటి హేమాహేమీలున్నా తమిళ ప్రజలు కొత్తగా వచ్చిన నాపై అందునా టైటిల్ రోల్ వేశాను కనుక నాపై దృష్టి సారించారు. ఓ పెద్ద అభినందన సభ ఏర్పాటు చేశారు. ఘనంగా సత్కరించి నిపున్నాగై అరసి” అనే బిరుదుతో గౌరవించారు. అంటే ‘నవ్వుల రారాణి్ణ అని అర్థం. ఈ బిరుదంటే నాకెంతో ఇష్టం. గౌరవ డాక్టరేట్లు, కలైమామణి, స్వర్ణ కంకణాలు ఇవేవీ ఇవ్వని మానసికానందాన్ని ప్రేక్షకులు ఇచ్చిన ‘పున్నాగై అరసి్ణ బిరుదు ఇస్తుంది. అందుకే ప్రేక్షకులంటే నాకు పంచప్రాణాలు. ఈ విషయంలో ఎం.జి.ఆర్. గారు నాకు మార్గదర్శకులు.
ఆయన అనేవారు నివిజయా! అభిమానులే మనకు దేవుళ్లు. వాళ్ల శ్రమే మన విలాసవంతమైన జీవితం. కనుక వాళ్లను ఎప్ప్పుడూ ఈసడించుకోగూడదు అని. ఈ నాటికీ నేను అభిమానుల విషయంలో ఆ సూత్రాన్నే అనుసరిస్తున్నాను. ప్రేక్షకులు ఎప్ప్పుడు ఫోన్ చేసినా విసుక్కోను. ఇంటికి వచ్చిన వారిని పలుకరిస్తుంటాను. మాకు ‘స్టార్ణ అనే గుర్తింపు ఇచ్చింది ప్రేక్షకులే. నటీనటులకు ఆరోజుల్లో అంత క్రేజ్ ఉండేది. ఏదో మమ్మల్ని దైవాంశ సంభూతులుగా, గంధర్వులుగా చూసేవారు. ఇప్ప్పుడు ఆ పరిస్థితి లేదు. ‘స్టార్ణ అనేమాటే వినబడడం లేదు. హీరో, హీరోయిన్ అనే తేలికపదాలనే వాడుతున్నారు. ‘స్టార్ణ అనే విశేషణాన్ని నటీనటులకు ఆపాదించడం లేదు.
ఎం.జి.ఆర్.గారు నాకు జీవనశైలిలో కూడా మార్గదర్శకులు.
ఆయన ఓ రోజు సెట్టులో ఏదో పిచ్చాపాటి మాట్లుడుకుంటుంటే మీరు రాత్రిపూట ఎన్ని గంటలకు భోంచేస్తారు” అని అడిగారు. నేను రాత్రి 11 గంటలు దాటుతుందని చెప్పాను. ఉదయం ఏడు గంటలకు ఏం చేస్తారని అడిగారు. బెడ్ కాఫీ తాగి తిరిగి పడుకుంటానని చెప్పాను. ఆయన చాలా తీక్షణంగా నావైపు చూశారు. రాత్రి కనీసం తొమ్మిది గంటలకల్లా భోంచేసి పడుకోవాలి. ఉదయం పూట పాచిపళ్లతో ఎలాంటి ఆహార పదార్థాలూ తీసుకోగూడదు. అవి విషంతో సమానమని హెచ్చరించారు. అప్పటినుండీ త్వరగా పడుకొని త్వరగా లేస్తాను, ఉదయం నిద్రలేవగానే దంతాలు శుభ్రపరచుకుంటాను. ఇలా ఎం.జి.ఆర్. నా విషయంలో ఓ ఫిలాసఫర్‌గా ఉండేవారు.
నా పెళ్లయితన కొత్తల్లో నిర్మాతలతో, దర్శకులతో ఎం.జి.ఆర్. గారే నిఆ అమ్మాయికి రాత్రివేళ షూటింగులు వేయవద్దు. ఏమున్నా ఒక ఉద్యోగం లాగా సాయంకాలం ఆరుగంటల లోపు ముగించి పంపేయండి” అని చెప్పేవారు. ఆయన పెద్ద హీరో గనుక వాళ్లూ ఆయన మాట జవదాటకుండా నా టైమింగ్స్ అలాగే సర్దుబాటు చేసేవారు. పాప పుట్టిన తర్వాత నేను సాయంకాలం దాటిన తర్వాత షూటింగులకు రాను. అనే షరతు మీదే నటించేదాన్ని. ఆదివారం పూట షూటింగ్‌లో పాý£్గనని చాలా కరాఖండిగా నియమం పెట్టుకున్నాను. అందువల్ల నటనలో ఎప్ప్పుడూ టెన్షన్ రాలేదు. నటజీవితంలో విసుగు కన్పించలేదు.
తెలుగులో మొట్టమొదటి సారిగా నేను నటించిన చిత్రం నిశ్రీకృష్ణపాండవీయం”. రామకృష్ణ, ఎన్.ఏ.టి. కంబైన్స్ పై ఎన్.టి.ఆర్. గారు సొంతంగా నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆయన దర్శకత్వంలో, ఆయన సరసన నాయికగా అందులోనూ ముగ్ధ రుక్మిణిగా నటించడాన్ని ఇప్పటికీ నేనొక అదృష్టంగానే భావిస్తుంటాను. మొట్టమొదటిసారిగా తెలుగు చలన చిత్రసీమలో అడుగుపెట్టడమే గాకుండా కత్తిమీద సాము వంటి పౌరాణిక పాత్రలో నటించడం సాహసమే. అయినప్పటికీ ఎన్.టి.రామారావు గారు ఇచ్చిన ప్రోత్సాహంతో, వారు చెప్పినట్లుగా నటించి ఆ పాత్రకు న్యాయం చేకూర్చగలిగాను. ఎన్.టి.ఆర్. గారు ఒక నటుడుగా పౌరాణిక పాత్రలు ధరిస్తున్నప్ప్పుడు చాలా నియమనిష్ఠలు పాటించేవారు. ఒక దర్శకులుగా నటీనటులు ‘గెటప్స్ణ దగ్గర నుంచి అన్నీ స్వయంగా తామే చూసుకునేవారు. తనకు ఏ విధమైన ‘ఎఫెక్ట్ణ కావాలో ముందే ఊహించుకుని, నటీనటులకు తెలియకుండానే వారి నుండి ఆ ‘ఎఫెక్ట్ణ రాబట్టుకునేవారు. నేను ఆ మధ్య పౌరాణిక పాత్రలు, అమ్మవారి పాత్రలు అతి సునాయాసంగా పోషించగలిగానంటే ఆయనే ప్రేరణ అని చెప్ప్పుకోవచ్చు.
నిశ్రీకృష్ణపాండవీయం” 13.01.1966 న విడుదలై ఆంధ్రదేశంలో తొమ్మిది కేంద్రాల్లో శతదినోత్సవాలు చేసుకుంది. ఈ చిత్రానికే 1965 లో ద్వితీయ ఉత్తమ కథాచిత్రంగా వెండి నంది వచ్చింది. అయితే ఇక్కడొక విషయం చెప్ప్పుకోవాలి. ఈ చిత్రానికి మొదట ఉత్తమ కథా చిత్రం అవాఉ్డ వచ్చినట్లు పత్రికలలో ప్రకటించారు. కానీ ఇది పౌరాణిక చిత్రమనే కారణంతో దీన్ని రెండవ అవార్డు చిత్రానికి మార్చారు. బంగారు నంది అవార్డుకు నిఅంతస్తులు” చిత్రాన్ని ప్రకటించారు. దీనిమీద మళ్లీ గొడవ మొదలైంది. నిఅంతస్తులు” చిత్రంలో దెయ్యం ఉందికదా, అది ‘నిను వీడని నీడను నేను...్ణ అనే పాపాట పాడుతుంది కదా, కనుక ఇది హేతుబద్ధంగా లేదని వాదించాఉ. సరే, ప్రకటించేశాం కదా అని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హడావుడిగా ఈ అవార్డుల తంతు ముగించేసింది. ఎందుకనే ఈ అవార్డుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి మొదటి నుండీ కూడా పారదర్శకత ఉండడం లేదు.
నా మొదటి తమిళ చిత్రం నికర్పగం” తమిళనాట కాసుల వర్షం కురిపించి గోపాలకృష్ణన్ గారిని నికర్పగం” స్టూడియో అధినేతను చేసింది. అదేవిధంగా తెలుగులో నా మొదటి చిత్రమైన నిశ్రీకృష్ణపాండవీయం” ఇప్పటికీ రికార్డు సృష్టిస్తూనే ఉంది. ఈ చిత్రం రిపీట్ రన్‌లో కోటి రూపాయలు వసూలు చేసింది. రిపీట్ రన్‌లో అంత డబ్బు వసూలు చేసిన చిత్రం ఇంతవరకూ చరిత్రలో ఇదొక్కటే. 1968, 1986, 1997 సం॥ల్లో ఈ చిత్రం రీరిలీజ్ జరిగింది. శాంతి పిక్చర్స్ ద్వారా మన కొమ్మినేని వేంకటేశ్వరరావు, ఆయన మిత్రబృందం ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే 1997 లో హైదరాబాదులో వంద రోజులు ఆడడం విశేషం. ఇలా రెండు భాషల్లోనూ నా మొదటి చిత్రాలు చరిత్ర సృష్టించడం నాకు ఆనందదాయకం.
నిశ్రీకృష్ణపాండవీయం” తర్వాత అదే సంవత్సరంలో ఎన్.టి.ఆర్. తోనే నిపరమానందయ్య శిష్యుల కథ” చిత్రంలో గంధర్వకన్య చిత్రలేఖగా నటించాను. ఈ చిత్రానికి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ వైలురాయి అనదగ్గ సి.పుల్లయ్య గాఉ దర్శకులు. ఈ చిత్రం 17 కేంద్రాల్లో శతదినోత్సవాలు చేసుకుంది. బెంగుళూరులో ఒకే థియేటర్‌లో 175 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం నాకు చేసిన మహోపకారం ఎల్.విజయలక్ష్మి లాంటి ప్రాణస్నేహితురాలు దొరకడం. ఈ చిత్రంలో మేమిద్దరం పోటీపడి నటించాం. నృత్యాలు చేశాము. నేను నర్తకినే అయినా ఎల్.విజయలక్ష్మితో పోటీపడేంత గట్టి నేర్పరితనం, సామర్థ్యం నాకు లేవు. మేమిద్దరం కలసి ఒకేసారి ‘వనిత తనంతట తానే వలచిన...్ణ అనే పాటలో నృత్యం చేసే సన్నివేశముంది. అయితే ఎల్.విజయలక్ష్మి టాలెంట్ తెలుసు గనుక ఆమెను క్లోజప్‌లోనూ, నేను హీరోయిన్‌నే అయినా నన్ను ఆ పాటలో లాంగ్‌షాట్‌లోనూ చూపించారు పుల్లయ్యగారు. ఆ చిత్రంలో కూడా నాకు మొదటి చిత్రంలో డబ్బింగ్ చెప్పిన టి.జి.కమలాదేవిగారే డబ్బింగ్ చెప్పారు. ఇక్కడ మరో విషయం చెప్పాలి - తెలుగులో నా ఘనవిజయాలలో సగభాగం డబ్బింగు పార్వతి గారికి కూడా చెందాలి. ఆమె గొంత నాకు బాగా సరిపోయేది. అసలు మాలాంటి పరభాషా తారలు క్లిక్ కావడంలో డబ్బింగు ఆర్టిస్టులే కీలకం.
నేను నా సొంత గొంతుతో నటించిన మొదటి చిత్రం తారక రామా పిక్చర్స్ నిభలేతమ్ముడు” (1969). ఈ చిత్ర నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య గారంటే నాకు ఎనలేని గౌరవం. ఆర్టిస్టుల పట్ల ఎంతో గౌరవంగా వ్యవహరించే వారాయన. నేనంటే చాలా ఇష్టం. నిఅమ్మాయ్! నా సినిమాలో నీకు డబ్బింగ్ పెట్టట్లేదు. బి.సరోజాదేవి లాగా నీ ముద్దు మాటలకు మంచి పేరు వస్తుంది” అని ప్రోత్సహించి, పట్టు పట్టి నాకు వాచకంలో చక్కటి తర్ఫీదునిచ్చ నాచే మాట్లాడించాడు. ఆ చిత్రం కూడా బాగానే డబ్బు గడించింది. అయితే ఈ చిత్రంలో మహమ్మద్ రఫీ పాడడం వల్ల కొంత విజయావకాశాలు దెబ్బతిన్నాయి అని చెప్ప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి ఘంటసాల గారి హవా బాగా నడుస్తోంది. పైగా రఫీ గారు హీందీ యాసతో పాడడం కొంతమందికి నచ్చలేదని నేననుకుంటుంటాను. అయితే రిపీట్ రన్స్‌లో బాగా పోయి ఆడింది.
నిభలేతమ్ముడు” తర్వాత నా సొంతగొంతుతోనే నటించిన మరో చిత్రం నిమేలుకొలుపు” (1978) కూడా పుండరీకాక్షయ్య గారిదే. స్వచ్ఛమైన మంచిగంధం లాంటి వారాయన.
ఎన్.టి.రామారావు గారితో నటించిన చిత్రాల్లో నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన మరో చిత్రం పద్మా ఫిలింస్ నిఏకవీర” (1969). మహానటి, అంతకంటే గొప్ప మనిషి జమున గారితో కలిసి నటించే అవకాశాన్ని, అదృష్టాన్ని కలిగించిన చిత్రమది. ఇందులో నేను టైటిల్ రోల్ పోషించాను. ఏమ్రించిన ప్రియునికి దూరమై, వివాహమాడిన భర్తకు దగ్గర కాలేక సంఘర్షణ ననుభవించే పాత్ర నాది. చాలా టిపికల్ రోల్. ఆ చిత్రమప్ప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సరాలుంటాయి. అంత చిన్న వయసులోనే నేను ఒక బరువైన, క్లిష్టమైన పాత్రను పోషించడం నా తలకు మించిన బాధ్యత. అయినప్పటికీ దర్శకుడు సి.యస్.రావు గారు చెప్పింది చెప్పినట్టుగా, ఆయన ఊహించిన మేరకు కొంతైనా న్యాయం చేకూర్చాలని ఎంతో తపనతో, దీక్షతో నటించాను. చిత్రంలోని ప్రతి దృశ్యాన్ని ఓ శిల్పం చెక్కినట్టు చెక్కారు సి.యస్.రావుగారు. చాలా బాగా వచ్చింది. చూచిన వారంతా చాలా బాగా ఉందన్నారు. కానీ ఆ చిత్రం ఆర్థికంగా విజయాన్ని సాధించలేక పోయింది. ఎదుకంటే ప్రేక్షకులు టైటిల్ రోల్ రామారావు గారిదనుకున్నారు. పైగా నిఏకవీర” అంటే వీరోచితమైన కత్తియుద్ధాలు వగౌరాలు ఉంటాయనుకున్నారు. తీరా చూసి అవేవీ లేకపోయేసరికి విరాశ చెందారు. అలా నిఏకవీర” ఒక క్లాసిక్‌గా నిలబడిపోయిందే తప్ప జనరంజకం కాలేకపోయింది. ఏది ఏమైనా ఈ చిత్రం నా కెరీరల్ ఓ మైలురాయి.
అయితే ఈ చిత్రంలో తెరవెనుక ఓ కథ ఉంది - ఈ పాత్రకు మొదట బి.సరోజాదేవిని అనుకున్నారట. కానీ ఎందుకనో ఆ ప్రతిపాదన చాలా ప్రాథమిక దశలోనే ఆగిపోయి, ఎన్.టి.రామారావు అభిప్రాయం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఆయన నాకిష్టమైన దర్శకుడు కూడా. ఆయన దర్శకత్వంలో నటినటులు చాలా సౌకర్యంగా ఉండవచ్చు. సెట్టులో కూడా నటీనటుల్ని ఆయన పువ్వుల్లా చూసుకునేవారు. ఏ పాత్రకు ఏ నటుడు సరిపోతాడో నిర్ణయించడంలో రావుగారి తర్వాతే ఎవరైనా.
ఎన్.టి.రామారావు గారు చాలా బోళామనిషి. ఎప్ప్పుడైనా కాస్త నీరసంగా కన్పిస్తే చాలు ‘రండి విజయ గారూ్ణ అంటూ జాగ్రత్తగా చెయ్యి పట్టుకుని కెమెరా ముదుకు తీసుకువెళ్లేవారు. ఎంతో అభిమానంగా ఉండేవారు. ఆ అభిమానమే ఆయన కొడుకు బాలకృష్ణలో కూడా కన్పిస్తుంది. అలా ఉండబట్టే బాలకృష్ణకు నిన్నటి నిశ్రీరామరాజ్యం” వరకు చాలా చిత్రాల్లో తల్లిగా వేయగలిగాను. సీనియర్ నటీమణులను బాలకృష్ణ చాలా గౌరవిస్తాడు. ఆ మాట తీరు చూస్తే నాకు వాళ్ల నాన్న గారే గుర్తుకు వచ్చి నాకు తెలీకుండానే కళ్లు వర్షిస్తాయి.
ఎన్.టి.రామారావు గారితో ఈ పౌరాణిక చిత్రాలు చేయడం వల్ల నాకు చదువుకోలేదనే కొరత తీరిపోయింది. రామాయణం, భాగవంత వంటి ఇతిహాసాలు, గాంధీ, నెహ్రూ వంటి దేశనాయకల చరిత్రలు అన్నీ సినిమాల ద్వారానే తెలుసుకున్నాను. స్కూలుకు వెళ్లకపోయినా ఎడ్యుకేట్ అయ్యాను.
నిశ్రీకృష్ణపాండవీయం” తమిళంలో కూడా నిరాజసూయం” అనే పేఉతో విడుదల కావడం వల్ల అక్కడ కూడా చాలా మంచి పౌరాణిక పాత్రలు వచ్చాయి. 1966 లోనే నిసరస్వతీశపథం” చిత్రంలో శివాజీగణేషన్ గారితో కలిసి మొదటిసారిగా పౌరాణిక పాత్ర (సరస్వతి) ధరించాను. అదే సంవత్సరం అదే దర్శకుడు (ఏ.పి.నాగరాజన్) తీసిన నికందన్‌కరుణై” చిత్రంలో కుమారస్వామి భార్యగా నటించాను. ఆతర్వాత ఏ.పి.నాగరన్ నిర్మించిన నితిరువరుట-సెల్వర” (1967) లో లక్ష్మీదేవిగానూ, నితిరుమాళ్‌పెరువై” (1972) లో ఆండాళ్ గానూ నటించాను. ఆ సమయంలోనే మలయాళంలో ప్రేమ్‌నజీర్ సరసన నిఅనార్కలి”, నితిలోత్తమ” చిత్రాల్లో టైటిల్స్‌రోల్స్ వేశాను. అలా అలా నా కెరీర్ మొదటి చిత్రం నికర్మగం” దర్శకుడైన కె.యస్.గోపాలకృష్ణన్ గారే నా నూరవ చిత్రం నినత్తయిల్ ముత్తు” దర్శకుడు కావడం. ఇది చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుంది. నా శతచిత్రాల పూర్తి సందర్భంగా చెన్నెíలో పెద్ద ఫంక్షన్ చేశారు అభిమానులు. ఆ సభలో కె.ఎస్.గోపాలకృష్ణన్ గారిని ఘనంగా సన్మానించి నా కృతజ్ఞతను వెల్లడించుకున్నాను.
శివాజీగణేశన్ గరాఇతో నేను మొట్టమొదట నిసెల్వం” అనే చిత్రంలో నాయికగా నటించాను. నేను హీరోయిన్‌గా నటించిన మొదటి చిత్రమÖ అదే. ప్రముఖ హాస్యనటి రమాప్రభకు కూడా అదే మొదటి తమిళ చిత్రం. ఎస్.వి.రంగారావు, ఎం.వి.రాజమ్మ మొదలైన హేమాహేమీలంతా ఆ చిత్రంలో నటించారు. అంచేత వారిని చూసి నటనలో మెళకులవెన్నో నేర్చుకున్నాను. ముఖ్యంగా శివాజీగణేశన్ గారి వద్ద ఆర్టిస్టులు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. క్రమశిక్షణ, సమయపాలన. ఈ రెండూ ‘ఆర్టిస్ట్ణ లకు చాలా ముఖ్యం. నిసెల్వం” చిత్రం కోసం మేమంతా రాత్రింబవళ్లు షూటింగ్‌లో పాý£్గనేవాళ్లం. అయినప్పటికీ శివాజీ గారు విసుగు చెందడం గాని, చిరాకు పడడం గాని నేను చూడలేదు. ఎప్ప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవాళ్లు. రాత్రి షూటింగ్ ఎంత సేపైనా ఆ మరునాడు ఉదయాన్నే ఆరు గంటలకి సెట్లో ఎవరు ముందుంటారు? అని పందాలు వేసుకుని ఒకరి కంటే ఒకరు ముందు సెట్‌కొచ్చి మేకప్ వేసుకుని సిద్ధంగా ఉండేవాళ్లం. ఆ చిత్రం షూటింగ్ జరిగినన్నాళ్లూ ఎంతో సరదాగా ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లా మెలిగాం. సంభాషణలు స్పష్టంగా చెప్పడం ఎలాగో నేను శివాజీగణేశన్ గారి దగ్గర నేర్చుకున్నాను. శివాజీ గారితో పద్మిని తర్వాత తమిళంలో మాది హిట్ పెయిర్. ఆయన కొడుకు ప్రభు కూడా వాళ్ల ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నన్ను తప్పక ఆహ్వానిస్తాడు. సొంత కుటుంబ సభ్యురాలిలా ఆప్యాయంగా పలుకరిస్తాడు. జెమినీగణేశన్ గారిది అదో తరహా. ఎవరితో ఎలా ఉన్నా నాతో మాత్రం చాలా గౌరవంగా ఉండేవాడు. నా మొదటి కథానాయకుడు ఆయనే అయినా నాకు పేరొచ్చింది మాత్రం శివాజీ గారితోనే. అంటే జెమినీ గారికి ఆయన సతీమణి సావిత్రే, సినిమాల్లో కూడా దాదాసే జంటగానే కొనసాగింది గనుక నాకు ఆయనతో అవకాశాలు తగ్గి ఉండవచ్చు.
అక్కినేని నాగేశ్వరరావుగారితో నేను నటించిన మొదటి చిత్రం నిసిపాయిచిన్నయ్య” (1969). సురేష్ ప్రొడక్షన్సు డా॥ డి.రామానాయుడు గారు నిర్మించిన ఈ చిత్రానికి జి.వి.ఆర్. శేషగిరిరావు దర్శకత్వం వహించారు. ఓ తమిళ చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రంలో హీరో పాత్రకు మొదట ఎన్.టి.రామారావు గారి నన్నుకున్నారు. ఆయనను దృష్టిలో పెట్టుకొనే డి.వి.నరసరాజు గారు సభాషణా రచన ప్రారంభించారు. అయితే రామానాయుడు గారితో ఎన్.టి.ఆర్ గారికి ఏవో తాత్కాలిక పేచీలు వచ్చి ఆయన తప్ప్పుకుంటే ఏ.ఎన్.ఆర్. గారు హీరో పాత్ర ధరించారు. దాంతో నరసరాజు గారు కూడా తప్ప్పుకున్నారు. అప్ప్పుడు ఆచార్య ఆత్రేయను రచయితగా నియమించుకున్నారు నాయుడు గారు.
ఏమైతేనేం నిదేవదాసు” చిత్రం దగ్గర నుండి అక్కినేని గారి అన్ని చిత్రాలు చూసి, ఆయన సరసన ఒక చిత్రంలోనైనా కథానాయికగా నటించాలన్న కోరిక ఈ చిత్రం ద్వారా నెరవేరింది. ఈ చిత్రం షూటింగ్ దాదాపు అంతా కేరళ ప్రాంతంలోనే జరిగింది. ఈ చిత్రంలోని ఒక సన్నివేశాన్ని మా ఇంట్లో కూడా చిత్రీకరించారు. ఈ చిత్రం కమర్షియల్‌గా రామానాయుడు గారికి తీవ్ర నష్టాన్ని కల్గించింది. ఆ తర్వాత మళ్లీ ఎప్ప్పుడో నిఇద్దరూ ఇద్దరే” (1990) చిత్రంలో ఆయన సరసన నటించాను. ఈ చిత్రంలో ఆయన కొడుకు అక్కినేని నాగార్జునకు తల్లిగా నటించాను. నాగేశ్వరరావు గారిలో నాకు నచ్చింది వారి ప్రశాంతగుణం. ఎవరినీ నిందించే తత్త్వం ఆయనలో ఉండదు. ఒకవేళ మనమే ఏదైనా అంటే నిపోనీలే అమ్మా” అని తేలికగా తీసి పారేస్తుంటారు. ఆ తామరాకు మీది నీటిu£ట్టు తత్త్వం అందరికీ రాదు.
మేము చెన్నెíకి వచ్చిన తొలిరోజుల్లో వడపళనిలో కొంతకాలం ఉన్నాము. అది ఆరు పోర్షన్లు ఇల్లు. ఒక పోర్షనులో మేము ఉండేవాళ్లం. మా పక్క పోర్షన్‌లో ఓ అందమైన యువకుడుండేవాడు. అదేపనిగా కాకపోయినా తటస్థపడినప్ప్పుడు నన్ను తదేకంగా చూసేవాడు. నేను ప్రకృతి సహజమేనని పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు ఆయనే చొరవగా నిమేడమ్! మీరు నవ్వితే నవరత్నాలు రాలినట్లుంటుంది. సినిమాల్లో ప్రయత్నించకూడదా?” అని అన్నారు. నేను ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పాను. అలా అప్ప్పుడు మా పక్కింట్లో ఉంటూ పరిచయమైన యువకుడే తర్వాత్తర్వాత నా సరసన హీరో అవుతాడని నేనూహించలేదు. అదే కదా జీవితం. ఆ యువకుడే శోభన్‌బాబు. అతనితో కలిసి నేను నటించిన మొదటి చిత్రం నిభక్తపోతన” (1966). ఆ తర్వాత నికలసిన మనసులు” (1968), నికనులపండుగ” (1969), నిమామంచిఅక్కయ్య” (1970) చిత్రాల్లో ఆయనకు హీరోయిన్‌గా చేశాను.
ఇక కృష్ణగారి గురించి చెప్ప్పుకోవాలి. నాకు ఇష్టమైన హీరో ఆయనే. ఆయనతో కలసి నటించిన మొదటి చిత్రం ఎ.రామచంద్రరావు దర్శకత్వంలో నిఅసాధ్యుడు” (1968). ఈ చిత్రంలో హీరో కృష్ణ గారు గుర్రం మీద వస్తూ దార్లో నన్ను చూసి గుర్రాన్ని ఆపి ఎక్కించుకుని తీసుకొని వెళ్లే ఒక సన్నివేశం ఉంది. ఆ సన్నివేశ చిత్రీకరణ సమయంలో నేను గుర్రం మీద నుండి కింద గొయ్యిలో పడిపోయాను. ఈ విషయం తెలిసిన మావారు ఇంకెప్ప్పుడూ ఇలాంటి ‘రిస్క్ణ తీసుకోవద్దని హెచ్చరించారు. అదే సమయంలో నిగూఢచారి116” హిందీలో పునర్మించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ సందర్భంలో ఎం.మల్లికార్జునరావు (దర్శకుడు) గారు హిందీలో నన్ను నటించమని కోరారు. కానీ ముంబై వాతావరణం పట్ల నాకు అంత సుముఖత లేని కారణంగా హిందీ చిత్రాలు మన కొద్దనుకుని నేను అంగీకరించలేదు.
ఈ సినిమా కృష్ణగారి సినీజీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్ప్పుకోవాలి. అదెలాగంటే ఈ చిత్రాన్ని నెల్లూరు కాంతారావు సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాడు. అయితే అదే సంక్రాంతికి కె.వి.రెడ్డి గారి నిఉమాచండీగౌరీశంకరుల కథ” విడుదలౌతుందనే ప్రకటన వెలువడింది. ఇక మీ పనైపోయిందని చాలా మంది భయపెట్టారు. కానే నెల్లూరు కాంతారావు అవేవీ పటించుకోకుండా 1968 జనవరి 12న నిఅసాధ్యుడు” విడదల చేశారు. అది ఎంత ఘనవిజయం సాధించింతో మీకు తెలుసు. ఈ సినిమాతోనే కృష్ణగారికి నిసంక్రాంతి హీరో” అన్న పేరు వచ్చింది. ఆ తర్వాత కృష్ణగారు అందించిన 30 సంక్రాంతి చిత్రాలకు నాంది. నేను హీరోయిన్‌గా నటించిన నిఅసాధ్యుడు” అని నాకు గర్వంగా ఉంటుంది. ఈ సినిమానే నిమిస్టర్ మద్రాస” అని అరవంలోకి డబ్‌చేశారు. ఈ సినిమాలోనే కృషగారు ప్రప్రథమంగా అల్లూరిసీతారామరాజు గెటప్‌లో కనిపించారు. ఇదే తర్వాత ఆయన నిఅల్లూరి సీతారామరాజు” (1974) చిత్రం నిర్మించడానికి స్ఫూర్తి.
ఎంతమంది హీరోలతో నటించినా కృష్ణగారితో నేను చాలా సులభంగా, హాయిగా నటించేదాన్ని. ఎందుకంటే శివాజీగారు, ఎన్.టి.రామారావు గారు వీళ్లంతా ఇండస్టీలో దిగ్గజాలు. వీళ్లదగ్గర చాలా భయంగా, బెరుకుగా, తెచ్చిపెట్టుకున్న నమ్రతతో నడుచుకోవాల్సి వచ్చేది. అందుకనే మీరు గమనించండి. వాళ్ల చిత్రాల్లో ఎక్కడో ఒకచోట నా నటన ఏదో పట్టుకనోని ఉన్నట్లు ఉంటుంది. అదే కృష్ణ, శోభన్‌బాబు, ముత్తురామన్... ఇలాంటి వాళ్ల దగ్గర నాకు ఆ ఇబ్బంది లేదు. నా ఈడు వాళ్లే గనుక స్నేహపూర్వకంగా, సరదాగా నటించేవాళ్లం. అగ్రహీరోలతో నటించేటప్ప్పుడు వాళ్లు స్కూలు మాష్టర్స్‌లా కనిపించేవాళ్లు. వీళ్లతో నటించేటప్ప్పుడు క్లాసుమేట్సుతో సరదాగా షికారు చేసినట్లుండేది. కృష్ణతో నటించిన నిభలే అమ్మాయిలు” (1969), నికోడలుపిల్ల్ణ(్ణ (1975) చిత్రాల్లో రెండవది బా3గానే ‘పే్ణ చేసింది.
ఇక నేను నటించిన వైవిధ్య భరిత చిత్రాల్లో చెప్ప్పుకోదగింది నిశ్రీదేవి” (1970). టి.ఎస్.నారాయణ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతకుముందు ఎన్నో చిత్రాలలో సాత్త్వికమైన పాత్రల్ని పోషించిన నేను ఈ చిత్రంలో ఆధునిక నాగరికతను బాగా ఒంటబట్టించుకున్న ‘అడ్వాన్స్‌డ్ గర్ల్ణ గా మొట్టమొదటి సారిగా నటించాను. నేను, హరనాథ్‌రాజుగారు నాయికా నాయకులుగా నటించిన మొదటి చిత్రం ఇదే. ఇందులో నాకు కూతురుగా రోజారమణి నటించింది. ఆ అమ్మాయంటే నాక చాలా ఇష్టం.
నికర్పగం” చిత్రంలో నటించేనాటికి నా వయసు పదహారేళ్లు. ఊహలకు రెక్కý£చ్చే వయసు. కానీ ఇంట్లో అమ్మానాన్నలు ఎప్ప్పుడూ తిట్టుకుంటూ ఉండేవారు. నా చెల్లెళ్లు, తమ్ముడికి బాగా చదువు చెప్పించాలని ఎంతో ప్రయత్నించాను. కానీ వాళ్ల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. జీవితంలో ఎక్కడో సమతౌల్యం కోల్పోతున్నట్లనిపించింది. ఎంతచేసినా ఇంతేనా అన్నట్లు ప్రవర్తించేవారు. ఆ వాతావరణంతో విసిగిపోయాను. నా దారి నేను చూసుకోవడమే మేలనిపించింది. ఆ సమయంలోనే వేలాయుదన్ గారు పరిచయమయ్యారు. నేను నిఅణ్ణావిన్ ఆశై” సినిమా చేసేటప్ప్పుడు తొలిసారి అతణ్ణి చూశాను. ఆయనో ఫైనాన్షియర్. ఈ చిత్రంలో భాగస్వామి కూడా. అందువల్ల సినిమా ఒప్పందం ఫారం మీద సంతకం చేయమని పిలిపించారు. నేను వెళ్లి ఏమీ చదవకుండానే సంతకం చేసేశాను. ఆయన ఆశ్చర్యపోతూ ని%ఈ ఫారంలో ఏమి రాసి ఉందో తెలుసా? నీ ఆస్తిపాస్తుల్నీ నాకు ఇచ్చేస్తున్నట్లు రాసి ఉంది. నువ్వేమో సంతకం చేసేశావు” అని వేళాకోళం చేశారు. నేను అది విని ఏమాత్రం గాభరా పడకుండా నిఅబ్బో... ఎంతాశ!” అని నవ్వేశాను. అలా మంచి ముహూర్తంలో కలుసుకున్నామేమో మా మధ్య స్నేహం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. 17.04.1966 లో మా పెళ్లి గురువాయÖర్‌లో జరిగింది. నాకు లభించిన భర్త కోటీశ్వరుడైనా - మా వివాహం పేదవివాహమనే చెప్పాలి. సంపాదించినదంతా మావాళ్ల ఇంట్లోనే వదిలేసి కట్టుకున్న చీరెతో మెట్టినింట అడుగుపెట్టాను. మా అమ్మ, సోదరుడు, చెల్లెళ్లు అందరూ వ్యతిరేకమయ్యారు. శూలాల్లాంటి మాటలతో నన్ను బాధించారు. అయినా మా వారి ఓదార్పుతో గుండె నిబ్బరంతో కాలం వెళ్లదీసాను. ‘సెంటిమెంటల్ణ కథానాయిక పాత్రల్లో అశేష ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన నేను నిజజీవితంలోనూ వైవాహిక బంధం వల్ల బాధ్యతలను పెంచుకుంటూ పరిపూర్ణ గృహిణిగా కొత్త జీవితానికి రూపురేఖలు దిద్దుకున్నాను.
నేను గర్భవతినయ్యాక కూడా మా పుట్టింటివారి నుంచీ ఎలాంటి ప్రేమాప్యాయతలూ నాకు లభించలేదు. నిండు గర్భిణినైన నాకు ప్రసవం కష్టమౌతుందన్నారు. అప్ప్పుడు కూడా మా అమ్మ నాకోసం రాలేదు. వెల్లింగ్‌టన్ హాస్పిటల్‌లో నన్ను చేర్పించారు. ఈ సందర్భంలో జరిగిన ఒక సంఘటనకు నా అభిమానమునకు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సి ఉంటుంది - కారణం - నేను మరణించినట్లుగా ఒక పుకారు వచ్చేసింది. దాంతో ఆరోజు నాకోసం వేలాదిమంది నన్ను చూడడానికి ఉరుకులు పరుగులతో వచ్చారు. వాళ్లను చూసి నేను ఆశ్చర్యపోయాను. అంతమంది అభిమానులు నా వెంట ఉన్నందుకు ఉప్పొంగిపోయాను. కానీ అప్ప్పుడు కూడా మా పుట్టింటి వాళ్లు రాలేదు.
నాకు పుత్రికోదయమయ్యింది. ఆ సందర్భంలో ఆ అభిమానుల ఆదరణ, ఆప్యాయతల్ని కళ్లారా చూసిన మావారు నిఇక నటించడం మానవద్దు” అన్నారు. అయితే నాకు నేనే కొన్ని కాలపరిమితులు విధించుకున్నాను. ఇంట్లో వంట చేసుకుని, ఆయన ఆఫీసుకు వెళ్లిన తర్వాత షూటింగ్‌కు వెళ్లేదాన్ని. పది గంటల నుంచీ ఐదు గంటల వరకే నటించేదాన్ని. ఆదివారాల్లో షూటింగ్‌కు వెళ్లేదాన్ని కాదు. రాత్రులే తియ్యాల్సిన దృశ్యాలకు తప్ప, రాత్రులు పనిచేసే దాన్ని కాదు. ఇదే విషయాన్ని నిర్మాతలకు గట్టిగా చెప్పేసేదాన్ని. అగ్రహీరోలు ముఖ్యంగా శివాజీగణేశన్ గారు నేను షూటింగ్‌కు రాకపోతే విసుక్కునేవారు. అయినా నేను పట్టించుకునే దాన్ని కాదు. రమ్మని బలవంతపెట్టినా మొండికేసేదాన్ని. దాంతో నన్ను అడగడం మానేశారు.
మొదట్లో మా అమ్మాయి ‘హేమ్ణ ను ఒంటరిగా వదిలిపెట్టి షూటింగుకు వెళ్లాలంటే బాధగా అన్పించేది. పైగా ఇంట్లో పెద్ద దిక్కు ఎవరూ లేకపోవడంతో పాప పెంపకం చాలా కష్టంగా ఉండేది. నా ఇబ్బందిని గమనించి మావారు ఇద్దరు కేర్ టేకర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇంట్లో ముఖ్యమైన పనులన్నీ నేను చక్కబెట్టేసి, మిగతా పనుల్ని, పాప సంరక్షణను ఆమెకు అప్పగించి సెట్‌కు వెళ్లేదాన్ని.
వృత్తిరీత్యా నేను ఎంత బిజీగా ఉన్న, డబ్బు హోదా, భర్త, కూతురు ఇలా ఏ విషయంలోనూ లోటు లేకపోయినా మా అమ్మ దూరమైందనే వెలితి నన్ను చాలా బాధించేది. అందువల్ల ఎంత సందడి వాతావరణంలో ఉన్నా మనసు ఒంటరి తనంతో దహించుకు పోయేది. ఈ పరిస్థితుల్లో పగిలిన అద్దం లాంటి మా కుటుంబం ఒక చోటకు చేరుకునే అవకాశం కలిగింది. మా చెల్లెళ్ల పెళ్లిళ్లతో అందరం ఒక్కటయ్యాము. అందరం ఒకక పెద్ద ఇల్లు కట్టుకొని ఒకేచోట ఉందామన్నారు మావారు. అలా టి.నగర్‌లోని రామన్ స్టీట్‌లో ఇల్లు కట్టుకున్నాం. అయినా వాళ్లతో నాకు తెలనొప్పి తగ్గలేదు.
మనం మనకున్న దాంట్లో ఏమైనా చేయగలిగితే నిఆ... సొంతవాళ్లు కాబట్టి సహాయం చేశారు!” అని లోకులు అంటారు. అదే ఇతరులకైతే నిఉంది కాబట్టి చేశారు. అందువల్ల ఏమన్నా వాళ్లకు తరిగిపోతుందా?” అని అంటారు. అయితే ఒకటి మాత్రం వాళ్లు గమనించరు. మనం ఏది చేసినా మన అవసరాలను వాళ్ల కోసం కొంత తగ్గించుకుని చేస్తున్నామన్న విషయం వాళ్లు గ్రహించలేరు. నా వరకు నేను ఇలాంటి విషయాల్లో తలదూర్చి ఇబ్బందులకు లోనై కూడా అవతల వాళ్లు నా సహాయాన్ని సరిగ్గా వినియోగించుకోలేక - నాకు తలనొప్పి తెప్పించిన సందర్భాలెన్నో ఉన్నాయి.
నా ఉద్దేశ్యంలో అదృష్టమనేది నుదటి రాత కాదు. అది మన నడవడికలోనే ఉంది. ఈ విషయాన్ని నేను నా జీవితంలో చక్కగా గ్రహించాను. జీవితంలో ఒక ప్రత్యేకదశను దాటిన తర్వాత మన మనసు పరిపక్వత చెందుతుంది. అప్ప్పుడు ప్రేమ, ద్వేషం, విరోధం, స్వార్థం, కోరికల పట్ల సుముఖత, విముఖత ఇవన్నీ మనల్ని విడిచిపెట్టి దూరంగా పోతాయి. బ్రతికి ఉన్నంతవరకూ మంచిపేరు సంపాయించి, ఆ కీర్తితోనే పోదామన్న భావం మనలో కలుగుతంది. సరిగ్గా ఇదే ఆలోచన నాకు ఇరవై ఆరేళ్ల వయసులోనే నాకు వచ్చి ఇక కుటుంబం అనుకుంటే లాభం లేదని నటన మీద దృష్టి కేంద్రీకరించాను. నిఇదయ కమలం”, నితంగపతకం” వంటి సినిమాలన్నీ అప్ప్పుడు చేసినవే. ఒకప్ప్పుడు నేను చేసిన సినిమాలు చూసి ఇలాంటి కోడలు కావాలి, ఇలాంటి కూతురు కావాలి అనుకునేవారట. నా స్నేహితురాలు ఈ విషయాలను చెబుతుంటే నేను ఎంతో మురిసిపోయేదాన్ని. కళాకారిణి సామాజిక బాధ్యత నిర్వర్తించ గలిగేది ఆ రూపంలోనే కదా. అన్ని భాషల్లో ఎక్కువగా నటించినా మరీ తక్కువ చేసింది కన్నడంలో. హిందీలో ఒకే చిత్రం నిఊంఛేలోగ” లో నటించాను. ఒకదశలో కాల్షీట్లు లేక ఉదయం ఓ సినిమా, సాయంత్రం మరో సినిమా షూటింగ్‌లకు కూడా వెళ్లాల్సి వచ్చేది.
నా కెరీర్‌లో తప్పనిసరిగా చెప్ప్పుకోదగ్గ చిత్రం నవతావారి నిత్యాగయ్య” (1981), సాయంత్రం ఆరు గంటల తర్వాత పనిచెయ్యను, ఆదివారాలు చెయ్యను ఇలాంటి నా నిబంధనలన్నిటినీ నేను అతిక్రమించి నటించిన చిత్రం ఇది. ఈ చిత్ర నిర్మాణ సమయంలో సహాయ దర్శకులు కె.వి.రావు గారు అందించిన సహాయ సహకారాలు ఎన్నటికీ మరచిపోలేను. త్యాగయ్య భార్య పాత్రకు రకరకాల నటీమణుల్ని అనుకుని చివరకు నన్ను నిర్ణయించారు. నవతా కృష్ణంరాజు గారు చాలా మర్యాదస్తులు. మా ఇంటికొచ్చి ఆ మాటా, ఈ మాటా అయిన తర్వాత చాలా వినయంగా, నిమరి, మీ రెమÖ్యనరేషన్... వర్కు పదిరోజులు అంతే” - అన్నారాయన. నిఅది తర్వాత, మీరు నన్ను వేషం అడిగారు. వేస్తాను. ఓ మంచి పాత్ర... మంచి నటుడి సరసన, మంచి దర్శకుడితో పనిచేయడం చాలా సంతోషం. దాన్ని మించిన పారితోషికం నేను ఆశించను. ఈ చిత్రానికి మీరు అనుకున్నది - మీరు ఇవ్వండి - మళ్లీ చిత్రంలో నేను అనుకున్నది ఇద్దురు గాని -” అన్నాను. నిమీరు మాకు పది కాల్‌షీట్లు యిస్తే చాలు” అన్నారాయన. నిపదయినా, పాతికైనా పాత్ర ఒప్ప్పుకున్న తర్వాత ఎన్ని రోజులైనా పనిచెయ్యాల్సిందేగా” నని చెప్పి నేను విధించిన షరతులు చెప్పాను. కానీ కృష్ణంరాజు గారి మంచితనం ముందు అవేవీ నిలవలేదు. నేనే నా రూల్సును అతిక్రమించి, ఆదివారం నాడు కుంభకోణంలోనూ (చెన్నెíలో శనివారం రాత్రి కారులో బయల్దేరి వచ్చి) ఎన్నో రాత్రులు చెన్నెíలోనూ పనిచేశాను. ఆ చిత్ర నిర్మాణ బృందం, వారి పనితీరూ, దర్శకులు బాపుగారి ప్రత్యేకమైన శైలీ, చూసి నేను ముచ్చటపడి ఈ చిత్రాన్ని నేను స్వంత డిస్టిబ్యూషన్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. మావారితో ఈ విషయం మరీ మరీ చెప్పి, వేరే అవుట్‌డోర్‌కి వెళ్లాను. కానీ వ్యాపారసంబంధమైన ప్రతిఘటనలవల్ల నా కోరిక నెరవేరలేదు. ఎంతో కళాత్మక విలువలతో ఉన్నా ఈ చిత్రం ఎందుకో ప్రభుత్వపరంగా ఏ గుర్తింపు నోచుకోలేదు. కమర్షియల్‌గా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు అయినా నేను నటించిన చిత్రాల్లో గొప్పవేవైనా ఉంటే వాటిల్లో ఈ చిత్రం ముందుంటుంది. ఇంతేబాగా వచ్చిన పాత్ర నిసూత్రధారులు” (1989) చిత్రంలో భాగవతారిణి పాత్ర. దీనికి గాను నాకు ఆంధ్రరాష్ట ప్రభుత్వ జ్యూరీ ప్రత్యేక అవార్డు వచ్చింది.
నిత్యాగయ్య” చిత్రం వల్ల నాకు లభించిన మరో గొప్ప అవకాశం భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారిని ఇంటర్వూ చేయాల్సి రావడం. గతంలో ఆమె పాటలు ఎన్నో విన్నాను. కానీ ఆమెను కలుసుకొని మాట్లాడే అవకాశం నాకు ఎప్ప్పుడూ రాలేదు. 1982లో అనుకుంటాను. నిu£మ్మెí్ణ పత్రిక నిర్వహించిన ఒక ఫీచర్ కోసం నేను సుబ్బులక్ష్మి గారిటికి వెళ్లే అవకాశం కలిగింది. ఆమె ఇల్లు నాకు ఓ దేవాలయంలా అనిపించింది. ముఖ్యంగా ఆమెలో నేను గమనించింది సింపుల్ లైఫ్. ఆ విషయంలో ఇప్టటికీ నాకు ఆమే మార్గదర్శకురాలు. మేమిద్దరం ఆరోజు చాలాసేపు మాట్లడుకున్నాం. ఆమె హార్మోనియం తెచ్చి పాటలు పాడి వినిపించారు కూడా. ఆమెతో, వారి భర్త సదాశివం గారితో నా పరిచయం ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.
అలాగే వాణీజయరాం. ఆమె పాటలంటే నాకు చాలా ఇష్టం. నిజానికి నేను ఆమె అభిమానిని. ఆమె పాట పాడిన నిగుడ్డీ” హిందీ చిత్రం చూసిన తర్వాత నేను ఆమె అభిమానినయ్యాను. మా సొంత చిత్రంలో ఆమె చేత పాట పాడించాలనుకున్నాం. అలాగే పాడించాం కూడా. ఆ చిత్రం నిదీర్ఘసుమంగళి”. అందులో ‘మల్లిగై...్ణ అన్న పాట ఆమె పాడిన పాట. అదే ఆమె తమిళ చిత్రాలకు పాడిన మొట్టమొదటి గీతం. నాకు చిన్నప్పటి నుండీ మల్లెపూవులంటే చాలా ఇష్టం. అందుకనే మా వారు కూడా మేము నిర్మించిన చిత్రాల్లో ఈ మల్లెపూలక సంబంధించిన పాట ఒకటి కచ్చితంగా పెట్టేవారు. వాణీజయరాం ఇది తెలుసుకొని కెరీర్ మొదట్లో మా ఇంటికి వచ్చినపుడు మల్లెపూలు తెచ్చింది. మళ్లీ ఎప్ప్పుడో ‘u£మ్మై్ణ పత్రికలో ఓ ఫీచర్ కోసం ఆమె మా ఇంటికి వచ్చింది. అప్ప్పుడూ ఆమె నాకోసం నిమల్లెపూలు” తీసుకొచ్చింది - అవంటే నాకిష్టమని గుర్తుంచుకొని! కానీ నాకు మాత్రం వాణీజయరాం పాడిన ‘మల్లిగై్ణ పాట విన్నా, మల్లెపూలు చూసినా ఆమె గుర్తుకొస్తుంటుంది.
ఇక నా నటజీవితంలో చెప్ప్పుకోవాల్సింది రెండవ అధ్యాయం గురించి సాధారణంగా ఏ నటీమణి అయినా కథానాయిక నుండే కేరెక్టర్ ఆర్టిస్టుగా మారుతారు. లేదా కథానాయకిగానే ఫీల్డు నుండీ నిష్క్రమిస్తారు. నా నటజీవితంలో కథానాయిక స్థానం నుండీ కారెక్టర్ ఆర్టిస్టుగా మారాక అదృష్టం నన్ను మరోసారి వరించింది. దేవతా పాత్రల రూపంలో.
వేలుమణి అనే నిర్మాత నా దగ్గరకు వచ్చి, తాను తియ్యబోతున్న సాంఘిక చిత్రం (అరవం) లో ‘శక్తిస్వరూపిణి్ణ పాత్ర ధరించమని అడిగారు. నిసాంఘిక చిత్రంలో శక్తిస్వరూపిణి పాత్ర ఏమిటి?” అని అడిగాను ఆశ్చర్యంగా. నిఆలయంలో ఉండే అమ్మవారు ఒక అమాయకురాలిని ఆవేశిస్తుంది. దానిమీదే కథంతా ఆధారపడి ఉన్నది” అన్నారాయన. అంటే, నేను రెండు పాత్రలూ ధరించాలి. అమాయకురాలైన యువతిగానూ, ఉగ్రస్వరూపిణియైన అమ్మవారు గానూ నేను నటించాలన్నమాట. ఆ పాత్ర ధరించాలని నేను మొదట ముచ్చట పడ్డా, తర్వాత మాత్రం చాలా భయపడ్డాను. కానీ - నా జీవితంలో ఒక మహోత్తమ పాత్ర ధరించవచ్చుననే విశ్వాసంతో అంగీకరించాను. మామÖలు స్తీ పాత్ర వేరు! ఇలాంటి స్తీ పాత్ర వేరు. స్తీలో సర్వశక్తులూ ఉన్నాయి. అలాంటి సర్వశక్తులూ గల దేవిపాత్ర నాకు లభించింది. ఆ చిత్రం పేరు నినమ్మవీట్టుదైవం” (తెలుగులో మా ఇలువేల్పు, 1971). ఈ చిత్రానికి సంబంధించిన కథాచర్చ అంతా అమ్మవారి దేవాలయాల్లోనే జరిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి