మొత్తం పేజీ వీక్షణలు

19, నవంబర్ 2022, శనివారం

తోరమునౌ ధనుస్సుగల దోర్బలు డా రఘురామ మూర్తి, మా.....

తోరమునౌ ధనుస్సుగల

    దోర్బలు డా రఘురామ మూర్తి, మా

భారము లెల్ల మోయగల 

    భద్ర కళామయ మూర్తి, ధర్మపుం

వైరము గల్గు రక్కసుల 

   వైరి, కృపామయ మూర్తి.. నా నమ

స్కార మిదే! యుదారము, వి

   శాలము రామ కథన్ స్మరించెదన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి