బరసానా దొరసాని కి వందనం
రాధమ్మ అలకలకు చందనం...
చందనం... కృష్ణ చందనం
కుందా వనములో
చిన్నబోయి కూచుంది
బృందావనం మూగబోయి చూసింది
నెమలమ్మను తరిమింది
చెలికత్తెల కసిరింది
మాధవుని కోసము
ఎంతగానో తలచింది
యమునా తీరాన
ఎంతో వేదనతో వెతికింది
మురళీ రవం జాడ వినిపించక కాచింది
చల్లగాలి తగిలినా భగ్గుమంటూ కసిరింది
వెన్నెలమ్మ పై నిందలెన్నో వేసింది
వెన్నుని జాడ లేక వేసారి పోయింది
రాధా రాధా అంటూ
జగమంతా తపించగా
ప్రేమదేవతే అలిగి పేచీలు పెట్టింది
ఆమె లేని చోటు లేక
అనంతం ఒదిగిపోగా
గోవిందుని కోసమై
తను గోప్యంగా వెతికింది
తానే మాధవుడై
మాధావుడే తానై
ఆనంద రాసలీల
అనుభూతుల్లో ఒదిగింది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి