మొత్తం పేజీ వీక్షణలు

15, మే 2022, ఆదివారం

10th class students public final exam general instructions in telugu 2022

అభ్యర్థులకు సూచనలు: 

1. పరీక్ష ప్రారంభమునకు ముందు మీకు ఒక ప్రధాన (మెయిన్) జవాబు పత్రము, ఒక బార్ కోడ్ కలిగిన OMR అందజేయబడును. ముందుగా మీరు

క్రింద పేర్కొనబడిన సూచనలు మరియు OMR షీటు పార్టు-1 వెనుక భాగమున ముద్రించబడిన సూచనలను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకొని దాని ప్రకారం వ్యవహరించవలసిందిగా కోరడమైనది. 

కోడింగు విధానములో ప్రత్యేకించబడిన 4 పేజీల జవాబు పత్రములు ఇవ్వడం జరిగింది. అందు సబ్జెక్టు పేరు, పేపరు పేరు మరియు మీరు తీసుకున్న అదనపు జవాబు పత్రముల సంఖ్య నమోదు చేయుటకు మరియు ఇన్విజిలేటరు సంతకము చేయుటకు స్థలము కేటాయించడం జరిగినది. 

జవాబు పత్రముపై ఎడమ బాగమున ఒక రంధ్రము చేసి అదనపు జవాబు పత్రములను, గ్రాఫ్, మ్యాపును మరియు పార్ట్ బి ప్రశ్నాపత్రము (బిట్ పేపరు) ట్వైన్ దారముతో కట్టుటకుగాను ఏర్పాటు చేయవలెను. 

పంచింగ్ మిషిన్ చీఫ్ సూపరింటెండెంట్‌కు ఇదివరకే యివ్వబడినది. 

అడిషనల్ అన్సర్ పత్రము నాలుగు పేజీలను కలిగియుంటుంది. 

మెయిన్ ఆన్సరు పత్రము నందు అడిషనల్ ఆన్సర్ పత్రము నందు రోల్ నెంబరు వ్రాయుటకు వీలులేదు. 

మీరు మీకు ఇవ్వబడిన OMRషీటు నందలి వివరాలను అనగా మీ యొక్క రోల్ నంబరు వగైరాలను సరిచూచుకొని సదరు షీటును ప్రధాన జవాబు పత్రమునకు సూచించబడిన రెండు చోట్ల పిన్ను మిషనుతో పిన్ చేసి వాటిని మీకివ్వబడిన పేపరు నీళ్ళతో మూసివేయవలయును. 

OMR షీటు ప్రధాన పత్రమునకు జత చేయునపుడు OMR అంచులు ప్రత్యేకంగా పార్టు- III చివర అంచులు ప్రధాన పత్రానికి దాటి క్రిందకుగానీ, ప్రక్కలకు గానీ రాకుండా వుండునట్లు పిన్ చేయవలెను. 

పార్టు-III దిగువ అంచు మెయిన్ ఆన్సరు పత్రము దిగువ అంచుకు కనీసము 4 మి.మీ. నుండి 5 మి.మీ పైన వుండునటుల పిన్ చేయవలెను. 

మీరు ప్రధాన జవాబు పత్రము పైగాని, అదనపు జవాబు పత్రము పైనగాని, గ్రాఫ్ లేదా మ్యాపు మీదగాని మరియు ప్రశ్నాపత్రము యొక్క పార్టు-బి విభాగము నందుగాని, మీరోల్ నంబరు వేయరాదు. 

రోలు నంబరు వేసిన జవాబు పత్రములను అనుచిత కార్యము (మాల్ ప్రాక్టీస్) జవాబు పత్రముల క్రింద పరిగణించి సదరు జవాబు పత్రములను మూల్యాంకనము చేయబడవు.

సబ్జెక్టు మరియు పేపరు మాత్రము ప్రధాన జవాబు పత్రముపై సూచించిన చోట (బాక్సులో) వ్రాయవలెను. 

ప్రతి మెయిన్ ఆన్సర్ బుకకు ఒక క్రమసంఖ్యను సి.ఎస్.నంబరింగ్ మిషితో ముద్రించవలెను. ఆ క్రమసంఖ్యను OMR షీలోని పార్టు-1 నందు సూచించబడిన బాక్సునందు తప్పక వేయవలెను. 

క్రమసంఖ్య లేని మెయిన్ ఆన్సరు పుస్తకము వాడకూడదు. అటువంటిది యిచ్చిన ఎడల దానిని ఇన్విజిలేటరునకు తిరిగి యిచ్చి నెంబరు కలిగిన వేరొక దానిని తీసి కొనవలెను. 

మెయిన్ ఆన్సర్ బుక్ పై ఉన్న క్రమ సంఖ్యను పార్టు 'బి' బిట్ పేపరుపై, మ్యాప్ పై మరియు గ్రాఫ్ పై వ్రాయవలెను. 

జవాబు పత్రము రెండు వైపుల బ్లూ లేదా బ్లాకు ఇంకు పెన్నుతో స్పష్టముగా ప్రశ్నల నెంబర్లు తెలుపుతూ సమాధానములు వ్రాయవలెను. 

ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు పెన్నులు వాడరాదు. 

అదనపు జవాబు పత్రములు ఉపయోగించిన యెడల వాటిని పార్టు-బి ప్రశ్నాపత్రమును మరియు గణితములో అయితే గ్రాఫ్, సాంఘిక శాస్త్రములో అయితే మ్యాపన్ను కూడా భద్రముగా ప్రధాన జవాబు పత్రమునకు ట్వైన్ దారముతో జాగ్రతగా కటవలయును. 

పరీక్షాంతమున మీరు ఉపయోగించిన అదనపు జవాబు పత్రముల సంఖ్యను నిర్దేశింపబడిన బాక్సులలో ప్రధాన జవాబు పత్రము మీదను మరియు OMR షీటు నందలి పార్టు-1, పార్టు-II లలో నమోదు చేయవలెను. 

పరీక్ష ముగిసిన తరువాత OMRషీటుతో సహా జవాబు పత్రమును ఇన్విజిలేటరుకు యిచ్చే బాధ్యత విద్యార్థిదే. 

జవాబు పత్రముపై ఎటువంటి నిషిద్ధమైన మరియు అశ్లీల పదజాలములను ఉపయోగించరాదు. అట్లు వ్రాసిన యెడల మీ జవాబు పత్రములను మూల్యాంకనము గావింపక విద్యా చట్టము 25/1997 క్రింద మీపై చర్యగైకొనబడును. 

జవాబు పత్రము నుండి కాగితములను చించుటగాని, ను వేరుచేయుటగాని ఎటువంటి పరిస్థితులలోను దేయకూడదు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి