చిత్త నిత్యస్థిత శ్రీరామకృష్ణుండు
శిష్యబృం దాచార్య శేఖరుండు
ప్రీతి పాలిత మాతృ పిత్రార్జితయుతుండు
పంచభాషానంత పండితుండు
అభ్యస్త వైద్యశాస్త్రారోగ్య వరదుండు
సాహిత్య పరమార్థ సంగ్రహుండు
సకల జనానంద సంధానకారుండు
సద్గుణ సంతాన జన్మదుండు
కనగ నారద భక్తియోగ పథికుండు,
పొసగ సద్గౌరవార్చిత భూసురుండు
ఋషిత సాధించినట్టి వారికి సఖుండు,
నిలను మజ్జనకుండు రామేశ్వరుండు
నిత్యమూ శ్రీరామకృష్ణ పరమహంసను హృదయంలో నిలుపుకొన్నవాడు, ఎందరో శిష్యులకు ఆచార్య శేఖరుడు, పిత్రార్జితాన్ని ప్రీతిగా చూచుకున్నవాడు, పంచభాషలలో (తెలుగు, ఆంగ్లము, హిందీ, సంస్కృతము, ఉర్దూ) అనంతమైన పాండిత్యాన్ని కైవసం చేసుకున్నవాడు, హోమియో, ఆయుర్వేద వైద్య విధానాలలో ప్రావీణ్యం సంపాదించి ఎందరికో ఆరోగ్యదానం కావించిన వాడు, సాహిత్యంలోని పరమార్థాన్ని గ్రహించగలిగిన వాడు, అందరికీ ఆనందాన్ని పంచిన వాడు, గుణవంతులైన సంతానానికి జన్మ నిచ్చిన వాడు, నారద భక్తి సూత్రాలను ఎంతో ప్రీతిపాత్రంగా అనుసరించే వాడు, ఋషిత్వం సాధించిన మహనీయులతో మైత్రి నెరపిన వాడు తండ్రియైన రామేశ్వర రావు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి