మొత్తం పేజీ వీక్షణలు

27, జులై 2026, సోమవారం

మల్లీశ్వరి సినిమా గొప్పతనం....

మల్లాది రామకృష్ణ శాస్త్రిగారన్నట్లు తెలుగు వారి ఇలవేలుపు సిగపాయ చేనంది చిడిముడి చేసే దివ్యమందహాసుడు  తిరుమలగిరివాసుడు. ఆంధ్రులకు చారిత్రాత్మక వ్యక్తులలో మహితాత్ముడు, మహోన్నతుడు శ్రీకృష్ణదేవరాయలు. అలాగే తెనుగువారి కళలెరిగిన వారికి, తెలుగు సినిమాలు చూసేవారికి “మల్లీశ్వరి” ఒక భవ్యానుభవం.

ఈ పరమపదం ఏ పూజ వలన సిద్ధించింది? సాహిత్యారాధన వలనా? నటనాభిషేకం వలనా? పాటల నోములతోనా? దర్శకత్వార్చనతోనా? కారణమే నాట్య నీరాజనం? ఏ కళాచందన చర్చ!

ఏ ఒక్కటీ కాదు. హృదయానికి హత్తుకొనే కథ, కథనం.  మల్లెపూరేకు బరువుతూగినా, అవసరాన మొగలి ఆకులా కోయగల మాటా, పాటా. నవభావాలను నవరసాలుగా చూపించిన నాట్య సంవిధానం. సన్నివేశానికి తగిన ధూపమైన సంగీతం. సాంబ్రాణి పరిమళంలా జ్ఞాపకాలలో పరివ్యాపించే సంగీతం. సంవత్సరాలు జరిగినా పట్టు సడలించని సంగీతం. సాధారణమనిపించక, సహజమనిపించే నటన. సాత్త్వికమైన నటన. ఆ కాలాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ జీవన విధానాన్ని కళ్లముందు నిలబెట్టే కళా దర్శకత్వం. నలుపు తెలుపుల్లో వెలుగు నీడలను చిత్రకారుని రంగుల్లా చూపిన ఛాయాగ్రహణం. గుళ్లలో  పావురాల కువకువలూ, పాడుబడిన సత్రాల్లో వలిపిరీ, తుంపర చినుకు పుణుకులూ, గుండెల్లోని వెక్కిళ్లూ, చూపులలోని కన్నీళ్లూ, కలవరమÖ, ఎదురుచూపుల్లోని సంకోచమÖ, ఆనందమÖ, మంగళ  తూర్యారవాలూ, తెగించిన బావ పట్టుబడిపోతాడేమో నన్న భయంతో గుండె చేసే చప్ప్పుళ్లూ, యింటివైపు పరుగులెత్తే పొగరుబోతు గిత్తల మెడగంటల సవ్వళ్లూ చెవులకు కట్టి మనసులో నిల్పిన శబ్దగ్రహణమÖ.

ఆంధ్రుని హృదయంలో “మల్లీశ్వరి” అధిష్టించిన సింహాసనానికి పైవన్నీ కారణాలే కాబట్టి “మల్లీశ్వరి” సినిమా నవలను నలభై యేళ్ల తరువాత తీసుకువచ్చే sTÖ ప్రయత్నం. విజయచిత్రలో ధారావాహికంగా వచ్చినప్ప్పుడు  వేలాది పాఠకులు చదివినదే. అయినా పుస్తకరూపంలో తేవడంలో ఒక పరమార్థమున్నది.

“మల్లీశ్వరి” గొప్పతనం తెలుసుకోవడానికి ఆ చిత్రం చూడటం ముఖ్యం . తెరమీద కాకపోయినా యింట్లో, విరివిగా విడియో సౌకర్యాలున్న sTÖ రోజుల్లో అదేమంత కష్టంకాదు. అయితే సినిమా దర్శకుడు నిర్ణయించిన ‘వడి’ తోనే నడుస్తుంది. నింపాదిగా నడపలేము. సినిమా నవల అలా కాదు  కావలసిన భాగం కావలసినన్ని మార్లు అవసరానికి తగిన పద్ధతిలో చదువుకోగలం. ఆ స్మృతులను మళ్లీ మళ్లీ నెమరు వేసుకుని దాని రసం తిరిగి తిరిగి ఆస్వాదించగలం. పుస్తకం అందుబాటులో ఉన్నట్లు వీడియో ఉండదు. వీడియోకున్న దృశ్యగుణం పుస్తకానికి లేదు. కాని రెండు మÖడు మార్లు సినిమా చూసుకున్న తరువాత నవల చదువుతుంటే మన జ్ఞాపకాలే మనోయవనికపై ఆ చిత్రాన్ని ప్రదర్శింపచేస్తాయి.

భారతదేశంలో యిన్ని సినిమాలు వచ్చినా, తెలుగులో యిన్ని సినిమాలు తీయబడినా వాటి డాక్యుమెంటేషన్ (విషయ సమీకరణ) గురించి ఎవరూ మొదట్లో పట్టించుకోలేదు. ఇటీవలి కాలంలో తెలుగులోనూ, ఆంగ్లంలోనూ రకరకాల పుస్తకాలు - ఎన్‌సైక్లోపీడియాల నుంచి ఆత్మకథలూ, కళాకారుల జీవితాలూ, అలనాటి చిత్రాల కొలుపులూ - వచ్చినా వాటిలో వాస్తవాలకంటె కల్పనలూ, ఉన్నదానికంటే ఊహా గానాలూ, కథలు చెప్పడంలో కకావికలూ పలికి చదువరినీ, ప్రేక్షకుడినీ, సినిమా అభిమానినీ, పరిశోధకునీ వెతలు పెట్టే కట్టుకతలైనవి. అన్నీనా అని అడిగితే కబళం అన్నాన్ని తినరానిదిగా చేయడానికి అయిదు బెడ్డలూ పదిరాళ్లూ చాలవూ?

సమగ్రత, నిర్దుష్టత అన్నవి అన్ని వేళలా అందరికీ సాధ్యంకావు. నిజం. ఈ ప్రయత్నంలోనూ లోపాలుండవచ్చు. “మల్లీశ్వరి”లోనూ ఉన్నవి (ఒకటి ‘మనసున మల్లెలు’ దృశ్యంలో ఎన్నిజాములు గడిచినా చంద్రుడొకడే చోట ఉండటం). ఉన్నవి చంద్రుని కళంకమాత్రంగానే, వెన్నెల తగ్గించని మోతాదులోనే ఉన్నవని నమ్మకం, ఆశయం.

“మల్లీశ్వరి” కథ మÖలం ఎక్కడిదని ఆలోచించాలి. చిత్రం క్రెడిట్స్‌లో, పాటల పుస్తకంలో, ఆనాడు పాత్రికేయులతో బి.ఎన్.రెడ్డి జరిపిన సమావేశాలలో దీని గురించి ఏ వివరమÖ యివ్వబడలేదు. 1964లో ప్రచురింపబడిన బుచ్చిబాబు నాటికలన్న పుస్తకంలో (విశ్వవాణి పబ్లికేషన్స్, విజయవాడ - 520 002  రూ. 2.50లు) నాలుగింటిలో మొదట యివ్వబడిన ‘రాయలవారి కరుణకృత్య’మనే నాటికకు పరిచయంగా ఇలా అన్నారు “ఈ నాటికలో యితివృత్తానికి మల్లీశ్వరి యితివృత్తానికి కొన్ని పోలికలు కనబడవచ్చు. ఈ నాటిక ‘భారతి’లో ప్రచురింపబడిన ఏడెనిమిది సంవత్సరాలకా చిత్రం విడుదలైందని పాఠకులు గుర్తుంచుకుంటే చాలు!”

ఈ విషయం రాండార్ గై ఏళ్ల తరువాత బి.ఎన్. గురించి వ్రాసిన మోనోగ్రాఫ్ (నేషనల్ ఫిల్మ్ ఆర్కైన్ ఆఫ్ ఇండియా, 1985, రూ. 30.00లు)లో ప్రస్తావించారు. కాని బి.ఎన్. దాని గురించి ఏమని వ్యాఖ్యానించారో దాఖలా లేదు.

మరొక చిన్న పిట్ట కథ. మద్రాసులో అనుకొంటాను ఒక యిరవైఏళ్ల క్రితం విజయనగరం వాస్తవ్యులు కుమ్మరి మాస్టారు ‘మల్లీశ్వరి’ కథ చెప్పారు. అందులో ‘పిలిచిన బిగువటరా’ పాటనొక్కదానినే పాడారు. తరువాత వెళ్లి అడిగితే - తక్కినవి పాడలేదేమన్న ధ్వనితో - ‘అంతకు ముందున్న కథే కదా!’ అన్నారు. దీని బట్టి నాకర్థమైనదేమిటంటే, సినిమాకు పూర్వం, బహుశ్ణ బుచ్చిబాబు నాటికకు పూర్వం sTÖ ప్రధానాంశం - శిల్పి ప్రేయసి రాయలవారి కొలువుకి పిలువబడటం, దొంగతనంగా యిద్దరూ కలుసుకొని పట్టుబడటం - ‘కళాప్రియులూ కరుణా సముద్రులూ అయిన రాయలవారి వాళ్లను క్షమించి వదిలివేయడం’ ప్రజలలో ఉందని తెలుస్తున్నది.

ఎలా? ఎక్కడ !! ఇవి sTÖ రెండు కథల గురించి పరిశోధనాంశాలే. ఒకటి మాత్రం చరిత్రకారులు సూత్రప్రాయంగా అంగీకరించిందే. అందమైన అమ్మాయిలను తమ ఆటవస్తువులుగా తెప్పించుకొని జనానాలలో జాగ్రత్త చేయడం ఎందరో రాజులు చేసిందే. ఇలా కృష్ణదేవరాయల గురించి చూపడం బాగుండదని చేయవలసిన మార్పు చేశారు.

ఇదంతా చెప్పడానికి కారణమొక్కటే. కాదేదీ పరిశోధన కనర్హం. ముఖ్యంగా యిలాటి చిత్రాల మÖలాలు తెలుసుకోవడం ఒక విధంగా చరిత్రాధ్యయనం చేయడమే.

శ్రీ రావి కొండలరావు రా.కు.మారుడుగా, నాటక కర్త - ప్రయోక్త - నటునిగా, పాత విషయాలను ఒళ్లు దగ్గర పెట్టుకొని తిరిగితోడే ఫిలిం జర్నలిస్టుగా, సినిమా సంభాషణల రచయితగా, స్నేహితునిగా నాకు తెలుసు. ఆయన నాటకాలలో నేను ఒకటిన్నర నిమిషాల వేషాల్లో నటించినప్పటి నుంచీ ఆయన కార్యతత్పరతంటే నాకు గౌరవం, అభిమానం. బహుశా అంతర్గతంగా పింగళి మాటల్లో కించి దీసునసూయలు కూడా!

ఈ పని జరుగుతున్నదంటే ఎంతో సంతోషించాను. ఇది యింతటితో ఆగకూడదు. విజయచిత్రలో వచ్చిన నవలీకరణలన్నీ యిలా పుస్తకాలుగా రావాలి. తెలుగు సినిమా చరిత్ర sTÖ మేరకింకా పటిష్టం కావాలి. ఆ చిత్రరాజాల్లో ఉన్న గుణరాసి తెలుగు తెలిసిన వారందరికీ చేతికందే చేమంతి, దిండుప్రక్క మల్లెచెండూ, ప్రియదూతిక తెచ్చిన కప్ప్పుర విడెమÖ కావాలి.

ఇలాగే “రేచుక్కా” “రాజునందినీ” “చిరంజీవులూ” రావి కొండలరావు తెస్తే అటు తెలుగు సినిమా సాహిత్యానికి మకుటాభిషేకమÖ నాకు కనకాభిషేకమÖ! త్వరలోనే ఆరోజు రావాలి. రప్పించేవారు మీరే! కొని చదివేవారు!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి