మొత్తం పేజీ వీక్షణలు

30, జులై 2026, గురువారం

నాగర్‌కర్నూలు జిల్లా చారిత్రక దేవాలయాలు

ఆలయం అంటే ఆత్మ లయించే స్థానం. భారతదేశచరిత్రలో అనాదిగా హిందువుల ఆధ్యాత్మిక జీవనాన్ని సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభావితం చేయడంలో దేవాలయాలు ముఖ్యపాత్ర వహించాయి. మనదేశంలో ఆలయాలు భగవరాధన క్షేత్రాలే కాకుండా సామాజిక ఆర్థిక జీవనం నెలకొనేందుకు కూడ దోహదకారిగా నిలిచాయి. భారతదేశ ఔన్నత్యం వివిధరంగాలలో పురోభివృద్ధి దేవాలయలతో ముడిపడి ఉంది. 

మన ఆరాధనాస్థానాలను ఆలయాలు, బృందావనాలు, ఆశ్రమాలు అని మÖడు విభాగాలుగా చెప్చొచ్చు. ఆలయాలకు నదీతీరాలు, పర్వతాలు శ్రేష్టమైనవి. పర్వత ప్రదేశాలలో ఏర్పడిన వాటికి క్షేత్రాలనీ నదీతీరాలందేర్పడిననాటికి తీర్థాలని వ్యవహారం. ఆలయాలలో అర్చించబడే మÖర్తులు స్వయంభువాలనీ బింబాలని రెండు విధాలు. స్వయంభువులనగా ప్రకృతిలో సహజముగా శిలాదారువులతో రూపొందింపబడినవి. బింబాలనగా శిలాదారుమృద్వాదులతో చేసినవి. నాగర్‌కర్నూల్‌జిల్లాలోని ముఖ్యమైన వెంకటేశ్వర స్వామి సంక్షిప్త చరిత్ర ప్రస్థానం  చేయడం ఈ వ్యాసోద్దేశం.

దేవుని తిరుమలాపురం పెద్దకొత్తపల్లికి పడమరగా మÖడు కిలోమీటర్ల దూరంలో ఉంది. “తీరిక ఉంటే తిరుపతికి వెళ్లు, తీరకుంటే తిరుమలాపురికి రమ్మని” ఉవాచ. ఈ ఆలయం విశాలంగా ప్రాకారం అందంగా ఉంటుంది. ఇది మÖడువందల యేండ్లనాటది. ఇక్కడ స్వామివారి ఉత్సవం మాఘంలో పదిదినాలు ఉంటుంది. మఖనక్షత్రంనాడు రథోత్సవం జరుగుతుంది.

సోమశిల కొల్లాపూర్ మండల కేంద్రానికి 10 కి.మీ. దూరంలో కృష్ణానదీతీరాన ఎడమవైపున ఉంది. శ్రీశైల జలాశయంలో ముంపుకు గురైన 117 గ్రామాల్లో సోమశిల ఒకటి.  ఇక్కడ దొరికిన ఆధారాల వలన సోమశిల పాతరాతియుగం నుండి అనగా క్రీ.పూ. 300 క్రీ.శ. 400 సంవత్సరం నుండి ఈ క్షేత్రం ఉందనడానికి ఆధారాలున్నాయి. సోమశిలలో మొత్తం 14 ఆలయాలు, ఒకే ఆవరణలో ఉన్నవి. వీరిని సురక్షిత ప్రాంతానికి తరలించినారు. 

ఊరి ముందర కన్పించే వేంకటేశ్వరాలయం తొలి కాకతీయుల కాలంలో నిర్మించబడింది. ఆలయంపై ద్వారమట్టము, కప్పుపైభాగంలోశిల్పం కాకతీయుల శైలిలో కనిపిస్తాయి. ఆలయంలో ప్రస్తుతమున్న వేంకటేశ్వర, శ్రీదేవి, భూదేవి విగ్రహాలు జటప్రోలు సంస్థానమువారు విజయనగరశైలిలో 17వ శతాబ్దిలో చెక్కించారు. సోమశిలలో ఇంకా చాళుక్య రాష్ట్రకూట, కళ్యాణీ చాళుక్య, కాకతీయ కాలాలకు చెందిన వినాయక, మహిషాసురమర్ధిని, భైరవి, సప్తమాతృక నంది శిల్పాలు ఉన్నాయి.

వెల్లూరు గ్రామంలో వెంకటేశ్వరాలయం ఊరి వెలుపల ఉంది. దాన్ని రంగప్ప ఆయన కట్టించినట్లు తెలుస్తుంది. అతడు నందవరీకుడు. ఇంటిపేరు ముత్యాలవారు. కానీ ఏ కాలం వాడో తెలియదు. ఒకప్పుడాయన వెంకటేశ్వరుని దర్శనానికి సపరివారంగా వెళుతూ కృష్ణాతీరంలోని బొల్లవరంలో మజిలీ చేయగా ఆ రాత్రి స్వామి కలలో కనిపించి తనకు ఒక ఆలయం కట్టించమని చెప్పాడట. అపుడతడు తిరిగి వచ్చి తమ గ్రామంలో ఈ ఆలయం తలపెట్టి దానిలో గర్భాలయం, మంటపం, ీVAమశాల, వాహనశాల మున్నగునవి కట్టించి స్వామివారిని అలిమేలుమంగా సహితంగా ప్రతిష్ఠించి గరుడళ్వారు సన్నిధిని ఏర్పాటు చేసి నిత్యోత్సవ పక్షోత్సవ, వత్సరోత్సవాలను ఏర్పాటు చేసాడు. వెల్లూరిలో ఇపుడు రంగప్పగారి వంశం ఉందిగాని ఆనాడాయన ఎలా ఏర్పాటు చేసిన ఉత్సవాలన్నీ ఇపుడు లేవు. ఆలయం మాత్రం చెదరకుండా రంగప్పగారి భక్తికి నిదర్శనంగా నిలిచింది. 

బిజినపల్లె మండలం పాలెం గ్రామంలోని వేంకటేశ్వరాలయం నేడు జిల్లాలో ఒక దర్శనీయక్షేత్రం. ఇది ప్రాచీన గ్రామం. ఈ గ్రామాభివృద్ధికి కారకుడు శ్రీ తోటపల్లి సుబ్బయ్యగారు. ఆయనగారి ప్రేరణచేతనే ఇక్కడ వెంకటేశ్వరుడు వెలిసాడు. ఇప్పటి ఆలయం కంటె ముందు ఇక్కడొక వెంకటేశ్వరాలయమున్న దాఖలా ఉంది. శివాలయం కూడా ఉండేది. కాని కాలక్రమంలో వానిలోని దీపం ఆరిపోయి మళ్లీ ఈ నూతనాలయావసరం ఏర్పడింది. ఇక్కడి ఆలయాన్ని మనుసాని నీలకంటయ్యగారి కుమారులు రామలింగయ్య, బాలలింగయ్య గార్లు క్రీ.శ. 1961 లో కట్టించారు. క్రీ.శ. 14-5-1962 నాడు స్వామివారి ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ ప్రాంతంలో ఇది వనపర్తి ఆలయానికంటే మొదటిది. 

తర్వాత క్రీ.శ.21-9-1964 నాడు ఆలయం కట్టించినవారే పద్మావతిదేవిని కూడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయాలు వెంకటేశ్వరాలయానికి ఎడమ వైపున ఉన్నవి. ఈ ఆలయానికి ముందు విశాలమైన మంటపం ఉంది.  ప్రతిఏటా మాఘంలో ఇక్కడ బ్రీVA్మత్సవాలు పదిహేను రోజులు వైభవంగా జరుగుతాయి.

ఇక్కడ ఇంకా స్వామి వారి ప్రక్కనే అలువేలుమంగ, ఆంజనేయస్వామి ఆలయం, ఆళ్వారు మÖర్తులు, గోదాదేవి ప్రతిష్ట, కాశీ విశ్వేశ్వరాలయం, నవగ్రహప్రతిష్ట కూడా చేసారు.

స్వామివారి విగ్రహాన్ని తిరుమల పాపనాసినుండి అమ్మవారి విగ్రహాన్ని కడప రాయచోటినుండి తెచ్చి ప్రతిష్టించారు. ముఖమంటపంపై ఇనుప కమ్మీలపై శంఖచక్రాలు, తిరునామం ఉన్నవి. గర్భాలయానికిరువైపుల జయవిజయులు కొలువై ఉన్నారు. ద్వారబంధానికి దశావతారాల విగ్రహాలు క్షీరసాగరంలో శయనించిన విష్ణువు పరివారంతో ఉన్నారు.

వట్టెం దేవాలయం అడ్డగట్టుపై ప్రశాంత వాతావరణంలో వెలసిన ఆలయం. త్రిదండి రామానుజ చిన్నజియ్యరుగారు వట్టెంలో 19-5-1986 నాడు స్వామివారి ప్రతిష్ఠామీVAత్సవం జరిగింది. ఈ ఆలయానికి హైదరాబాదు నివాసి బాదం రామస్వామిగారు రోడ్డు దగ్గర మహాద్వారం వేయించగా, కొల్లాపురం తాలూకా గోపాలపేట నివాసి శ్రీ ఎం. ప్రతాపరెడ్డిగారు మంటపం కట్టించారు. 

స్వామివారికి కుడివైపున విశాలమైన సత్రశాల కట్టించగా, ఎడమ వైపున హైదరాబాదు నివాసి కపిలవాయి రాధాకృష్ణగారు హనుమత్ప్రతిష్ఠ 16-2-1990 నాడు చేయించారు. దాని కుడివైపున యాగశాల కట్టించారు. నారదగిరిపై వెంకటేశ్వరుడు లక్ష్మీదేవితో వెలయగా, ఇక్కడ పద్మావతితో వెలిసినాడు. 

ఇక్కడ గోదాదేవి, ఆంజనేయస్వామి, వరాహస్వామి, సంతానగోపాలస్వామి, గరుడాళ్వారును ప్రతిష్టించారు. అద్దాల మండపం, గోశాల, స్వామి పుష్కరిణి, భక్తుల సౌకర్యార్ధం కల్యాణమండపం ఏర్పాటు చేసారు. ఫాల్గుణమాసంలో బ్రీVA్మత్సవాలు, మార్గశిర మాసంలో లక్షతులసి అర్చనలు జరుగుతాయి.

బిజినపల్లి నాగర్ కర్నూల్ జిల్లాలోని పురాతన గ్రామాలలో ఒకటి. గ్రామానికి నైరుతి దిక్కున ఆనందగిరిపై వెంకటేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1940 ప్రమాది శ్రావణ శుద్ధ పాడ్యమి భానువారం నాడు కోటకదిర చంద్రమౌళిగారు స్వామిని ప్రతిష్టించి ఆ గుట్టకు ఆనందగిరి అని నామకరణం చేసినాడు. స్వామి ఇక్కడ ఒక రాతిలో కనిపించాడు. ఈ ఆలయం ఆడంబర రహితంగా ఉంది. గర్భాలయం ముందు ఒక మండపం కట్టబడింది. ఇక్కడ బ్రీVA్మత్సవాలు కూడా జరుగుతాయి.

నారద గిరి ఆలయం వట్టెం గ్రామానికి వాయువ్యంగా ఉన్న గుట్టపై ఉంది. ఇది ఒక గుట్టల వరుస. దీనిపై వింధ్యవాసిని, భైరవ, నృసింహ, వెంకటేశ్వర ప్రతిష్ఠలున్నవి. ఈ వెంకటేశ్వరుని స్థానికుడైన తిరునగరి లక్ష్మణదాసు ప్రతిష్ఠించాడు.  ఈయనకు తల్లిదండ్రి వివాహం తలపెట్టగా ఆయన అది యిష్టం లేక ఇంటి నుండి వెళ్ళిపోయి తిరుపతిలో నివసించగా ఒకనాడు స్వామి కలలో కనిపించి ‘నీ విక్కడెందుకున్నావు? నేనే అక్కడికి వస్తాను పద’ అన్నాడట. అది విని మేలుకొని ఆయన ఆ కలకు ఆశ్చర్యపడి అక్కడ తనకు పరిచయమయిన ఒక సాహుకారితో చెప్పగా ఆయన లక్ష్మణదాసుగారికి లక్ష్మీ వెంకటేశ్వరుని ప్రతిమ ఇప్పించాడు.  కాసె రామన్నగారిని పిలుచుకు వచ్చి ఇపుడున్న ఆలయం కట్టించి దానిలో స్వామిని క్రీ.శ. 1880 ప్రమాది ఫాల్గున త్రయోదశినాడు ప్రతిష్ఠ చేసాడు. ఇక్కడ ఉత్సవం ఫాల్గుణ శుద్ధ నవమినుంచి ప్రారంభమవుతుంది.

కానాపురం పాలెం గ్రామానికి 2 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి దొరలు కోట మరమ్మత్తుకై దూలలకు అడవికి వచ్చినపుడు అక్కడ విష్ణు ప్రతిమ బయటపడింది. అక్కడ గుడి కట్టించి స్వామి నందులో ప్రతిష్టించారు. దీనికి లోకల్ రికార్డులలో వేంకటేశ్వరుడనే వ్యవహారం గాని ఇప్పుడు చెన్నకేశవుడంటున్నారు.

రంగాపురం నేడు వంగూరు మండలంలోని గ్రామం. పూర్వం అచ్చంపేట తాలూకాలో గున్నదొరలు ప్రసిద్ధులు. వారు రెడ్లు. వారిలో సీతారామరెడ్డిగారు శౌర్య పరాక్రమాలలో వదాన్యంలో భక్తిలో పేరు చెందినవారు. 

ప్రస్తుతం రంగాపురంలో ఉన్న వెంకటేశ్వరాలయం సీతారామ రెడ్డిగారు కట్టించారు. ప్రస్తుతం ముడుంబావారు పూజారులుగా ఉన్నారు. ఈ ఆలయంలో ధనుర్మాసం మొదలైన విశేషోత్సవాలన్నీ నడుస్తవి. ఇక్కడ గల స్వామివారి ఉత్సవ విగ్రహాలు, సిరుసనగండ్ల శ్రీరామునికి ప్రభ, మామిళ్ళపల్లి నృసింహస్వామికి ద్వారకవచం ఇదే గ్రామనివాసియైన చింతోజు వీరయ్యగారు చేసినట్లు చెబుతారు.  ప్రస్తుతం గ్రామస్థులు ఈ ఆలయాన్ని పునర్మిర్మాణం చేస్తున్నారు.

గోవిందయ్య పల్లె సిరసవాడ గ్రామానికి సమీపంగా ఉంది.  గోవిందయ్య వంశంలోని కృష్ణారావు గారు స్వామి వారిని వేంచేపు చేసుకుని ఇక్కడ గుడి కట్టించి అర్చనాదులు ప్రారంభించారు. ఈ ఆలయం శిల్పశోభితం కాదు. వనపర్తి రామేశ్వరరావు పత్ని రాణి శంకరమ్మ గారు ఆలయ మంటపాదులు కట్టించి ఒక ఇనుప తేరు చేయించింది. ఈతేరు చక్రాలతో డేఖీలు అంతా ఇనుపదే కావటం దీని ప్రత్యేకత. ఇటువంటి రథం ఈ ప్రాంతంలో మరొకటి లేదు. 

ఇక్కడ ఉత్సవ విగ్రహాలను రఘుపతిపేట ఇరువంటి శేషయ్య గారు ఇప్పించినారు ఇక్కడ ఉత్సవం చైత్ర పున్నమకు సాగుతుంది. ఇది ఆరంభమై ఇప్పటికి రెండు అక్షయ చక్రాలు గడచినవట నిత్యార్చన బ్రీVA్మత్సవాలు నిర్విఘ్నంగా నడుస్తున్నాయి.

పెంట్లవెల్లి గ్రామం కొల్లాపురానికి ఐదు మైళ్ళుంది. ఇది జటప్రోలు వారికి మÖడవ రాజధాని, క్రీ.శ. 1742లో రాజా చిన్న మాధవరావు ఇక్కడ నుండి పాలించి ఈ గ్రామంలో శివ కేశవాలయాలు కట్టించి బ్రీVA్మత్సవాలేర్పాటు చేసారు. ఇక్కడ మాధవరాయలు కట్టించిన కేశవాలయం ప్రస్తుతం వెంకటేశ్వరాలయంగా చలామణి అవుతుంది. స్వామివారికి బ్రీVA్మత్సవాలు - 

కూడా నడుస్తాయి. 

రామగిరి నాగర్‌కర్నూలు తాలూకాలో తెలకపల్లికి 6 కిలోమీటర్ల దూరంలో దుందుభీ తీరాన ఒక చిన్న గుట్టపై ఉంది. నది నిండుగా ఉన్నపుడిది గోదావరి తీరంలోని భద్రాచలం వలె భాసిస్తుంది. పాలమÖరు జిల్లాలో చరిత్ర ప్రసిద్ధమైన సురభిపట్టణం ఇక్కడనే ఉన్నది కాబట్టి ఆ కాలంలో ఈ క్షేత్రానికి సాటిలేదు. గట్టుతుమ్మెన, మామిళ్ళపల్లి, రామగిరి ఆలయాలను ఎగువ వంశానికి గోకర్ణ మహారాజు కట్టించాడని చెబుతారు.

ఇక్కడి గుట్టపై విశాలమైన ఆవరణలో రెండు ఆలయాలు ఉన్నవి. ఒకదానికి ద్వారపాలకులుగా కత్తి డాలు ధరించిన నకల్లున్నవి. అవి గోడలకే మలువబడినవి. క్రీ.శ. 1973లో శ్రీ రామలింగేశ్వర, లక్ష్మీగణపతి, శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ ప్రతిష్ఠలు, వానితోపాటు శ్రీవేంకటేశ్వరస్వామిని ఎండోమెంట్ కమిషనర్ కె.వాసుదేవరావుగారిచే ప్రతిష్ఠ చేసారు. అప్పటినుండి మళ్ళీ ఇది పూర్వరీతిగా నిత్యార్చనలతో రాజిల్లుతూ ఉంది.

పెద్దపల్లి గ్రామం నాగర్ కర్నూలు నుండి కొల్లాపురం దారిలో ఉంది. ఇది క్రీ.శ. 1123 నాటి వర్థమానపురంలో గోన గణపిరెడ్డి శాసనంలో పేర్కొనబడింది. దీన్ని పూర్వం జిల్లెళ్ళరెడ్డి పాలించాడు. అతడు ఎప్పటివాడో తెలియదు. ఆయన కాలంలో ఇక్కడికి సంచారవశంగా దేవేంద్రపురి, నరేంద్రపురి అనే ఇద్దరు సన్యాసులు వచ్చి, ఆ గ్రామానికి పడమరగా ఉండే ఒక విశాలమైన చట్టుపై నిద్రించారు. వారికి రాత్రి స్వప్నంలో ఆ సమీపంలో ఒక చోట నేలలో వెంకటేశ్వరు డున్నట్లు తనను వెలికి తీసి ప్రతిష్ఠించమని చెప్పినట్లు కల వచ్చిందట. ఆ కలకు అద్భుతపడి దేవేంద్రపురి మేలుకొని, మరునాడు కొందరు పనివారిని పిలిచి తనకు స్వప్నంలో కనిపించిన స్థలం గుర్తించి త్రవ్వించగా వారికి అక్కడ ఒక వెంకటేశ్వర ప్రతిమ లభించింది. అంతేగాక, ఆ త్రవ్వినచోట ఒక బుగ్గ కూడా బయట పడింది. అపుడు దేవేంద్రపురి ఆ స్వామికి వెంకట రమణుడని పేరు పెట్టి, రాత్రి తాము నిద్రించిన చోటనే ఒక చిన్న ఆలయం కట్టించి స్వామిని ప్రతిష్ఠించాడు. 

ఇక్కడి స్వామికి మొదట కపిలవాయి వారనే విశ్వబ్రాహ్మణులు అర్చకులుగా ఉన్నారు. ఆ వంశంలో లక్ష్మయ్య అనే వ్యక్తి స్వామివారికి ఉత్సవమÖర్తులు తెప్పించి బ్రీVA్మత్సవం ఏర్పాటుచేసాడు. కపిలవాయి లింగమÖర్తి గారు ఈ స్వామిపై 1980లో చక్రతీర్థమాహాత్మ్యం అనే కావ్యం రచించాడు. ఇక్కడ ఏటా మాఘంలో మÖడు దినాల ఉత్సవం సాగుతుంది.  ఇప్పుడు వింజమÖరివారు పూజారులుగా ఉన్నారు. ఈ బ్రీVA్మత్సవమేగాక శ్రావణంలోనూ ఇతర దినాలలోను ఆలయ కమిటివారు విశేషోత్సవాలు జరుపుతుంటారు. 

చిట్లెంగుంట గ్రామం అప్పర్‌ఫ్లాటులో వంకేశ్వరం తర్వాత ఉంది. ఈ గ్రామంలో హత్తిరాం బావాజీ అనే ఒక లంబాడి ఉండేవాడు. అతడు బాలాజీ భక్తుడు. క్రీ.శ. 1920 ప్రాంతం వాడు. ఇతనిని పాత బాబా అనేవారు. లంబాడీలు వేంకటేశ్వరుని బాలాజీ పేర కొలుస్తారు. హత్తీరాం పైకి ప్రతి శనివారం వేంకటేశ్వరుడు వచ్చి భక్తులడిగే విషయాలు చెప్పేవారు. వారికి అతని మాటల్లో సత్యం గోచరించేది. 

అతని తర్వాత రెండవ బావాజీ వచ్చి ఒక చిన్నగుడి కట్టి 1980 వేంకటేశ్వరుని నిలుపుకున్నాడు. అట్లా ఉండగా ఇక్కడ వంకేశ్వరం నివాసి ఆరుట్ల సత్యాలు బంగారు రాముల ప్రోత్సాహంతో క్రీ.శ. 1992 వేంకటేశ్వరాలయం పునరుద్ధరింపబడి స్వామివారి ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడ జరిగాయి. ఏటా బ్రీVA్మత్సవం జరుగు తుంది. 

కలువకుర్తి దేవాలయాన్ని స్థానికుడైన కల్వ నారాయణ సుభాస్‌రోడ్Žలో కట్టించినాడు. అనంతరం అతని కుమారులు స్థానికుల సహాయంతో రాజగోపురం కూడ కట్టించారు. ఇది 1992లో స్థాపించబడి క్రమంగా ఇపుడు అన్ని హంగులు సమకూర్చుకున్నది. ఇక్కడ ఏటా మాఘబహుళ దశమి నుండి ద్వాదశి వరకు మÖడుదినాలు బ్రీVA్మత్సవాలు నడుస్తాయి. 

బాలాజితాండ అచ్చంపేట తాలూకాలోని లింగాలకు కిలోమీటరు దూరంలో ధారారం వెళ్లే మార్గంలో ఉంది. ఇక్కడ వేంకటేశ్వర శ్రీభ్రమరాంభ మల్లికార్జునాలయాలు రెండున్నాయి. ఈ విధంగా నాగర్‌కర్నూల్‌జిల్లా దేవాలయాల ఖిల్లాగా ప్రసిద్ధిగాంచింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి