బ్రహ్మానందం పరమ సుఖదం
పూర్వం పల్లెటూళ్లలో విశ్వకర్మలను ఒజులు లేదా బ్రహ్మయగార్లు అని వ్యవహరించేవారు. ఇది జార్లపాలెంలో నివసించినటువంటి ఒక బ్రహ్మయగారి చరిత్ర.
ఆంధ్రదేశంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రుని గురించి విననివారు, తెలియనివారు ఉండరు. ఆయన చరిత్ర అంటే నిరాకారమైన బ్రహ్మం సాకారమై ‘దైవం మానుషరూపేణా’ అన్నట్లు కలియుగంలో, భూలోకంలో అవతరించి కందిమల్లయపల్లెలో కాపురం చేసిన చరిత్ర. అతని పిమ్మట మళ్ళీ అది సంపూర్తి నామధేయంతో కాకపోయినా బ్రహ్మనామాంకితుడై వెలసిన మీVAన్నతుడు ఈ జార్లపాలెం బ్రహ్మయానంద స్వాములవారు.
ఈయన చరిత్రను మొదట ఒక చిన్న పుస్తకంగా తెచ్చినవాడు శ్రీ గోనుగుంట బ్రహ్మయ్యగారు. అది నాసికా త్య్రయంబకంలోని గోదావరి కాగా ఇపుడీ విభావసుగారు రచించిన పరమానంద భారతం ధవళేశ్వరం దగ్గర గోదావరిలా పొంగి పరవళ్ళు తొక్కుతుంది. ఈ చరిత్రకు ఫణిదపు ప్రభాకరశర్మ సూతమునీశ్వరుపాత్ర పోషింపగా జలదుర్గం జగన్నాథచక్రవర్తిగారు కుటుంబ సభ్యులు సూతశౌనకులుగా ఉన్నారు.
శ్రీ ప్రభాకరశర్మగారు ఇంతవరకు యజ్ఞోపవీతం కథ, విశ్వబ్రాహ్మణ గోత్రగాయత్రి, వీరగురునిభారతం, విశ్వకర్మభారతం, సిద్ధయోగి ప్రసిద్ధ భారతం ఈశ్వరీ అమ్మవారి పవిత్రభారతం, గోవిందమాంబా అమ్మవారి ప్రశస్తభారతం, విశ్వకర్మ విజ్ఞాన భారతం, కందుకూరి జడల పిచ్చయానందుల ఆనంద భారతం అను పలువిధాల కృతులు వెలయించి బహుభారత బ్రహ్మగా సుప్రసిద్దులైనారు. కనుక వానివల్ల వీరి విశ్వకర్మలచరిత్రలు యజ్ఞోపవీత కథవల్ల యాజుషప్రయోగవిశేషాలు కొట్టినపిండిగా ఉన్నవి. కనుక అవే ప్రస్తుత బ్రహ్మయానందుల చరిత్రకు నేపథ్యమైనవి.
రచనారంగంలో కవిత్వం, పద్యం, గద్యం, గేయం అని త్రిపథగా ఉన్నా గద్యాన్ని లాక్షణికులు కవిత్వంగా అంగీకరించలేదు కాని గద్యం కవీనాం నికషం వదంతి గద్యమే కవికి గీటురాయిగా ఉంది.
పద్యకవిత ఆశు, బంధ, చిత్ర, గర్భ కవిత్వాలని నాలుగు విధాలుగా
ఉంది. దానిలో మళ్లీ ఆశువు మధుర, విస్తర, వస్తుకవిత లని మÖడు
విభాగాలుగా విభజించడం జరిగింది. ఈనాడు సంకీర్త£నా సాహిత్యమంతా మధురకవితా శాఖకు చెందగా కావ్యంలోని అష్టాదశ వర్ణనలలో దేన్ని ఎత్తుకున్నా అది సాంగోపాంగంగా వివరించటం వస్తుకవిత అని అట్లా కాక ప్రధాన కవితనే వివిథో పకథలతో విస్తరించుకొని పోవటాన్ని విస్తరకవిత అంటున్నారు.
ఈనాడీ విస్తరణ కవితకు సంస్కృతంలో బాణుని కాదంబరి, తెలుగులో పింగళిసూరన కళాపూర్ణోదయం ఉదాహరణలుగా ఉన్నవి. ఆధునికులు గద్య రూపంలో ఈ విస్తరకవితనే ఇపుడు బహుళ ప్రచారంలోనికి తెచ్చినారు. తమిళులిపుడు దీన్ని ‘కదంబరి’ అని అనగా హిందీ వారు “పన్సాల” అంటున్నారు. తెలుగులో దీన్ని కాశీభట్టబ్రహ్మయ్యగారు ‘నవల’ అన్నారు. నవల అంటే నూతనత్వాన్ని కొని తెచ్చింది అని అర్థం. ఇక ఇపుడు చరిత్రలైనా, ఊహాచిత్రాలైనా అన్నీ ఈ మార్గంలోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నవి. అందులో ఇపుడు మిత్రులు బ్రహ్మశ్రీప్రభాకరశాస్త్రిగారి బ్రహ్మయభారతం గూడ చేరుతుంది. ఇందులో కొన్ని పాత్రలు అవసరాన్ని బట్టి కల్పించినా ఇది కల్పితకథగా గాక వాస్తవ చరిత్రగానే ఉంది.
ఈ బ్రహ్మయ్యగారు షిర్డీబాబాగారి పిమ్మట రెండు సంవత్సరాలకు పుట్టినా వారికంటే మÖడు సంవత్సరాల మొదలే మహాసమాధిని పొందినారు. శ్రీ ప్రభాకరశర్మగారు షిర్డీబాబాగారి భక్తుడు. అందువల్ల బ్రహ్మయ్యగారి కాలసమన్వయంలో వీరు షిర్డీబాబాగారిని గూడ స్మరించినారు. ఈ బాబాగారు ప్రపంచ ప్రథమ సంగ్రామకాలంలో జనించి ఆ సంగ్రామం క్రీ.శ. 1914లో ఆరంభమై 1918లో ముగిసింది. అనుక ఆ పిమ్మట వీరు అదే సంవత్సరంలో మహాసమాధిని చెందినారు.
ఈ సంవత్సరంలో శర్మగారు బ్రహ్మయ్యగారి జననం మరియు సమాధి కాలాన్ని చెబుతూ కాలసమన్వయంలో షిర్డీబాబాగారిని పేర్కొని వారు జన్మించింది ప్రపంచ ప్రథమ సంగ్రామం కంటే మొదలే కాబట్టి అప్పటి కాల పరిస్థితిని వివరిస్తూ బ్రిటిషువారి పాలనా విధానాన్ని ఆనాటి సంఘంలో సామాన్యుల జీవితం మరియు పంచదాయిలజీవితం గూడ ఈ చరిత్రానుబందంగా వీరికి వివరించివలసి వచ్చింది.
నాలోను, ఈ ప్రభాకరశర్మగారిలోనూ ఒక దుర్గుణముంది. రచనా వస్తువును గ్రహించిన పిమ్మట దాని సమగ్రత కొరకని వివిధ విషయాలు దానిలో ప్రవేశపెడుతూ విస్తరిస్తూపోతామే కాని సంక్షిప్తతకు అలవాటుపడలేదు. కనుక కథాగమనం కోరే పాఠకులకు మాత్రం ఇది కొంత విసుగుదలను కలిగించవచ్చు. మేం కలం పట్టుకున్న తర్వాత ఎంతదూరం పరుగెత్తుతామో, ఎక్కడ ఆగుతామో తెలియదు కనుక మా పాఠకులు మాత్రం మాయొక్క ఈ అతనితప ఓపికకు పరీక్ష పెడుతున్నందుకు మన్నించవలె.
ఈ పవిత్ర భారతానికి రచనా సంకల్పనాంతరం శ్రీ శర్మగారికి జలదుర్గం చక్రవర్తిగారు లభించటం ఒక విశేష పరిణామం. అది ఆ బ్రహ్మయానందుల సంకల్పమే తప్ప అన్యం కాదు. రచనలో బ్రహ్మయానందుల పట్ల శర్మగారికున్న భక్తిప్రపత్తులు అడుగడుగున వ్యక్తమవుతూనే ఉన్నవి. ఈ చక్రవర్తిగారివల్ల పాఠకులకు శ్రీ బ్రహ్మయ్యానందుల గారి ఆత్మకథ సాకల్యంగా వినే చదివే అవకాశం లభించింది.
శ్రీ ప్రభాకరశర్మగారే ఇందులో మహాభారతం కురుక్షేత్రమాచార్యులుగా అవతారమెత్తారని అంటే అతిశయోక్తి కాదు. శ్రీ ప్రభాకరశర్మగారు ఇంతవరకే బహు భారత బ్రహ్మలు కనుక వారి భారత మణిహారానికి ఇది మరో చేర్పుగా ఉంది. అంతేగాక ఇది మహాభారతాన్ని గురించి “యన్న భారతేతన్న భారతే” అనే సూక్తికి విశ్వకర్మల సంస్కృతి విషయంలో సార్థకంగా ఉంది.
రచనా విషయంలో శర్మగారిని అడుగవలసినపనిలేదు. కథానుగమనంలో గాని దాని తీర్పులోగాని చేయి తిరిగిన కళాకారుడుగా
ఉన్నాడు. వీరి రచనలో ప్రతిదానిలో ఆనాటి సాంఘికచరిత్ర ఎంతో కొంత పాఠకులకు తెలిసి ప్రాచీన సంస్కృతీసుముఖులను చేస్తుంది. ఇది వీరి కలానికి గల ఒక ప్రత్యేకత.
కనుక సామాన్యమైన ఒక సాంసారిక జీవితం గడిపి తన యోగసాధనలో జన్మను చరితార్థం చేసుకున్న ఈ బ్రహ్మయానందుల పరమానంద భారతం శ్రీ విభావసుగారు తనయొక్క లేఖినీమÖలంగా భారతభారతీగభస్తి గౌరవం కలిగించినందుకు వారికి నాపైగల అవ్యాజమైన ఆత్మీయతకు శర్మాజీ అభినందిస్తు, ఆశీర్వదిస్తున్నాను.
భారతీయుని సంస్కృతి ప్రతిఫలించు
బ్రహ్మయానంద వర్యుని భారతంబు
పవలు రేలును చదివెడి మానవులకు
అమృతపదమందు నిస్సంశయంబుగాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి