రాధే రాధే అంటూ
బృందావని అంతా
నీ నామంతో పులకరించే
ఓ రాదమ్మా...
బృందావని లో
గోవిందుడు ఎక్కడ
పిలుపులో రాధే
పలుకులో రాధే
పులకరింతలో రాధే
పరవశంలో రాధే
బాధలోనూ రాధే
బోధలో రాధే
తలంపులో రాధే
తన్మయత్వంలో రాధే
అంతా రాధా రసామృతములో
ఓలలాడే వారే
రాధా నామామృతమే
అక్కడ రాధ కాని వారెవరూ
అసలు ...రాదమ్మా
రాధ రాధ అంటూ...గోవిందుడు
రాగాలతో నింపాడు కదా
అసలు బృందావనంలో
గోవిందుడు ఏడి...
ఉన్నది నీవేకదా
అంటూ ఆరాలు తీసాను
గోవిందున్ని క్షణమైనా వదలక
నా హృదయం నిండా నింపుకున్నందుకే
తానే నేనైనందుకే
అందరూ రాధా రాధా
అంటూ నన్ను తలుస్తున్నారు
ప్రేమ దేవతను కదా
ప్రేమే తన స్వరూపం కదా
అంతేకానీ నాదేముంది చెప్పు
చిరునవ్వు చిలకరించే ....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి