మొత్తం పేజీ వీక్షణలు

15, మే 2022, ఆదివారం

అందమైన అలజడుల కాశ్మీరం


ఎత్తైన హిమగిరి సొగసైన అందాలు. ఆయుర్వేద విలువల కుంకుమ పువ్వు.. కొండలపై తెల్లటి మంచు తుంపరలు.. ఆహ్లాదాన్ని పంచే మధురమైన ఆపిల్‌ తోటలు.. కాశ్మీరపు అందాలలో ఇవి కొన్ని మాత్రమే.

భారతదేశంలో ఒక గొప్ప చారిత్రక గ్రంథం కాశ్మీరు దేశానికి ఉంది. 12వ శతాబ్దంలో కల్హణుడు రాసిన ‘రాజతరంగిణి’ గొప్ప చారిత్రక, సాంస్కృతిక గ్రంథమని ‘ఆక్స్‌ఫర్డ్‌ స్టూడెంట్స్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియా’లో వి.ఎ.స్మిత్‌ తెలియజేసాడు. అంతటి మహత్తుగల కాశ్మీర్‌ దేశం కశ్యపుని పేరుమీద ఏర్పడ్డది. 

14వ శతాబ్దంలో కాశ్మీరును పాలించిన సహదేవుడు తనకు లొంగిపోయిన ఇద్దర విదేశీయులకు చోటిచ్చి ఈ పరిస్థితిని విషమం చేశాడు. పిదప మతమార్పిడి ముఠాకు నాయకత్వం వహించిన బుల్‌బుల్‌షా అనే మౌల్వీ, అతని బాటలో నడిచిన సద్రుద్దీన్‌ జీహాద్‌ను అమలుపరచే క్రమంలో కశ్మీరీ బౌద్ధ, హిందువుల పాలిట యమభటులయ్యారు.

సహదేవుడు, సద్రుద్దీన్‌ల అవతారాలే షేక్‌ అబ్దుల్లాలు. వాళ్లు మళ్లీ ఇలా పుట్టి కాశ్మీర్‌కు దుర్గతి పట్టించారు. రాళ్లు రువ్వడం వారి మత నియమం అని చెప్పుకుంటూ, ఆ నియమంతోనే ఈరోజు మన జవాన్లపై రాళ్లు రువ్వుతున్నారు. చూసి మనం వింత అనుకోనక్కరలేదు. 

24 సెప్టెంబర్‌ 1931న మహారాజా హరిసింగ్‌ జన్మదినోత్సవం జరుగుతున్నది. నగరం కోలాహలంగా ఉంది. ఈ ఉత్సవంలో మహమ్మదీయులూ భాగస్వాములవుతున్నారు. సుద్రుద్దీన్‌ ఆత్మ ఆవహించిన షేక్‌ అబ్దుల్లా పథకం ప్రకారం రాజావారి ఊరేగింపుపై రాళ్లు వేయించాడు. హిందువుల ఇళ్లు తగలబడి కాశ్మీర్‌లో బీభత్స వాతావరణం నెలకొన్నది. ఉత్సవాలు ఆగి, శాంతి భద్రతల సమస్య ముందుకొచ్చింది. 

గత ప్రభుత్వాలన్నీ సైన్యం కోరలు పీకి వేర్పాటువాదుల చేతికి కశ్మీరును వదిలిపెట్టాయి. ఇటీవలికాలంలో సైన్యం కాశ్మీరుపై కొంత పట్టు సాధించింది. 

2017లో ఏప్రిల్‌ 6 నాడు కాశ్మీరు మాజీ సిఎం ఫారూఖ్‌ అబ్దుల్లా ‘జమ్మూ కాశ్మీర్‌లో యువత దేశం కోసమే భద్రతా బలగాలపై రాళ్లు రువ్వుతున్నారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా కాశ్మీర్‌పై తీర్మానం చేయాలనే రాళ్లు విసురుతున్నారు’ అన్నాడు. 

అదే సంవత్సరం 2017 ఏప్రిల్‌ 16న ఫరూఖ్‌ అహ్మద్‌దార్‌ అనే రాళ్లు రువ్వే దేశద్రోహిని రాష్ట్రీయ రైఫిల్స్‌ కంపెనీకి చెందిన క్విక్‌రెస్పాన్స్‌ టీం జీపుకు కట్టి తమను తాము రక్షించుకున్నారు. ఇదీ అప్పటి ప్రభుత్వాలకీ, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా!

మతోన్మాద జీహాదీ శక్తుల మోచేతి నీళ్లు తాగే దేశద్రోహులు ఓ పథకం ప్రకారం భారత్‌ను దోషిగా నిలబెట్టి పాకిస్తాన్‌కు ఆనందం కలిగిస్తున్నారు. పాక్‌ టీవీ చానల్‌ చర్చలో మణిశంకర్‌ అయ్యర్‌ భారత్‌`పాక్‌ మధ్య చర్చలు జరగాలంటే ‘మోదీని గద్దెదించాలి’ అన్నాడు. నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పాకిస్తాన్‌ వెళ్లి వాళ్ల ఆర్మీచీఫ్‌ను కౌగిలించుకున్నాడు. 

నషీరుద్దీన్‌ షా అనే సినీ నటుడు సింపుల్‌గా ‘భారత్‌లో తమకు భద్రత లేదు’ అన్నాడు. అమీర్‌ఖాన్‌ కూడా అదే బాటలో నడిచాడు. గతంలో ఉపరాష్ట్రపతి పదవి అనుభవించి దిగిపోయిన హమీద్‌ అన్సారీ ‘అసహనం’ అంటూ కూనిరాగాలు తీశాడు. ఈ దేశంలో బయటి శత్రువులకన్న ఇంటి దొంగలే మరింత ప్రమాదకారులుగా తయారయ్యారు. 

దేశంపై దాడి జరిగినా పెద్దగా స్పందించని గ్యాంగులు మనదేశంలో బోలెడు ఉన్నాయి. అదే మైనార్టీపై ఈగ వాలినా వాళ్ల యావత్‌ శక్తీ కేవలం అందుకే వినియోగిస్తారు. అందుకే చావుకు దగ్గరవుతున్న వృద్ధులు కూడా ఈ ఘటనను ఖండిస్తుంటే అభ్యుదయ వాదులు, సేవ్‌ డెమక్రసీ గ్యాంగులు, ఇండియా గేట్‌ క్యాండిల్‌ బ్యాచులు, రోహింగ్యాల రక్షణ కవచాలు, అవార్డు వాపసీ వృద్ధ జంబూకాలు, జస్ట్‌ ఆస్కింగ్‌ బ్యాచ్‌, చైనా చంచాలు, మీటూ ఉద్యమకారులు, ఎర్ర కళ్లద్దాల మీడియా, కిస్‌ ఆఫ్‌ లవ్‌ గ్యాంగు, బీఫ్‌ఫెస్టివల్‌ వాళ్లు, పుస్తక స్మగ్లర్లు, ప్రజాస్వామ పరిరక్షకులు, జన అజ్ఞాన వేదికలు, అర్బన్‌ నక్సల్స్‌.. 42 మంది వీర సైనికుల చావు గురించి తెలిసినా ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు?!

కోయంబత్తూరు, బెంగళూరు బాంబు పేలుళ్లతో నరమేధం సృష్టించిన అబ్దుల్‌ నాసర్‌ మదానీని విడుదల చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన కేరళ కమ్యూనిస్టులున్న ఈ దేశంలో దేశద్రోహులుండక ఇంకెవరుంటారు? ఈ దేశ బడ్జెట్‌లో మొదటి ముద్ద ముస్లింలకే అని సవతి తల్లి ప్రేమ చూపించిన మన్మోహన్‌ ఏలిన ఈ దేశం నుండి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలం!? 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి