అందం, అభినయం కలబోసిన మొన్నటితరం నటీమణి లత. తమిళ భాష నుంచీ వచ్చి, తెలుగులో హీరోయిన్‌గా తళుక్కుమని మెరిసిన తార ఆమె. నాలుగు దశాబ్దాల కిందట “అందాలరాముడు” చిత్రంతో రంగప్రవేశం చేసి అక్కినేనికి సమ ఉజ్జీగా స్టెప్ప్పులేసిన ‘సోషల్ సీత’ జ్ఞాపకాలు ఈ వారం...
నేను 1955 లో పుట్టాను మా తండ్రి రాజేశ్వర షన్ముఖ సేతుపతి రామనాథ్ సంస్థానాధీశులు. అంచేత మాది మొదటి నుండీ సంపన్న కుటుంబమే. ఆయన రాజాజీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశారు. మా అమ్మ లీలారాణి. తెలుగు వాళ్లు. మా అమ్మకు సొంత అక్క ఒకనాటి సుప్రసిద్ధ నటీమణి కమలాకోట్నీసు. మా పెద్దమ్మ ఆ రోజుల్లో “చెంచులక్ష్మి” (1943), “సీతారామజననం” (1944), “తాశీల్దారు” (1944) మొదలైన చిత్రాల్లో నటించారు. అవేవీ నేను చూడలేదు వాటి గురించి నాకు అసలు తెలియనూ తెలియదనుకోండి. మా వంశవృక్షంలో ఆమె తప్ప ఇంకెవరూ నటీనటులు లేరు. మా తల్లిదండ్రులు తెలుగువాళ్లే అయినా మేము చెన్నెíలోనే స్థిరపడ్డాం. దానివల్ల మాకు తమిళ భాష బాగా అలవాటయ్యింది. నేను “హోలీ ఏంజెల్స” కాన్వెంటులో పదవ తరగతి వరకూ చదువుకున్నాను.
అసలు నేను సినిమాల్లో ప్రవేశిస్తానని గానీ, సినిమా నటిగా మారతానని గానీ ఎవ్వరూ అనుకోని ఉండరు. నేను కూడా ఎప్ప్పుడూ అనుకోలేదు. మా అమ్మగారికి అసలు ఆ అభిప్రాయమే లేదు. కానీ, అంతా తమాషాగా జరిగిపోయింది. ఎలా కలిగిందో గానీ నాకు మాత్రం చిన్నతనం నుంచీ నాట్యం మీద అభిలాష కలిగింది. మÖడు, నాలుగేళ్ల వయసులో - ఎక్కడ ఏ పాట విన్పించినా, సంగీతం విన్పించినా అది వింటూ, తోచినట్టు నాట్యం చేసేదాన్ని. ఆ ఉత్సాహమÖ, తక్కిన వాళ్లంతా చెప్పటమÖ చూసి, మా అమ్మగారు నాకూ, మా అక్కయ్యకూ భరతనాట్యం నేర్పించారు. వళ్లూర్ రామయ్య పిళ్ళెí గారి దగ్గర ఇద్దరం నేర్చుకున్నాం. మా అక్కయ్యకు అంతగా ఉత్సాహం లేదు గానీ, నేను మాత్రం ‘తొలి ప్రదర్శన’ ఇవ్వగలిగేతంత వరకూ వచ్చాను. క్లాసులో కూడా మార్కులు బాగానే తెచ్చుకుంటూ, ఫస్టులో వచ్చేదాన్ని.
ఆ తర్వాత కృష్ణకుమార్ గారి దగ్గర కథక్ నేర్చుకున్నాను. ఒకసారి ఆయన ఒక మంచి కార్యం నిమిత్తం నాట్యప్రదర్శనలు ఏర్పాటు చేసి, నన్ను కూడా నృత్యం చెయ్యమని అడిగారు. మా అమ్మ అసలు ఒప్ప్పుకోలేదు. “అమ్మాయికి సరదాగా ఉందని డాన్సు నేర్పించాము గాని, ప్రదర్శనలు ఇవ్వడం కోసం కాదుగా” అనేశారు. అయితే మా మాస్టర్ ఒప్ప్పుకోలేదు. “తప్పకుండా చేయించాలి” అని పట్టుబట్టారు. నాకు మాత్రం మనసులో ‘చేస్తే బాగుండును’ అనే ఉంది. మొత్తానికి ఎలా అయితేనేం - మాస్టర్ గారూ, నేనూ గెలిచాం.
అప్ప్పుడు జరిగిన నాట్యప్రదర్శనల్లో నేనూ పాý£్గని, కొన్ని ‘ఐటమ్స’ చేశాను. నేను డాన్సు చేస్తూ ఉండగా - పార్థసారథి అనే స్టిల్ ఫోటోగ్రాఫర్ - కొన్ని స్టిల్స్ తీశారు. ఆ స్టిల్సే - నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి. ఎలా అంటే -
అంతకు ముందు రోజున మనోహర్ గారి ‘శూరపద్మన’ నాటకం జరిగింది. నాటకం జరుగుతున్నప్ప్పుడు ఈ పార్థసారథి గారు కొన్ని స్టిల్స్ తీశారు. ఆ స్టిల్స్ తీసుకోవడానికని మనోహర్ గారు, పార్థసారథి గారి దగ్గరకు వెళ్లినప్ప్పుడు ఆ స్టిల్స్, నాకు తీసిన స్టిల్స్ అన్నీ కలిసిపోయి ఉన్నాయట. అలా, నా స్టిల్స్‌ను ఆయన చూశారు. “ఎవరీ అమ్మాయి? ఏమిటి?” అని అడిగారుట - ఆయన చెప్పారుట. “ఎందుకీ వివరాలు అడుగుతున్నారంటే - అమ్మాయి బాగుంది. ఎం.జి.ఆర్. గారు కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్నారు - వారి సొంత చిత్రంలో నటించడానికి, ఈ ఫోటోలు చూపించండి” అన్నారు మనోహర్‌గారు. ఈ విషయం తర్వాత, పార్థసారథి గారు మా ఇంటికి ఫోన్ చేసి అమ్మతో చెప్పారు. అమ్మో! మా అమ్మ ఒప్ప్పుకోనేలేదు. “నో! ఐ డోంట్ సెండ్ మై డాటర్ టు ఫిల్మ్స” అని నిక్కచ్చిగా చెప్పేశారు! పార్థసారథి గారు ఏం మాట్లాడలేక పోయారు.
ఆ తర్వాత ఒకరోజు ఎం.జి.ఆర్. గారు ఎవర్నో రాయబారం పంపారు. ఆయన మా అమ్మతో మాట్లాడుతూ ఉంటే విన్నాను. ‘అమ్మాయికి మంచి లక్షణాలు ఉన్నాయి. రాణించే అవకాశాలూ ఉన్నాయి” అని ఆయన చెబుతున్నారు. కానీ మా అమ్మ అభిప్రాయం నన్ను బాగా చదివించి, ఏ పెద్దింటి సంబంధమో చూసి పెళ్లి చేసేయాలని. మా అక్కను అలాగే చేసింది కూడా. అంచేత, నేను సినిమాల్లో చేరితే ఆమె ఆశయం దెబ్బతింటుందని ఆమె భావించి ‘నో’ అంది.
ఆ సమయంలో మా పెద్దమ్మ, కమలా కోట్సీసు గారు మా అమ్మకు చాలా నచ్చజెప్పి నన్ను సినిమారంగంలో ప్రవేశించమని ప్రోత్సహించారు. పెళ్లి, పిల్లలు, సంసారం... ఇవన్నీ ఏ స్తీకైనా సర్వ సాధారణమని కళాకారిణి కావడం పెద్ద వరమని ఆమే నన్ను బాగా సినిమాల్లోకి రావడానికి మానసికంగా సంసిద్ధురాల్ని చేశారు. నేనూ సినిమాల్లో చేరడానికే నిర్ణయించుకున్నాను. “పోనీ మమ్మీ - ఒక్క సినిమాలో వేస్తాను. తర్వాత కావాలంటే మానేస్తాను” అన్నాను నేను నెమ్మదిగా. మొత్తానికి మా అమ్మ అంగీకరించింది. నన్ను ఎం.జి.ఆర్. గారు బుక్ చేశారు. ఒక సంవత్సరం పాటు నాకు ‘డైలాగ్ శిక్షణ’ ఇప్పించారు. ఈలోగా చోప్రా మాస్టారు గారి దగ్గర కొన్ని నృత్యాలూ, పాశ్చాత్య నృత్యాలూ నేర్చుకున్నాను. మొట్టమొదటిసారిగా ఎం.జి.ఆర్. సరసన కథానాయికగా “ఉలగం చుట్రియ వాలిబన” (1973) అన్న చిత్రంలో నటించాను. ఇదే తెలుగులో “లోకంచుట్టిన వీరుడు” అనే పేరుతో డబ్ అయ్యింది. ఆ చిత్రంలో కొంతభాగం జపాన్‌లో జరిగిన ‘ఎక్స్‌పో-70’ లో తీశారు. నేను కూడా వెళ్లి పాý£్గన్నాను. నా సినిమా ఉత్సాహం చూసి, మా అమ్మ తర్వాత ఏం మాట్లాడలేదు. నా మొదటి సినిమా అది నా అదృష్టం, అంతే గదా. ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే 18 చిత్రాలు రావడం అదృష్టం కాక మరేవమిటి?
నా అసలు పేరు నళిని. కానీ నేను సినిమాల్లోకి వచ్చినపుడు ఆ పేరు గల ఇంకొకామె కూడా ఉన్నదని - నన్ను పేరు మార్చుకోమని సలహా ఇస్తూ ఎం.జి.ఆర్. గారు లత అని సూచించారు. “ఈ పేరు గల లతామంగేష్కర్ గారి లాగా, నువ్వు ప్రఖ్యాతి చెందాలి” అని దీవించారు. అలా నేను “లత” గా మారిపోయాను.
ఎం.జి.ఆర్. గారితో కలిసి 25 చిత్రాల్లో కథానాయికగా నటించి మంచిపేరు సంపాదించాను. ఒకరకంగా చెప్పాలంటే ఆయన చివరి హీరోయిన్‌ను నేనే. బి.సరోజాదేవి, జయలలితల తర్వాత ఆయన సరసన కథానాయిక స్థానాన్ని నేను భర్తీచేశాను. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని ఆగిపోయిన చిత్రాలు పూర్తిచేశాను. ఆయనతో నటించిన చివరి చిత్రం “మధురై మీటర్ సుందరపాండ్యన”. ఇలా తొలిసినిమానే భారీస్థాయి కథానాయకునితో కావడంతో తమిళనాడులో చాలా పేరు వచ్చింది. నా పేరు ఎవరినోట విన్నా “ఎం.జి.ఆర్.లత” అనే వినబడుతుంది. సినిమా పేరు జానకి గారికి ఇంటిపేరుగా మారి ‘షావుకారు’ జానకి అయినట్టు. ఒక హీరో పేరు నాకు ఇంటిపేరుగా మారింది. బహుశా ఇది నాకు మాత్రమే లభించిన అవకాశమేమో! నేను ఎం.జి.ఆర్. హీరోయిన్‌నని మిగతా నిర్మాతలు నన్ను బుక్ చేసేవారు కారు. అందువల్ల తమిళంలో ఆనాటి మిగతా అగ్ర కథానాయికుల సరసన నటించలేకపోయాను. జెమినీ గణేశన్ గారితో ఒక్క సినిమా కూడా చేయలేదు. శివాజీ గణేశన్ గారితో “శివగామి సెల్వన” అని ఒకే ఒక చిత్రం చేశాను. అసలు నేను ఎం.జి.ఆర్. తో గాకుండా మరొకరి ప్రక్కన నటిస్తే డిస్టిబ్యూటర్లు ఒప్ప్పుకునేవారు కాదు.
మొదట్లో ఎం.జి.ఆర్. గారు నన్ను మÖడేళ్లు కాంట్రాక్టులో తీసుకున్నారు. ఆ తర్వాతే నన్ను బయట చిత్రాలు అంగీకరించమని, మంచి కథలు గల చిత్రాలు ఎన్నుకోమని, ఎం.జి.ఆర్.గారే నన్ను ఆశీర్వదించారు. తర్వాత ఒకటీ ఒకటీ రాసాగాయి. అయినా ఏం లాభం, ఎం.జి.ఆర్. గారు ఎప్ప్పుడూ నా కాల్సీట్లు బిజీగా పెట్టేసేవారు. దానివల్ల చాలా అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. అలా కోల్పోయిన అవకాశం హిందీలో రిషికపూర్‌తో, ఆయన సరసన “రాజా” అనే చిత్రానికి కథానాయికగా నన్ను అడిగారు. కానీ పై కారణం వల్ల నేను వెళ్లలేకపోయాను.
ఎం.జి.ఆర్. గారి తర్వాత నేను దాదాపు అందరు హీరోలతోనూ తమిళంలో చేశాను. అయితే చెప్ప్పుకోదగ్గ హీరో కమల్‌హాసన్. ఆయనతో కలసి మొదట మలయాళంలో “వైనాడుంతంబాన” అనే చిత్రంలో నటించాను. కెమెరామెన్ విన్సెంట్ ఆ చిత్ర దర్శక నిర్మాత. ఆ తర్వాత “నియా” అనే తమిళ చిత్రంలో ఆయన సరసన నటించాను. ఆ చిత్రం చాలా పెద్ద హిట్టు. ఆ సినిమానే హిందీలో నాగిన్. ఆ చిత్రంలో ఓ పాము డాన్సు ఉంది. ఆ డాన్సులో నేను డాన్సు చేస్తూ కమల్‌హాసన్‌ను తన్ని ఆయన పైకెక్కి డాన్సుచేయాలి. మొదట నేను చేయలేనన్నాను. కానీ ఆయనే ఒప్పించి నాచేత చేయించారు. ఆ డాన్సు పూర్తయేంతవరకూ నా బరువును భరించారు. ఫర్‌ఫెక్షన్ కోసం కమల్‌హాసన్ అంత ప్రాకులాడే మనిషి. అందుకే అన్ని భాషల్లోనూ ఇప్పటికీ కమల్‌హాసన్ అంటే అంత క్రేజ్.
తెలుగులో నేను నటించిన మొదటి చిత్రం చిత్రకల్పనా వారి “అందాలరాముడు” (1973). ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి సరసన కథానాయికగా నటించాను. ఆ సినిమా నాకు చాలా మంచిపేరు తెచ్చిపెట్టింది. బాపురమణల పర్యవేక్షణలో నా నటజీవితానికి మెరుగులు దిద్దుకున్న సినిమా అందాలరాముడు. సినిమా అంతా ఒక సాదా లాంచీ, ఒక లగ్జరీ లాంచీలలో గడచిపోతుంది. భద్రాచలం దారిలో వచ్చే పాపికొండలు, అడవులు, పట్టిసీమ అన్నీ చూపిస్తూ చిత్రీకరణ సాగాలి కనుక దేవీపట్నం అనే ఏజెన్సీ ప్రాంతంలో ఫారెస్టు కాంప్ వేశారు. నిజంగా ఆ సినిమాను నేను బాగా ఎంజాయ్ చేశాను. అక్కినేని నాగేశ్వరరావు అంత పెద్ద హీరో అయినా అందరితోనూ బాగా కలిసిపోయేవారు. అందరితో పాటే సామÖహిక భోజనం చేసేవారు. సూర్యకాంతం, నాగభూషణం, ధూళిపాళ... ఇలా ఎంతో అనుభవమున్న నటీనటులు కూడా నన్ను బాగా చూసుకునేవారు. రాధాకుమారి గారు సహజంగా నటించడమెలాగో చేసి చూపించి నన్ను ఒక పరిపూర్ణ నటిగా ఎదగాలని ఆశీర్వదించారు.
ఆ సమయంలోనే ‘జై ఆంధ్ర’ ఉద్యమం ఉధృతమైంది. దానివల్ల మా షూటింగ్ స్పాట్ మాకు కొంతకాలం నివాసమైపోయింది. దాంతో “అందాలరాముడు” మాకు పిక్నిక్ ఎంజాయ్‌మెంటయ్యింది. సినిమా మొదట్లో విజయవంతం కాకపోయినా, తర్వాత్తర్వాత బాగాపోయింది. ఆ సినిమాతోనే నాకు “సోషల్ సీత” అనే పేరు వచ్చింది.
అక్కినేని గారితో “రావణుడే రాముడైతే” (1979) చిత్రంలో నాయికగా నటించాను. ఆనాటి అగ్రహీరోలందరితోనూ నేను, చేసినా, నేను అక్కినేని గారితో నటించేటప్ప్పుడే చాలా సౌకర్యంగా ఫీలయ్యేదాన్ని. ఆయన ఎంతో సరదాగా ఉండేవారు. తెలియని విషయాల్ని చాలా సున్నితంగా నేర్పేవారు. ఎదుటి మనిషిని బాగా గౌరవిస్తారాయన. ఈ మధ్య ఏదో షూటింగుకని హైదరాబాదు వెళ్లాను. అన్నపూర్ణా స్టూడియోలో షూటింగు. అక్కినేని నాగేశ్వరరావు గారు నేనొచ్చానని తెలిసి స్టూడియోకొచ్చి చాలా ఆప్యాయంగా పలుకరించారు. షూటింగ్‌కు అవసరమైన డైలాగులన్నీ వల్లె వేశావా? అని అడిగారు. నేను “లేదండీ, ప్రామ్టింగ్ అలవాటైపోయింది” అన్నాను. ఆయన చాలా గట్టిగానే మందలించారు. “ఏం లతా! మనం అప్పటి దర్శకుల చేతుల్లో తయారైన వాళ్లం. ఆ స్కూల్లో చదువుకున్న వాళ్లం. మనకు ప్రామ్టింగ్ ఏమిటి?” అన్నారు. నాకే సిగ్గేసింది. కొంచెం గిల్టీగా ఫీలయ్యాను. అంత నిబద్ధత గల నటుడాయన. అందుకే ఎంతమంది హీరోలతో పనిచేసినా నా మనసుకు నచ్చిన హీరో నా ‘అందాలరాముడే’ (అక్కినేనే). ఏ.ఎన్.ఆర్. తోనే నేను “మట్టిమనిషి” అనే టెలీ సీరియల్‌లో నటించాను.
ఇక చెప్ప్పుకోవాల్సింది ఎన్.టి.రామారావు గారి గురించి. ఆయనతో కలసి “నిప్ప్పులాంటి మనిషి” (1974), “శృంగారరాముడు” (1979) చిత్రాల్లో కథానాయికగా నటించాను, “నిప్ప్పులాంటి మనిషి” చిత్రం తమిళ వెర్షన్‌లో ఎం.జి.ఆర్. గారు హీరో. అందువల్ల అందులో హీరోయిన్ అయిన నన్నే తెలుగులోకి తీసుకున్నారు ఎస్.డి.లా¿గారు. సెట్టుమీద ఎన్.టి.ఆర్.గారు ప్రతి ఆర్టిస్టునీ ఎంతో గౌరవంగా పలుకరించేవారు. అందులోనూ నేను ఎం.జి.ఆర్. గారి హీరోయిన్‌నని ఇంకా గౌరవంగా చూసేవారు. ఒకసారి “శృంగారరాముడు” ఔట్‌డోర్ షూటింగు కోసం కాశ్మీర్ వెళ్లాం. బాగా చలికాలం. ఎన్.టి.ఆర్. గారు ఉదయం ఆరున్నరకే మేకప్ వేసుకొని సెట్లోకి వచ్చేసేవారు. ఆయన రాత్రిపూట ఏడు గంటల కంతా నిద్రపోయేవారు. అంచేత తెల్లవారి త్వరగా నిద్ర లేవడానికి ఇబ్బంది పడేవాళ్లం. ఆ సమయంలో రామారావుగారి సతీమణి శ్రీమతి బసవతారకం గారు కూడా మా అవస్థలు గమనించారు. డైరెక్టరు కె.శంకర్ గారిని మిగతా ఆర్టిస్టులందరం కలిసి షూటింగు పది గంటలకు ప్రారంభించమని అడిగాము. ఆయన సరేనన్నారు. కానీ ఈ విషయం రామారావుగారికి ఎవరు చెబుతారనేది మా సమస్య. అందరూ కలసి ఆ భారం నా మీద మోపారు. నేను కూడా భయపడుతూనే వెళ్లి షూటింగు అంత ఉదయాన్నే వద్దని ఆయన్ను రిక్వెస్టు చేశాను. ఆయన చాలా తాపీగా “ఓ.కే. లతగారూ! నాకు ముందే చెప్పొచ్చు గదా! అలాగే చేద్దాం” అని మా సమయానికి ఆయన సర్దుకున్నారు. అంత గొప్ప మనిషితో మేము కలసి పనిచేశామనే తృప్తి మాటల్లో చెప్పలేనిది. ఆయన కూతురుగా భరణీ పిక్చర్స్ “అమ్మాయిపెళ్లి” (1974) లో నటించాను. భానుమతి గారు అప్పటినుండీ నన్ను సొంత కూతురులాగా చూసుకునేవారు. నన్ను ‘పాప’ అని పిలిచేవారు. ఒకసారి “పవిత్రబంధం” సీరియల్ చూసి నాకు ఫోన్ చేసి ఎంతగానే ప్రశంసించారు. ఆమె ప్రశంసలంటే మాటలా? మరొకసారి అలాగే ఫోన్ చేసి “నువ్వు మేకప్ కిట్ ఎక్కడ కొంటావు. చాలా బాగుంది. నాకొకటి తెచ్చిపెట్టు” అన్నారు. అలాగేనని, నేను తీసుకువెళ్లాను. ఆమె పట్టుచీర, పసుపు కుంకుమను తాంబూళంలో పెట్టి ‘దీర్ఘసుమంగళీభవ’ అని ఆశీర్వదించారు. ఆ తర్వాత కొద్దిరోజుýకే ఆమె చనిపోయారు. నేను మా అమ్మనే పోగొట్టుకున్నట్టు ఇప్పటికీ ఫీలవుతుంటాను.
ఇక నా కెరీర్‌లో చెప్ప్పుకోదగ్గ ప్రముఖులు కృష్ణ-విజయనిర్మల దంపతులు. కృష్ణగారితో కలసి “సింహగర్జన” (1978) అనే చిత్రంలో కథానాయికగా నటించాను. అమ్మో! కృష్ణగారికి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఎంత పెద్ద నిడివిగల డైలాగ్‌నైనా ఒకే టేకులో ఓ.కే. చేసేవారు. మేమేమో మతిమరుపుతో అవస్థపడేవాళ్లం. ఇక విజయనిర్మల గారు కూడా నన్ను నా కెరీర్ మొదటి రోజుల్లో బాగా ప్రోత్సహించేవారు. ఆమె దర్శకత్వంలో “శంఖుతీర్థం” (1979) చిత్రంలో నేను నటించాను. ఆమె దర్శకత్వం చాలా సరదాగా గడచిపోయేది. మొదట్లో కృష్ణగారు నేను ఎం.జి.ఆర్. హీరోయిన్‌నని, నాతో చాలా రిజర్వుడుగా ఉండేవారు. “నన్నూ మీతో కలుపుకోండి” అని చెప్పాను. ఇక ఆ రోజు నుంచీ కృష్ణగారు నాతో ఎంతో చనువుగా మాట్లాడేవారు. కృష్ణగారు చాలా ధైర్యశాలి. ఏ.ఎస్.ఆర్. ఆంజనేయులుగారు “కురుక్షేత్రం” (1977) తీశారు. అదే సమయంలో ఎన్.టి.రామారావు గారు “దానవీరశూరకర్ణ” తీశారు. ఆ చిత్ర నిర్మాణంలో కృష్ణగారి ప్రమేయం ఏమీ లేకపోయినా, ఎందుకనో పరిశ్రమలో ‘ఎన్.టి.ఆర్. గారికి పోటీగా కృష్ణ’ అన్న అపనింద కృష్ణగారిపై పడ్డది. దాన్ని తట్టుకొని నిలబడ్డాడు. అందులో నేను నటించాను. దాంతో ఆ సమయంలో నాపై రామారావుగారు కొంచెం కోప్పడ్డారు కూడా. అప్ప్పుడు కైకాల సత్యనారాయణ గారు జోక్యం చేసుకొని నాపై ఆయన కోపాన్ని తగ్గించారు. ఆ తర్వాత అంతా మామÖలే. కృష్ణగారి కార్యదీక్ష, విజయనిర్మల గారి వ్యవహార దక్షత ఆ సమయంలో నన్ను ఆశ్చర్యపరిచాయి.
శోభన్‌బాబు గారితో “కన్నవారికలలు” (1974), “రాముడు పరశురాముడు” (1980) చిత్రాల్లో కథానాయకిగా చేశాను. సెట్లోగానీ బయట గానీ ఆయన చాలా క్రమశిక్షణతో ఉండేవారు. ఒక దశలో నేను లావైపోతుంటే ఫోన్ చేసి మరీ నా హీరోయిన్ అయ్యుండి నువ్వు ఇలా u£ద్దుగా తయారైతే ఎలా? అని చివాట్లు పెట్టారు. ఇక కృష్ణంరాజు గారితో నటించిన “గాంధీపుట్టినదేశం” (1973) నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండీ నంది అవార్డు తెచ్చిపెట్టింది. ఆయనతోనే “అందడు ఆగడు” (1979) చిత్రంలో నాయికగా చేశాను. ఇంకా మురళీమోహన్‌తో “అన్నదమ్ముల అనుబంధం” (1975) చిత్రంలో చేశాను. ఆ చిత్రంలోని ‘గులాబి పువ్వెí నవ్వాలి...’ పాట ఒక్కసారిగా నాకు తెలుగులో చాలా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకున్నారంటే ఆ పాట పుణ్యమే. ఇంకా శ్రీధర్‌తో “ఊర్వశీ నీవే నా ప్రేయసి” (1976) చిత్రంలో నటించాను. ఆ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నేనే నటించాను. ఇంకా “పాడిపంటలు” (1976), “రామరాజ్యంలో రక్తపాతం” (1976) తదితర చిత్రాలు నాకు ఒక ప్రత్యేకతను సంపాదించి పెట్టినవే. ముఖ్యంగా “పాడిపంటలు” చిత్రంలో చంద్రమోహన్ భార్యగా ఒక స్టెíలిష్ నటించి ప్రశంసలు పొందాను.
1980 తర్వాత నేను సినిమా రంగం నుంచీ నిష్క్రమించాను. 1983 లో నాకు పెద్ద పారిశ్రామికవేత్త సభాపతి గారితో వివాహం జరిగడంతో ఆయనతో పాటు సింగపూరు వెళ్లిపోయాను. ఆ తర్వాత మా అమ్మగారు చనిపోవడంతో నేను కుటుంబ బాధ్యతల వల్ల 1988 లో చెన్నెí వచ్చేశాను. సినిమాలు పూర్తిగా మానేసి కుటుంబానికే పరిమితమైపోయాను. భాగ్యరాజా గారు నన్ను తిరిగీ సినిమాల్లో నటించమని విపరీతంగా ఒత్తిడి తెచ్చినా నేను ససేమిరా కాదన్నాను. 1996 లో ఒకసారి ప్రముఖ నటి మంజుల ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగితే వెళ్లాను. అక్కడ రాజ్‌కిరణ్, ఖుష్బూ నన్ను మళ్లీ సినిమాల్లోకి రమ్మని బలవంతపెట్టారు. రోజుకు రెండుసార్లు ఫోన్ చేసి ఒక దశలో విసుగు తెప్పించారు. ఇక వాళ్ల మాటను కాదనలేక “పొన్‌విలయం భూమి” అనే తమిళ చిత్రంలో కారెక్టర్ ఆర్టిస్టుగా పరిశ్రమలోకి పున్ణప్రవేశించాను. అలా ఇప్పటివరకు అన్ని భాషల్లోనూ రెండొందల చిత్రాలు చేశాను. తమిళంలో నా ఆఖరి చిత్రం ‘వళ్ళెíకొట్టెí”.
నా జీవితంలో నేను మరచిపోలేని వ్యక్తులు ఇద్దరు. వారిని ఇక్కడ స్మరించుకోవడం నా ధర్మం కూడా. ఒకరు ఎం.జి.ఆర్., మరొకరు సుప్రసిద్ధ నటి చంద్రకళ.
ఎం.జి.ఆర్. గారు నాకు మంచి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. నేనంటే విపరీతమైన అభిమానం ఆయనకు. మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేర్పించాము. సుమారు నెలరోజులు ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎం.జి.ఆర్. గారు తమిళనాడు ముఖ్యమంత్రి. అంత ఒత్తిడిలో ఉన్నా ఆయన రోజూ సాయంకాలం ఆసుపత్రికి వచ్చి మా అమ్మను పలుకరించి వెళ్లేవారు. అంత మంచి మనిషి చనిపోయిన తర్వాత నేను షాక్‌లోకి వెళ్లిపోయాను. కోలుకోవడానికి చాలారోజులు పట్టింది. అదేవిధంగా చంద్రకళ, నాకు మంచి మిత్రురాలు. నా మొదటి చిత్రం కోసం విదేశాలకు వెళ్లాము. అక్కడ నాకు, ఆమెకు ఒకే గది కేటాయించారు ఆ సమయంలో. చంద్రకళ నన్ను సొంత చెల్లెల్లా చూసుకునేది. మన తెలుగులో జూ॥ శ్రీరంజని గారిలా చంద్రకళ మొహాన్ని చూస్తూనే నాకు ఓ పవిత్రత, ప్రశాంతత గోచరించేవి. ఎన్నో కష్టసుఖాలు కలసి మాట్లాడుకునేవాళ్లం. మంచి నటి, అంతకంటే మంచి మనిషి. చాలా త్వరగా చనిపోతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఆమె లేని లోటు నాకు ఈ జన్మకు తీరదు. ప్రస్తుతం నా మిత్రురాలిని ఆమె కూతురు ముఖంలో చూసుకుంటున్నాను.
అసలు ఆ రోజుల్లో ఆత్మీయతలు చాలా బాగుండేవి. ముఖ్యంగా సీనియర్ ఆర్టిస్టులు మమ్మల్ని ఎంతో గారాబంగా చూసుకునేవారు. “స్వర్గత్తుళ్ తిరుమణమ” అనే తమిళ చిత్రంలో నేను షావుకారు జానకి గారితో కలసి పనిచేశాను. ఆమె షూటింగులో ఉన్నారంటే రకరకాల తినుబండారాలు, భోజనాలు అన్నీ ఆమె ఇంటినుండి వచ్చేవి. ముఖ్యంగా నాకైతే మాంసాహారం ప్రత్యేకంగా వండించి తెచ్చేవారామె. నాకు “ఇకచాలు” అని చెప్పినా కొసరి కొసరి తినిపించేవారు. ఆ ఆప్యాయతలు ఇప్ప్పుడు చూద్దామనుకున్నా కనపించవు.
నేను సినిమాల్లో అగ్ర కథానాయికగా ఎదిగినా, నాట్యరంగాన్ని వదలి పెట్టలేదు. అప్ప్పుడప్ప్పుడూ నాట్య ప్రదర్శనలిస్తూనే ఉండేదాన్ని. పద్మినిగారు అమెరికా వెళ్లిపోయిన తర్వాత, పి.ఎస్.గోపాలకృష్ణన్ గారి ప్రోత్సాహంతో ఓ డాన్సు ట్రూపు నడిపాను. అంతా మహిళలతోనే మేము ప్రదర్శించిన ‘శకుంతల’ నృత్యరూపకం మాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులో నేను దుష్యంతునిగా నటించేదాన్ని.
నాకు ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి కార్తీక్ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో అబ్బాయి శ్రీనివాస్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో మాస్టర్ చేసి ప్రస్తుతం ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు. అందువల్ల నేను భారతదేశంలో ఉండేది చాలా తక్కువ. మÖడు నెలలు మా వారి దగ్గర సింగపూర్‌లోనూ, మరో మÖడు నెలలు మా పెద్దబ్బాయి దగ్గర లండన్‌లోనూ ఉంటాను.
రాధిక నాకు మంచి స్నేహితురాలు. నేను హీరోయిన్‌గా నటించిన “అన్నెíప్పరవై” అనే చిత్రంలో రాధిక కూడా నటించింది. అప్పటి నుండీ ఆమెకు నేనంటే చాలా ఇష్టం. ఒకసారి మా ఇంటికొచ్చి నేను టీవీ సీరియల్సు తీస్తున్నాను. అందులో మీరు నటించాలి” అని పట్టుబట్టింది. నేను కుదరదన్నాను. రాధిక అమ్మ గీత, ఇంటికొచ్చి మరీ బలవంతప్టెడంతో టీ.వీ. నటిగా మారాను. రాధిక అన్న రాధారవితో తమిళంలో నిర్మించిన “రామాయణం” ధారావాహికలో మండోదరిగా నటించాను. ఆ తర్వాత తెలుగులో “ఇదికథకాదు” (1999) ధారావాహికతో పాపులర్ అయ్యాను. ఒకదశలో టెలీ సీరియల్సులో కూడా నటించడం విసుగుగా, కష్టంగా కూడా ఉంది. కానీ ఏం చేద్దాం నిర్మాతల్ని బాధపెట్టడం మంచిది కాదు. ఇన్నాళ్లూ మమ్మల్ని పోషించి మాకొక స్టేటస్ తెచ్చిపెట్టింది నిర్మాతలే కదా. అందుకే మంచి టెలీ సీరియల్స్ వస్తే వేస్తున్నాను. అయితే ఒకేసారి చాలా పెట్టుకోకుండా ఒకటి పూర్తి అయిన తర్వాత ఒకటి ఒప్ప్పుకుంటున్నాను. ఈ మధ్యే “మహాలక్ష్మీనివాసం” పూర్తయింది. ప్రస్తుతం కస్తూరి (తమిళం) చేస్తున్నాను.
నాకు “వట్టత్తుకుళ్‌సదరం” అనే చిత్రానికి గాను ఫిల్ముఫేర్ అవార్డు వచ్చింది. 1978 లో తమిళనాడు ప్రభుత్వం నుండే కలైమామణి అందుకున్నాను. హైదరాబాదులో గీతాంజలి, చెన్నెíలో మంజుల నా స్నేహితురాళ్లు. జీవితంలో ఎలాంటి బాధలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి